Followers

Thursday, 30 May 2013

అష్టాదశ పురానాలు (Ashta Dhasa Puranalu)



1. మత్స్య పురాణం : మత్స్యావతారమెత్తిన శ్రీ 


మహావిష్ణువు మనువుకు బోధించిన పురాణం ఇది. 

యయాతి, సావిత్రి, కార్తికేయ చరిత్రలు ఇందులో 

ఉన్నాయి. అంతేకాక వారణాసి, ప్రయాగ మొదలైన 

పుణ్యక్షేత్రాల వివరణ ఇందులో ఉంది.


2. మార్కండేయ పురాణం : ఇది మార్కండేయ ఋషి 


చెప్పినది కనుక దీనికి ఈ పేరు వచ్చింది. శివుడు, 

విష్ణువు, ఇంద్రుడు, అగ్నిదేవుడు, సూర్యుల మహత్తు 

గురించి ఇందులో వివరించారు.


3. భాగవత పురాణం : దీన్ని తెలుగులోకి పోతన కవి 


అనువదించారు కనుక తెలుగు ప్రజలకు ఇది 

చిరపరిచితమైన పురాణమే. ఇందులో మహావిష్ణు 

అవతారాల గురించి , శ్రీకృష్ణుని లీలల గురించి 

వివరించారు. తెలుగులో ఇది మొత్తం 12 స్కంధాల 

గ్రంధం. 


4. భవిష్య పురాణం : ఇది సూర్యభగవానుడు 


మనువుకు చెప్పిన పురాణం. ఇందులో వర్ణాశ్రమాల 

ధర్మాల అగురించ్, భవిష్యత్తులో జరగబోయే 

పరిణామాల గురించి వివరించారు.


5. బ్రహ్మ పురాణం : ఇది దక్షునికి బ్రహ్మదేవుడు 


చెప్పిన పురాణం. శ్రీకృష్ణుడు, మార్కండేయుడు, 

కశ్యపుల జీవన గాథలు ఉన్నాయి.


6., బ్రహ్మాండ పురాణం : బ్రహ్మ మరీచికి చెప్పిన 



పురాణం ఇది. పరశురాముడి గురించి, రాముడి 

గురించి, శ్రీకృష్ణుని గురించి ఇందులో వివరించారు. 

ఇందులో దేవతాస్తోత్ర శ్లోకాలు కూడా ఉన్నాయి. 


7. బ్రహ్మవైవర్త పురాణం : ఇది నారద మహర్షికి 


సావర్ణుడు చెప్పిన పురాణం. సృష్టికి మూలమైన భౌతిక 

జగత్తు గురించి, పంచమహా శక్తుల గురించి ఇందులో 

ఉంది.



8. వరాహ పురాణం : ఇది విష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన 



పురాణం. పార్వతీ పరమేశ్వర చరిత్ర, ధర్మశాస్త్ర శ్లోకాలు, 

వ్రత విధానాలు ఇందులో ఉన్నాయి.


9.వామన పురాణం : నారదునికి పులస్త్య ఋషి 


వివరించిన పురాణం ఇది. శివపార్వతుల కళ్యాణం, 

కార్తికేయగాధ, భూగోళ వర్ణన, రుతువర్ణన ఇందులో 

ఉన్నాయి. ఆర్యభట్టులాంటి ఖగోళ శాస్త్రవేత్తలు ఈ 

పురాణాన్ని శ్రద్ధగా చదివినట్లు ఆధారాలున్నాయి.


10. వాయు పురాణం : ఇది వాయుదేవుడు 


ఉపదేశించిన పురాణం. ఇందులో శివమహత్యముతో 

పాటు భూగోళ వర్ణన, సౌరమండల వ్యవస్థ వర్ణన కూడా 

ఉండి. మన ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్తలు ఈ పురాణాన్ని 

కూడా అధ్యయనం చేశారు.


11. విష్ణు పురాణం : ఇది మైత్రేయునికి పరాశర మహర్షి 


ఉపదేశించిన పురాణం. విష్ణు, శ్రీకృష్ణ, ధృవ, ప్రహ్లాద, 

భరతుల గురించి విపులంగా వివరించారు. 


12. నారద పురాణం : ఇది నారదుడు నలుగురు బ్రహ్మ 


మానసపుత్రులకు చెప్పిన పురాణం. ఇందులో వ్రతాల 

గురించి, వేదాంగాల గురించి కూడా వివరించారు. వివిధ 

పుణ్యక్షేత్రాల వర్ణన ఇందులో ఉంది.


13. అగ్ని పురాణం : ఇది అగ్నిదేవుడు ప్రవచించిన 


పురాణం. వైద్యం, వ్యాకరణం, చందస్సు, భూగోళ 

శాస్త్రం, జ్యోతిష్యం గురించి ఇందులో ఉన్నాయి.


14. స్కంద పురాణం : ఇది స్కందుడు చెప్పిన 


పురాణం. ఇందులో అనేక వ్రతాల గురించి, 

శివమాహత్మ్యం గురించి ఇంకా వివిధ పుణ్యక్షేత్రాల 

గురించి వివరించారు. 
15. గరుడ పురాణం : ఇది తన వాహనమైన గరుడునికి 

(గరుత్మంతునికి) శ్రీమహావిష్ణువు ఉపదేశించిన 

పురాణం. గరుడుని జన్మవృత్తాంతముతో పాటు 

స్వర్గలోకం గురించి, నరకలోకం గురించి, విష్ణు ఉపాసన 

గురించి ఇందులో వివరించారు.

16. లింగ పురాణం : ఇందులో శివుని ఉపదేశాలు, 


ఇతర వ్రతాలు, ఖగోళశాస్త్రం, జ్యోతిష్యశాస్త్రం మొదలైన 

వాటి గురించి వివరించారు.

17. కూర్మ పురాణం : శ్రీమహావిష్ణువు కూర్మావతారంలో 


ఉపదేశించిన పురాణం కనుకే దీనికి ఈ పేరు వచ్చింది. 

ఇందులో వరాహ అవతారం గురించి, నరసింహావతారం 

గురించి వివరించారు. భూగోళం గురించి కూడా 

వివరించారు. 


18. పద్మ పురాణం : 18 పురాణాలలోకెల్లా ఇది పెద్దది. 


ఇందులో బ్రహ్మ చేసిన సృష్టి గురించి, గంగా మహాత్మ్యం 

గురించి, గాయత్రీ చరితం గురించి, గీత గురించి, పూజా 

విధానం గురించి వివరంగా వర్ణించారు.

Popular Posts