బుద్ధం శరణం గచ్ఛామి
ధర్మం శరణం గచ్ఛామి
సంఘం శరణం గచ్ఛామి
బౌద్ధులకే కాదు హిందువులకు పవిత్రమైన స్థలం గయ. బీహార్లో గయ ముఖ్యపట్టణం. పాట్నా నుండి 100 కి.మీ. దూరంలో ఉంది. గౌతమబుద్ధుడు జన్మించిన తరువాత చరిత్ర పుటలలోకి ఎక్కింది. గయకు 11 కిలోమీటర్ల దూరంలో బుద్ధునికి ఙానోదయం కలిగిన బోధ్ గయ ఉంది. ఈ ప్రాంతాన్ని జ్ఞానభాండాగరమని కూడా అంటారు. క్రీ.శ 1810లో గయ రెండు భాగాలుగా ఉండేది. ఒక భాగం పూజారులు నివసించే భాగం. ఈ భాగాన్ని గయ అనేవారు. రెండవ భాగంలో న్యాయవాదులు, వ్యాపారులు ఉండేవారు. కలెక్టర్ సాహెబ్ థోమస్ ఈ నగర పునరుద్ధరణ చేసిన తరువాత దీనిని సాహెబ్గంజ్ అంటూ వచ్చారు. బోధి
బోధి అనగా నిద్ర లేచుట - థేరవాదంలో అరహంతులకు, బుద్ధులకు కూడా జ్ఞానోదయమయ్యే ప్రక్రియను బోధి అంటారు. జన్మ జన్మల సాధన, ధ్యానం తరువాతనే ఈ స్థితి సాధ్యమవుతుంది. బౌద్ధం ఆరంభ దశలో బోధి, నిర్వాణం అనే పదాలు ఒకే అర్ధంలో వాడబడ్డాయి. రాగ, ద్వేష, మోహాలు అంతరించడం ఈ ప్రక్రియలో ముఖ్యమైన లక్షణం. తరువాత వచ్చిన మహాయాన సిద్ధాంతాలలో నిర్వాణం అనే స్థితి బుద్ధత్వం కంటే కొంత తగ్గింది. రాగ ద్వేషాలనుండి విముక్తి కలిగితే అది నిర్వాణం అవుతుంది, అనగా ఇంకా మోహం ఉంటుంది. ఈ మోహం కూడా తొలగిపోయినపుడు బోధి స్థితి లభిస్తుంది. మహాయానంలోని ఈ సిద్ధాంతం ప్రకారం అరహంతులు నిర్వాణాన్ని పొందుతారు కాని, ఇంకా మోహంనుండి విముక్తులు కానందున వారు బోధిత్వం పొందరు. కాని థేరవాదంలోని నమ్మకం ప్రకారం అరహంతులు రాగ, ద్వేష, మోహాలనుండి విముక్తి పొదిన బోధులు.
కథనం
గయలో ఇక్కడ శార్ద విధులను నిర్వర్తించి పిండ ప్రదానం చేస్తే పితృ ఋణాన్ని తీర్చుకుని ఇహపర సాధనలో మోక్ష ప్రదమైన పవిత్ర స్థలంగా భావిస్తారు. ఒక్క క్షణం దారిలో ఉన్న ఆసక్తికరమైన స్థల సందర్శనం చేసికొంటూ వెళదాం.
