సకల ప్రాణికోటిలోను మానవ జన్మ చాలా గొప్పది. మానవునిగా పుట్టినవారు తమ దేహమును, మలిన గుణములతో నిండిన ఆత్మనూ ప్రక్షాళన చేసుకోవడం ద్వారా ఇహపరములలో ఉత్తమునిగా జన్మరాహిత్యం పొందడానికి వీలుకలుగుతుంది. మానవుడు శరీర సుదిె్ధకై ప్రతి నిత్యం స్నానం ఆచరింస్తూ, సదాచా రాన్ని పాటించాలి. సంపూర్ణ ఆయుర్ధాయం కోరి చిరకాలం జీవించాలనుకున్న వారు కొన్ని నియమాలు పాఠించక తప్పదు. ఆ నియమాలలో ముఖ్యమైనవి, రుద్రాక్ష ధారణ, విభూది దారణ చాలా స్రాశస్త్యమై నవని వేదకోవిదులు వక్కాణించారు.
శరీరము నందు రుద్రాక్ష ధరించి ప్రాణము విడిచిన ఏ జీవి అయినా శివసా యుజ్యం పొందుతారని పురా ణాలు ఘోషిస్తున్నాయి. ఇక శాస్ర్తీయ పరంగా రుద్రాక్ష ధారణ వలన శరీర కాంతి పెరుగుతుంది. రుద్రాక్షలు ఒంటి మీద ఉండగా స్నానం చేస్తే వాటినుండి జారిన నీరు శరీరాన్నంతటినీ తాకి తేజోవం తంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తనాళాల్లో మలినములు మటుమాయ మవుతాయి. గుండె జబ్బులు రాకుండా నిరోధి స్తుంది. నరముల నిస్త్రాణ నివారించి ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. భారతీయ సంస్కృతిలో చిరకాలం జీవించడానికి వీలుగా సదాచారాలు నిర్ణయించారు. వాటిని అనుసరించి ఎందరో ఆయురారోగ్యాలతో తుల తూగారు. ఇటువంటి సదాచారాన్ని పాటించకపోవడం వల్లనే కోరినంత కాలం జీవించలేక, అనారోగ్యాలతో అకాల మృత్యువాత పడుతున్నాం. రుద్రాక్ష మహిమ అనంతం అని దేవీభాగవతంలో కూడా సవివరంగా లిఖించబడింది.
విభూది ధారణ
నిత్య స్నానానంతరం విభూధిని కూడా శరీరానికి రాసుకోవాలి. భస్మం రాసుకో వడం ఏమిటీ? అని నాగరీక ప్రపంచంలో చాలామందికి విస్మయం కలుగు తుంది. మన శరీరంలో వాత, పిత్త, శ్లేష్మములనే మూడు ధాతులున్నాయి. రక్త ములో హీనత ఉన్నా, రక్తము వేడి వలన వేగవంతమైనా, దాని ప్రభావంతంలో ముందుగా వాత, శ్లేష్మములు ప్రకోపించును. అందువలన అధిక రక్తపోటు ఏర్పడును. స్నానానంతరం విభూది రాసుకోవడం మూలంగా రక్త ప్రసరణ నియంత్రించబడుతుంది. నాడీమండలములో ప్రవహించే రక్త వేగాని సమ తూల్యం చేసి ఆరోగ్యంగా ఉంచడంలో భస్మధారణని మించిన ఔషధం మరొ కటి లేదని చెప్ప వచ్చు. పతంజలి యోగ శాస్త్రంలో కూడా భస్మధారణ గావించి కొన్ని ఆసనాలు వేయడం వలన శల్య సంధులలో ఇరుక్కుని ఉన్న సూక్ష్మక్రి ములు బయటకు వచ్చి శరీర ధారుఢ్యాని పెంచుతుందని ప్రవచించడం జరి గింది. ఇది శాస్త్రీయ దృక్పథం. ఇక ఆధ్యాత్మికంగా శివుని మూడవ నేత్రము నుండి ఉద్భవించిన విభూదిని త్రయంబకం అని పిలుస్తారు.
‚ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోః మృక్షీర్యుమామృతాత్!
