Followers

Saturday, 13 July 2013

మంత్రాలు రెండు రకాలు. 1. దీర్ఘమంత్రాలు, 2. బీజామంత్రం.

మంత్రాలు రెండు రకాలు. 

1. దీర్ఘమంత్రాలు, 2. బీజామంత్రం. 

మనకు తెలిసిన వాటిలో ఎక్కువ భాగం ఓంకారం వంటి హ్రస్వబీజాలు (మంత్రాలు) ఈ మంత్రాలు ఓం, హూం, శ్రీం వంటి మూలశబ్దాలను కలిగి ఉంటాయి. ఈ విధమైన మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది. దీర్ఘమంత్రాలు వేదపాఠాల వలె గాన రూపములో ఉంటాయి. వీట్లో గాయత్రీ మంత్రం ముఖ్యమైనది.

గాయత్రీ మంత్రం మూడు పాదములు కలదెై, ఇరవెై నాలుగు అక్షరాలతో, ఇరవెై నాలుగు చంధస్సులెై, ఇరవెై నాలుగు తత్వాలకు సంకేతంగా భాసిస్తోంది. గాయత్రీ మంత్రంలోని మూడు పాదాలు ఋగ్‌, యజుర్‌, సామవేదాల నుంచి గ్రహించబడి, ‘ఓం’కారంలోని అకార, ఉకార, మకారాలకు ప్రతిరూపమై భాసిస్తున్నాయి. ‘గాయత్రీ’ మంత్ర ద్రష్టం అయిన విశ్వామిత్రుడు మంత్రనుష్ఠాన ప్రభావంవల్లజితేంద్రియుడవడమేకాక, రాజర్షీత్వాన్ని వదలి బ్రహ్మర్షిత్వాన్ని పొందాడు. అంతేకాక, ప్రతి సృష్టి చేయగల సామర్థ్యాన్ని పొందాడు. అందుకే చాలా మంది సంధ్యావందనాది సమయాల్లో గాయత్రీ మంత్రమును జపిస్తుంటారు. గాయత్రీ మంత్రాన్నీ ఎవరు క్రమం తప్పకుండా జపిస్తారో, వారు కోటి జన్మలలో చేసిన పాపాల నుంచి విముక్తులవుతారన్నది వాస్తవం.
హ్రస్వబీజమంత్రం మరింత విస్తారమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. దీర్ఘ మంత్రాలు, వాటి అర్థాలపట్ల మనకుగల అవగాహనలపెై ఆధారపడి ఉంటాయి

Popular Posts