చికిత్స ప్రక్రియలుకొన్ని రకాల కీళ్ళ అరుగుదలలో వచ్చే నొప్పిని మందులతో తగ్గిస్తారు. అయితే కీళ్ళు అరగడం వల్ల వచ్చే నొప్పికి మందులతో శాశ్వత ప్రయోజనం ఉండదు. ఇన్ఫెక్షన్ పోవడం వల్ల వచ్చే పోస్ట్ ఇన్ప్‌క్టివ్ ఆర్థరైటిస్ మినహా మిగతా అన్ని రకాల ఆర్థరైటిస్‌లకు కీళ్ళ మార్పిడి ఒక్కటే సరైన మార్గం. మోకాలులో జాయింట్స్ రీప్లేస్‌మెంట్ చికిత్స ద్వారా పూర్తి ఉపశమనం కలుగుతుంది.
ఆర్థరైటిస్ లక్షణాలు
తీసుకోవాల్సిన జాగ్రత్తలుశరీర బరువును కంట్రోల్‌లో ఉంచుకుంటూ, స్థూలకాయం రాకుండా చూసుకోవడం, నేలపై మఠం వేసుకొని ఎక్కువగా కూర్చోకుండా చూసుకోవడం, టాయిలెట్లలో కాలు ముడుచుకొని కూర్చునే ఇండియన్ టాయిలెట్స్ కంటే వెస్ట్రన్ టాయిలెట్స్ ఉపయోగించడం, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు, స్ట్రెచింగ్ ఎక్సర్ సైజ్‌ల వల్ల ఎముక చివరన ఉండే కార్టిలేజ్ దెబ్బతినకుండా ఉంటుంది.
మోకాలి నొప్పి;మోకాలిలో రెండు ఎముకలు చివరన ఉండే కార్టిలేజ్ మోకాలి చిప్ప వెనుక ఉంటుంది. అలాగే ఎముకలు దగ్గరగా ఉంచడంలో లిగమెంట్ అనే మరో పొర సైతం కీలకంగా ఉంటుంది. తొడను, కాలి ఎముకలను దగ్గరగా కలిపి ఉంచేందుకు ఈ పొర తోడ్పడులతుంది. అలాగే కండరాలు, ఎముకలను పట్టి ఉంచేందుకు టెండన్స్ అనేవి తోడ్పడతాయి. తొడ ఎముక, కాలి ఎముక మధ్యన ఉండే కీళ్ళు (జాయింట్స్) వంగేటప్పుడు లోపలివైపునకు ఒంగితే దాన్ని వాల్గస్ అంటారు. బయటివైపుకు వంగితే దాన్ని వారస్ అంటారు. ఇలా వంగిపోతూ ఉండటం వల్ల కార్టిటేజ్ త్వరగా అరుగుదలకు లోనవుతుంది. దాంతో రెండు ఎముకలు ఒరుసుకుపోయి భరించలేని నొప్పి వస్తుంది.
డా:అరవింద్
ఆర్థోపెడిక్ అండ్ ఆర్థోస్కోపీ సర్జన్,
లక్డీకాపూల్, గ్లోబల్ హాస్పిటల్