Pages

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –25 కుశోత్తముని కధ


కృత యుగం లో మాంధాత చక్రవర్తి పరమ ధర్మజ్ఞుడు గా ప్రశిద్ధి చెందాడు .మంత్ర వేత్త ,సదాచార ఆరీనుడు .సర్వ విద్యలకు నిలయ మైన వాడు .సౌభాగ్య నగరం ను రాజ దాని గా చేసుకొని పాలిస్తున్నాడు .ఆ పట్నం లో ”కుశోత్తముడు ”అనే బ్రాహ్మనుడున్నాడు .వేద వేదాంగ పారంగతుడు ,సత్య వాది,మౌని . అక్కడి నదీతీరం లో ఉండే వాడు .ఇతని నియమ నిష్టలను చూసి హనుమంతుడు ఒక సారి ఇతన్ని చూడాలని ,అతడు జపం చేసుకొనే సమయం లో వచ్చాడు .దివ్య శోభ తో విలసిల్లే ఆంజనేయుని చూసి ,ఆనంద బాష్పాలు రాలుస్తూ స్తోత్రం చేశాడు ”నిత్యానందుడు ,సదాశివ స్వరూపుడు ,భాక్తాశ్రయుడు ,పావనుడు ,రక్త లోచనుడు ,సువర్నాభారణ అలంకృతుడు ,దేవతలచే నిరంతరం స్తుతింప బడే వాడు ,దేవతలకు గురు తుల్యుడు అయిన హనుమా నీకు నమస్కారం ”అన్నాడు .కొన సాగిస్తూ ”ఆరు ముఖాలతో శత ముఖ రావణ సంహారం చేసి ,భయంకర కోరలతో ,గరుత్మంతుని గర్వాపహారి సృష్టి స్థితి లయ కారుడు పద్దెనిమిది నేత్రాలతో విలసిల్లె వాడు ,భీమాగ్రజుడు అయిన కేసరి తనయునికి నమస్కారం ”అన్నాడు .మళ్ళీ ”సీతా శోక వినాశ కారి ,శుభాలను కలగా జేశే వాడు ,గాన ప్రియుడు ,ఆత్మా లో రమించే వాడు సర్వ లోక ప్రభువు అయిన మారుతికి  వందనం ”అని భక్తీ తో స్తోత్రం చేశాడు ..
ఈ స్తోత్రానికి పరమానంద మ పొందిన పావని కుశోత్తమునికి రత్న మాల ను కానుక గా ఇచ్చాడు .ఆశీర్వదించి అదృష్యమయాడు .ఈ విషయం మాంధాత చక్ర వర్తి కి తెలిసింది .అంతటి వజ్ర మాణిక్యాలు పొదిగిన  విలువైన రత్న మాల చక్ర వర్తి దగ్గర ఉండాలి కాని సామాన్య బ్రాహ్మణుడి వద్ద ఉండ రాదనీ  తలచి దానికి తగిన ధనాన్ని ఇస్తానని ఆ మాలను తన కివ్వ మని ఇంటికి పిలి పించి చెప్పాడు .అప్పడు కుశోత్తముడు ”మహా రాజా ఆ రత్న మాలను  మీ కు ఇవ్వటానికి నాకు అనుజ్న లేదు .దాన్ని ఆంజనేయ స్వామి నాకు బహూకరించాడు .ఆయనకు చెప్పి  ఆయన ఇవ్వ మంటే మీకు ఇస్తాను ”అని వినయం గా చెప్పాడు .ఈ మాటలు మాంధాత కు రుచించ లేదు .చివరికి బల వంతం గా తీసుకోవా టానికి ప్రయత్నం చేశాడు అప్పుడు కుశోత్తముడు మారుతిని మనసారా స్మరించాడు .హనుమ ప్రత్యక్షమై వాయువు సహాయ మ్ తో మాంధాత మొదలైన వారందర్నీ సముద్రం లోకి విసిరేశాడు .కుశోత్తముని దీవించి హనుమ అంతర్ధాన మయాడు .ఆయన జీవిత కాల  మంతా హనుమ ధ్యానం లో గడిపి చివరికి సాయుజ్యం పొందాడు
సశేషం