Pages

Saturday, 1 February 2014

శ్రీమద్భాగవతం రెండవ స్కంధం మూడవ అధ్యాయం



ఈ అధ్యాయాన్ని పారాయణ చేస్తే అనుకున్నవన్ని నెరవేరుతాయి

శ్రీశుక ఉవాచ
ఏవమేతన్నిగదితం పృష్టవాన్యద్భవాన్మమ
నృణాం యన్మ్రియమాణానాం మనుష్యేషు మనీషిణామ్

నీవడిగిన దాన్ని చెప్పాను. మ్రియమాణానాం మనుష్యేషు మనీషిణామ్ -చనిపోయే వారిలో బుద్ధిమంతులైన మనుషులు దేన్ని పొందాలో దాన్ని పొందాను.

బ్రహ్మవర్చసకామస్తు యజేత బ్రహ్మణః పతిమ్
ఇన్ద్రమిన్ద్రియకామస్తు ప్రజాకామః ప్రజాపతీన్

బ్రహ్మ వర్చస్సు - బ్రహ్మ గారిని
ఇంద్రియబలం కావలనుకునే వారు - ఇంద్రున్ని
సంతానానికి - ప్రజాపతిని

దేవీం మాయాం తు శ్రీకామస్తేజస్కామో విభావసుమ్
వసుకామో వసూన్రుద్రాన్వీర్యకామోऽథ వీర్యవాన్

సంపద - మాయా దేవి
తేజస్సు - అగ్ని ని
వసువు కావాలంటే - వసువున్
వీర్యం - రుద్రులను

అన్నాద్యకామస్త్వదితిం స్వర్గకామోऽదితేః సుతాన్
విశ్వాన్దేవాన్రాజ్యకామః సాధ్యాన్సంసాధకో విశామ్

అన్నము పశువులు - అథితి
స్వర్గం - ఆదిత్యులను
రాజ్యం - విశ్వేదేవతలను
కర్మలు సాధించాలి - సాధ్యులను

ఆయుష్కామోऽశ్వినౌ దేవౌ పుష్టికామ ఇలాం యజేత్
ప్రతిష్ఠాకామః పురుషో రోదసీ లోకమాతరౌ

ఆయుష్షు - అశ్విని దేవతలు
బలం - భూమి
ప్రతిష్ట - రోదసి (వీరే భూలోకమునకు ద్విలోకమునకు తల్లులు)

రూపాభికామో గన్ధర్వాన్స్త్రీకామోऽప్సర ఉర్వశీమ్
ఆధిపత్యకామః సర్వేషాం యజేత పరమేష్ఠినమ్

సౌందర్యం - గంధర్వులను
అందమైన భార్య - ఊర్వశి
ఆధిపత్యం - బ్రహ్మను

యజ్ఞం యజేద్యశస్కామః కోశకామః ప్రచేతసమ్
విద్యాకామస్తు గిరిశం దామ్పత్యార్థ ఉమాం సతీమ్

కీర్తి - యజ్ఞ్యం
ధనం - వరుణున్ని
విద్య - శంకరుడు
దాంపత్యం - పార్వతీ దేవినీ

ధర్మార్థ ఉత్తమశ్లోకం తన్తుః తన్వన్పిత్న్యజేత్
రక్షాకామః పుణ్యజనానోజస్కామో మరుద్గణాన్

ధర్మార్థములు కావాలంటే - స్వామిని సేవించాలి
సంతానానికి - పితృదేవతలనూ
రక్ష - రాక్షసులని (రక్షించే వారిని రాక్షసులంటారు)
ఓజస్సును కోరేవాళ్ళు - మరుత్తుని
రాజ్యం - మరుత్ గణాలు

రాజ్యకామో మనూన్దేవాన్నిరృతిం త్వభిచరన్యజేత్
కామకామో యజేత్సోమమకామః పురుషం పరమ్

శత్రు నాశం - నిరుతి
కామం - చంద్రున్ని
ఏ కోరికలూ లేని వారు -- పరమాత్మని ఆరాధించాలి


అకామః సర్వకామో వా మోక్షకామ ఉదారధీః
తీవ్రేణ భక్తియోగేన యజేత పురుషం పరమ్

ఏ కోరికలూ లేని వారూ, అన్ని కోరికలూ కలవారూ, మోక్షాన్ని కోరేవారు తీవ్రమైన భక్తి యోగంతో పరమాత్మను ఆరాధించాలి.

