క్షీరసాగర మధనములో ధన్వంతరి జనన మరణాలకి
తావు లేని దివ్య ఔషదాన్ని దేవతలకిచ్చాడు.
పంచమ వేదమైన ఆయుర్వేదాన్ని బ్రహ్మ కిచ్చాడు.
బ్రహ్మ నుంచి దక్ష ప్రజాపతికి , వాని నుంచి అశ్వనీ
పుత్రులకి వచ్చింది. ఆ తరువాత భరద్వాజ ఋషి
దేవలోకంలో ఆయుర్వేదాన్ని పటించి, ఆత్రేయ
మహర్షికి ఆ రహస్యాలను భోదించాడు. అయన వద్దే
అగ్నివేశుడు అభ్యసించి 'అగ్నివేశ' మను ఆయుర్వేద
గ్రంధాన్ని రచించాడు. దాని నుంచి వచ్చినవే
ఆయుర్వేద మహామహతి గ్రంధాలూ.