Pages

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –26 కేశవుని కధ


  పూర్వం ఒక గ్రామం లో కేశవుడు అనే బ్రాహ్మణుడు ఉండే వాడు .వెద వేదంగా పారంగతుడు  ,బుద్ధి మాన్ ,స్వధర్మా చరణ నిష్టుడు .పుత్రులు ,పౌత్రులతో భార్య విశా లాక్షి తో సుఖ జీవితం గడు పుతున్నాడు .అతిధి పూజ లో జన్మ ధన్యం చేసు కొంటున్నాడు .ఆ గ్రామానికి ఒక ప్రభువు లా వెలిగి పోతున్నాడు కేశవుడు .కొంత కాలానికి అతని జీవితం లో విషాదం అలము కొంది .ప్రియ అర్ధాంగి అకస్మాత్తు గా మరణించింది .అతని దుఖం పట్ట శక్యం కా కుండా ఉంది .బాధ తట్టు కో లేక కాశీ నగరం చేరాడు
అక్కడ నిత్యం గంగా స్నానం తో పవిత్రత ను పొందుతూ ,విశ్వేశ్వరున్ని దర్శిస్తూ ,అభిషేకం చేస్తూ ,విశాలాక్షీ దేవి దర్శనం తో ఊరట చెందుతున్నాడు .కొంత కాలం కాశీ లో గడిపి ,తర్వాత ప్రయాగ ,గయా  మొదలైన క్షేత్ర దర్శనం చేసి పితృ కార్యాలను నిర్వ హిస్తూ ,విధ్యుక్త ధర్మాలన్నీ నిర్వ హిస్తూ కొన్ని నెలలు గడిపి ,మళ్ళీ ఇంటి ముఖం పట్టాడు .ప్రయాణం లో ఒక రోజు చీకటి పడటం తో ఒక మర్రి చెట్టు కింద విశ్ర మించాడు .ఆ వట వృక్షం చాలా పురాతనమై ఊడలతో  బాగా విస్త రించి ఉంది .అర్ధ రాత్రి సమయం లో ఆ చెట్టు ను ఆశ్రయించుకొన ఒక పిశాచం అందంగా ఉన్న కేశవుని తినాలని ఉబలాట పడింది .మనోహర సుందర యువతీ గా మారి అతని దగ్గర కు వచ్చింది .శృంగార చేస్ష్టలతో రెచ్చ గొట్టటం ప్రారంభించింది .అతనికి ఏమీ పాలు పోలేదు .”యువతీ !ఎవరు నువ్వు ?అర్ధ రాత్రి ఒంటరిగా ఇలా రావటం తగదు .వివాహం అయిందా ?నేను భార్య లేని వాడను .నా అండ దండ లతో ఉండ గలవా ?నువ్వు ఒప్పుకొంటే నాతో నిన్ను మా ఊరు తీసుకొని వెళ్తాను”అని చెప్పాడు .ఆమె అంగీకరించింది .వారిద్దరూ ఆ రాత్రి ఆనందం గా గడిపారు .మర్నాడు ఆ ఇద్దరు ఇంటికి చేరారు .
                కొంత కాలం ఆమె తో చక్కగా కాపురం చేశాడు .ఒక రోజు కేశవుని ఇంటికి దూరం గా ఒక చెట్టు కింద ధూళి దూసర దేహం తో ,రుద్రాక్ష మాల ధరించి ,వ్యాఘ్ర చర్మాంబర దారి అయిన ఒక యోగి శిష్యులతో కని పించాడు .కేశవుడు ఆయన్ను చేరి తన ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించ మని కోరాడు .సంతోషం తో ఆ యోగి ,శిష్యులతో కేశవుని ఇంటికి వచ్చాడు .లోపలి వెళ్లి భార్యను రమ్మని పిలిచాడు .అ యోగి పిలవ వద్దని వారించాడు .కేశవుని తో యోగి ”కేశవా !ఆమె ను తెలుసుకొనే కాపురం చేస్తున్నావా ?పెళ్లి చేసుకోన్నావా ?నిజం చెప్పు ”అని అడిగాడు .దానికి కేశవుడు జరిగిన విశేషాలన్నీ వివరం గా తెలిపాడు .తనకే మీ తెలీదని తనను ఉద్ధరించ మని వేడు  కొన్నాడు .
కేశ్శవుని పై యోగికి జాలి కలిగి అతన్ని ఉద్ద రించాలని భావించాడు .”ఈమె విషయం నేను చెప్పను .నువ్వే గ్రహించు .”అని చెప్పి శ్రీ రామ తారక మంత్రాన్ని ఉపదేశించి వెంటనే జపిమ్పచేయించాడు .ఒక రుద్రాక్ష మాలను ఇచ్చి దానితో జపం చేయమన్నాడు .చేతి లోని ఆ మాల వల్ల  సూర్య తేజం తో  వెలిగి పోతున్నాడు ఆమె భయ పడి ఆ జప మాలను దూరం గా విసిరేయమని కోరింది .తన దగ్గరకు రావద్దని ప్రార్ధిస్తూ ఏడుస్తూ దూర దూరం గా జరిగింది .అప్పుడు భక్త శులభుడైన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై తన తోక తో ఆ పిశాచిని చుట్టి విసిరేశాడు .కేశవుడికి జరిగిన దంతా తెలిపి స్వామి అదృశ్య మైనాడు .కేశవుడు యోగిని దర్శించి ,జరిగిన దంతా తెలియ జేషి ,తన్ను ఉద్ధరించమని వేడాడు .యోగి క్రుపాలువై ”రామ   ,ఆన్జనేయులను నిత్యం జపించు .ఒక దేవాలయం నిర్మించి శ్రీ హనుమ ను ప్రతిష్టించు .జేవితాంతం హనుమ పూజ మాన వద్దు ”అని హితవు చెప్పి శిష్యులతో వెళ్లి పోయాడు .యోగి ఆదేశించిన విధంగా కేశవుడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మిచి ,స్వామిని ప్రతిష్టించి యదా విధిగా పూజలు నిర్వ హిస్తూ ,హనుమ మద్భాక్తులను ఆదరిస్తూ   ,హనుమ కధలను విని పిస్తూ ,హనుమదనుగ్రహాన్ని సంపూర్ణం గా పొంది ,చివరకు ముక్తిని పొందాడు
                             సశేషం