కార్తీక మాసములో కావేరి, నదిలో గాని, గంగా నదిలో గాని, అఖండ గౌతమీ నదిలో గాని స్నాన మాచరించి ముందు చెప్పిన విధముగా నిష్టతో ఆచరించిన వారు యిహమందు సర్వసుఖములను అనుభ వించుటయేగాక, జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసములకన్నా కార్తీక మాసము వుత్త మెత్త మ మైనది. అధికఫలదాయక యైనది. హరి హరాదులకు ప్రితికర మైనది. కనుక కార్తీక మాసవ్రతము వలన జన్మజన్మలను౦డి వారలకున్న సకలపాపములు హరించి, మరుజన్మ లేక, వైకుంఠ మందగలరు. పుణ్యాత్ములకు మాత్రమే యీ వ్రత మాచరించ వలెన నెది కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యేవగింపు అసహ్యము కలుగును. కాన, ప్రతిమానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి యిటువంటి పుణ్యకాలమును చెతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెలరోజులు చేయలేని వారలు కార్తీక శుద్ద పౌర్ణ మినాడు అయినను తమ శక్తీ కొలది వ్రత మాచరించి పురాణ శ్రవణము చేసి, జాగరణము వుండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజన మిడినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు, చేసిన చొ యెప్పటి కినీ తరగని పుణ్యము లభించును. ఈ నెలరోజులు ధనవంతుడైన ను బీదవాడైన ను మరెవ్వరైన ను సరే సదా హరి నామస్మరణ చేయుచు, పురాణములు వింటూ, పుణ్యతీర్ధ ములను సేవిస్తూ, దాన ధర్మములు చేయుచున్న యెడల వారికి పుణ్యలోక మబ్బును. ఈ కథ ను చదివిన వారికి ని శ్రీ మన్నారాయుణుడు సక లైశ్వర్యములు యిచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగ చేయును.
ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మాహత్య మందలి
త్రింశో ధ్యాయము - ముప్పదవ అఖిరి రోజు పారాయణము సమాప్తము
ఓం సర్వేషాం స్వస్తి ర్భ వతు ఓం సర్వేషాం శాంతి ర్భ వతు
ఓం సర్వేషాం పూర్ణ౦ భవతు ఓం శ్శాంతి శ్శాంతి::||