పిండ ప్రధానానికి ముందు స్నానమాచరించడానికి శ్రీ రాముడు వెళ్లిన సమయంలో మహారాజైన దశరధుని హస్థాలు రెండు సీత ముందు కనిపించి తాను చాలా ఆకలిగా ఇన్నానని రామునికి బదులుగా పిండం ప్రదానం చెయ్యమని సీతను అడిగాడుగగా సీతాదేవి పిండములు తీసి ఆ చేతులలో ఉంచింది. శ్రీరాముడు తిరిగి వచ్చి యధావిధిగా పిండములు ప్రదానము చేసే సమయములో అతని తండ్రి ఆ పిండాలను స్వీకరించక పోయినప్పుడు శ్రీరాముడు ఆశ్చర్యానికి గురికావడమే కాక బాధపడ్డాడు. తరువాత సీతాదేవి జరిగిన ఉదంతం వివరించి సాక్ష్యానికి ఫలగు నదిని, సమీపంలో నిలిచియున్న బ్రాహ్మణుని, ఆవుని మరియు రావిచెట్టుని పిలిచింది. రావిచెట్టు తప్ప మిగిలిన వారు సాక్ష్యం చెప్పలేదు. ఆవు శ్రీ రామునికి భయపడి, ఫల్గూ నది శ్రీరాముని నుండి అధిక వరాలు పొందడానికి, బ్రాహ్మణుడు శ్రీరాముని నుండి అధిక దక్షిణ పొందాలని నిజం చెప్పలేదు. సీతాదేవి ఆ ముగ్గిరిని శపించిందని పురాణకథనం వివరిస్తుంది. శాపకారణంగా ఫల్గూనదిలో నీరు ఇంకిపోయింది. రావిచెట్టును శాశ్వతంగా జీవించమని వరమిచ్చింది. ఈ రావిచెట్టు ఆకులు ఎప్పుడూ రాలవని ఎప్పుడూ పచ్చగానే ఉంటాయని ఇక్కడివారు చెప్పుకుంటారు. అక్షయ వృక్షం అంటే ఎప్పటికీ క్షయం పొదనిదని అని అర్ధం. కరువు సమయంలో కూడా ఈ వృక్షం పచ్చగా ఉంటుంది.
బౌద్ధులకు ఒక ప్రాముఖ్యమైన యాత్రాక్షేత్రం. ఈ బ్రహ్మయోని కొండల మీద బుద్ధుడు ఆదిత్య పర్యాయ సూత్రాలను భోధించాడని చెప్పబడుతుంది. ఈ సూత్రాలను విన్న వేలాది అగ్నిఆరాధకులు ఙాఅనసిద్ధి పొందారని అందువలన ఈ కొండని గయాసిసా అని పిలిచేవారని చెప్పబడుతుంది.
జమ్మా మసీద్
గయలో ఉన్న జమ్మా మసీద్ బీహారులోనే అతిపెద్ద మసీదు. ముజాఫీరి రాజకుటుంబం 150 సంవత్సరాక్రితం ఈ మసీదును నిర్మించారు. ఇక్కడ ఒకేసారి వేలమంది నమాజ్ చేసే వీలుంది. ప్రస్థుతం ఈ మసీదును చారిత్రక ప్రదేశంగా చూపుతున్నారు.
బుద్దతత్వం
సంసార సుఖం నుండి విరక్తి చెందిన అమరతత్వాన్ని పరిశోధించుటకు ఒక రోజు రాత్రి రాజభవనం నుండి బయటికి వచ్చి, తపస్సు చేసి బుద్ధుడైయ్యాడు. ప్రపంచమంత తిరిగి మానవ ధర్మములను ప్రచారం గావించిన బుద్ధుడు, యజ్ఞములందు పశువధను మాన్పించెను. జీవులయెడ ప్రేమ, అహింస సద్భావములతో అమర సందేశమిచ్చెను. సంసారం దుఃఖమయము, తృష్ణ దుఃఖ కారణము. తౄఎష్ణ నశించిన, దుఃఖము నశించును. రాగ ద్వేష అహంకారములను వదిలిన జీవులు ముక్తులగుదురు.
1. సత్యం 2. నమ్రత 3. సదాచారం 4. సద్విచారం 5. సద్గుణము 6. సమృద్ధి 7. ఉన్నతమైన లక్ష్యం 8. ఉత్తమమైన ధ్యానం ఈ ఎనిమిది సాధనములను బుద్ధ భగవానుడు మానవుల ఉన్నతి కోసం చెప్పెను.