Pages

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –34– శ్రీ హనుమత్ సూక్తం

”శ్రీమాన్ సర్వ సర్వ లక్షణ సంపన్నః ,జయప్రద ,సర్వాభరణ భూషితః ఉదారం ,మహోన్నత ఉష్ట్రా రూడ్హః కేసరీ ప్రియ నందనః ,వాయు తనూజః ,యధేచ్చ పంపా తీర విహారీ ,గంధ మాదన సంచారః ,హేమ ప్రాకారాన్చిత కదళీ వనాంతర నివాసః ,పరమాత్మా ,వన చర శాప విమోచన ,హేమ వర్ణాం ,నానా రత్న ఖచితామమూల్య తరాం ,మేఖ లంచ స్వర్నోపవీతాం ,,కౌశేయ వస్త్రం చ బిభ్రాణః ,సనాతనః ,పరమ పురుషః ,మహాబలః ,అప్రమేయ ప్రతాప శాలీ ,రజత వర్ణః ,శుద్ధ స్ఫటిక సంకాశః ,పంచ వదనః ,పంచ దశ నేత్రః ,సకల దివ్యాస్త్రా దారీ ,శ్రీ సువర్చలా రమణః ,మహేంద్రాది అష్ట దిక్పాలక త్రియంశాద్గీర్వాన ముని గణ గంధర్వ యక్ష కిన్నర ,పన్నగాసుర పూజిత పాద పద్మ యుగళః ,నానా వర్ణః ,కామ రూపః ,కామ చారః ,యోగిధ్యేయః ,శ్రీ హనూమాన్ ఆంజనేయో ,విరాడ్రూపీ ,విశ్వాత్మా ,విశ్వ రూపా ,పవన నందనః ,పార్వతీ పుత్రః ,ఈశ్వర తనూజః ,సకల మనో రధాన్నో దదాతు ”
     ఇదం శ్రీ హనుమత్సూక్త యో దీమాన్ ఏక వారః ,పతేద్యాది సర్వేభ్యో పాపెభ్యో విముక్తో ,భూయాత్ .ద్వివారం యది పతేత్ సమస్త తీర్ధ స్నానః సర్వ వేదంగా పార గశ్చ  భూయాత్ .త్రివారం యః పతేత్ శ్రీ హనుమత్ సాయుజ్యం ప్రాప్నుయాత్ .సర్వాన్ కామానవాప్నోతి ”దీని అర్ధ వివరణ –
                శ్రీ మంతుడు ,సర్వ లక్షణాలతో కూడిన వాడు ,జయప్రడుడు ,సర్వ ఆభరణాలతో శోభించే వాడు ,ఉదారగుణం ఉన్న వాడు ,ఒంటెను వాహనం గా కల వాడు ,కేసరి కి ప్రియమైన కుమారుడు ,వాయుదేవుని పుత్రుడు ,ఇస్తాను సారం పంపా నదీ తీరం లో సాంచ రించే వాడు ,గంధ మాదన పర్వత నివాసి ,సర్వ ప్రాకారాలు ఉన్న బంగారు అరటి తోటలలో నివ సించె వాడు ,పరమాత్ముడు ,వనచరాలకు శాప విమోచనం కల్గించిన వాడు ,బంగారు రంగు శరీరం కల వాడు ,అమూల్య మైన నవ రత్నాలు పొదిగిన హారాలు ,మేఖల ,బంగారు యజ్ఞోప వీతం ,పట్టు బట్టలు ధరించిన వాడు ,సనాతనుడు ,పరమ పురుషుడు ,మహా బల వంతుడు ,ఎదురు లేని ప్రతాపం తో శోభించే వాడు ,వెండి రంగు ,శుద్ధ స్పటిక వర్ణాలతో సమాన మైన తెజస్సున్న వాడు ,అయిదు ముఖాలతో పదిహేను నేత్రాలతో ,సర్వ దివ్యాస్త్రాలు కల వాడు ,సువర్చలా దేవి మనోహరుడు ,మహేంద్రుడు మొద లైన అష్ట దిక్పాలకుల చేత ,ముప్ఫై మూడు కోట్ల దేవతలచేత  మునులు ,గంధర్వులు ,యక్షులు ,కిన్నరులు ,పన్నగులు  అసురులచేత  పూజింప బడిన పాద పద్మాలు కల వాడు ,అనేక వర్ణాలు ,అనేక కామ రూపాలు ధరించే వాడు ,అదృశ్య సంచారం చేసే యోగుల చేత ద్యానింప బడే వాడు ,అయిన శ్రీ హను మంతుడు ,ఆంజనేయుడు ,విరాట్ స్వరూపుడు ,విశ్వాత్ముడు ,విశ్వ రూపుడు ,పవన నందనుడు ,పార్వతీ పుత్రుడు ,ఈశ్వర కుమారుడు సకల మనో రధాలను ఇచ్చు గాక ”
 ఈ హనుమత్సూక్తాన్ని బుద్ధి మంతుడు ఒక్క సారి పాఠం చేస్తే సర్వ పాప విముక్తుదౌతాడు .రెండు సార్లు చేస్తే సర్వ తీర్ధాలలో స్నానం చేసిన ఫలం,వెద వేదాంగాలను చదివిన ఫలితము  పొందు తాడు .మూడు సార్లు చదివితే హనుమంతుని సాయుజ్యం పొందు తాడు .
