Followers

Tuesday, 17 December 2013

మణి ద్వీప వర్ణన (15 వ భాగము )



ఓం శ్రీ గణేశాయ నమః ,
ఓం శ్రీ గురుభ్యో నమః 
ఓం శ్రీ పరామ్బికాయై నమః 

అపారమైన పరమ జ్యోతి అమ్మ భువనేశ్వరీ తమ మధుర మైన వాక్కు తో పలుకాగానే ,వీణా నాదాన్ని సహితము వెల-వెల పోయింది ది . ఆమె పలుకులు వీణా నాదము కన్న మిన్నగా ఉన్నయ్యి . ఆమెకు ఎందఱో సఖులు , దాసీలు .దేవతాస్త్రీలు . అఖిల దేవతలా వృoదము ఆమెను చుట్టూ ముట్టి ఉన్నారు , అందరు ఆమె ఆఘ్య కొరకు వేచి ఉన్నారు . ఆ తల్లి ఇచ్చా శక్తి , ఘ్యాన శక్తి ,క్రియా శక్తి చే సంపాన్నురాలు . లజ్జ , తుష్టి,పుష్టి , కీర్తి , కాంతి ,కీర్తి , క్షమా దయా , బుద్ధి మేధా ,, ఇవన్ని మూర్తిభవించి , అందరు అమ్మచెంత చేరాఋ . .

జయా , విజయా, అజితా , అపరాజితా , నిత్యా , విలాసిని,దోగ్ధ్రీ అఘోరా,అమంగాలా ఇవి తొమ్మిది శక్తులు ,భగవతి పరామ్బిక సేవ లో . తత్పరులైయ్యి ఉంటారు . శంఖ నిధి ,పద్మ నిధీ భగవతి కి పార్శ్వ భాగాన ఉన్నారు . పద్మ నిధి

నవరత్న వహా, కాంచనసహత్ర ,సప్త దాతువహా , సంఘ్యక్,నదులు , ఈ ధాతువులనుండి ప్రవహిస్తాయి . ఇవన్ని వెళ్లి సుదాసగారములో కలుస్తాయి . ఈ విధముగా సమస్త శక్తులు కలిగి ఉన్నట్టి భువనేశ్వరీ దేవి , భువనేశ్వరుని తో కూడి ఉన్నది .” సర్వేశుడు “ అన్న బిరుదు భువనేశునికి అమ్మ వలన నే వచ్చిన ది . వ్యాసులవారు చెపుతున్నారు , రాజా ,

ఇప్పుడు ఈ చిoతామణి గృహ ము యొక్క పరిమాణము గూర్చి విను .
“ఇది ఓక వేయి యోజనాలు తో అతి పెద్దగా ఉన్న విశాలమైన భవనము . వేయి యోజనాల పొడవు , వేయి యోజనాల వెడల్పుతో ఉంది . దీనికి ఉత్తరాన అనేకమగు సుదీర్ఘముగా ఉన్న ప్రాకారాలు ఉన్నయి . పూర్వ ప్రాకారానికన్న ఉత్తర ప్రాకారములు రెండoతలుగా ఉన్నాయి . అని చెప్ప బడింది .

దేవి భగవతి మణి ద్వీపము భూమి పైన లేదు , అంతరిక్షములో ఉన్నది . ప్రళయములో ,దీనికి వినాశము లేదు . ఇది సృష్టికి ముందు కూడా ఉన్నది . కాని ఇందులో కార్యానుకూలముగా సంకోచాలు , వికాసాలు జరుగుతుంటాయి .

ఇందులులో భగవతి మహామాయ నివసిస్తుంది . ఇక్కడికి సమస్త లోకాలనుండి అమ్మ భక్తులు వస్తుంటారు . ఇక్కడికి వచ్చిన భక్తులు అమ్మను గూర్చి తపస్సును చేసుకుంటూ తమ ప్రాణాలు వదులుతారు .
అందరు వెళ్లి మహోత్సవా దగ్గరికి చేరి పోతారు .

