Pages

Thursday, 26 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –19 సుముఖుని కధ


  శ్రీ భద్రం అనే పట్టణం లో దర్మవేది సుముఖుడనే బ్రాహ్మణుడు వున్నాడు .నిత్య హనుమ జప తపాలతో జీవితాన్ని పండించుకొంతున్నాడు .బ్రాహమనులను ఆహ్వానించి అన్న సమారాధన చేస్తూ ధార్మిక జీవనాన్ని గడుపు తున్నాడు . పట్టణానికి దగ్గరలోనే ఒక గ్రామం వుంది .అందులో దేను మాలి అనే గోళ్ళ వాడు రోజూ సుముఖుని కి నెయ్యి తెచ్చి ఇస్తుంటాడు .దాన్ని అన్నదానానికి ఈయన వినియోగిస్తుంటాడు .ఇది రోజూ జరిగే కార్య క్రమం .
ఒక రోజున రోజూ లాగానే నెయ్యి పాత్ర తీసుకొని వస్తుండగా రెండు గ్రామాలకు మధ్యలో వున్న యేరు పొంగి రాక పోకలకు ఆటంకం కల్గించింది .యేరు ఉధృతం గా ప్రవహిస్తుండటం తో దేను మాలి ఏటి ఒడ్డునే నేటి పాత్రతో కూర్చుని వున్నాడు .యేరు తగ్గ గానే నెయ్యి సుముఖునికి చేర్చాలని ఆరాట పడుతున్నాడు .అక్కడ సుముఖుడు బ్రాహమనులను పిలిచి సమారాధనకు అంతా సిద్ధం చేశాడు .కాని గోళ్ళ వాడు ఇంకా నెయ్యి తీసుకొని రాలేదని ఎదురు చూస్తున్నాడు .కంగారు పడుతున్నాడు .ఆంజనేయుని మన సారా స్మరిస్తున్నాడు అపహాశ్యం పాలు అవుతానేమో నని నిట్టూరుస్తున్నాడు .ఆంజనేయుడు సుముఖుని బాధ గమనిస్తూ గోపాలుని వేశం వేసుకొని నెయ్యి పాత్ర తీసుకొని వచ్చి ఇస్తున్నాడు ఏటి ప్రవాహం తగ్గే దాకా ఇలానే స్వామి చేశాడు .దేనుమాలే తెస్తున్నాడని సుముఖుడు భావిస్తున్నాడు .ఇలా రెండు రోజులు గడిచాయి .మూడో రోజూ యేరు తగ్గింది .ఏటి ఒడ్డునే కూర్చుని ఎప్పుడెప్పుడు వెళ్లి బ్రాహ్మణుడికి నెయ్యి ఇద్దామా అని ఎదురు చూస్తున్న దేను మాలి ,నేమడిగా యేరు దాటి వచ్చి నేటి పాత్రను అండ జేశాడు .గత రెండు రోజులు గా ఏటి ప్రవాహం ఉద్ధృతం గా వుండటం వల్ల రాలేక పోయానని ,క్షమించమని వేడు కొన్నాడు .సుముఖుడు అతని మాటలు విని తనకు రెండు రోజులు ఎయ్యి అందించిన వాడు ఆంజనేయ స్వామే నని గ్రహించాడు .తన సమారాధనకు ఎలాంటి ఆటంకం కలుగ కుండా స్వామి కాపాడి నందుకు మనసు లో మెచ్చి కీర్తించాడు .ఆపన్న శరన్యుడు గా తన్ను ఆడుకొన్నందుకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియ జేసుకొన్నాడు .హనుమ గుణ గానాన్ని చేశాడు .

నమస్తే దేవ దేవేశ నమస్తే రాక్ష శాంతక నమస్తే వానరాదీశ నమస్త్రిమూర్తి వపుషే వేద వేద్యాయ తే నమః -నమస్తే లోక నాదాయ సీతా శోకార్తి హారినే -స్వామింత్వయాక్రుతం హృద్య యదాజ్యవహనం మామ -జాతం మా మప రాధాయ తత్ క్షమస్వ దయానిధే
స్తోత్రానికి మెచ్చి వాయునందనుడు తప్త కాంచన సంకాశం గా ,ముక్తాహార బిన్-భూషనుడిగా ,దివ్య పీతాంబర దారిగా మని కుండల మందితుని గా సుముఖునికి ప్రత్యక్ష మయ్యాడు .సుముఖునితో స్వామి హనుమ నిత్యం నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ పూజిస్తూ సేవిస్తూ ధర్మం తప్పక విపర సమారాధన నిత్యం చేస్తూ న్నావు .నీ దీక్షకు ఆటంకం కలుగ రాదనీ నేనే నెయ్యి పాత్రను రోజూ గోపాలుడి వేశం లో వచ్చి ఈకు ఇచ్చి వెళ్లాను .నీ భక్తీ దాశ్యానికి చాలా సంతోషం గా వుంది .నువ్వు ఏది కోరు కుంతావో అది తప్పక జరిగి తీరు తుంది . ఆటంకము వుండదు .నీ భార్యా పుత్రులతో లోకం లో సుఖాలు అనుభవించి పిమ్మట వారందరి తోనూ గోపాలుడైన దేను మాలి తోనూ కలిసి దివ్య దేహం పొంది మోక్షాన్ని పొంద గలరు విధం గా వరాలు కురిపించి హనుమ అదృష్యుదయ్యాడు .సుముహుడు ఆరోజు నుంచి కోరతా లేకుండా జీవించి సమారాధన క్రమం తప్పకుండా చేస్తూ హనుమ సప్తాక్షరి మంత్రాన్ని జపిస్తూ చివరకు అందరి తో కలిసి మోక్షాన్ని పొందాడు . కధలన్నీ మోక్ష సాధనకు మూల మార్గాలు .హనుమ మంత్ర జపం ,నామ స్మరణ ,హనుమ పాద సేవనం సర్వదా శుభ దాయకం .మరో కధ తరువాత తెలుసు కొందాం .
సశేషం