Pages

Sunday, 8 September 2013

వినాయక చవితి. అసలు పత్రి అంటేనే ఆకులు.అయితే ఏ ఆకులు దొరికితే వాటిని కోసుకోస్తాం. ఒక్క వినాయకుడికే ఈ పత్రి పూజ ఎందుకు చేస్తాం? ఏయే ఆకులను పత్రిగా ఉపయోగిస్తారు? వినాయకచవితి రోజున నినాయకుని విగ్రహాన్ని తెచ్చే ముందు గుర్తు పెట్టుకోవలసిన విషయాలను తెలుసుకొందాం.


 వినాయక చవితి. అసలు పత్రి అంటేనే ఆకులు.అయితే ఏ ఆకులు దొరికితే వాటిని కోసుకోస్తాం.  ఒక్క వినాయకుడికే ఈ పత్రి పూజ ఎందుకు చేస్తాం?  ఏయే ఆకులను పత్రిగా ఉపయోగిస్తారు? వినాయకచవితి రోజున నినాయకుని విగ్రహాన్ని తెచ్చే ముందు గుర్తు పెట్టుకోవలసిన విషయాలను తెలుసుకొందాం. 
               ఆకులతో పూజించబడేది మనకు తెలిసి హనుమంతుడు, వినాయకుడు. దీనికి కారణం కోతికి, ఏనుగుకు ఆకులంటే ఇష్టం కాబట్టి. వినాయకునికి 21 అకులేంటి. హనుమంతునికి ఒక్క తమలపాకు ఏంటి అనే వాటికీ శాస్త్రీయంగా, ఆయుర్వేద పరంగా చాలా  కారణాలు ఉన్నాయి అవి నాకూ పూర్తిగా తెలియదు తెలిసిన కొన్ని చివరలో తెల్సుకొందాం 
      
వ్రతకల్పం లో చెప్పిన వాటిలో జాజి, గన్నేరు, దానిమ్మ, తులసి లాంటివి ఇంటిలోనే దొరుకుతాయి. ఇంకా మరువం,దవనం లాంటివి ఎప్పుడు దొరుకుతూనే ఉంటై . ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, జిల్లేడు  లాంటివి ప్రతి ఖాళీ స్తలాలలో పెరుగుతూ ఉంటాయి. బిల్వ దళాలు (మూడు ఆకులు కలసినవి మాత్రమే వాడాలి) శివాలయాల వద్ద విక్రయిస్తారు. మామిడి ఆకులు ఎలాగు ఉంటాయి. రావి చెట్లు కనబడుతూనే ఉంటాయి. మద్ది, జమ్మి కూడా రహదారుల పక్కన సాధించవచ్చు. దేవదారు పత్రం హిమాలయాలలో ఉంటుంది కాబట్టి కష్టం. గరిక గురించి చివరలో చెప్పుకొందాం. మిగిలినవి నేను హైదరాబాద్ మార్కెట్లలో కూడా చూసినట్లు లేదు. కొన్ని నాకూ తెలియవు, కొన్ని తెలిసినా  ఎక్కడ దొరుకుతాయో చెప్పలేను. కాబట్టి మార్కెట్ కి వెళ్లి తెలిసి తెలియనివి, చేయకూడనివి అన్నీ తేవడం కన్నా తెలుసుకోని, దొరికినవి, వ్రతకల్పంలో చెప్పినవి, కొన్నైనా చాలు.  
గరిక : ఇది అన్నిటిలా పత్రీ (ఆకులు) కాదు, ఇది గడ్డి. కాబట్టి దుర్వార పత్రీ అనకూడదు దుర్వార యుగ్మం అనాలి. ఈ గడ్డిని  దుర్వాలు, దర్భలు, కుశలు, రెల్లు  . . . అంటూ  అని  ధర్మసిందు ఈ జాతిని పది రకాలుగా చెప్పింది. వీటిలో ఒకటి దొరకనప్పుడు ఇంకొకటి ప్రత్యామ్నాయంగా వాడచ్చు. ఇది ఒక్కటి మాత్రం మార్కెట్లలో కూడా రకరకాలుగా దొరుకుతుంది. వీటి గొప్పతనాన్ని గురించి అన్ని పురాణాలూ వర్ణించాయి. పవిత్రం (ఈ గడ్డితో చేసే ఉంగరం) ధరించకుండా చేసే ఏ కర్మలకూ (యజ్ఞాలు, పితృ కార్యాలు ) ఫలితం ఉండదని శాస్త్రం చెబుతుంది. ఇక వీటి గొప్పతనం ఎలా వచ్చిందో అనేది వేరే పోస్ట్ లో తెలుసుకొందాం  ఇవి గణపతి ఎంతో ఇష్టమైనవి. ఏ  పత్రీ లేకుండా ఒక్క గరిక తో కూడా గణపతిని పూజించవచ్చు.





  ఇప్పుడు వినాయకుని విగ్రహం గురించి తెల్సుకొందాం. ఆగమం ప్రకారం పూజించే విగ్రహం ఏదైనా లోపల  లొట్ట (Hallow) గా ఉండకూడదు గట్టి (solid) గా ఉండాలి. అలాంటి  విగ్రహాలు పూజకు అనర్హం. ప్రస్తుతం అన్నిచోట్ల వాడే ప్లాస్టర్ అఫ్ పారిస్  విగ్రహాల గురించి నేను మాట్లాడను. విగ్రహం దేనితో చేయాలని ఆలోచిస్తే విగ్రహం చేసే పదార్దం ప్రకృతిలో పుట్టి, ప్రకృతిలో కలిసేట్టుగా ఉండాలి. అంటే రాయి, ఆగమం చెప్పిన లోహాలు రాగి. ...,. గణపతి విషయానికొస్తే 9 రోజుల వ్రతానికి  కాబట్టి నాకు తెలిసి మట్టి, పసుపు పిండి లాంటివి ఉత్తమం.
తర్వాత వినాయకుని ఆకారం. వినాయకుని ఆకారం గణేశ ఉపనిషత్ ఈ విధంగా చెప్పింది 



        గణేశ ఉపనిషత్ ప్రకారం వినాయకుడు ఏనుగు ముఖం ఒక దంతం నాల్గు చేతులు నాల్గు చేతుల్లో వాళ్ళ అమ్మ లాగే పాశాంకుశాలు మిగిలిన రెండు చేతుల్లో విరిగిన రెండో దంతం(రదం), వరద హస్తం ఉంటాయి. అయన ధ్వజం మీద ఉండే ఎలుకే వాహనం. అయన రంగు కూడా వాళ్ళ అమ్మ లాగే ఎరుపు(సర్వారుణా,రక్త వర్ణా )., లావు పొట్ట(లంబోదరం). చేట ల్లాంటి చెవులు(శూర్ప కర్ణకం), వాళ్ళ అమ్మ లాగే ఎర్రటి బట్టలు( అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్కటీతటీ). వాళ్ళ అమ్మ లాగే ఎర్రటి గంధం అన్నా ఎర్రటి పూలన్నా ఇష్టం. పొట్ట, చెవులు మాత్రం వాళ్ళ అమ్మ లాగే కాదు పైన మంత్రం అర్ధం వరుసలో వచ్చింది  అంతే. (సంస్కృతం లో రక్తం అంటే BLOOD కాదు RED. రుధిరం అంటే BLOOD, శూర్పం అంటే చేట ). ఈ ఆకారం తోనే విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా చాల రకాలతో ఉన్న ఇదే ఇందుకు చెప్తారు అంటే   వేద గణపతి : మహాగణపతి వ్యాసం చుడండి