Pages

Tuesday, 23 July 2013

భావిగ భద్రేశ్వరస్వామి

ఈ దేవాలయం తాండూరు ఊరు మధ్యలోనే ఉంది. ఈ ఆలయానికి మొక్కులు తీర్చుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా విశేషంగా భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో ప్రతిఏటా ఏప్రిల్‌లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు వారంరోజులపాటు జరుపుతారు.

Bhadreaఅప్పుడు భక్తుల సంఖ్య ఇంత అని చెప్ప లేము. ఈ ఆలయానికి చరిత్ర ఉంది. అదేమిటంటే, కర్నాటకా రాష్ట్రంలో బీదర్‌ జిల్లాలో భావిగ అనే కుగ్రామంలో 200 సంవత్సరాల క్రితం భద్రప్ప అనే అతను జన్మిం చాడు. ఇతడు సాక్షాత్తు వీరభద్రుని అవతారమని అక్కడి వారి నమ్మకం. భద్రప్ప నిజసమాధి ఉన్న భావిగలో కూడా అత్యంత వైభవంగా వేడుకలు జరుపుతారు. తాండూరుకు చెందిన పటేల్‌ బసవన్న అనే భక్తుడు ఏటా భద్రప్ప ఉత్సవాలకి ఎడ్లబండ్లు కట్టించుకుని వెళ్ళి ఎంతో భక్తితో పూజలు నిర్వహించి తిరిగి తాండూరు చేరుకునే వాడు. ఒకసారి ఇలాగే ఉత్సవాలకి హాజ రయ్యి తిరిగు ప్రయాణం అవుతూ భద్రేశ్వ రునికి వెళ్ళి వస్తానని మనసులో విన్నవించుకున్నాడు. ఎడ్లబళ్ళు ఎక్కి వస్తూండగా ఒక బాలుడు పటేల్‌ బండి వెనుక నడుచుకుంటూ వస్తున్నాడు. 

పటేల్‌ అతనిని భద్రేశ్వరుడిగా గుర్తించి, బండి ఎక్కమని అనగా అందుకు ఆబాలుడు అంగీకరించలేదు. అలాగే తాండూరు వరకూ వచ్చి, ఇప్పుడున్న దేవాలయం స్థలానికి రాగానే మాయం అయిపో యాడు. అదేరోజు పటేల్‌ బసవన్నకి కలలో కనిపించి తన పాదుకలు భావిగ నుంచి తెచ్చి, వాటిని ఇక్కడ ప్రతిష్టించి ఆలయం నిర్మించమని ఆదేశించాడు. ఆయన చెప్పినట్టే పటేల్‌ బసవన్న ఆల య నిర్మాణం చేసాడు. నాటినుండీ ఈ ఆలయం ఎం తో వైభవంతో వెలుగొందుతోంది. ఈ ప్రాంతంలో స్వామి మహిమలెన్నో ప్రచారంలో ఉన్నాయి.