Followers

Friday, 19 April 2013

శ్రీరాముడు హనుమంతునికి బహుమతి ఎందుకు ఇవ్వలేదు?







శ్రీరామచంద్రుని రాజ్యాభిషేకమహోత్సవం జరిగింది. అందరికీ బహుమతులు లభించాయి. రామచంద్ర 

ప్రభువు స్వహస్తములతో సుగ్రీవ విభీషణాదులకు మణి, రత్న వస్త్రభూషణములు సమర్పించాడు. దేవదేవుని హృదయగతమేమో కాని, హనుమంతునకు మాత్రం ఏమీ ఇవ్వలేదు.
“రఘునాథుడు అత్యంత ఆప్తుడైన హనుమంతుని విషయం ఎలా విస్మరించినట్లు?” అనుకుని అందరూ ఆశ్చర్యపోయారు. రామచంద్ర భగవానుడికి తెలియనిదేమీ లేదు. అంతా తెలిసినవాడే కనుక మౌనంగా ఉండిపోయాడు. సీతామాత భగవల్లీలలను అర్ధము చేసుకుంది. కానీ, ఇతరులకు హనుమద్ భక్తిని ప్రకటింప జేసేందుకు మరొక విచిత్రమును కలుగజేసింది. ఆమె తన గళసీమనుండి బహుమూల్యమగు మణిహారమును తీసి హనుమంతునికి ఇచ్చింది.
దానితో అందరూ జానకిదేవిని ప్రశంసించారు. జానకీదేవి ఇచ్చిన మాలను మారుతి ప్రేమగా స్వీకరించాడు. కానీ, వెంటనే అందరూ ఆశ్చర్యంగా అతనివైపు చూస్తుండగా హనుమంతుడు ఆ హారములోని ఒక్కొక్క మణినీ పంటితో కొరుకుతూ, అతి జాగ్రత్తగా వాటిని పరీక్షిస్తూ విసిరి పారవేయ సాగాడు. ఆ పని చాలాసేపు నిరాటంకముగా జరిగింది. అది చూసి శ్రీరామచంద్రుడు మందస్మితము చేయుచుండెను. సీతాదేవి మోములోగాంభీర్యం గోచరించింది.

Popular Posts