Pages

Monday, 13 January 2014

సంక్రాంతి పండుగ(SANKRANTHI FESTIVAL)



గొబ్బెమ్మలతోనిండుగ
ముందుగవచ్చేపండుగ
భోగిమంటలు,బొమ్మలకొలువుతో
పిల్లలు మెచ్చేపండుగ.

                   భోగిపండుగ.
ముగ్గులువేసేపండుగ
ముచ్చటగొలిపేపండుగ
అంబరమంత సంబరమిచ్చే
మకరసంక్రాంతి పండుగ
                సంక్రాంతిపండుగ
కాంతులు నింపే పండుగ
కార్మిక , కర్షక పండుగ
విందులతొ సందడి చేసే
కమ్మని కనుమపండుగ.
                కనుమ పండుగ.
మూడు పండుగలు ముచ్చటైనవి
తెలుగువారికి ముఖ్యమైనవి
సంప్రదాయాలు చాటుచున్నవి. 
సర్వశుభాలను తెచ్చుచున్నవి.