Pages

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –35 శ్రీ రాముని గుణ సౌందర్యాలు


 మైత్రేయ మహర్షి పరాశర మహర్షిని శ్రీ రాముని గుణ సౌందర్యాలను వరిం చమని కోరాడు .దానికి ఆయన సుందర కాండ లో  ఆ విషయాలన్నీ ఉన్నాయని చెప్పి తెలియజేశాడు .శ్రీ రాముడు కమల పత్రాక్షుడు ,సర్వజీవుల మనోహరుడు .మంచి రూపం ,దాక్షిణ్య స్వభావం ఉన్న వాడు .సర్వగుణాల రాశీ భూత మూర్తి యే రామ మూర్తి .సూర్య సమాన తేజస్సు ,భూమి వంటి ఓర్పు ,బృహస్పతి బుద్ధి ,ఇంద్రుని  కీర్తి ,కలవాడు .సర్వజన రక్షణ ,క్షత్రియ ధర్మ పాలన ,లోకధర్మ రక్షణ ఉన్నవాడు .వర్నాశ్రమాలకు ,నాలుగు వర్ణాలకు రక్షకుడు .మర్యాదానిలయుడు .తేజో వంతుడు ,సర్వపూజ్యుడు .బ్రహ్మ చర్య వ్రత పరాయణుడు ,సాదుజనవుప కారి .ఐహికాముష్మిక ధర్మాలు తెలిసిన వాడు .రాజ్య విద్యలో సుశిక్షితుడు .మంచి మాటలే వినే స్వభావం .శత్రుహృదయ వేది .శీ ల ,వినయ సంపన్నుడు .శత్రుదమనుడు .యజుర్వేదాధ్యయన పరుడు .ధనుర్వేద పారంగతుడు .వేద వేత్తలకు పూజ్యుడు .వేదాంగ రహస్య విజ్ఞాని .’
    శ్రీ రాముడు సత్య ,ధర్మాను రక్తుడు .ఆర్జించిన ధనాన్ని యాచకుల కిచ్చి కాపాడే వాడు .దేశకాల విధిగా పనులు చేసే వాడు .ప్రజలందరినీ సమానం గా చూసే వాడు .అందరికి ఐ ష్టుడే .ఇప్పుడు సీతా దేవి గురించి పరాశరుడు వివరిస్తున్నాడు –‘’ఇచ్చ్చా జ్ఞాన క్రియా శక్తిత్రయం యద్భావసాధనం –తాద్బ్రహ్మ సత్తా సామాన్యం సీతా సత్వ ముపాస్మహే ‘’అనే –ఇచ్చా ,జ్ఞాన ,క్రియా శక్తులైన మూడింటికి యే భావం సాధనం అయిందో ,ఆ సామాన్య మైన బ్రహ్మ సత్తే సీతా తత్త్వం అని చెప్పాడు దీన్ని పూర్తిగా వివరిస్తున్నాడు –
‘’దేవాహవైప్రజాపతి మబ్రువన్ ,కా సీతా రూప మితి ,సహోవాచ ప్రజా పథిహ్ –సా సీతా ఇతి మూల ప్రకృతి రూపత్వా తా సీతా ప్రకృతి స్మృతా ప్రణవ ప్రకృతి రూపత్వా ,సీతా ప్రకృతి రుచ్యతే –సీతా ఇతి త్రివర్నాత్మ సాక్షా న్మాయామాయీ భవేత్ –విశ్నుహ్ ప్రపంచ బీజం ఛ మాయా ఈకార ,ఉచ్యతే .సహకార సత్య మమృతం ,ప్రాప్తః సోమశ్చ  కీర్త్యతే –తాకార స్తార లక్ష్మా ఛ వైరాజః ప్రస్తారా స్మృతః –ఇకార రూపిణీ సోమామ్రుతా వయ వాదే వ్యలన్కార సరజ మౌక్తికాద్యాభారణ లంక్రుత వ్యక్త రూపిణీ భవతి –ప్రధమా శబ్ద బ్రహ్మ మయీ ,స్వాధ్యాయ కాలే ప్రసన్నా ఉద్భావన కారీ ,కాత్మికా ,ద్వితీయా భూతలే హలాగ్రే సముత్పన్నా ,తృతీయే ఇవావ కారిణీ అవ్యక్త స్వరూపా భవతీతి సీతా ఇత్య్దహరాంతి ,శౌ నకీయే శ్రీ రామ సాన్నిధ్య వశాజ్జగా ధా నంద కారిణీ ,ఉత్పత్తి స్థితి సంహార కారిణీ ,సర్వ దేహినాం ,సీతా భగ వ తీ జ్ఞేయా’’  అని ‘’సీతోపనిషత్తు ‘’నుండి ఆమె స్వరూపాన్ని వివ రించాడు .దీని భావం –సీత మూల ప్రకృతి .ప్రణవ స్వరూపిణి.సీత అనే పేరు లో మూడు వర్నాలున్నాయి .త్రివర్నాత్మకమైనది సీత .ఆమె ప్రత్యక్ష మాయ .ప్రపంచానికి విష్ణుడవు (స)బీజము .మాయామాయి ఈ కారం గా చెప్పబడింది .స కారం సత్యానికి ,అమృత సిద్ధి కి సోమానికి కారణం .త కారం లక్ష్మీ బీజమైన శ్రీ కారానికి సంకేతం .ఇకార రూపిణి అయిన మహా మాయ అవ్యక్త రూపిణి అయినా ,సోముని లాగా అమృత స్వరూపిణి .ముత్యాలు మొదలైన ఆభరణాలను ధరించి ఉంటుంది .మొదట శబ్ద బ్రహ్మ మయి గా ,స్వాధ్యాయన కాలం లో ,ఉపాసనా కాలం లో ఆత్మ రూపిణి గా ,ప్రసన్నమై ,రెండవ సారి భూమి లో నాగలి చివర జన్మించింది .దీనికి ఉదాహరణ ఆమెయే శ్రీ రాముని సన్నిధి లో జగదానంద కారిణి గా ,సృష్టి స్థితి సంహార కారిణి గా ఉన్నది అని ‘’శౌనకీయం ‘’అంగీక రించింది .ఆమె సీత .ఆ సీతే సర్వ జీవుల లో భగవతి అంటే మాయ గా ఉంది .
