Followers

Sunday, 21 April 2013

కంకణాన్ని ఎందుకు కట్టుకుంటారు?



గౌరీ పూజ, సత్యనారాయణ వ్రత  సమయాల్లోనూ, వివాహాది కార్యాలలోను, యజ్ఞ సమయాల్లోనూ కంకణం చేతికి  కట్టుకుంటారు.
  

 చేసిన పూజ ఫలం, భావన తొలగిపోకుండా ఆ కంకణం ఉన్నంత వరకు  అదే భావనతో  ప్రశాంతతతో  వుండాలని నూలుకి  పసుపు రాసి కట్టుకుంటారు. దానితో పాటు శరీరంలోని  జీవనాడుల్లో  ముఖ్యనాడి  చేతుల మణికట్టు భాగం  వరకు వుంటుంది.  కంకణం కట్టుకోవటం వల్ల , ఒత్తిడి వల్ల  రక్త ప్రసరణలతో          పాటు  హృదయ స్పందన  సరళ రీతిలోకి  ప్రయాణిస్తుంది.

     అక్కడున్న  నాడి  గర్భాశయం  వరకు వుంటుంది. అందుకే నాడి  పట్టుకొని  చూసి కూడా స్రీ  గర్భవతి అని చెప్పగలరు వైద్యులు అంతటి  విశిష్టస్దానం ఆ  ప్రదేశముగాన  ఎంతో కొంత  వ్యాయామం కొరకు  పెద్దలు పూజ, వ్రతాది సమయాల్లో కంకణాన్ని ధరించే  ఆచారం పెట్టారు.

Popular Posts