Pages

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –24 రత్నాకరుని కధ

అయోధ్య లో రత్నాకరుడు అనే వైశ్య వ్యాపారి ఉన్నాడు .ధనం తో పాటు విద్య ఉన్నవాడు .కర్మిష్టి .అనేక యాగాలను శ్రద్ధ గా చేశాడు .గొప్ప దాత .జన హృదయం లో నిలిచిన వాడైనా గర్వం లేని వాడు .కీర్తి కాంక్ష లేని వాడు .నిత్యం భగవంతుని చింతనతో అన్న దానం తో గడుపుతాడు .అనుకూల వతి అయిన బార్య .తండ్రి ని గౌరవించే పుత్రులు .జీవితం హాయిగా గడిచి పోతోంది .రత్నాకరుని కుటుంబం వారంతా రామ భక్తులే అయినా ,హనుమ ను ఆరాధిస్తారు .ఏపని చేసినా దాశ్య భావం తో ఆంజనేయుని లాగా చేస్తారు .ఆదర్శ కుటుంబం అని అందరు పిలుచుకొంటారు .
ఒక రోజూ రత్నాకరుడు యాగం చేస్తున్నాడు .యజ్ఞాన్ని కొందరు  దానవులు భగ్నం చేయ టానికి ప్రయత్నించారు .ఆపేసి మళ్ళీ ప్రయత్నం చేశాడు .మళ్ళీ విధ్వంసం .మళ్ళీ ప్రారంభం గా కొన సాగింది .చేసేది లేక ఇంద్రుడిని  శ్రద్ధ గా ప్రార్ధించాడు .ఆయన ప్రత్యక్షమవ్వగా ,తన బాధ చెప్పుకొన్నాడు .శచీ పతి ”నువ్వు అధైర్య పడ వద్దు .గౌతమ ఆశ్రమానికి వెళ్ళు .అక్కడ  శతా నందుని పూజించి ,”హుమ్కార ఆంజనేయ మంత్రాన్ని ”ఉపదేశం గా పొందు .పవన తనయుడు నిన్ను అనుగ్రహించి నీ యజ్ఞాన్ని నిర్విఘ్నం గా జరిగే టట్లు చేస్తాడు ”అని చెప్పాడు .అలాగే గౌతమాశ్రమానికి చేరి ,శాతానందాను గ్రహం  పొంది,గురుత్రయ ఉపదేశాన్ని ,హుమ్కార హనుమంమంత్రాన్నిన్యాస పూర్వకం గా  ఉపదేశం  పొందాడు .మంత్ర జప నియమాన్ని ,కాల నిబంధనలను శతానందుడు రాత్నాకరునికి వివ రం గా అనుగ్రహించాడు .
గౌతమాశ్రమం లోనే మహర్షి శతా నందుని సాన్నిధ్యం లో ”హుమ్కార మంత్రాన్ని ”ఒక జాము సేపు జపించాడు .భక్త సులభుడు ఆంజనేయుడు ఆవిర్భవించాడు .”రత్నాకరా !చాలా సంతోషించాను .నీ భక్తీ గొప్పది .అనుమానం లేకుండా ఇంటికి వెళ్ళు .సత్ర యాగం మొదలైనవి నిర్విఘ్నం గా చేసుకో .సర్వ సుఖాలు అనుభవించి ,ముక్తిని పొందు ‘అని చెప్పి అదృశ్యమైనాడు. మారుతి .గురువు శతానందుని అనుజ్న పొంది ,రత్నాకరుడు అయోధ్య కు తిరిగి వచ్చాడు .వేద విదులైన బ్రాహ్మనోత్తముల ఆధ్వర్యం లో సత్రయాగం ప్రారంభించాడు .మూడు రోజులు గడిచిన తర్వాత రాక్షసులు యాగ విధ్వంసానికి వచ్చారు .హనుమంతుడు బహు రూపములతో ప్రత్యక్షమై ,రాక్షస సంహారం చేసి ,యాగం నిర్విఘ్నం గా జరిపించాడు .
ఆ తర్వాత అనేక సత్రయాగాలు చేసి ,పునర్జన్మ లేని లోకం చేరాడు .