ఏతావానేవ యజతామిహ నిఃశ్రేయసోదయః
భగవత్యచలో భావో యద్భాగవతసఙ్గతః

ఆరాధించే వారికి కలిగే శ్రేయసు ఇది. పరమాత్మని ఆరాధించే వారికి నిశ్శ్రేయసు కలుగుతుంది. మళ్ళి యేమీ కోరని స్థితిని ని:శ్రేయసం అంటారు
పరమాత్మ యందు నిశ్చలమైన భక్తి కలగడమే ని:శ్రేయసం. అది భగవంతుని భక్తుల సహవాసం వలన ఏర్పడుతుంది.

జ్ఞానం యదాప్రతినివృత్తగుణోర్మిచక్రమ్
ఆత్మప్రసాద ఉత యత్ర గుణేష్వసఙ్గః
కైవల్యసమ్మతపథస్త్వథ భక్తియోగః
కో నిర్వృతో హరికథాసు రతిం న కుర్యాత్

మనం జ్ఞ్యానాన్ని పొందాలి, అది ఎలాంటిదంటే, అన్ని గుణాలు (సత్వ రజ తమ), అన్ని ఊర్ములు (ఊర్ములంటే తరంగాలు - ఆకలి దప్పులు శొక మోహములు జన్మ మరణములు ) తొలగిపోవాలి. ఇది ఆత్మ ప్రసాదంతో (మనసు యొక్క ప్రసన్నతతో) వస్తుంది. దాని వల్ల గుణ సంగం ఉండదు. ఇదే మనకు పరమాత్మని చేరడానికి జ్ఞ్యానులు ఒప్పుకున్న మార్గం. ఇదే భక్తి యోగం. సంసారం యందు విరక్తిని కలిగినవాడు, నిర్వృతిని పొందినవాడు ఎవడు పరమాత్మ యందు భక్తిని కోరుకోడు?

శౌనక ఉవాచ
ఇత్యభివ్యాహృతం రాజా నిశమ్య భరతర్షభః
కిమన్యత్పృష్టవాన్భూయో వైయాసకిమృషిం కవిమ్

ఇలా శుకయోగీంద్రుని మాటలు విన్న పరీక్షిత్తు ఇంకేం అడగలేదా?

ఏతచ్ఛుశ్రూషతాం విద్వన్సూత నోऽర్హసి భాషితుమ్
కథా హరికథోదర్కాః సతాం స్యుః సదసి ధ్రువమ్

వినగోరుచున్న మాకు ఈ విషయం చెప్పాలి
ఎందుకంటే సత్పురుషుల సభలో పరమాత్మ కథలను వర్ణించే కథలే ఉంటాయి

స వై భాగవతో రాజా పాణ్డవేయో మహారథః
బాలక్రీడనకైః క్రీడన్కృష్ణక్రీడాం య ఆదదే

పాణ్డవేయుడు మహారథుడు అయిన పరీక్షిత్తు మహాభక్తుడు. బాల్యక్రీడలోనే కృష్ణలీలను ఆడుకున్నాడు.

వైయాసకిశ్చ భగవాన్వాసుదేవపరాయణః
ఉరుగాయగుణోదారాః సతాం స్యుర్హి సమాగమే

 శుకుడు సర్వదా సర్వామనా వాసుదేవునితో ఉండేవాడే. అటువంటి వారి సభలో పరమాత్మ కథలు గాక ఇంకేం ఉంటాయి

ఆయుర్హరతి వై పుంసాముద్యన్నస్తం చ యన్నసౌ
తస్యర్తే యత్క్షణో నీత ఉత్తమశ్లోకవార్తయా

ప్రతీ సూర్యాస్తమయానికి ఆయువు తగ్గుతూనే ఉంటుంది. ఆ తరిగిపోయే దానికి పరమాత్మ కథలను జోడిస్తే సద్వినియోగమవుతుంది.
పరమాత్మ వార్తలేకుండా గడిపిన ఒక్క క్షణమైన వ్యర్థమే కదా. ఆయన కథలను వినే ఒక్క క్షణమైన సార్ధకం

తరవః కిం న జీవన్తి భస్త్రాః కిం న శ్వసన్త్యుత
న ఖాదన్తి న మేహన్తి కిం గ్రామే పశవోऽపరే

చెట్లు బ్రతకట్లేదా? తోలుతిత్తులు కూడా గాలి తీసి వదులుతూ ఉంటాయి. పశువులు తినట్లేదా, సంసారాన్ని పొందట్లేదా (మేహన్తి ). క్షీణించి మళ్ళీ వచ్చే దేహంలేకుండా చేస్కుంటేనే మనిషి.

