మానవునికి రంగు రంగుల దుస్తుల మీద మక్కువ ఎక్కువ కాని ఆ అయ్యప్ప ధీక్ష లొ ఉన్న భక్తులకి దుస్తుల రంగుల పై మమకారం ఉండకూడదని చేప్పే అంధవిహీనమైన నల్లని దుస్తులు ధరిస్తారు. ఈ నల్లని దుస్తులు మనకి ఏన్నో విషయాల ను చెబుతాయి.
భక్తులు మాలను శీతాకాలంలొ ధరిస్తారు కావూన నల్లని దుస్తులు ధరించటం వలన సూర్యరశ్మీని గ్రహించి శరీరానికి చలి నుండి కపాడుతుంది.
అంతేకాక నలుపు శని దేవునికి ఇష్టమైన రంగు ఈ రంగు ధరించటం వలన శని దేవుడు శాంతిస్తాడు అని, శని భాధలు తొలుగుతాయని అంటారు.
అంతేకాక శబరిమల యాత్రలొ అడవుల గుండా రాత్రి వేళ లొ ప్రయాణం చేసేటప్పుడు జంతువుల భారిన పడకుండ నల్లని దుస్తులు (చీకటిలొ కలిసిపోవడం) కాపాడతాయి. -