Pages

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –33 సౌందర్య కాండ


           మైత్రేయ మహర్షి పరాశర మహర్షి కి అంజలి ఘటించి ‘’మహర్షీ !సుందర కాండ లోని 48 వ సర్గ కే అంతటి మహిమ ఉంటె ,అసలు సుందర కాండ ప్రతి సర్గకు మహాత్మ్యం ఉన్నది, ఉంటుందని తోస్తోంది .అసలు ఆ కాండకు సుందర కాండ అనే పేరు ఎందుకు వచ్చింది ?అందు లోని సౌందర్యం ఏమిటి ?అంతటి పారాయణ గ్రంధం గురించి వివరించండి ‘’అని కోరాడు .పరాశర మహర్షి వివరించటం మొదలు పెట్టాడు .
     వాల్మీకి మహర్షి రచించిన రామాయణమే ఆది కావ్యం . అందులో ఏడు కాన్దలున్నాయి .బాల ,అయోధ్య ,అరణ్య ,కిష్కింద ,సుందర ,యుద్ధ,ఉత్తర కాండలు .అందులో అయిదవదే సుందర కాండ .శ్రీ రాముని జననం నుండి తిరిగి వైకుంఠానికి చేరే వరకు ఉన్న చరిత్ర అంతా రామాయణం లో నిక్షిప్తం చేశాడు ఆది కవి వాల్మీకి మహర్షి .రామాయణం మనకు పవిత్ర పథ నీయ గ్రంధం .ఇతిహాసం .దీన్ని పఠిస్తే పాపాలు తొలగి పోతాయి .చిత్త  శుద్ధి టో పారాయణం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి .
                  సుందర కాండను ‘’హనుమద్విజయం ‘’అని కూడా పిలుస్తారు .దీనిని పారాయణం చేస్తే ఆపత్తు లన్ని తొలగి పోతాయి .ఒక రకం గా ‘’సర్వార్ధ చింతా మణి ‘’అని సుందర కాండను అంటారు .అయితే సుందర కాండ పారాయణ కు కొన్ని నియమాలున్నాయి .అవి గురు ముఖతా తెలుసు కొని భక్తీ తో ,దీక్ష తో పారాయణ చేస్తే అన్ని ఫలితాలు కలుగు తాయి .సుందర కాండ లోని పాత్రలన్నీ బహు సుందరం గా ఉంటాయి .అందులోని ప్రదేశాలు కూడా సుందర తరం గా ఉంటాయి .సన్నీ వేశాలు ,రచనా విధానం ,పదాల కూర్పు ,అర్ధ గౌరవం ,అలంకార విశిష్టత ,మనో భావాలు ,కధనం లో ఉత్క్రుష్టత ,కధలో ఆనందం అన్నీ సుందరాతి  సుందరం గా ఉండటం వల్ల ఈ కాండకు సుందర కాండ అనే చక్కని పేరు పెట్టాడు మహర్షి .
‘’సుందరే సుందరో రామః సుందరే సుందరీ కధా –సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనం
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిహ్ –సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరః’’
    అని మహానీయులందరి ప్రశంస లను పొందింది .’’సుందర హనుమన్మంత్రం ‘’ఈ కాండ లో ఉందని విజ్ఞుల భావన .మాటలతో వర్ణించటం కష్టం .చదివి అనుభ వించాలి .శ్రీ రాముడు సుందర రఘు రాముడు . పుంసాం మోహన రూపాయ అని పిలువ బడ్డ వాడు .సీతా మాత జగదేక  సౌందర్య మూర్తి .రామాయణ కధల్లో అన్తితి కంటే  ఈ కధ అతి సుందర మైనది .లంకలోని వనాలు దుర్గాలు ,భవనాలు అన్నీ సుందరత్వానికి ప్రతీకలే .ఆ వనాల్లో సీతా దేవి కూర్చున్న అశోక వనం అత్యంత సుందరమైనది . సుందర కావ్యాలలో  అతి లోక సుందర మైనది సుందర కాండ .సుందర మైన కపి శ్రేష్ఠులలో కపి వరేణ్యుడు  హనుమ సుందర తేజో ,బల శౌర్య స్వరూపుడు ..సద్యో ఫలితాన్ని ఇచ్చే సుందర మంత్రాలలో సుందర కాండ మంత్రం అతి సుందర మైనది .గాయత్రీ మంత్రం ఈ కాండలో ప్రతిష్టింప బడింది .సుందర కావ్యాలలో ఇంతకు మించిన సౌందర్యం ఇంకెక్కడా లేదు కనుక సౌందర్య .లేక సుందర కాండ అనే పేరు తో ప్రసిద్ధ మైనది .అలాంటి సుందర రాముడి సుందర రూపం ముప్ఫై మూడో సర్గ నుండి వర్ణించాడు మహర్షి వాల్మీకి .
        సశేషం —