             హనుమంతుని రూపం ఎలా ఉంటుందంటే అన్ని లోకాల లో ఉన్న లావణ్యం అంతా పోత పోసి నట్లు ఉంటుందట .దేవతలే ఆ రూపాన్ని చూసి ఆశ్చర్య పడ తారట .బలిష్టమై ,పొడవైన ఆ దేహాన్ని ,అతి పొడవైన వాలాన్ని ,వానర ఆది పత్యాన్ని తలచుకొంటూ భక్తితో కళ్ళు మూసు కొంటారట .జాంబవంతుడు ,అంగదుడు ,నలుడు  నీలుడు మొదలైన వారంతా రక్షకులు గా నిల బడి సేవ చేస్తూ ఉంటారట .అవసర మైనప్పుడు భక్తులను రక్షించ టానికి అనేక రూపాలు ధరిస్తాడట .ఆశ్రితులను రక్షిస్తూ ,దుష్టులను శిక్షిస్తూ కూడా నిత్య క్రుత్యాలలో ఏమాత్రం అజాగ్రత చూపించ కుండా ఉంటాడట .హనుమంతుని అనుగ్రహం పొంద టానికి కొందరు ఆయన విగ్రహాలను భక్తులకు ఇస్తారట .శచీ పతి దేవేంద్రుడు గంధ మాదన పర్వతం దగ్గర సరస్సు వద్ద  తూర్పు ముఖం గ,హనుమ విగ్రహాన్ని స్థాపించి  స్తోత్రాలు చేసి పూజించాడు .ధర్మ రాజు దక్షిణ దిక్కులో విగ్రహ ప్రతిష్ట చేసి నీలుడికి ఇచ్చాడు .,వరుణుడు నిరుతి  నైరుతి దిక్కున విగ్రహం పెట్టి పూజించి పనసుడి కి  సమర్పించాడు .పశ్చిమాన వరుణుడు ప్రతిష్ట చేసి గంధ మాదనుడికి ఇచ్చాడు .వాయవ్యం లో వాయుదేవుడు నెల కొల్పి ,సుషేనుడికి సమర్పించాడు  .అగ్ని ఆగ్నేయం లో పెట్టి వినతుడికిచ్చాడు .ఉత్తరాన కుబేరుడు స్థాపించి మైన్దునకు అప్పగించాడు .ఈశాన్యం లో శివుడు ఏర్పాటు చేసి ద్వివిడుడికి ఇచ్చాడు .ఈ విధం గా దిక్పాలకు లంతా హనుమ విగ్రహాలను నెల కొల్పి ,పూజించి తరించారు .అక్కడే దగ్గర లో ఉన్న ఆవాల సాగరం లో  స్నానం చేస్తే పాపాలు పోతాయి .అందులో పసుపు రంగు కమలాలు కళ్ళకు వింత శోభను చేకూరుస్తాయి .రాజ హంసలు ,చక్ర వాకాలు ఆ జలం మీద తిరుగు తుంటాయి .అప్సర గణం నృత్యాలు చేస్తుంటారు .మంత్రాలను ఉపాసిస్తూ ఉంటారు .గంధ మాదన గుహలో రత్న సింహాసనం మీద హనుమంతుడు చిద్విలాసం గా ,శ్రీ రామ నామ ధ్యానం తో ,అర మూసిన కన్ను లతో ,భక్తుల సందేహ నివృత్తి చేస్తూ త్రిమూర్త్యాత్మక స్వరూపం గా వెలిగి పోతు ఉంటాడు .     
             సశేషం –