అదృష్టముండాలి . ఆ అదృష్టం కష్టపడటం ద్వారానే
వస్తుంది. ఏమి చేయకుండా రాత్రికి రాత్రే ఏదో
అవ్వాలనుకుంటే..... అవ్వటం భ్రమ . అదృష్టం రెండు
రకాలు . ఒకటి పుట్టుకతోనే దండిగా ధనమున్న
ఇంట్లో పుట్టడం.
ఇక రెండో రకం అదృష్టం ...... కష్టపడటం .
గమ్యాన్ని చేరటం. అప్పుడు మీరన్న ధనముతో
పాటు సకల భోగాలు మీ వాకిట వద్దే మీ ఆజ్ఞ కోసం
వేచి వుంటాయి. మొదటి అదృష్టం పూర్వ జన్మ
పుణ్యం వల్ల సాధ్యమవుతుంది. రెండో అదృష్టం
భగవంతుడు మనకిచ్చిన జ్ఞానం. ఆ జ్ఞాన కాంతి
ద్వారా మన పయనం మంచి వైపు వెళ్లి
అదృష్టవంతులుగా కీర్తి గడించాలో , చెడు వైపు వెళ్లి
కాలగర్భంలో కలసిపోవాలో ఆలోచించు కోవాల్సింది
మన బుద్ధి ద్వారానే . అందుకే బుద్ధిని బట్టి కర్మ ,
కర్మని బట్టి బుద్ధి అన్నది.