Pages

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –46 కుమ్భినీ పాలుని కధ


శ్రీ రామ చంద్రుని పరి పాలనా కాలం లో దక్షిణ భాగం లో ధర్మా రాన్యం అంటే ఈ నాటి కర్నాటక లో రాక్షసుల చేత ధ్వంసం చెయ్య బడ్డ గ్రామా లను రాముడు పునర్నిర్మించి వాస యోగ్యం చేయించాడు .ఆ గ్రామాలకు ”మండల నగరం ”అనే దాన్ని ప్రధాన కేంద్రం గా చేశాడు .అక్కడ వేద వేద్యులు సత్కర్మా చారణులు పండితులు జ్ఞాన నిష్టులు అనేక మంది ఉండే వారు దానికి ధర్మ కర్త గా ఆంజనేయుడిని నియమించాడు .శ్రీ రాముని తరఫున హనుమ వారిని చక్క గా కాపాడుతున్నాడు .ప్రజలకందరికి మంచి రక్షణ కల్పించాడు .కలి ప్రవేశించే వరకు అక్కడ ఎలాంటి ఉపద్రవాలు లేవు .గొప్ప ధర్మ వ్యవస్తనేర్పరచి ,దాని దిన దినాభి వృద్ధి కి కృషి చేశాడు .కలి కాలం ప్రవేశించ గానే ,దాని పరి పాలనాన్ని అక్కడి వారి కే వదిలి గంధ మాదన పర్వతం చేరి శ్రీ రాముని పై ధ్యానం చేస్తూ గడుపు తున్నాడు .
కలియుగం లో ”కన్యా కుబ్జం ”అనే పట్టణాన్ని రాజధాని గా చేసుకొని ,”ఆ  మందుడు ”అనే రాజు పాలిస్తున్నాడు .అతనికి ”మాయ”అనే భార్య ఉంది .వారికి ”రత్న గంగ ”అనే కూతురు జన్మించింది .ఆమెను అల్లారు ముద్దు గా పెంచుతూ ,సర్వ విద్యా విశారద ను చేశారు .ఆమె కు పెండ్లీడు వచ్చింది .వరాన్వేషణ చేస్తున్నారు .వీరి పురోహితుడు ”ధర్మ సఖుడు ”.ఆయన రోజు పురాణ శ్రవణం చేస్తూ రాజుకు చాలా సంతోషం కల్గిస్తున్నాడు .ఒక రాజు ఆయనతో ”మహాత్మా !కలి ప్రవేశించింది .కల్మషం అంతటా వ్యాపించి పోయింది .”అన్నాడు .రాజు కలి కల్మషమంటే ఏమిటి ?అని అడిగాడు .ఆయన దానికి అర్ధం అసత్య ప్రచారం అని చెప్పి ”కలి కాలం లో అబద్ధం చెప్పే వారు ,వేదాన్ని దూషించే వారు ,హింసను పెంచే వారు ,ధర్మాన్ని వాడి లేసి అర్ధ ,కామాలను మాత్రమె ఆశ్ర యించే వారు ఎక్కువై పోతారు .విశ్వాస హీనులు ,కామ పరాయణులు ,దైవ చింతన లేని వారు ,డామ్బికులు ,వేష దారులు ,పాశందులు ,ప్రజా వంచకులు ,అసూయా పరులు ,మూర్ఖులు పెరిగి పోతారు .వీటి వల్ల ఆ అధర్మాలన్ని రాజుకు సంక్ర మిస్తాయి .మీరు ధర్మ పరులు కనుక భారాన్ని దేవుడి మీద వేయండి .మన చిరంజీవి కి మంచి వరుని తో త్వర లోనే వివాహం అవుతుంది ”అని చెప్పాడు .
కొంత కాలానికి బ్రహ్మా వర్తాన్ని పాలించే కుమ్భినీ పాలుడు అనే రాజుకు రత్న గంగ నిచ్చి వివాహం చేశాడు .కుమ్భినీ పాలుడు ,భార్య తో కలిసి ధర్మారణ్యానికి వెళ్లి అక్కడ తన రాజ్యాన్ని స్తాపించాడు .కుమ్భినీ పాలకుడు క్రమంగా వేద మార్గానికి దూరమై జైన మతాన్ని అవలంబించాడు .అప్పటి దాకా బ్రాహ్మణులు వేద విద్యా వ్యాప్తికి సత్కర్మా చరణకు యజ్న యాగాలకు ఇవ్వ బడిన అగ్రహారాలనాన్ని టినీ లాగేసు కొన్నాడు .జైనులను అక్కడ అ దికారులను గా నియ మించాడు .వాళ్ళు యజ్న యాగాలు చేసే వారిని హింసించి శిక్షించే వారు .జైనుల వేధింపు విపరీతమై వారికేమీ దిక్కు తోచలేదు .దుష్టులకు రాజ బలం తోడైంది .ఇక భరించ లేక అందరు కలిసి కన్యా కుబ్జ రాజు అయిన ”ఆమందుడు  రాజు ”కు తమ గోడు విన్న వించు కొన్నారు .తాము అతి ప్రాఛీ న కాలం నుండి అక్కడ ఉంటున్నామని ,త్రేతాయుగం లో శ్రీ రాముడు ”మహోదరం ”తో పాటు మరి కొన్ని అగ్రహారాలను తమకు ఇచ్చాడని ,తమ అల్లుడు కుమ్భినీ పాలుడు దుర్మార్గం గా వాటిని లాగేసుకొని ,హింసిస్తున్నాడని దేవతా రాదన యజ్న యాగాదులను నిషేధించాడని పూర్వ జీవితం కోన సాగించటం దుర్భరం గా ఉందని ,మళ్ళీ తమ దైవ కార్య నిర్వహణకు ,తమ వృత్తులను కోన సాగించు కోవటానికి వెంటనే చర్య తీసుకో మని విన్న వించారు .
