Followers

Friday, 19 April 2013

నవ రత్నాలు


ప్రాచీన జ్యోతిష్య శాస్త్ర వేత్త శ్రీ వరాహ మిహిరుడు బృహత్ సంహిత గ్రందమందు నవరత్నాల గూర్చి వివరించాడు.
మత్స్య పురాణములో రత్న పర్వత దానము,రత్న దేను దానము ,అనెడి దానముల విషయములో నవరత్నాల ప్రసక్తి కలదు.ప్రాచీన ఆయుర్వేద గ్రందాల్లోకూడా వీటి వివరణ కలదు రత్న శాస్త్రం పేరిట ప్రత్యేక అద్వైన గ్రందాలు కూడా గలవు.ఋగ్వేద ప్రదమ ఋక్కులోహోతారం రత్న దాతమం అని రత్న శబ్ద ప్రయేగం కలదు.
     పూర్వకాలం నుండి దురదృష్టాలను తొలగించుటకు ,శత్రువుల నుండి రక్షణ పొందుటకు.ప్రకృతి వైపరీత్యాలను తట్టు కొనుటకు రోగాలను నివారించు కొనుటకు జాతి రత్నాలను ధరించుట వాడుకలో ఉంది.
గ్రహదిపతి ఐన సూర్యుని కాంతిలోఏడు రంగులు ఉంటాయనే విషయం సైన్సు లో మరింత లోతుకు పోయి ఆలోచించిన వారు,ప్రయోగాలూ చేసినవారు గుర్తించారు.ప్రతి రంగులో ప్రత్యేకమైన స్పందనలు,కంపనలు,విద్యుదఐస్కాంత తరంగ దైర్గ్యములు కలిగి ఉంటాయి.ప్రతి రంగు అందరికి  నప్పదు కొన్ని రంగులు నైసర్గిక తత్వాలను రగుల్కొలుపుతాయి రంగులకి తత్వాలు ఉన్నాయి.కోపానికి ఎరుపు ,సాన్తానికి తెలుపు.త్యాగానికి కాషాయము,ఈర్ష్యకు పసుపు ,అజ్ఞానానికి నలుపు ,ఈవిదంగా ప్రాచీనులు రంగులకు తత్వాలను నిర్దేశించారు. ఈ విశ్వమంతా రంగుల రంగేలిలో ఏర్పడ్డదే. సప్త వర్ణములనుండి సప్తస్వరాలు ,సప్త దాతువులు,సప్త మరుత్తులు ,సప్త ద్వీపాలు మొదలగు విశ్వ సృష్టి మవులిక అంశాలన్నీ ఏర్పడ్డాయి .ఛాయా గ్రహాలైన రాహు కేతులకు తప్ప సప్త గ్రహాలకు సప్త వర్ణాలు కలిగి ఉన్నాయ్ ఆయా గ్రహాలు ఆయా రంగుల కిరణాలను,వాయువులను తరంగాలను,ప్రసరింప చేస్తూ ఉంటాయి గ్రహాలు ప్రసరింపజేసే  కిరణ సముదాయాన్ని బట్టే నవరత్నాలు,నవ ఒషదులు నవ ధాన్యాలు ,కల్పింప బడ్డాయి .
మన శరీరములో కల సప్త వర్ణాల్లోఒకదానికి లోపము కలిగినప్పుడు తత్ సంబంద రోగము ,విపరీత మానసిక తత్వము ,భావన ఏర్పడుతుంది .తద్వారా అస్త వ్యస్త పరిస్తుతులు ఏర్పడతాయి.ఏరంగు లోపము వల్ల విపరీత పరిస్తితి ఏర్పడిందో అరంగు కల జాతి రత్నము ధరించుట వల్ల ,ఆ రంగుకు ప్రతి నిది అయిన గ్రహాము యొక్క ప్రభావము తగ్గుతుంది ,గ్రహాల స్తితి గతులను మార్చలేము గాని వాటి ప్రభావాలను తగ్గించుకొనే మార్గాలెన్నో ప్రాచీనులు నిర్దేశించారు,నిప్పులు కక్కే వేసవిలో సూర్యుని అర్పలేము కానీ ,గొడుగు  ధరిచుట వల్ల ఎండ తీవ్రత నార్ప వచును ,నీటి ప్రవాహాన్ని ఇంకి పోయేటట్లు చేయలేము కానీ ,ప్రవాహ గతిని దరి మళ్ళింప వచును .
