‘‘నీ పొరుగింటి వానిని ప్రేమించిన గాని, భగవంతుడు నిన్ను ప్రేమించడు’’అని బైబిలులో చెప్పబడింది. అర్జునుడు ఇటువంటి లక్షణాల్ని కలిగి ఉండబట్టే ఆయన్ని వ్యాజముగా ఉంచుకుని పరమాత్మ మనందరికి గీతోపదేశం చేసాడు.
సర్వోపనిషత్తులు ఆవు వంటివి. ఆవు నుంచి దూడ కుడిచిన తర్వాతే పాలను పిండాలి. అలా పితకబడిన పాలే శ్రేష్టమైనవి. ఉపనిషత్తులనే గోమాత నుంచిఅర్జునుడు అనబడే దూడ కుడిచి వదిలిపెట్టిన శేషాన్ని మనం త్రాగాలి. సద్బుద్ధిగలవారికే గీత బోధపడుతుంది. ఎవరి గీత బాగుంటుందో వారికే గీత అర్థవౌతుంది. గీతామృతం పిండబడిన పాలు. ఇది నూట ఎనిమిది ఉపనిషత్తుల సారాంశం. అటువంటి అమృతాన్ని పరమాత్మ అర్జునుని ద్వారా మనకు అందించాడు. దీనిని ఆస్వాదింపగలిగినవారే దైవానుగ్రహానికి పాత్రులవుతారు.