బొట్టు పెట్టి తాంబూలము ఇచ్చేటప్పుడు తమలపాకు
చివర్లు, అరటి పళ్ళు చివర్లు ఇచ్చే వారి వైపు
కాకుండా వ్యతిరేక దిశలో వుంచి ఇవ్వాలి. చివరలను
వారి వైపు వుంచి ఇస్తే మీరిచ్చిన తాంబూలం ఫలం
వృధాగా పోతుంది. తమలపాకులు మూడు గాని, ఐదు
గాని, అలాగే వక్కలు, పండ్లు రెండు చొప్పున పెట్టాలి.
ఏక పండు తాంబూలం ఎప్పుడు ఇవ్వరాదు.