Pages

Saturday, 8 August 2015

దైవాసురసంపద్విభాగయోగః 2 ( అథ షోడశోధ్యాయః, భగవద్గీత) -శ్రీ భగవద్గీత


కామమాశ్రిత్య దుష్పూరం
దంభమానమదాన్వితాః,
మోహాద్గృహీత్వాసద్గ్రాహాన్‌
ప్రవర్తంతే శుచి వ్రతాః


వారు తనివితీరని కామమునాశ్రయించి, డంబము, అభిమానము, మదముగలవారలై అవివేకమువలన చెడు పట్టుదల నాశ్రయించి అపవిత్రములగు వ్రతములు (నీచవృత్తులు) గలవారై ప్రవర్తించుచున్నారు.

******************************************************************************************* 10

చింతామపరిమేయాం చ
ప్రలయాంతాముపాశ్రితాః,
కామోపభోగపరమా
‌ఏతావదితి నిశ్చితాః.

ఆశాపాశశతైర్బద్ధాః
కామక్రోధపరాయణాః,
ఈహంతే కామభోగార్థ
మన్యాయేనార్థసంచయాన్‌


మఱియు వారు అపరిమితమైనదియు, మరణము వఱకు (లేక ప్రళయకాలమువరకు) విడువనిదియునగు విషయచింతను (కోరికలను) ఆశ్రయించినవారును, కామోపభోగమే పరమపురుషార్థముగ దలంచువారును, ఇంతకుమించినది వేఱొకటిలేదని నిశ్చయించువారును,పెక్కు ఆశాపాశములచే బంధింపబడినవారును కామక్రోధములనే ముఖ్యముగ నాశ్రయించినవారును అయి కామముల ననుభవించుట కొఱకుగాను అన్యాయమార్గములద్వారా ధనసమూహములను కోరుచున్నారు.

******************************************************************************************* 11,12

ఇదమద్య మయా లబ్ధ
మిమం ప్రాప్స్యే మనోరథమ్‌,
ఇదమస్తీ దమపి మే
భవిష్యతి పునర్థనమ్‌.

అసౌ మయా హతశ్శత్రు
ర్హనిష్యే చాపరానపి,
ఈశ్వరోహమహం భోగీ
సిద్ధోహం బలవాన్‌ సుఖీ.

ఆఢోభిజనవానస్మి
కోన్యోస్తి సదృశో మయా,
యక్ష్యే దాస్యామి మోదిష్య
ఇత్యజ్ఞానవి మోహితాః.

అనేకచిత్తవిభ్రాంతా
మోహజాలసమావృతాః,
ప్రసక్తాః కామభోగేషు
పతంతి నరకేశుచౌ.


" ఈ కోరికలను ఇపుడు నేను పొందితిని; ఈకోరికను ఇక మీదట పొందగలను; ఈ ధనము ఇపుడు నాకు కలదు; ఇంకను ఎంతయో ధనము నేనుసంపాదించగలను; ఈ శత్రువులను నేనిపుడు చంపితిని; తక్కిన శత్రువులను గూడా చంపగలను; నేను ప్రభువును; సమస్తభోగములను అనుభవించువాడను; తలంచిన కార్యమును నెరవేర్పశక్తిగలవాడను; బలవంతుడను; సుఖవంతుడను; ధనవంతుడను; గొప్ప వంశమున జనించినవాడను; నాతో సమానమైనవాడు మఱియొక డెవడుకలడు? నేను యజ్ఞములను జేసెదను; దానముల నిచ్చెదను; ఆనందము ననుభవించెదను" - అని యీ ప్రకారముగ అజ్ఞానముచే మోహము భ్రమ నొందినవారును, అనేకవిధములైన చిత్తచాంచల్యములతో గూడినవారును, మోహము (దారాపుత్రక్షేత్రాదులందు అభిమానము) అను వలచే బాగుగా గప్పబడినవారును, కాలముల ననుభవించుటయందు మిగుల యాసక్తికలవారును అయి వారు (అసుర ప్రకృతిగలవారు) అపవిత్రమైన నరకమునందు పడుచున్నారు.

******************************************************************************************* 13,14,15,16

ఆత్మసంభావితాః స్తబ్ధా
దనమానమదాన్వితాః,
యజంతే నామయజ్ఞై స్తే
దంభేనావిధిపూర్వకమ్‌

అహంకారం బలం దర్పం
కామం క్రోధం చ సంశ్రితాః,
మామాత్మపరదేహేషు
ప్రద్విషంతోభ్యసూయకాః.


తమ్ముతాము గొప్పగా దలంచువారును, వినయము (మర్యాద) లేనివారును, ధనముకలదని అభిమానముతోనూ, మదముతోనూ గూడియుండువారును, అహంకారమును (పరపీడాకరమగు) బలమును, గర్వమును, కామమును, క్రోధమును బాగుగ ఆశ్రయించినవారును, తమశరీరములందును, ఇతరుల శరీరములందును (సాక్షిగ నున్న) నన్ను మిగుల ద్వేషించువారును, అసూయాపరులై యుండువారునగు (అసురసంపదగల) వారు డంబముతో శాస్త్రవిరుద్ధముగ నామమాత్రపు యజ్ఞములచే యాగము చేయుచుందురు.

******************************************************************************************* 17,18