Followers

Monday, 22 July 2013

పూలదండగా మారిన వకుళమాత...

vakula

వెైకుంఠవాసుడు శ్రీక్ష్మీలోలుడు, శ్రీమన్నారాయణుడు, దేవకీ వసుదేవుల కోరిక ప్రకారం పుత్రుడెై జన్మించాడు. ఆయనకు జన్మనిచ్చింది దేవకి అయినా పెంచింది యశోద. శ్రీకృష్ణుడని నామకరణం చేశారు. గొల్లపిల్లలతోనే తిరిగాడు. శ్రీకృష్ణునికి అల్లరితనం చాలా ఎక్కువ. గొల్లభామలతో రాధికామనోహరుడు పెరిగాడు. ఎంతో మంది రాక్షసుల్ని చంపాడు. కొంత కాలానికి కంసుడు ద్వారకకు రమ్మని పిలిచాడు. ఆ సమయంలోనే కంసుని వధించి తన తల్లిదండ్రులను కారాగారం నుంచి విడిపించాడు. ఇలా ఉండగా శ్రీకృష్ణుడు అనేక మంది గోపికలను పరిణయమాడాడు.

దీంతో తల్లి యశోద ‘బిడ్డా ఇన్ని వివాహాలు చేసుకున్నావు, కనీసం ఒక్క వివాహానికైనా పిలవలేదే?’ అని శ్రీకృష్ణుని ప్రశ్నించింది. అందుకు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ‘అమ్మా బాధపడకు, కలియుగంలో వెంకటేశ్వరునిగా అవతరిస్తాను, అప్పుడు నువ్వే దగ్గర ఉండి వివాహం చేయుదువు అని చెప్పారు. ఆ తర్వాత కలియుగంలో శ్రీకృష్ణుడు వెంకటేశ్వరుని అవతారాన్ని పొందాడు. అప్పుడు యశోద వకుళమాతగా అవతారం ఎత్తింది. ఏడు కొండలకు వచ్చింది. నదీ తీరాన కుటీరం వేసుకొని, నివసించసాగింది. ఒకనాడు నీటి కోసం బయలుదేరింది. దారిలో ఒక బాలుడు పడి ఉండడాన్ని ఆమె గమనించింది.

దీంతో ఆమె ఆందోళన చెంది, ముఖంపెై నీళ్ళు చల్లి లేపించి. ‘ఎవరు బాబూ!?’ అని ప్రశ్నించింది. దానికి ఆ బాలుడు జవాబు చెప్పలేదు. ఆమెకు ఏమీ అర్థం కాక ఎంతో ఆదుర్థాగా ‘శ్రీనివాసా...’ అని పిలిచింది. వకుళమాత నోటి నుంచి ఆ పలుకులు రాగానే ఆ బాలుడు వెంటనే లేచి కూర్చున్నాడు. దీంతో ఆమె ఆ బాలుని తన కుటీరానికి తీసుకొని వెళ్ళింది. రోజులు గడుస్తున్నాయి. పెద్దవాడవుతున్న ఆ బాలుడు వనంలో తిరిగేందుకని బయలుదేరాడు. దారిలో పద్మావతి కనిపించింది. ఆమె చెల్లికత్తెలతో వివరాలను ఆరా తీశాడు. ఆకాశరాజు కుమార్తె పద్మావతి అని చెలికత్తెలు చెప్పి అక్కడి నుంచి పరుగు తీశారు. ఆ విషయాన్ని వచ్చి తన తల్లికి చెప్పాడు.

అడవిలో తాను చూసిన యువతితో వివాహం జరిపించమని తల్లికి వివరించాడు. దీంతో వకుళమాత రాయభారానికి పద్మావతి తల్లిదండ్రుల వద్దకు వెళ్ళింది. మీ కుమార్తెను తన కుమారునికి ఇచ్చి వివాహం జరిపించాల్సిందిగా ఆమె ఆకాశరాజు దంపతులను కోరింది. అందుకు ఆకాశరాజు దంపతులు సంతోషించి వివాహానికి అంగీకరించి ఘనంగా వివాహం జరిపించారు.

పూలదండగా మారిన వకుళమాత...
వివాహం తరువాత పుణ్యదంపతులు ఏడుకొండలపెైనే నివసించసాగారు. కాగా లక్ష్మీదేవి ఆగ్రహావేశాలతో అక్కడికి చేరుకుంది. ‘నన్ను కాదని పద్మావతిని వివాహం చేసుకున్నందుకు నీవు శిలగా మారిపో..’ అంటూ శపించింది. అప్పుడు శిలగా మారిన వెంకటేశ్వర స్వామి హృదయంలో లక్ష్మీదేవి. పద్మావతి నిలిచిపోయారు. అప్పుడు వకుళమాత పూలదండగా మారి శ్రీ వెంకటేశ్వర స్వామి మెడలో పడింది. అంటే వెంకటేశ్వర స్వామి హృదయంపెైనే నిలిచింది.

తిరుమల దేవాలయంలో కుమారుడు శ్రీవెంకటేశ్వర స్వామి సన్నిధిలో (పోటు స్థలంలో) వెలసిన వకుళమా తను మొదట దర్శించిన వారికే శ్రీ శ్రీనివాసుని అనుగ్రహం లభించునని తన తల్లికి ఆయన మాట ఇచ్చాడు . కాబట్టి దీనిపెై అనవసరమైన వివాదాలు విడనాడి తిరుమలలో ఉండే నిత్యకల్యాణం పచ్చతోరణంతో వెైభోగంగా ఉండే ఆలయంలోనే వకుళమాతను ప్రతిష్ఠించాలి. వకుళమాత విగ్రహాన్ని తిరుపతిలో ప్రతిష్ఠించాలా? అనే వివాదం ఇటీవల కాలంలో తలెత్తింది. తిరుపతిలో ప్రతిష్ఠిస్తే, కుమారుని పాదాల కింద ఏర్పాటు చేసినట్లు అవుతుందన్న వాదన ఉంది. కాబట్టి ఈ వివాదానికి తెరదించాలంటే, వకుళమాత విగ్రహాన్ని ఏడుకొండల స్వామి ఆలయం సన్నిధిలోనే ఏర్పాటు చేయాలి.

Popular Posts