శ్వవిడ్వరాహోష్ట్రఖరైః సంస్తుతః పురుషః పశుః
న యత్కర్ణపథోపేతో జాతు నామ గదాగ్రజః

కుక్క లాగా, పంది లాగా, పురుగులాగ, ఒంటెలాగా, గాడిదలాగా ఉంటే వాటికన్న గొప్ప అని ఎలా అనిపించుకుంటారు.
ఎవడి చెవిలో పుట్టినప్పటినుంచి మరణించే వరకూ ఒక్క సారి కూడా పరమాత్మ కథలు పడవో వాడికీ పశువుకీ తేడా లేదు.

బిలే బతోరుక్రమవిక్రమాన్యే న శృణ్వతః కర్ణపుటే నరస్య
జిహ్వాసతీ దార్దురికేవ సూత న చోపగాయత్యురుగాయగాథాః

పరమాత్మ కథలు వినని చెవులు రంధ్రములు మాత్రమే. ఆయన కథలు గానం చేయని నాలుక కప్ప నాలుక.

భారః పరం పట్టకిరీటజుష్టమప్యుత్తమాఙ్గం న నమేన్ముకున్దమ్
శావౌ కరౌ నో కురుతే సపర్యాం హరేర్లసత్కాఞ్చనకఙ్కణౌ వా

ఎవరి శిరస్సు పరమాత్మకి వంగి నమస్కరించదో ఆ శిరసుకి ఉన్న కిరీటం కట్టెల మోపులాగ భరమైనది. వజ్రాలు తొడగబడిన చేతులైనా ఆయనకు సపర్యలు, ఆరధన చేయని చేతులు శవానికి ఉన్న చేతులు లాంటివి .

బర్హాయితే తే నయనే నరాణాం లిఙ్గాని విష్ణోర్న నిరీక్షతో యే
పాదౌ నృణాం తౌ ద్రుమజన్మభాజౌ క్షేత్రాణి నానువ్రజతో హరేర్యౌ

ఆయన చిహ్నాలను అలంకారాలను చూడని కన్నులు నెమలి కన్నులు లాంటివి (పించాలు అలంకారానికి మాత్రమే పనికొస్తాయి). ఆయన దివ్య క్షేత్రాలకు వెళ్ళని కాళ్ళు చెట్లు కొమ్మలు లాంటివి.

జీవఞ్ఛవో భాగవతాఙ్ఘ్రిరేణుం న జాతు మర్త్యోऽభిలభేత యస్తు
శ్రీవిష్ణుపద్యా మనుజస్తులస్యాః శ్వసఞ్ఛవో యస్తు న వేద గన్ధమ్

పరమ భాగవతోత్తముని పాద ధూళి కోరని వాడు జీవచ్చవము. పరమాత్మ పాదములలో ఉన్న తులసి వాసన చూడని వాడు శ్వాస తీసుకుంటున్న శవము.

తదశ్మసారం హృదయం బతేదం యద్గృహ్యమాణైర్హరినామధేయైః
న విక్రియేతాథ యదా వికారో నేత్రే జలం గాత్రరుహేషు హర్షః

పరమాత్మ కథలు వింటూ కూడా హృదయంలో పులకింత కదలిక కలగకుంటే ఆ హృదయం రాతి బండ. కళ్ళవెంబడి ఆనంద బాష్పాలు, శరీరం మీద పులకింతలూ రావాలి హృదయమంతా పరిపక్వానికి వచ్చి కరిగిపోవాలి.

అథాభిధేహ్యఙ్గ మనోऽనుకూలం ప్రభాషసే భాగవతప్రధానః
యదాహ వైయాసకిరాత్మవిద్యా విశారదో నృపతిం సాధు పృష్టః

పరీక్షిత్తు శుకయోగీంద్రుడు కలిస్తే పరమాత్మ కథలు ఉంటాయి. అవి ఏమిటో చెప్పవలసింది. నీవు మనసుకు అనుకూలమైన దాన్ని చెప్తున్నావు. పరెక్షిత్తు ఉత్తమభాగవతుడు. ఆత్మవిద్యా విశారదుడైన శుకయోగీంద్రుడు పరీక్షిత్తుతో ఏమి చెప్పాడు. పరీక్షిత్తు బాగుగా ఏమి అడిగాడు.

                                          సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు