పెళ్లికానివారు , అయినవారు, అరటి చెట్టు బోదేలో
దీపం వెలిగించి కోనేరు, నదుల్లో దీపాలు వదులుతారు.
పెళ్లైనవారు భర్త క్షేమం కోసం , పెళ్లి కానివారు మంచి
భర్త లభిస్తాడని అరటిబోదే లో వెలిగించిన దీపాన్ని
వుంచి వదలమంటారు పెద్దలు. తెల్లవారుజామున
లేవటం వల్ల, ఎంతో దూరం వెళ్లి ప్రశాంతంగా దీపాలు
వదలటం ద్వార పెళ్లైనవారికి ఆ సమయంలో
ప్రశాంతమైన గాలి శరీరంలోకి ప్రవేశించి మరింత
మెరుపు వచ్చి తద్వారా భర్త ప్రేమను
అందుకుంటుంది.
పెళ్ళికాని పిల్ల నలుగురి దృష్ష్టిలో పడి త్వరగా
వివాహమయ్యే అవకాశం వుంటుంది. భక్తితో పాటు
మానవ కళ్యాణాలకు అవసరమైన పద్దతులే పెట్టారు
మన పెద్దలు.