ఈ దేవాలయం తాండూరు ఊరు మధ్యలోనే ఉంది. ఈ ఆలయానికి మొక్కులు తీర్చుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా విశేషంగా భక్తులు తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో ప్రతిఏటా ఏప్రిల్లో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలు వారంరోజులపాటు జరుపుతారు.
పటేల్ అతనిని భద్రేశ్వరుడిగా గుర్తించి, బండి ఎక్కమని అనగా అందుకు ఆబాలుడు అంగీకరించలేదు. అలాగే తాండూరు వరకూ వచ్చి, ఇప్పుడున్న దేవాలయం స్థలానికి రాగానే మాయం అయిపో యాడు. అదేరోజు పటేల్ బసవన్నకి కలలో కనిపించి తన పాదుకలు భావిగ నుంచి తెచ్చి, వాటిని ఇక్కడ ప్రతిష్టించి ఆలయం నిర్మించమని ఆదేశించాడు. ఆయన చెప్పినట్టే పటేల్ బసవన్న ఆల య నిర్మాణం చేసాడు. నాటినుండీ ఈ ఆలయం ఎం తో వైభవంతో వెలుగొందుతోంది. ఈ ప్రాంతంలో స్వామి మహిమలెన్నో ప్రచారంలో ఉన్నాయి.