- తన క్షేమముల కంటే తనవారి క్షేమాన్ని నిరంతరమూ
- చూసేవాడు ఉత్తమ పురుషుడు .
- తనకి వచ్చిన ఫలమును బట్టి ప్రత్యుపకార ఫలాన్ని
- ఇచ్చువాడు మధ్యమ పురుషుడు .
- తన సుఖం కోసం , తన వ్యసనాల కోసం కుటుంబాన్ని ,
- తన వారిని నాశనం చేయువాడు అధమ పురుషుడు .
- తనకున్న దుర్గుణాల ద్వార తను, తన వారిని పాడు
- చెయ్యటమే కాక, ఏ సంబంధం లేని వారిని కూడా మాయ
- ప్రలోభాలతో ఆ వైపు మళ్ళించు వాడు అధమాధమ
- పురుషుడు.