Pages

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –36 హనుమ జాంబవంతులు ఎవరు ?


          పరాశర మహర్షి ని మైత్రేయుడు ఈ ప్రశ్న ను అడిగాడు .దానికి ఆయన ‘తార సారోపనిష త్’’ ఈ విషయాన్ని బాగా  వివరించిందని చెప్పటం ప్రారంభించాడు .
‘’అథ హైనం భరద్వాజహ ప్రపచ్చ యాజ్న్య వల్క్యం కిమ్తారకం ?కిం తార యతీతి ?సహోవాచ యాజ్న్య వల్క్యః –ఓం నమో నారాయణేతి తారకం ,చిదాత్మ మిత్యుపాసితవ్యం ,ఓమిత్యేకాక్షరం ఆత్మాత్మ రూపం ,తదేవ తారకం ,బ్రహ్మత్వం విద్ధి తదేవో పాసితవ్యం .అత్రైతే శ్లోకా భవంతి అకారాదభవ బ్రహ్మా ,జామ్బవానితి సంజ్నితః ,ఉకారాక్షర సంభూత ఉపెంద్రో హరి నాయకః –మకారాక్షర సంభూత స్శివంతు హనుమాన్ స్మృతః –బిన్డురీశ్వర సంజ్ఞాస్తూ ,శత్రుఘ్న శాక్రరాత్స్వయం –నాదో మహా ప్రభురర్జ్నేయో ,భరత శ్శంఖ నామకః –కలాయః పురుష స్సాక్షాత్ లక్షనో ధరణీధరః –కలాతీతా భగవతీ స్వయం సీతేతి సంజ్నితా తత్పరః పరమాత్మా శ్రీ రామః పురుషోత్తమః ఒమిత్యేతరక్షర మిదం సర్వం తస్యోప వ్యాఖ్యానం ‘’             దీని గురించి తెలుసు కొందాం .ఓం నమో నారాయణ అనేది తారకం .చిదాత్మను ఉపాసించాలి .ఓం అనే ఎకాక్షరమే ఆత్మా స్వరూపం .ఆకారం నుండి జన్మించిన బ్రహ్మ యే జాంబవంతుడు .ఉకారం నుండి పుట్టిన ఇంద్రుడే హరి నాయకుడైన సుగ్రీవుడు .మకారాక్షర సంభూతుడైన శివుడే హను మంతుడు .బిందువు అంటే సున్నా ఈశ్వర సంజ్ఞ  మై చక్ర రాజమునకు శత్రుఘ్నుడు .మహా నాదం ఇచ్చే శంఖానికి భరతుడు గుర్తు .సాక్షాత్తు కళా స్వరూపుడైన ఆది శేషునికి చిహ్నం లక్ష్మణుడు .కళా తీత అయిన స్వయం భువి అయిన భగవతి కి సీత గుర్తు .తత్పరుడైన పరమాత్మకు శ్రీ రాముడే పురుషోత్తముడు .ఓం అనే అక్షరం ఈ విధం గా వ్యాఖ్యానింప బడింది .
     అధ్యాత్మ రామాయణం లో బాల కాండ ప్రధమ సర్గ లో శ్రీ రాముని హృదయా ఆవిష్కరణ జరిగింది –శ్రీ రాముడు పరబ్రహ్మ రూపుడు .అవ్యయుడు .సర్వ ఉపాధి నుండి విముక్తుడు .సత్తా మాత్రుడు .అగోచరుడు .అసందుడు .నిర్మలుడు .శాంతుడు .నిర్వి కారుడు .నిరంజనుడు .సర్వ వ్యాపకుడు .ఆత్మా స్వరూపుడు .స్వప్రకాషుడు ,ఆకల్మషుడు .సీత మూల ప్రకృతి .శ్రీ రాముని సన్నిధి లో ఉండి సర్గ ,స్థితి ,లయాలను చేస్తుంది .సీతా దేవి ప్రభావం చేత అన్నీ శ్రీ రాముడే చేస్తున్నట్లు భ్రమ కలుగుతుంది .అయోధ్య లో అతి నిర్మల వంశం లో రాముడు జన్మించటం ,,విశ్వామిత్రుని యాగ సంరక్షణం ,మొదలు రావణ వధ ,రామాభిషేచనం వరకు జరిగిన కధ అంతా సీతా మహాత్మ్యమే .ఈ విషయాలన్నీ సీతా దేవి హనుమ కు స్వయం గ బోధించింది .
సశేషం