రత్నాకరుని  వంశం వారంతా అతని మార్గాన్నే అనుసరించి మోక్షం పొందారు .ఈ కధ చెప్పిన పరాశర మహర్షి మైత్రేయునితో కొన్ని ముఖ్య విషయాలు తెలిపాడు .మంత్రాలు అనేకం .ఒకే మంత్రాన్ని ,పల్లవాలను కలిపి జపించ వచ్చు .నిర్దిష్ట కార్యాన్ని అనుసరించి ,బీజాలను ఇరువైపులా చేర్చి జపించాలి .గురువు నుండే మంత్రాన్ని ఉపదేశం గా పొందాలి .ఉపదేశం లేని మంత్రం ఫలం ఇవ్వదు . .నిష్కామం గా ,నిగర్వం గా ,సత్కర్మా చరణం తో సాధన చేయాలి .అలాంటి  వారినే మంత్రాధిష్టాన దేవత రక్షిస్తాడు .మంత్రాలతో వ్యాపారం చేసే వారు మొదట్లో బానే ఉంటారు .తర్వాత వారికి కష్ట నష్టాలు వస్తాయి .అని చెప్పి ”హుమ్కార మంత్రోద్ధారాన్ని ”వివరించాడు —
”రామ బీజం సముచ్చార్య వాయు బీజం నమో నమః -వాయుపుత్రేత్యదో చార్య హనుమత్పరమం ధరేత్ .
సర్వ రాక్షస సంహార కారణాయే త్యదోచ్చరేత్ -సర్వ భయ నివారణం కురు యుగ్మంచ హుం త్రయం .
ఫటు స్వాహేతి మంత్రోయం ద్విచాత్వారిమ్ష దక్షరః -సర్వేషామేవ మంత్రానాం అయం శ్రేష్ఠ తరో మతః
అస్య మంత్రస్య హనుమాన్ స్వయమేవ రుషిస్మ్రుతః -చందస్య దైవ గాయత్రీ హనుమాన్ దేవతా స్మృతః
రామో బీజ మరుక్చక్తిహ్ వాయు పుత్రేతి కీలకం -సర్వ కామ్యార్ధ సిద్ధ్యర్ధం సాధకో విని యోజఎత్
న్యాసం కుర్యాత్ప్రయత్నేన మూల మంత్ర విధానతః –అధవా రామ వాయుభ్యాం షడంగం విన్యసేద్బుదః
ఆయుతం తు పునస్చార్యా దశాంశ విధినా తతః -హోమ తర్పణ విప్రార్చాన్ గురు పూజాం సమాచ రేత్ ”
ఇది హుమ్కార మంత్రోద్ధారం .దీనికి ధ్యాన శ్లోకం -కింద చెప్ప బడింది
”ద్వాత్రిమ్శాద్భుజ భీశానో దయత మహా శాస్త్రం త్రిశీర్షం జ్వాల –ధ్వహ్ని స్పర్దీశాడీ క్షణం ప్రవిలసడ్డంష్ట్రా కరాలాననం
నిస్త్రింశ ప్రతి మాన రోమ నిచయం హుమ్కార ఘోరాక్రుతిం -ధ్యాఎచ్చత్రు వినాశానాయ నుతి మానుగ్రం హను మత్ప్రభుం ”
”అస్య శ్రీ హుమ్కార హనుమన్మహా మంత్రస్య -హనుమాన్ రుషి హ్  గాయత్రీ చందః హుమ్కార హనుమాన్ దేవతా -రాం బీజం -మరుక్చక్తిహ్ -వాయు పుత్రేతి కీలకం -హుమ్కార హను మత్ప్రసాదేన సర్వ కామ్యార్ధ సిద్ధ్యర్ధం హుమ్కార హనుమంమంత్ర జపే విని యోగః -మూల మంత్రేనా షడంగ న్యాసం కుర్యాత్ -భూర్భువాస్వోమితి దిగ్బంధః -ధ్యానం -ల మితి గురు ధ్యానాదికం కృత్వా-
ఓం రాం యం ,నమో వాయు పుత్రాయ హను మతే సర్వ రాక్షస సంహార కారణాయ ,సర్వ భయ నివారణం కూరు హుం హుం హుం ఫట్ స్వాహా –