రత్న ధారణ పూర్వకాలము నుండి జ్యోతిష్య శాస్త్రముతో ముడి పడి ఉన్నది. విది వాయిచత్రిని తట్టుకొనేందుకు ,కాల పురుషుని కొరడా దెబ్బలను బరించేందుకు రత్న దారణ చేయుట అతి ప్రాచినముగా    వస్తున్న ఆచారము సూర్య రస్మిలో వలె ,మానవ శరీరములో  సప్తవర్ణాల సంగమము ఉంటుంది .ఈ సప్త వర్ణాల్లో,ఒక దానికి లోటు లేదా అధికము అయినప్పుడు వాటిని అదుపులో పెట్టుటకు ,ఆ వర్ణానికి సంబందించిన జాతి రత్నాన్ని ధరించుట శాస్త్రములో నిర్నయిమ్పబడినది .
జాతి రత్నాలు అంత రిక్షఅతీంద్రియ కిరణ జాలాన్నికలిగి ఉంటాయి అని ,వాటి శక్తీ అనంతము ,అద్బుతము సర్వ వ్యాపకత్వ లక్షణ శరీరము లోని అన్ని మర్మ సందుల్లోకి ప్రవేశించి నివారణ జరుగు తుంది అని నిర్ణయించారు ,డా // బట్టాచార్యగారు అతని ౪౦ యేండ్ల పరిశోదన ప్రయోగాలలో ,మూడు లక్షలమందికి పైగా
జాతి రత్నాల ఒషదులను ప్రయోగించి సత్ఫలితాలను పొందారు.ప్రపంచ అన్ని వాయిద్య విదానాల్లో లోటు కలదని ,అవన్నీ రోగము యొక్క రూటు దగ్గరకు వెల్లడము లేదని నిర్దారణ చేసారు .కాస్మిక్ కిరణాలూ మాత్రమే రోగాల యొక్క మూలము లోకి వెళ్ళే శక్తీ కలదని ,అటువంటి కాస్మిక్ కిరణ శక్తీ జాతి రత్నాలకు కలదని రుజువు చేసారు
సుర్యునిలోని సప్త వర్ణాల కాస్మిక్ కిరణ శక్తీ సప్త గ్రహాల్లో కలవని వాటిని అదుపు చేయుటకు, అటువంటి కాస్మిక్ కిరణ శక్తీ గల జాతి రత్నాలకే శక్తీ కలదని చెప్పబడినది .నవగ్రహాలకు కల్పిమ్పబడిన రంగులు విశ్వంలో కల సౌర శక్తిలో కల రంగులకు సంక్షిప్త  రూపాలని కూర్మ పురాణము నిర్దేసించినది .రత్నాలు బహిరంగముగా ప్రసరించే రంగులనే కాక ,అంతర్గతముగా కాస్మిక్ [దివ్య]కిరణాలూ కలిగి ఉంటాయి ఇవి స్తూల దృష్టికి గోచరము కావు.ఈ కాస్మిక్ కిరణలకు అత్యంత శక్తి వంతమైన నివారణ శక్తి కలిగి ఉంటాయి.ముత్యము తెలుపుగా కనపడినా దాని కాస్మిక్ కిరణము ఆరంజ్ రంగు ,పగడము యొక్క కస్మికి రంగు పసుపు ,చంద్ర సిల ,పుష్యరగాలవి ,నీలము రంగు ,వజ్రానిది ఇండిగో ,నీలానిది వయిలేటు రంగు,ఎలక్ట్రిక్ మోటారు మీద అత్యంత వేగముగా పరిబ్రింప చేయుట వల్ల కానీ కండ్లకు ప్రిజము ఆపాదించుట వల్ల కానీ రత్నాలకు కల కాస్మిక్ కిరణాలను గుర్తింప వచునని శ్రీ బట్ట చర్య గారు నిరూపించారు.
