కనులకు అందాన్ని, హాయిని ఇస్తుంది కాటుక. రాగి
పళ్ళెమునకు నలుగు అంగుళాలు పచ్చ కర్పూరం
పులిమి, దానిపై ఆముదం పోసి వత్తి పెడతారు. ఆ
వత్తిని ముట్టించి, దాని నుంచి వచ్చే పొగమసి
తగలటానికి పైన పాత్ర ఉంచుతారు. అలా
కొంతసేపయ్యాక బాగా మసి పడుతుంది. దాన్ని తీసి
ఆముదంతో మర్దించి ఆపై కతుకను కనులకు
పెట్టుకుంటారు.
గతంలో ఎవరికీ వారు గృహంలో
చేసుకునేవారు. ఆముద దీపాన్ని వెలిగించి దానిపై
రాగి పళ్ళెం పెట్టి ఆ మసిని కాటుకగా కూడా
వాడుతుంటారు. గర్భవతులు క్రమం తప్పకుండ
కాటుక పెట్టుకుంటే బిడ్డకి, తల్లికి మంచిది.