Pages

Tuesday, 21 May 2013

తేలికగా ధనలక్ష్మి వచ్చి పడాలంటే?






అదృష్టముండాలి . ఆ అదృష్టం  కష్టపడటం ద్వారానే 

వస్తుంది. ఏమి చేయకుండా రాత్రికి రాత్రే  ఏదో 

అవ్వాలనుకుంటే..... అవ్వటం భ్రమ .  అదృష్టం రెండు 

రకాలు . ఒకటి పుట్టుకతోనే  దండిగా ధనమున్న 

ఇంట్లో పుట్టడం. 

           ఇక రెండో రకం అదృష్టం ...... కష్టపడటం . 

గమ్యాన్ని చేరటం.  అప్పుడు మీరన్న ధనముతో  

పాటు సకల భోగాలు మీ వాకిట వద్దే  మీ ఆజ్ఞ కోసం 

వేచి వుంటాయి. మొదటి అదృష్టం పూర్వ జన్మ 

పుణ్యం వల్ల సాధ్యమవుతుంది. రెండో అదృష్టం  

భగవంతుడు మనకిచ్చిన జ్ఞానం. ఆ జ్ఞాన కాంతి 

ద్వారా  మన పయనం మంచి వైపు వెళ్లి  

అదృష్టవంతులుగా కీర్తి గడించాలో , చెడు వైపు వెళ్లి 

కాలగర్భంలో  కలసిపోవాలో ఆలోచించు కోవాల్సింది  

మన  బుద్ధి ద్వారానే . అందుకే బుద్ధిని బట్టి కర్మ , 

కర్మని బట్టి బుద్ధి అన్నది.