ప్రాచిన కాలము నుండి ఏరంగు ,ఎ శక్తీ జాతి రత్నాలకు నిర్ణయింప బడిందో అవే అంశాలు నేటికి అనుసరించుట జాతి రాత్నాలకుండే విశ్వ జనినతను స్పష్టం చేస్తుంది.అన్ని దేశాల వారు జాతి రత్నాలను ధరించుట కలదు .వాటి మహత్తును గ్రహించుట కలదు.ధరించే వారికీ ,రత్నానికి మద్య సైన్సు కు అందని కాంతి వలయబందము ఒకటి ఉందని సత్యము అందరు అంగీకరించారు ,గ్రహాలకు గృహాలను గృహలన్కరనలను,ప్రీతీ కరమైన వస్తు జాలాన్నిశాస్త్రాలు నిర్ణయించాయి .అందులోని బాగంగానే గ్రహాలకు జాతి రత్నాలను కూడా నిర్ణయించారు .ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క జతిరత్నము నిర్దేసింప బడినది గ్రహాలు ప్రసరించే కిరణ జాలము సారూప్యత పొందేటట్లు ఈ నిర్దేసముచేయబడినది .
అందుకు బిన్నముగా ధారణ జరిగినప్పుడు విపరీత పరిస్తుతులు ,పరిణామాలు సంబవిస్తుంటాయి .అన్నిటికన్నా ముక్యముగా ఎ రాత్నానికైన ,ఆలజ్ఞాదిపతి సంబంద జాతి రత్నము తప్పక ధరించాలి ,సర్వ శక్తులు లగ్నములోనే ఇమిడి ఉంటాయి .లగ్నమంటే ఏమిటనే భావన చాలా మందికి ఉంది. మనము జననమొందే కాలానికి సూర్యునికి అభిముకముగా ఎరాసి ఉంటుందో ఆరాసే లగ్నమవుతుంది.దానికి సరిగ్గా సప్తమములో ఉండే రాసి సప్తమ రాసి అవుతుంది .
రత్నాలకు కాల కాస్మిక్ కిరణ శక్తీ ఉష్ణ శీతల తత్వాలను కలిగి ఉంటుంది. పురుష గ్రహాలైన రవి, కుజ,గురు గ్రహాల కాస్మిక్ కిరనాలైన  ఎరుపు ,పసుపు ,నీలము ,రంగుల్లో ఉష్ణ తత్వము కలవి,స్త్రీ గ్రహాలైన చంద్ర,భుద,శుక్ర ,శనులకాస్మిక్ కిరనలైన ఆరంజ్ ,ఆసుపచ, ఇండిగో ,వైలేటు రంగులు శీతల తత్వము కలవి.ఈ కాస్మిక్ కిరణాలూ ఇంద్రధనస్సు లోను,గ్రహల్లోను,రాత్నాల్లోను,
సారూప్యత  కలిగిఉంటాయి,కనుక కృత్తిమంగా ఈ కాస్మిక్ కిరణాలను మానవసరీరము లోనికి ప్రసరింప చేయుట వల్ల రోగ నివారణ జరుగుతుందని శ్రీ భట్టాచార్య గారు నిర్దారించారు.అయితే ఈ కాస్మిక్ కిరణాలూ ఎక్కువగా ఎక్కడ ఉంటాయనేది ప్రశ్న.గ్రహకిరనల్లోను ,జాతి రాత్నాల్లోను కావలసినంత ఉంటాయి.రత్నాలలో కాల కాస్మిక్ కిరణ శక్తి అత్యంత శక్తీ వంతమై,కాల ప్రవాహి గతిని తట్టుకొని నీల్గా కలిగి ఉంటాయి .ఈ రత్నాల శక్తిని అనేక విదాలుగా ఉపయోగించ వచును .

Popular Posts