Followers

Wednesday, 31 July 2013

కేదార్‌నాథ్‌ యాత్రతో పాపపరిహారం

కేదార్‌నాథ్‌.. ఇప్పుడు ఈ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. అనుకోని ప్రళయానికి నిలయంగా మారిన ప్రాంతం. ఎంతో మందిని తనలో కలిపేసుకున్న కర్మ భూమి. తన వద్దకు వచ్చిన వారిని ఏకంగా దేవుని వద్దకు చేర్చిన ప్రాంతం. అందాలే కాదు బీభత్సాన్ని రుచి చూపించిన పర్యాటక స్థలం. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి దర్శనానికి ప్రజలు వస్తారని చెప్పుకోవడమే కానీ ఇన్ని వేల మంది వస్తున్నారని ఉపద్రవం జరిగేవరకు తెలియలేదు. ఒక్క వర్షాలు పడిన ఒకటి రెండు రోజుల్లోనే వేలాది అక్కడ ఉన్నారంటే... యేటా సందర్శించుకునే వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంచనా వేయవచ్చు. ఇంత మంది దర్శించుకోవడానికి ఇక్కడ ఉన్న అద్భుతం ఏమిటీ? ఆలయ విశిష్టత? దాని ప్రాశస్త్యం?
కేదార్‌నాథ్‌ ఉత్తరాఖండ్‌లో ఉంది. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఈ ఆలయాన్ని మే నుంచి సెప్టెంబరు(వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ బహుళ చతుర్దశి) వరకు తెరిచి ఉంచుతారు. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవది. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి 11, 760 అడుగుల ఎత్తులో ఉంది. 

ప్రయానమిలాకేదార్‌నాథ్‌ ఉత్తరాఖండ్‌లో ఉంది. కేదార్‌నాథ్‌ క్షేత్రానికి చేరుకోవాలంటే ఢిల్లీ వరకు రైల్లో వెళ్లి అక్కడి నుంచి రోడ్డు మార్గాన హరిద్వార్‌, దేవప్రయాగ, రుద్ర ప్రయాగ మీదుగా రాంపూర్‌ చేరాలి. రాంపూర్‌ నుంచి సోన ప్రయాగ మీదుగా గౌరీకుండ్‌ చేరాలి. ఈ గౌరీకుండ్‌ గౌరీమాత జన్మస్థలం అని చెబుతారు. కేదార్‌నాథ్‌ పర్యాటకులు ఇక్కడ వేడినీటి కుండాలలో స్నానమాచరించి గౌరీమాతను దర్శించుకుని కేదార్‌నాథ్‌ పర్యటనను కొనసాగిస్తారు. గౌరీకుండ్‌ నుంచి కేదార్‌నాథ్‌ సుమారు 13 కి.మీలు ఉంటుంది. కాలి నడకన కాని, గుర్రాల మీద లేదా డోలీల్లో ప్రయాణించవచ్చు. వాతావరణాన్ని తట్టుకోవడం కొంచెం కష్టమే. విపరీతమైన చలి, అప్పుడప్పుడూ శ్వాసలో ఇబ్బందులు తలెత్తుతాయి. 13 కి.మీల దూరం ప్రయాణించడానికి ఏడెనిమిది గంటలు పడుతుంది. యాత్రికులు కేదారనాథుడి మీద నమ్మకంతో యాత్ర సాగిస్తారు. హరిద్వార్‌ నుంచి గౌరీకుండ్‌ వరకు గవర్నమెంట్‌ బస్సులు ఉన్నాయి. 

