నూతన దంపతులు అత్తగారింటికి వచ్చినప్పుడు రాగి
పాత్రలో బియ్యం పోసి సింహ ద్వారం మీద పెట్టి , కొత్త
పెళ్ళికూతుర్ని ఆ బియ్యపు పాత్రను తన్ని ముందుగా
కుడి కాలు పెట్టి లోపలి రమ్మంటారు.
ధాన్యలక్ష్మిని తన్నటం తప్పే. అయిన
పెళ్ళికూతురు తన్నిన బియ్యం ఎంత దూరంగా పడి
విస్తరిస్తే అంత ప్రదేశం మేర ఆ కుటుంబంలో ధాన్యలక్ష్మి
తాండవిస్తుందని అలా చేయిస్తారు. ఇది కేవలం కొన్ని
ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఆచారం.