నిండు నూరేళ్ళు జీవించే భగవంతుని వరమున్నా ,
అనేక ఆటుపోట్లతో మనిషి సగటు జీవితం డెబ్భై
సంవత్సరాలే. అందులో సగ భాగం నిద్రకు, మిగత
ముప్ఫై అయిదేళ్ళలో బాల్యం పన్నెండేళ్ళు.
ముసలితనం పదేళ్ళు.
ఇక మిగిలిన పదమూడేళ్ళలో కొంత కాలం
జబ్బులు, సమస్యలూ. ఆ మిగిలిన కాలమే
మానవుడు నిజంగా బ్రతికే కాలం. అంత విలువైన ఆ
సమయాన్ని ఎంత ధర్మ బద్దంగా గడపాలో చెప్పేందుకే
మన వేదాలు, ఉపనిషత్తులు.