Pages

Friday, 27 February 2015

శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –47 గంధ సింధూర విశేషం


.శ్రీ రామ పాద సేవా దురంధరుడు , రామ భక్తీ సామ్రాజ్యాధి పతి అయినశ్రీ  హను మంతుడు అయోధ్య లో శ్రీ రామ పట్టాభి షెకాన్ని పరమ వైభవం గా జరి పించాడు .రామ పరభువు సీతా మాతను ప్రేమించి నంతగా తనను ప్రేమించటం లేదని తనను దూరం గా ఉంచుతున్నాడని మనసు లో భావించాడు .రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వటం లేదు .తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నారో అర్ధం కావటం లేదు .తన కంటే సీతా మాత లో అధికం గా ఏముంది ?ఆమెనే అంత ఆత్మీయం గా దగ్గరే ఉచుకోవటానికి కారణ మేమిటో ఆ ఆజనం బ్రహ్మ చారికి ఏమీ తెలియక తల్ల డిల్లు తున్నాడు .జానకీ దేవి పాపిడి లో యెర్రని సిందూరపు బొట్టు కనిపిస్తోంది .ఆ యెర్ర బొట్టు కు రాముడు ఆకర్షితు దయాదేమో నని అనుమానం వచ్చింది .ఆ సిన్దూరమే తన కొంప ముంచి శ్రీరాముడిని సీతా దేవికి అతి సమీపం గా ఉంచుతోందని భ్రమ పడ్డాడు .శ్రీ రామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించ లేని దుర్భర వేదన కు గురి అయాడు .దీని సంగతేమిటో తేల్చు కోవాలని శ్రీ రాముడి దగ్గరకే ,వెళ్లి చేతులు జోడించి ”రామయ తండ్రీ !మా తల్లి సీతా మాత శిరస్సు మీద ఉన్న పాపిట లో సింధూరం ఉంది .దానికి కారణం ఏమిటో వివరించండి ”అని ప్రార్ధించాడు .
శ్రీ రామ ప్రభువు చిరు నవ్వు నవ్వి ,భక్త హనుమాన్ ను సమీపానికి రమ్మని ”భక్తా ఆంజనేయా !సీతా దేవి నుదుట సింధూర బొట్టు పెట్టు కోవటానికి కారణం ఉంది .శివ ధనుర్భంగం చేసి ,జానకిని వివాహ మాడిన శుభ సమయం లో ఆమె పాపిట మీద  సిన్దూరాన్ని నేను ఉంచాను .అప్పటి నుండి ఆమె సిన్దూరాన్ని పాపిటలో ధరిస్తోంది .దాని వల్ల నేను సీత కు వశుడను అయ్యాను .మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సిన్దూరమే కారణం ”అని వివరించి చెప్పాడు .
ఆంజనేయుడు శ్రీ రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు .ఇక ఆలస్యం చెయ్య లేదు .వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్లి గంధ సిన్దూరాన్ని తీసుకొని ,నువ్వుల నూనె తో కలిపి ,తన ఒళ్లంతా పూసేసు కొన్నాడు .ఇలా చేస్తే  ఆ సింధూరం ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తనవాశం అవుతాడని భావించాడు .వెంటనే హుటాహుటిన శ్రీ రామ దర్శనం చేసి నమస్కరించి ”ప్రభూసీతా రామా !చిటికెడు సిన్దూరానికే సీతా మాతకు వశమై పోయావు .మరి ఇప్పుడు నేను ఒళ్లంతా సింధూరం పూసుకొన్నాను .మరి నాకు మీరు ఎప్పుడూ వశులై ఉంటారు కదా ?”అని అమాయకం గా అయినా మనసు లోని మాటను ధైర్యం గానే చెప్పాడు .సీతా రాముడు నవ్వి ఆనందం తో ‘హనుమా !ఈ రోజు మంగళ వారం .