Pages

Thursday, 26 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –18 నాగ కన్య చరిత్ర


 కింపురుష ఖండం లో తార్శ్ని వేనుడు అనే వాడి తమ్ముడు సుషేణుడు అనే గంధర్వ రాజు వున్నాడు .పావనుడు ,జ్ఞాని ,సుశీలుడు ,సత్య వ్రతి .దయా దాక్షిణ్యం వున్న వాడు .హనుమ పద సేవకుడు .నిత్యమూ  హనుమను జలం తోనూ ,పంచామృతాలతోను సేవిస్తాడు .త్రికాల పూజా దురంధరుడు .దానాలు చేస్తూ ,హనుమ కు ప్రీతి గా హోమాలు చేస్తాడు .షడ్రసోపేత భక్ష్య భోజ్య,ములను నైవేద్యం పెట్టె వాడు . కాలమ్ లోనే నాగ కన్య అనే పతివ్రతా వుండేది .సుశీల ,సుగుణ మని ,సత్య వ్రాతు రాలు .సర్వ సద్గుణ సంపన్న .ఆమె రక్త రోముడు అనే క్రూర రాక్షసునికి భయ పడి గంధర్వ రాజైన సుషేనుడిని శరణు వేడింది .
ఆయనతో గాంధర్వ రాజా !కామాంధుడు ,క్రూరుడు అయిన రక్త రాముడు అనే రాక్షసుడు నాగ లోకం వచ్చి నన్ను బలాత్కారింప ప్రయత్నించాడు .నన్ను రక్షించే వారు లేక నీ శరణు వేడు కొంటున్నాను అని వినయం గా మనవి చేసింది .సుషేణుడు నాగ కన్య తో భయం వద్దు అమ్మాయీ !నీ భయం పోగొట్టే ,నీ మనసుకు సంతృప్తి కలిగించే ఒక మాట చెబుతాను విను .వజ్ర దేహుడు అరమ పావనుడు పావని నీకు అండ గా నిలుస్తాడు .అతడు యజ్న భోక్త .ఆపన్న రక్షకుడు .ఆర్తి ని పోగొట్టే వాడు అలాంటి హనుమ మూల మంత్రాన్ని నీకు ఉప దేశిస్తాను .ఆచరించి ,మనోభీస్తాన్ని పొందు నేను కూఒడా జపం వల్లే సౌఖ్యం గా వున్నాను .అని చెప్పి హనుమంమంత్రాన్ని ఉప దేశించాడు
ణాఆఆ కన్య హనుమంమంత్రాన్ని శ్రీ మన్నిరంతర కరుణామృత సాగర వర్షినీం ,పింగాక్షం ,అమోఘ మహేంద్రా యుధ క్షతాన్చిత మహా హనుమ ,అరుణాధర బింబ భూషిత ముఖ చంద్ర మండలం ,ఆతప్త కార్తస్వర భాస్వర ,కాన్తిచ్చతా కాంతి కలిత ,చూడా విరాజితం ,అప్రతిమ దివ్య మాణిక్య మండిత గండ భాగం ,అసమాన మాన నీయ ,రామా కాంత ,కర కమల కలిత పంచ జన్య బందుకంబుధారం ,ఇరావత నాసాదండ సుమత్త దీర్ఘ భుజార్గలం ,అనన్య సాధారణ సంకల్ప సంభావాస్తాన పీథ ,పరినాహి బాహ్వంతరం ,అమూల్య పీతాంబరాలంక్రుత కటి ప్రదేశం ,అనవరత వినత జన మనోరధ సాధన పాద యుగళం ,ఉష్ట్ర వాహనం ,అమర గంగా నదీ పరి వేష్టిత ,హాట కాచల ,వద్దీర్ఘ లాంగూల రంగ ఉత్తుంగ  ,మంగ లాంగాకం ,అన్జనానంద వర్ధనం ,అమల ఊర్ధ్వ పుండ్రం ,తదు పరి కర్పూర సమ్మిశ్రిత శుభ్ర విభూతి ధారణం ,యజ్ఞోప వీత తులసీ పద్మాక్ష రుద్రాక్ష మాలాభి రామం ,శ్రీ రామ చంద్ర చరణార వింద ,సంధిత హృదయార విందం ,అఖిల కళ్యాణ గుణ వంతం ,హనుమంత ముపాస్మహే అని తీవ్రం గా తపస్సు చేసింది .ఆమె తపస్సు ఫలించి హనుమ దివ్య రూపం తో ప్రత్యక్ష మయాడు .
హనుమ నాగాకంయను ఉద్దేశించి కన్యా మణీ !ఎందుకు ఇంత ఘోర తపస్సు చేస్తున్నావు ?నీ కోరిక తెలియ జేస్తే నేను నీ కార్యాన్ని సాను కూల పరుస్తాను అన్నాడు .దానికి ఆమె తన కదా నతా వివరం గా విన్న వించు కొన్నది .స్వామి దర్శనం తో తాను ధన్యత చెందానని చెప్పింది .హనుమ ప్రీత మానసుడై అభయమిచ్చాడు .తనతో ఆమెను నాగ లోకానికి తీసుకొని వెళ్ళాడు .అక్కడ అతి భయంకరు డైన ,అతి బలవంతు డైన రక్త రోమ రాక్షసుని చూశాడు .వాడు ఆంజనేయుని మీదకు యుద్ధానికి వస్తుండటం గమనించి దుష్టుడా !నా ప్రతాపం తెలియక విర్ర వీగు తున్నావు .బ్రహ్మాదులకు కూడా నేను అసాధ్యుడిని అని తీవ్రం గా హుంకరించి తన తోక తో రక్త రామున్ని బంధించి నెల మీద విసిరి కొట్టాడు . దెబ్బకు వాడు తీవ్రం గా రోదిస్తూ ,రక్తం కక్కు కొని చచ్చాడు .దేవ యక్ష గాంధర్వ కింపురుషులు పూల వర్షం కురిపించి హనుమను కీర్తించారు .నాగ కన్యకు దీవేనలిచ్చి అనేక వరాలు అంద జేసి ఇక నుంచి భయం లేకుండా నాగ లోకం లో హాయిగా స్వేచ్చ గా ఉండమని చెప్పాడు .అక్కడి నుండి పావని అదృశ్యమై పంపా తీరం చేరి అక్కడ కొత్త కాలం వుండి ,మళ్ళీ గంధ మాదన పర్వతం చేరు కొన్నాడు .
నాగ కన్య చేసిన స్తోత్ర గద్యను నిండు మనసుతో భక్తీ తో ఎవరు పథి స్తారో  వారికి అన్ని కార్యాలను దగ్గర వుండి తీరుస్తాడు హనుమ . సారి ఇంకో కధ
సశేషం