పూర్తిగా ఒకటిన్నర రోజు ప్రయాణం. కేదారనాథ్‌లో ఆలయం ముందు నుంచి సుమారు ఒకటిన్నర ఫర్లాంగు పొడవున ఒక వీధి ఉంది. ఆ వీధిలో దుకాణాలు, ధర్మశాలలు ఉన్నాయి. అందులో కాలీ కమ్లి బాబా ధర్మశాల బాగా ప్రసిద్ధి. అందులో గది అద్దె రోజుకు సమారు 300 రూఉంటుంది. అన్ని అధునాతన సౌకర్యాలు ఉంటాయి. ఈ మధ్యనే కేదార్‌నాథ్‌లోని గుడివరకు హెలికాప్ట్టర్‌ సౌకర్యం కూడా ఏర్పడింది. అక్కడి వాతావరణాన్ని తట్టుకునే శక్తి మీకుంటే అక్కడ ఎన్నిరోజులయినా ఉండవచ్చు. మే మధ్య భాగం నుంచి నవంబర్‌ మధ్య వరకు ఏడాదికి ఆరు నెలలు మాత్రమే ఈ ఆలయం తెరచి ఉంటుంది. హిమాలయాల్లో కురిసే విపరీతమైన మంచు కప్పి వేయడంతో, మిగిలిన ఆరు నెలలు ఈ ఆలయం మూసే ఉంటుంది. ఆలయాన్ని తెరిచే సీజన్‌ ప్రారంభం కాగానే, లక్షలాది యాత్రికులు కేదారనాథ్‌ను సందర్శిస్తారు. ఆలయానికి దాదాపు 14 కిలోమీటర్ల దూరంలో ఉండే గౌరీకుండ్‌ ప్రాంతం దాకా బస్సులు, మోటారు వాహనాలు వెళ్ల గలుగుతాయి. అక్కడ నుంచి గుడి దాకా మిగిలిన దూరమంతా యాత్రికులు కాలినడకన వెళ్లాలి. లేదంటే, గుర్రాల మీద వెళ్లాలి.

స్వయంగా అభిషేకంకేదారేశ్వర జ్యోతిర్లింగానికి భక్తులు స్వయంగా అభిషేకం చేయవచ్చు. ఆలయానికి వెనుక వైపు జగద్గురువు ఆదిశంకరాచార్యుల సమాధి ఉంది. సాధువులు ఒళ్లంతా విబూది పూసుకుని సంచరిస్తుంటారు. ఆధ్యాత్మిక వికాసానికి, పర్యాటక ఆహ్లాదానికి చక్కని వేదిక కేదార్‌నాథ్‌. కేదారేశ్వర జ్యోతిర్లింగానికి భక్తులు స్వయంగా అభిషేకం చేయవచ్చు. ఆలయానికి వెనుకవైపున జగద్గురువు ఆదిశంకరాచార్యుల సమాధి ఉంది. సాధువులు ఒళ్లంతా విబూది పూసుకుని సంచరిస్తుంటారు. ఆధ్యాత్మిక వికాసానికి, పర్యాటక ఆహ్లాదానికి చక్కని వేదిక కేదార్‌నాథ్‌. 

మందాకినీ నది పైభాగంలో మంచు కప్పిన కొండల మధ్య ఉంది. హిందువుల పవిత్ర ఆలయమైన కేదార్‌నాథ్‌ శివాలయం ఉన్న పుణ్యక్షేత్రం. గర్హ్వాల్‌ కోడల పైభాగంలో ఉంది. ప్రతికూల వాతావరణం కారణంగా అక్షయతృతీయ నుండి దీపావళి వరకు భక్త సందర్శనార్ధం ఈ గుడిని తెరచి ఉంచుతారు. ఇక్కడ పూజలు నిర్వహించడానికి అధికారమున్న కుటుంబం అంటూ ఏదీ లేదు. గుడిలోని ప్రతిష్టితమైన లింగం కాలం ఇదమిద్దంగా ఇంతవరకు నిర్ణయించ బడలేదు. గుడి చేరడానికి రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్‌ నుండి గుర్రాలు, డోలీలు, కాలినడకన మాత్రం గుడిని చేరవచ్చు. ఈ గుడిని ఆదిశంకరులు నిర్మించినట్లు విశ్వసిస్తున్నారు. కేదార్‌నాథ్‌ గుడి వెనుక భాగంలో ఆదింకరుల సమాధికి ఉంది. 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లలో ఇది ఒకటి. గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్‌, కేదార్‌నాధ్‌లను చార్‌ ఉత్తరాఖండ్‌ ధామ్‌లుగా వ్యవహరిస్తారు.