నాకు ప్రీతీ కలిగించాలని శరీరం అంతా సిన్దూరాన్ని ధరించావు కనుక ,నీకు మంగళ వారం భక్తీ తో గంధ సింధూరం తో పూజ చేసి ,దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు .ఈ వరాన్ని నేను నీ కు అనుగ్రహించిన వరం గా గ్రహించు .”అని హనుమ కు మనశ్శాంతి ని చేకూర్చాడు  .అప్పటి నుండి శ్రీ హనుమంతునికి మంగళ వారం నాడు గంధ సింధూరం తో పూజ చేసి దానిని నువ్వుల నూనె తో కలిపి నుదుట బొట్టు పెట్టు కొనే ఆచారం లోకం లో ప్రారంభ మైంది .ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనె తో కలిపినా లేపనాన్ని శరీరం అంతా పూసి ఉంచటం మొదలైంది .,అభిషేకం చేసిన తర్వాతా ఈ లేపనాన్ని పూస్తారు .సిందూర పూజ హనుమ కు అత్యంత ప్రీతీ కరం .అందులోను మంగళ వారం రోజున మరీ ఇష్టం .ఇదీ సింధూరం కధా విశేషం .
సింధూరం గురించి ఇంకో కధ కూడా ప్రచారం లో ఉంది .ఇది ఆంజనేయుని తొమ్మిది అవతారాలలోమొదటిది విజయుని చరిత్రకు సంబంధించినది .ఆ విజయుడే పాండవ మధ్యముడయినఅర్జునుడు . ధర్మ రాజు చేసిన రాజ సూయ యాగం లో దక్షిణ దేశాలను జయించటానికి అర్జునుడు సైన్యం తో బయల్దేరాడు .దక్షిణ సముద్రాన్ని చేరి ,అక్కడ శ్రీ రాముడు లంకకు కట్టిన వారధిని చూసి పరిహాసం గా నవ్వాడు .అక్కడే ఉన్న హనుమకు కోపం వచ్చింది ఇద్దరికీ వాగ్వాదం పెరిగింది .ప్రతిజ్ఞలు చేసుకొన్నారు పంతాలకు పోయి .అప్పుడు శ్రీ కృష్ణుడు అక్కడికి వచ్చాడు .కిరీటి బాణాలతో సేతువు ను నిర్మించాడు .దాని కింద ఎవ్వరికీ తెలీకుండా కృష్ణుడు తాబేలు ర రూపం లో ఉంది సేతువు విరిగి పోకుండా కాపాడు తున్నాడు .హనుమ ఒక్క సారి సేతువు పైకెక్కి కాళ్ళతో చిందర వందర చేస్తూ తొక్కు తున్నాడు .సేతువు యే మాత్రం వంగ కుండా  శిధిలం కాకుండా నిలబడి ఉంది హనుమ అంతటి బలాధ్యుని పాద ఘట్టనానికి తట్టు కొని నిల బడింది .ఆంజనేయుడు ఓటమిని అంగీకరించాడు .అర్జునుడు విజయ గర్వం తో విర్ర వీగాడు .కృష్ణుడు నీటి నుండి బయటకు వచ్చాడు .ఒళ్లంతా రక్తం కారుతోంది .పార్ధుని తో సహా అందరు భయ పడ్డారు .అప్పుడు పరమాత్మ ”అర్జునా ! ఈ జయం నీది కాదు .ఆన్జనేయుడిది .నేను వారధి కింద వీపు పెట్టి మోయక పోతే  అది హనుమ ఒక్క లంఘనానికే విరిగి ముక్కలయ్యేది .నీ పరువు కాపాడ టానికి నేత్తురువోడే  టట్లు తట్లు శ్రమించాను .బాధ భరించాను .హనుమ కు నేను రాముడిగా ,కృష్ణుడిగా ఉంటున్నానని తెలియదు పాపం .”అన్నాడు అర్జునుడు సిగ్గుపడి తన తప్పుకు పశ్చాత్తాప పడి హనుమ ను ఆశ్రయించాడు .హనుమ శ్రీ కృష్ణుని శ్రీ రాముని గా గ్రహించి ,ఆయన వీపుకు అంటిన రక్తాన్ని అంతటిని తన శరీరానికి పట్టించు కొన్నాడు .క్షమాపణ కోరాడు .అప్పటి నుండి ఆంజనేయునికి సింధూర పూజ వ్యాప్తి లో ఉందని తెలుస్తోంది .అర్జునుని రధం మీద జెండా పై హనుమ ఉండి మహా భారతయుద్ధం లో   ఆతని విజయానికి కారకుడ వుతానని అనుగ్రహించాడు  .దాన్నే ”కపి ధ్వజం ”అంటారు .
సశేషం –