అప్పుడు యమధర్మరాజు పైకి చూసి అగస్త్యులవారిని ఆహ్వానించి తగిన విధంగా ఆతిధ్యమిచ్చాడు. మునీం ద్రా! తమ దృష్టి పారించినంత మాత్రాన నాలోకంలో శిక్షలనుభవిస్తున్న పాపులు కూడా ఆ శిక్షల బాధ మరిచి ఆనందం అనుభవిస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అని అడిగాడు. అగస్త్యుడు జవాబు ఇవ్వకుండా చిరునవ్వుతూ యమలోకం నుంచి బయలు దేరాడు. కానీ, కొద్దిగా అహంభావం పొడచూ పింది. తన దృష్టి తాకినంత మాత్రాన లోకంలో శాంతి లభించిందని భావిస్తూ వెడుతున్న ఆ మహామునికి నారదుడు ఎదురు పడ్డాడు. సర్వాంతర్యామి అయిన నారదుడు అగస్త్యుని మనసులో ప్రవేశించిన అహాన్ని గమనించి, ఏం అగస్త్యా! ఎక్కడ నుండి వస్తున్నావు? అని అడిగాడు. అందుకు అగస్త్యుడు గర్వం నిండిన ముఖంతో ‘కైలాసంలో శివుని దర్శించి వస్తు న్నానని చెప్పాడు.
అప్పుడు నారధుడు ఓహో అదా అసలు సంగతి! అని ఆగా డు. అగస్త్యుడు ఏమిటా అసలు సంగతి అని ప్రశ్నించాడు. అప్పుడు నారదుడు మందహాసంతో యమలోకవాసులు నీ దృష్టి చేత శాంతిపొందారని విన్నాను . అది నీకెలా సాధ్యమయ్యిందాని అనుమానం వచ్చింది. ఇప్పుడు నివృత్తి అయ్యిం ది. అన్నాడు. మళ్ళీ అగస్త్యుడు విషయం మీద ఆసక్తితో నీకేమని తెలిసింది నారదా! అని అడిగాడు. అది నీ మహిమ కాదు అగస్త్యా! శివలోకంలో నీవు ధరించిన విభూది, నువ్వు కిందనున్న యమలోకాన్ని వీక్షిస్తున్నప్పుడు నీ నుదుట నున్న విభూది కొద్దిగా రాలి పడింది. ఆ విభూధి మహిమ వలన అక్కడ పాపుల శిక్షలు వేస్తున్నా వారికి ఆనందం కలిగింది. యమలోకం శాంతపడింది. అన్నా డు. అది విని గర్వం నశించినవాడై తన అపరాధాన్ని తెలుసుకుని తన తప్పును క్షమించమని శివుని మనసులోనే ప్రార్ధించుకుంటూ నిజవా సానికి చేరాడు.
నారదుడు కూడా చిరునవ్వు నవ్వుకుంటూ వైకుంఠానికి బయలుదేరాడు. సమంత్రయుక్తంగా విభూది ధరించడం వలన ఇంతటి శక్తి లభిస్తుంది. మనసు శాంత పడుతుంది. అపమృత్యు భయం తొలగిపోతుందని పురాణాలు ఘంటాపథంగా చెప్తున్నాయి.శాస్ర్తీయ పరంగా రుద్రాక్ష ధారణ వలన శరీర కాంతి పెరుగుతుంది. రుద్రాక్షలు ఒంటి మీద ఉండగా స్నానం చేస్తే వాటినుండి జారిన నీరు శరీరాన్నంతటినీ తాకి తేజోవం తంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తనాళాల్లో మలినములు మటుమాయ మవుతాయి. గుండె జబ్బులు రాకుండా నిరోధిస్తుంది. నరముల నిస్త్రాణ నివారించి ఎంతో ఉత్సాహాన్ని నింపుతుంది. భారతీయ సంస్కృతిలో చిరకాలం జీవించడానికి వీలుగా సదాచా రాలు నిర్ణయించారు. వాటిని అనుసరించి ఎందరో ఆయురారో గ్యాలతో తులతూగారు. ఇటువంటి సదాచా రాన్ని పాటించకపోవడం వల్లనే కోరినంత కాలం జీవించలేక, అనారోగ్యాలతో అకాల మృత్యువాత పడుతు న్నాం. రుద్రాక్ష మహిమ అనంతం అని దేవీభాగవతంలో కూడా సవివరంగా లిఖించబడింది.