శ్రీకేదారనాథ్‌ ధామ్‌
కేదారనాథ్‌ ఆలయం చుట్టూ విస్తరించిన ఓ చిన్న కుగ్రామం ‘శ్రీకేదారనాథ్‌ ధామ్‌’. ఆ గ్రామమంతా సాధు, సన్యాసులతోనూ, యాత్రకు వచ్చే పర్యాటకులకు వసతులు కల్పించే ధర్మశాలలు, దుకాణాలతోనూ ఏర్పడినదే. కేదారనాథ్‌ ఆలయానికి వెనకాల కొద్ది దూరంలో కేదారనాథ్‌ పర్వత శిఖరం కనిపిస్తుంది. ఈ పర్వత శిఖరం ఎత్తు 6940 మీటర్లు. ఈ పర్వత శిఖర ముఖం ఎంత ఏటవాలుగా ఉంటుందంటే, చివరకు కురిసే మంచు, వర్షం కూడా దాని మీద నిలవదు.
బుట్టలో యాత్రికుని మోసుకెళుతున్న దృశ్యం కేదార్‌నాథ్‌ ఆలయానికి యాత్రికులు గౌరీకుండ్‌ నుంచి కాలిబాటలో వెళ్లాలి. 14 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గంలో కొందరు శ్రమకు ఓర్చి కాలిబాటన ప్రయాణం చేస్తారు. ఈ ఆలయానికి యాత్రికులను గుర్రాలలోను, డోలీలలోను మరియు బుట్టలలోనూ చేరుస్తుంటారు.

బుట్టలలో యాత్రికులను ఒక మనిషిని ఒక మనిషి మాత్రమే మోస్తూ చేరవేయడం విశేషం. డోలీలో ఒక మనిషిని నలుగురు పనివాళ్లు మోస్తూ ఆలయానికి చేరుస్తుంటారు. గుర్రాలలో యాత్రికులతో ఒకరు గుర్రాన్ని నడిపిస్తూ తోడు ఉంటారు. వీరు యాత్రికులను ఆలయానికి కొంతదూరం వరకు తీసుకువెళతారు. తరువాత ఆలయదర్శనం చేయడానికి వీరిలో ఒకరు యాత్రికులకు తోడు వస్తారు దర్శనానినికి సహకరిస్తారు. తిరిగి వారిని భద్రంగా గౌరికుండ్‌ లోని వారి బసవరకు తీసుకు వస్తారు. పనివాళ్ల కోరికపై అనేకమంది యాత్రికులు మార్గంలో అదనంగా వారి ఆహార పానీయాల ఖర్చును భరిస్తారు. రానూ పోనూ 28 కిలోమీటర్ల ఈ ప్రయాణానికి చేర్చి వారికి రుసుము చెల్లించాలి. కొందరు ఒక మార్గానికి మాత్రం కూడా వీరిని కుదుర్చుకుంటారు అన్నీ యాత్రికుల నిర్ణయం మాత్రమే. మార్గంలో హిమపాతం, వర్షం లాంటి అవాంతరాలు ఎదురైనప్పుడు వారు యాత్రికులకు వేడినీటిని అందించడం, ప్రాణ వాయువు కొరత ఏర్పడినప్పుడు చికిత్సాలయానికి తీసుకొని పోవడం లాంటి అనేక సేవలు అందిస్తారు. 