             ‘’శ్రీ రామ తారక ఉపనిషత్తు ‘’లోను ‘’శ్రీ రామొత్తరతా పి  న్యుపనిషత్తు ‘’లోను ఉన్న శ్రీ రామ రహస్యాన్ని మహర్షి మళ్ళీ విశ్లేషించి చెప్పాడు  .—‘’కామ రూపాయ రామాయ ,నమో మాయా మయాయచ –నమో వేదాది రూపాయ ,ఓంకారాయ నమో నమః ‘’
‘’అద హీనం భారద్వాజః పప్రచ్చ యాజ్న్య వల్క్యం కిం  తారకం ?కిం తారీతి ?సహోవాచ యాజ్న్య వల్క్య స్తారకం దీర్ఘానల బిందు పూర్వకం ,దీర్ఘానలం పునర్మాయ నమ్స్చంద్రాయ ,నమో భద్రాయ నమ ఇత్యోన్తద్బ్రహ్మాత్మికః సచ్చిదానందాభ్యా- ఇత్యు పాసితవ్యా ‘’
దీని భావం –శ్రీ రాముడు మాయా మయుడు ,వేదాది రూపుడు ,ఓంకార రూపుడు అని రామ పూర్వతాపిత్యుపనిశాత్తు చెప్పింది తారకం అంటే దీర్ఘ అ కారం తో (రా )అనే అగ్ని బీజం అయిన రకారం బిందువు తో  కూడి తె ‘’రాం’’ అవుతుంది .తరువాత మయాయనమః అనేది ఉంది .వీటిని కలిపితే ‘’రామాయ నమః ‘’అవుతుంది .దీన్నే తారకం అంటారు .ఈ తారకాన్ని ‘’రాం రామ చంద్రాయనమః ‘’అని ,’’రాం రామ భద్రా యనమః ‘’అని రెండు రకాలుగా చెబుతారు .ఈ మూడూ తారక మంత్రాలే .ఈ విధం గా ఓంకారం తత్వస్వరూపం ,బ్రహ్మ స్వరూపమూ అయింది .వీటిని సచ్చిదానంద రూపం గా ఉపాసించాలని ఈ ఉఅనిషత్తు చెప్పింది .
శ్రీ రాముడిని సర్వ దేవాత్మక స్వరూపం గా నలభై ఏడు మంత్రాలు చెప్పాయి అందులో ముఖ్య మైన నాలుగు మంత్రాలు-
ఓం యో వై శ్రీ రామ చంద్రః స భగవాన్ అద్వైత పరమానందాత్మా యత్పరం బ్రహం భూర్భువస్సువ స్తస్మై నమః
ఓం యో వై శ్రీ రామ చంద్రః స భగవాన్ యస్చాఖండైక రసాత్మా ,భూర్భువస్స్సువ స్తస్మైనమః
ఓం యో వై శ్రీ రామ చంద్రః స భగవాన్ యచ్చ బ్రహ్మానందామృతం భూర్భువస్సు వస్సువస్తస్మైనమ్హ్
ఓం యో వై శ్రీ రామ చంద్రః స భగవాన్ యత్తా రకం బ్రహ్మ భూర్భువస్సువస్తాస్మై నమః
సూక్ష్మం గా వీటి అర్ధం –అద్వైత పరమానందుడు ,పరబ్రహ్మం ,బూ లోక భువర్లోక సువర్లోక ములు తానే అయి , అఖండైక రాసాత్మకుడు ,బ్రహ్మానందామృత  స్వరూపుడు ,తారక బ్రహ్మము అయిన శ్రీ రామ చంద్ర భగవానునికి నమస్కారములు
‘’విశ్వా కారం ,మహా విష్ణుం ,నారాయణ మనామయం –పరి పూర్ణానంద విజనం పరం జ్యోతి స్వరూపినిం  –మనసా సంస్మరాన్ బ్రహ్మాతుష్టావ పర మీశ్వరం ‘’—విశ్వానికి ఆధార మైన వాడు ,మహా విష్ణువు ,నారాయణుడు ,అనామయుడు ,పరిపూరనా నందుడు ,పరంజ్యోతి స్వరూపుడు అయిన  శ్రీ రామ చంద్ర పర మేశ్వరునికి మనసు లో సంస్మరిస్తాను .
   సశేషం