Pages

Saturday, 8 August 2015

విశ్వరూపసందర్శనయోగః 4 (అథ ఏకాదశోధ్యాయః, భగవద్గీత)-శ్రీ భగవద్గీత

యథా నదీనాం బహవోంబువేగా
స్సముద్ర మేవాభిముఖా ద్రవంతి
తథా తవామీ నరలోకవీరా
విశంతివక్త్రాణ్యభివిజ్వలంతి‌.


ఏ ప్రకారము అనేక నదీప్రవాహములు సముద్రాభిముఖములై ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నవో, ఆ ప్రకారమే ఈ మనుష్యలోకమందలి వీరులు (రాజులు) లెస్సగ జ్వలించుచున్న మీ నోళ్ళయందు ప్రవేశించుచున్నారు.

******************************************************************************************* 28

యథా ప్రదీప్తం జ్వలనం పతజ్గా
విశంతి నాశాయ సమృద్ధవేగాః,
తథైవ నాశాయ విశంతిలోకా
స్తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః‌.


ఏ ప్రకారముగ మిడతలు వినాశము కొరకు మిక్కిలి వేగముతో గూడినవై బాగుగ మండుచున్న అగ్నియందు ప్రవేశించుచున్నవో, ఆ ప్రకారమే జనులున్ను మిగుల వేగముతో గూడినవారై నాశము కొరకు మీ నోళ్ళయందు ప్రవేశించుచున్నారు.

******************************************************************************************* 29

లేలిహ్యసే గ్రసమాన స్సమంతా
ల్లోకాన్‌ సమగ్రాన్‌ వదనైర్జ్వలబ్ధిః
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపంతివిష్ణో.


ఓ కృష్ణమూర్తీ! మండుచున్న మీయొక్క నోళ్ళచే జనులందరిని అంతటను మ్రింగుచున్నవారై ఆస్వాదించుచున్నారు. మీయొక్క భయంకరములైన కాంతులు తమ తేజస్సులచేత జగత్తునంతను వ్యాపించి మిగుల తపింపజేయుచున్నవి.

*******************************************************************************************  30

ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమోస్తు తే దేవవర ప్రసీద,
విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్‌.


దేవోత్తమా! భయంకరాకారముగల మీరెవరో నాకు చెప్పుడు. ఏలయనగా మీ ప్రవృత్తిని ఎరుంగకున్నాను. కనుక ఆదిపురుషులగు మిమ్ముగూర్చి తెలిసికొనగోరుచున్నాను. మీకు నమస్కారము నన్ననుగ్రహింపుడు.

******************************************************************************************* 31

శ్రీ భగవానువాచ:-

కాలోస్మిలోకక్షయ కృత్ప్రవృద్ధో
లోకాన్‌ సమాహర్తుమిహ ప్రవృత్తః‌,
ఋతేపి త్వా న భవిష్యంతి సర్వే
యే వస్థితాః ప్రత్యనీకేషుయోధాః‌‌.


శ్రీ భగవంతుడు చెప్పెను - (ఓ అర్జునా) (నేను) లోకసంహారకుడనై విజృంభించినకాలుడను అయియున్నాను. ప్రాణులను సంహరించు నిమిత్త మీ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. ప్రతిపక్ష సైన్యములందు గల వీరులు నీవు లేకపోయినను, యుద్ధము చేయకున్నను జీవించియుండరు (మృతినొందక తప్పరు).

*******************************************************************************************  32

తస్మాత్త్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్‌ భుజ్క్ష్వ రాజ్యం సమృద్ధమ్‌,
మయైవైతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్‌.


కాబట్టి నీవు లెమ్ము. శత్రువులను జయించి కీర్తిని బడయుము. పరిపూర్ణమగు (నిష్కంటకమైన) రాజ్యమును అనుభవింపుము. వీరందరును ఇదివరకే నాచేతనే చంపబడిరి. కావున ఓ అర్జునా! నీవు నిమిత్త మాత్రముగ నుండుము.

*******************************************************************************************  33

ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్‌
మయా హతాంస్త్వం జహి మా వ్యధిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్‌.


నాచేత (ఇదివరకే చంపబడిన ద్రోణాచార్యుని, భీష్మాచార్యుని, జయద్రథుని, కర్ణుని అట్లే ఇతర యుద్ధవీరులను గూడ నీవు చంపుము. భయపడకుము. యుద్ధము చేయుము. శత్రువులను గెలువగలవు.

*******************************************************************************************  34

సంజయ ఉవాచ:-

ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య
కృతాఞ్జలిర్వేపమానః కిరీటీ,
నమస్కృత్వా భూయ ఏవాహకృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య.


సంజయుడు చెప్పెను - అర్జునుడు శ్రీకృష్ణ మూర్తి యొక్క ఈ వాక్యములను విని వణకుచున్నవాడై చేతులు జోడించుకొని శ్రీకృష్ణునకు నమస్కరించి మిగుల భయపడినవాడగుచు వినమ్రుడై గద్గదస్వరముతో నిట్లు పలికెను.

*******************************************************************************************  35

అర్జున ఉవాచ :-

స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా
జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ,
రక్షాంసి భీతాని దిశో ద్రవంతి
సర్వే నమస్యంతి చ సిద్ధసజ్ఘాః


అర్జునుడు చెప్పెను - ఓ కృష్ణా! మీయొక్క నామము నుచ్చరించుటచేతను, మాహాత్మ్యమును లెస్సగా కొనియాడుటచేతను లోకము మిగుల సంతోషించుచున్నది. మిక్కిలి ప్రీతిబొందుచున్నది. (నిన్ను జూచి) రాక్షసులు భయపడినవారై దిగంతములకు పరుగిడుచున్నారు. సిద్ధుల సమూహములన్నియు మీకు నమస్కరించుచున్నవి. ఇవియన్నియు మీ మహిమకు తగియేయున్నవి.

*******************************************************************************************  36