పరమశివుడు అనంత రూపుడు అనంతనాముడు. ఈ రూపమునే మహారుద్రు లుగా కొలుచుచున్నారు. అభిషేకనందలి పంచబ్రహ్మ మంత్రములందలి వామదేవుడు, జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు, రుద్రుడు, కాలుడు, కలవికరణుడు, జలవికరణుడు, బలుడు, బలప్రమథనుడు, సర్వభూతదమనుడు, మనోన్మనుడు, ఏకాదశ రుద్రులే.
శివుడు మంగళకరుడు, సురగురువు, ప్రపంచమందలి ప్రథమ గురుస్థానము శివునిది. శివసహస్రము నందలి మొదటి నామము. ‘శ్రీ గురవే నమః’. శంకరుడు కైలాసమున పార్వతీదేవితో నాట్యము సలు పును. శివుడు ఉమామహేశ్వరుడు, పార్వతీదేవిని వామాంక మున కలవాడు. అమ్మను కూడినవాడు, అర్థనారీశ్వరుడు - శక్తి సంపన్నుడు. గజాసురుని కోరిక మేరకు ఏనుగు చర్మమును ధరించి నవాడు, చంద్రకళాధారణచే చిరునవ్వు కలిగి జ్ఞానముద్రతో పద్మాస నమున విరాజిల్లువాడు. పరమ పవిత్రగంగను శిరము దాల్చిన వాడు. రుద్రైకాదశినీ యాగములోని ఏకాదశిరుద్రుల నామములు: మహాదేవః, శివః, రుద్రః, శంకరః, నీల లోహితః, ఈశానః, విజయః, భీమః, దేవదేవః, భవోద్భవః, ఆదిత్యః.అదే విధంగా పురాణాల్లో ఏకాదశ రుద్రులు వర్ణించబడిరి : మన్యుః, మనుః, మహినసహః, మహాన్, శిః, ఋతధ్వజః, ఉగ్రరేతః, భవః, కాలః, వామదేవః, ధృతవ్రతః, శివుడు ప్రదాయకము.
మానవులు పూజా సమయమున, జపసమయమున రుద్రాక్షలు ఉపయోగించ తగినవిగా గుర్తింపబడినవి. శివుడు నాగాభరణ భూషితుడు. నాగ ము దశదిశల పడగ త్రిప్పుచూ లోకవీక్షణ దీక్షలో నిమగ్నమై ఉపద్ర వములను, ప్రజల కష్టనష్టములను ప్రభువునకు తెలుపుచున్నట్లుం డును. శివుడు నందివాహనుడు. నంది ధర్మదేవత. సర్వకాల - సర్వాపస్థలందు శివదేవుని ఎదురుగా నుండి చెవులు నిక్కపొడుచు కొని భక్తుల మొర ఆలకించి, ప్రభునికి విన్నవించును. కొన్ని దేవాలయములలో (ఉత్తరదేశమున), కూర్మ మును కూడా నందితో పాటు అలంకరించెదరు. అమ్మవారి ఆలయములందు కూర్మ విగ్రహముండును. నంది మానవ శరీరమునకు, కూర్మం మానవ చిత్తమునకు ప్రతీకలుగా నిలుచును