రక్తాన్ని శుభ్రపరిచే యంత్రం కిడ్నీ ఒక్కసారిగా మూలనపడితే..! శరీరంలో మలినాలన్నీ పేరుకుపోరుు వ్యవస్థలన్నీ అస్తవ్యస్తం అరుుపోతారుు. రక్తపోటు పెరిగి గుండె, మెదడు లాంటి ప్రధాన అవయవాలు కూడా దెబ్బతింటారుు. క్రానిక్ కిడ్నీ వ్యాధికి గురైనవారిలో గుండె దెబ్బతినడం వల్ల సగం మంది మృత్యువాత పడుతున్నారు. అందుేక కిడ్నీని కాపాడుకుంటే గుండెను రక్షించుకోవచ్చు.
కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు అనేక రకాల లక్షణాలు మూకుమ్మడిగా కనిపిస్తాయి. ఆకలి లేకపోవడం, వాంతులు, వికారం, గుండె చుట్లూ వాపు, నాడుల్లో సమస్యలు, మానసికస్థితి సక్రమంగా ఉండకపోవడం, మగతగా ఉండటం, ఫిట్స్ రావడం, అపస్మారక స్థితిలోకి కూడా వెళ్లవచ్చు. ముఖం, పాదాల్లో వాపు, రక్తపోటు పెరగడం, రక్తహీనత, ఎముకల సమస్యలు, ఎలక్ట్రొలైట్ల పరిమాణంలో మార్పులు... ఈ లక్షణాలన్నింటినీ కలిపి యూరేమియా అంటారు.
గుర్తించడం కష్టమే!
చాలా మందిలో కిడ్నీ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఏర్పడే మూత్రం పరిమాణం మాత్రం సాధారణంగానే ఉంటుంది. కానీ వాటిలో మాత్రం వ్యర్థ పదార్థాలన్నీ పోవు. మూత్ర పరిమాణం మామూలుగానే ఉండటం వల్ల కిడ్నీలో సమస్య ఉందనే అనుమానం రాదు.
నివారణ - చికిత్స
మధుమేహం ఉన్న వాళ్లు చక్కెరల శాతం పెరగకుండా మరింత జాగ్రత్తపడాలి. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంది. కాబట్టి ఎరిత్రోపాయిటిన్, ఇనుము సప్లిమెంట్లు తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. కిడ్నీ పూర్తి స్థాయిలో దెబ్బతిన్నప్పుడు డయాలిసిస్ తప్పనిసరి అవుతుంది. అవసరాన్ని బట్టి హీమోడయాలిసిస్ లేదా పెరిటినియల్ డయాలిసిస్ గానీ చేయాలి. చివరి దశలో కిడ్నీ మార్పిడి తప్ప మార్గం లేదు. మనదేశంలో ఏటా సుమారు రెండు లక్షల మందికి పైగా ఫెయిల్యూర్‌కి గురవుతున్నారు. వీరిలో చాలా మంది గుండె దెబ్బతినండం వల్లనే మరణిస్తున్నారు. కిడ్నీ వ్యాధిని ముందుగా గుర్తించగలిగితే రెండింటినీ కాపాడుకునే వీలుంటుంది.
ప్రొటీన్ల మోతాదు తగ్గించడం.
మాంసాహారం, పండ్లు, పండ్ల రసాలు వద్దు.
ధూమపానానికి దూరంగా ఉండాలి.
సోయాబీన్స్, డ్రైఫ్రూట్స్, కొవ్వు పదార్థాలు తీసుకోవద్దు.
టెస్టులతోనే తెలుసుకోవచ్చు
అల్బుమిన్, ప్రొటీన్ల మోతాదు తెలుసుకోవడం కోసం మూత్ర పరీక్ష చేస్తారు. క్రియాటినిన్, సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్‌ల మోతాదు రక్తపరీక్షలో తెలుస్తుంది. అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్, సిటి స్కాన్, కిడ్నీ బయాప్సీ చేయించుకోవాల్సి ఉంటుంది. మధుమేహం, అధిక రక్తపోటు లాంటి సమస్యలు ఉన్నా లేకపోయినా కిడ్నీ దెబ్బతింటే గుండె కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి రీనల్ ఫెయిల్యూర్‌ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఒకసారి కిడ్నీ పూర్తిగా దెబ్బతింటే గుండె పాడయ్యే అవకాశం 20 నుంచి 30 వంతులు అధికంగా ఉంటుంది. రక్తపోటును అదుపులో ఉంచుకోవడంతో పాటు, ప్రొటీన్‌ను మూత్రం ద్వారా వెళ్లిపోవడాన్ని తగ్గించగలిగితే కిడ్నీనే కాదు గుండెనూ కాపాడుకోవచ్చు.