వాతావరణం కారణంగా ప్రయాణం కష్టమైనప్పుడు యాత్రికులు అక్కడి తాత్కాలిక గుడారాలలో రాత్రి సమయంలో బస చేసి మరుసటి రోజు ఆలయానికి వెళ్లడం సహజం కానీ ఇది చాలా అరుదు. వీరిలో అనేకమంది నేపాలీయులే వీరు విశ్వాసపాత్రులు రుసుము మాత్రం యాత్రికులు ముందుగానే నిర్ణయించుకుంటారు. ఆలయ అనేక శ్రమలను ఓర్చి చేరే భక్తులకు అక్కడి అత్యంత శీతల వాతావరణం మరికొంత ఇబ్బందిని కలిగించడం సహజం. యాత్రికులకు గౌరీ కుండులో ఆక్సిజన్‌ సిలిండర్లు వారి బసయజమానులు సరఫరా చేస్తుంటారు. వీటికి అదనపు రుసుము చెల్లించి యాత్రికులు తమ వెంట తీసుకు వెళుతుంటారు. వీటిని వాడని పక్షంలో బస యజమానులు తీసుకొని రుసుములో కొంత తగ్గించి ఇస్తారు. ఆలయ ప్రాంగణం కొంత మంచులో కప్పబడి ఉంటుంది. 

పేరుకు పోయిన మంచు అక్కడక్కడా యాత్రికులకు వింత అనుభూతిని ఇస్తుంది. ఆలయ సమీపంలో ప్రవహించే నదికి మందాకినీ నామంతో వ్యవహరిస్తారు. ఆలయ దర్శనం పగలు మూడుగంటల వరకు కొనసాగుతుంది. ఉత్తరకాశి నుండి హెలికాఫ్ట్‌ ద్వారా యాత్రికులను ఆలయానికి చేరుస్తుంటారు కానీ ఇది ఖరీదైనది మరియు పరిమితమైనది. ఇవి అనేకంగా ముందుగానే యాత్రికులచే ఒప్పందము జరిగి ఉంటుంది కనుక జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఉత్తరకాశి నుంచి ఉదయం 6 నుంచి 7 గంటల సమయం నుంచి యాత్రికులను ఆలయానికి చేర్చుతుంటారు. హెలికాఫ్టర్లు యాత్రికులను కొన్ని కిలోమీటర్ల దూరంలోనే వదిలివేస్తాయి కనుక కొంతదూరం ప్రయాణించి ఆలయ దర్శనం చేసుకోవడం తప్పనిసరి.

చరిత్రఆలయం ముందరి భాగంలో కుంతీ దేవి, పంచ పాండవులు, శ్రీకృష్ణుని మూర్తులు వరుసగా కుడ్య శిలలుగా దర్శనమిస్తాయి. గర్భగుడిలో కేదారీశ్వరుడు స్వయం భువుడుగా దర్శనం ఇస్తాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్దానంతరం సగోత్రీకుల హత్యాపాకం నుండి బయట పడటానికి పాండవులు శివుని కోసం గాలిస్తూ ఇక్కడికి చేరిన పాండవులను చూసి శివుడూ భూగర్భంలోకి వెళ్ళగా పాండవులు విడవకుండా వెన్నంటి శివుని వెనుకభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు పురాణ కధనం. తలభాగం నేపాల్‌లోని పసుపతినాధుని ఆలయంలో ఉన్నట్లు స్వయంగా శివుడు పార్వతీతో చెప్పినట్లు స్థల పరాణం చెప్తుంది. పాండవులు కుంతీ దేవితో ఇక్కడ ఈశ్వరుని పూజించినట్లుగా ఆ కారణంగా వారి విగ్రహాలు ఆలయంలో ఉన్నట్లు కొందరు విశ్వసిస్తారు. ఆలయ ప్రాంగణంలో యాత్రీకులకు కావలసిన పూజా సామగ్రి దుకాణాలలో లభిస్తుంది. ఆలయ మార్గంలో ప్రయాణించే సమయంలో వృక్షాలతో కూడిన పచ్చని పర్వతాలు జలపాతాలు యాత్రీకులను అలరిస్తాయి. హిమపాతం వర్షం ఏ సమయంలోనైనా సంభవం. ఆలయం పర్వత శిఖరాగ్రంలో ఉంటుంది కనుక భక్తులు శిఖరాగ్రాన్ని చేరి దర్శించి కిందకు రావడం ఒక వింత అనుభూతి.

Popular Posts