రాజు వారంతా చెప్పింది సావధానం గా ఆలకించాడు .అల్లుడు కుంభీ పాలుడికి కబురు చేసి లాక్కున్న భూముల నన్నిటిని బ్రాహ్మణులకు ఇచ్చి వేయమని వేద విద్య కు ఆటంకం కలిగించవద్దని హితవు చెప్పి రాజ పత్రం ఇచ్చి వారిని పంపాడు . వారందరూ కుమ్భినీ పాలుడికి రాజ పత్రం ఇచ్చారు . .ఇది అల్లుడికి కోపం తెప్పించింది .మొండిగా ”మీకు యే రాముడు భూముల్ని ఇచ్చాడో ఆ రామున్నే రమ్మనండి ఆయన తో బాటు ”తోకాయన్ను ”కూడా తీసుకొని రండి ..అప్పుడు ఆయన చెప్పింది విని తగిన ట్లు చేస్తా ”అని భీష్మించాడు .పాపం కొంత మంది బ్రాహ్మణులు రాజుకు ఎదురు తిరగ లేక జైన మతాన్ని తీసుకొని ,రాజుకు లోబడి జీవిస్తున్నారు .మిగిలిన వారు తమను రక్షించ గలిగేది వాయు సుతుడైన హనుమ ఒక్కడే నని గ్రహించి ,శరణు కోరుతూ ధ్యానించ సాగారు .భక్త సులభుడైన మారుతి వెంటనే ప్రత్యక్ష మైవారికి ఆనందం కల్గించాడు .వారు ఆయన్ను ప్రస్తుతి చేశారు .తమ బాధ ను వెల్ల బోసుకొన్నారు .వారిని రక్షించాలనే ఉద్దేశ్యం తో మనసు కరిగి ,తన ఎడమ బాహువు నుండి ఒక వెంట్రుకను ,కుడి చేతి నుండి ఇంకో రోమాన్నితీసి  ,ఒక భూర్జర పత్రం లో భద్రం గా ఉంచి దాన్ని బ్రాహ్మణుల కిచ్చి ,రాజు దగ్గరకు వెళ్లి తమ భూములను ఇమ్మని అడగమని చెప్పి పంపించాడు .ఇవ్వకుండా తిరస్కారం చూపిస్తే -ఒక రోమాన్ని సింహ ద్వారం మీద ఉంచండి .అప్పుడు భయంకర మైన అగ్ని జ్వాలలు ఏర్పడి రాజ సౌధాన్ని ,పట్టణాన్ని కాల్చేస్తాయి మీ గ్రామాలను మీ కిచ్చేసి, రక్షించమని రాజు ప్రార్ధిస్తే కుడి చేతి రోమాన్ని విసరండి . .అప్పుడు అంతా యదా స్తితి లోకి వస్తుంది అని చెప్పి పంపాడు .అక్కడ మూడు రోజులున్దమని ,ఆకలి దప్పుల తో బాధ పడుతున్నారు కనుక తానిచ్చే ఫలాలను ఆర గించమని చెప్పి ,అదృశ్య మైనాడు .
బ్రాహ్మణులు హనుమంతుని పూజ చేసి ,ప్రసాదం తీసుకొని స్వస్థత చెందారు మారుతి వారికోసం విశ్రాంతి గృహం నిర్మించాడు .మూడు రోజులు అందులో ఉండి ,నాలుగవ రోజు న వారి అగ్రహారాలకు శిలాగ్రుం చేర్చింది . మర్నాడు వారంతా రాజు దగ్గరకు వెళ్లి హనుమ చెప్పి నట్లు అడిగారు .దానిని మన్నిన్చాకుండా అవమానించాడు .హనుమ ఎడమ చేతి వెంట్రుకను ద్వారం మీద ఉంచారు .పట్టణం అంతా అంటుకొని భస్మీ భూతమైంది . ఆర్త నాదాలు పట్నం అన్తావ్యాపించాయి .జైనులందరూ పారి పోయారు .బ్రాహ్మణుల ప్రభావాన్ని గమనించి ,రాజు భయ పడి వారి అగ్రహారాలను వారికిచ్చి వేశాడు .వారు కుడి చేతి రోమాన్ని విసరేశారు .దానితో పట్నం మామూలు అయింది .రాజు కూడా బుద్ధి తెచ్చుకొని ,శ్రీ రాముని భక్తుడు గా మారి  వేదాను సారం గా ప్రవర్తించాడు ధర్మ సంస్తాపకుడై ,విష్ణు ధ్యాన రతుడై ప్రజలను కన్న బిడ్డల్లా పాలించాడు .ధర్మారణ్యాన్ని నిజమైన ధర్మా రణ్యం గా పాలిచాడు .త్రిమూర్త్యాత్మక స్వరూపుడైన హనుమను అందరు భక్తీ శ్రద్ధలతో పూజిస్తూ సుఖాలను పొంది ,చివరకు కై వల్యం చేరారు .
సశేషం