Pages

Saturday, 13 April 2013

ఆయుర్వేద శాస్రం అధర్వణ వేదానికి ఉపవేదం అవుతుందా ?


క్షీరసాగర మధనములో ధన్వంతరి జనన మరణాలకి 

తావు లేని దివ్య  ఔషదాన్ని   దేవతలకిచ్చాడు. 

పంచమ వేదమైన ఆయుర్వేదాన్ని బ్రహ్మ కిచ్చాడు.

 బ్రహ్మ నుంచి దక్ష ప్రజాపతికి , వాని నుంచి అశ్వనీ 

పుత్రులకి వచ్చింది.  ఆ తరువాత భరద్వాజ ఋషి 

దేవలోకంలో ఆయుర్వేదాన్ని పటించి,   ఆత్రేయ 

మహర్షికి  ఆ రహస్యాలను భోదించాడు.  అయన వద్దే 

అగ్నివేశుడు అభ్యసించి  'అగ్నివేశ' మను ఆయుర్వేద 

గ్రంధాన్ని రచించాడు. దాని నుంచి వచ్చినవే 

ఆయుర్వేద మహామహతి గ్రంధాలూ.