అక్కడ ఘ్రుత కుల్యా ,దుఘ్ద కుల్యా, దధీ కుల్యా , మధస్త్రవా ,అమృత వహా ,,ద్రాక్షారసవహా , జమ్బురసవహా , ఆమ్రేక్షు రసవహా . ఈ నదులు ప్రవహిస్తుంటాయి . మనోరథ ఫలాలు ఇచ్చేటి , వృక్షాలు , బావులు , సరస్సులు , అందరు ,యథేష్టముగా సేవిచు కొరకు , అన్ని దొరకుతాయి . మణి ద్వీపములో ఎవరు రోగాల బాధలు తో ఉండరు . వృద్దాప్యము లు ఉండవు , ఈ దివ్యమగు క్షేత్రము లో , కామక్రొధములుoడవు .అక్కడ నివసించే ప్రతి ఒక్కరు యువావస్తలోనే ఉంటారు . స్త్రీ యుక్తముగా కోటి సూర్య తేజముతో ప్రకాశిస్తుంటారు . ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరు దేవిని ఉపాసిస్తారు . 7 కోట్ల మహామంత్రాలు దేవిని ఆరాధిస్తుంటారు . కారణ బ్రహ్మ స్వరూపిణి . శివా . మాయాబలము చే సబల విగ్రహాన్ని సృష్టించింది . మహావిద్యలు , సతతము ఆమెను సేవిస్తాయి .

వ్యాసులు చెపుతున్నారు రాజ ఈ మణి ద్వీపాన్ని ఎవరు వర్ణించలేరు , ఒక్కోసారి చిన్న పెసరు గింజ అంత ప్రకాశము కనబడితే మరో పక్క సూర్యడిలా తేజం కనపడుతుంటుంది , ఒక్కో సారి , మరకత మణి లా ప్రాకాశాన్ని వెదజల్లుతుంటుంది ఒక్కో సారి విద్యుత్తూ లా కన పడితే , ఒక్కో సారి మధ్యాన్హ తేజము ప్రకాశమానముగా కోటి సూర్య కాంతులు కనపడతాయి . ఒక్కో చోట సిందూర్ వర్ణ కాంతి కనపడితే వెంటనే రక్తవర్ణ మెరుపు కనపడుతుంది , నీలమణి
కాంతులు వెదజల్లుతుంటుంది , కొన్ని చోట్ల దావానల కాంతి పుంజాలు కనపడతాయి . ఇవన్ని వన్నెలు కలిగిన కాంతులతో ఎల్లప్పుడూ దేదివ్యా మానముగా ప్రకాశించే అమృతమయ కాంతుల లోకమే ఈ మణి ద్వీపము .

వర్ణించలేని కాంతులచే నిర్మితమైన గోపురాలు , ప్రాకారాలు ,భవనాలు, మందిరాలు ,వృక్షాలు , నేమిల్లు కోకిలలు అన్ని జాతుల పక్షులు , అన్ని ఆత్మా స్వరూప ప్రకాశాన్నిపూనీ వెలుగొందే ఈ లోకమే మణి ద్వీపము ప్రపంచ లో ఉన్నట్టి అన్ని ఆనందాలు ఇక్కడ లభ్యము అవుతాయి . మధుర సుగందితంయ్యి ఉన్నట్టి ఈ లోకము రంగురంగు ల ఎండ లచే చల్లని కాంతి యుతముగా ఉన్నది , దర్పణ రూపములో ప్రకాశిస్తూ , ఒక్కో సారి జాలము లా ప్రకాశిస్తున్నది . రాజు కు కలిగేటి ఆనందమును మొదలుకొని , బ్రహ్మ పర్యంతము పొంద గలిగే ఆననదము ఇక్కడ లభిస్తుంది .

మహాదేవి పరమ దాము అయినట్టి ఈ పురిని స్మరిచిన , సమస్త పాపాలు హరించి పోగలవు . చివరి సమయమందు దీనిని స్మరిo చిన మణిపురి నివాసమే తథ్యము ,”దేవి భాగవతము లో 8వ అధ్యాయమును మొదలుకొని 12 ఆదాయము పర్యంతము “అధ్యాయ పంచకము అని చెప్పబడింది . దీనిని నిత్యమూ పతించిన చొ భూత ప్రేత పిశాచ బాధలు తొలగి , పోతాయి వాస్తు , గ్రహ శాంతి చేయ దళిచినప్పుడు ప్రయత్నా పూరవకముగా ఈ అధ్యా యాలను చదివిన యెడల శుభములు చేకూరుతాయి.
ఓం శ్రీ మాత్రె నమః

“సర్వం శ్రీ లలితార్పనమస్తూ “

అమ్మ త్రిపుర సుందరీ ! తల్లీ !నాకు ఇంతటి భాగ్యమును ప్రసాదించి నీకు శతకోటి ప్రణామాలు

. అందరికి శుభాలు కలిగించి , “ ఆత్మ సత్యము అన్న తలంపును కలిగించి” స న్ మార్గాన నడిపించు . పరస్పర ప్రేమాభిమానాలు మాయందు ఉదయింప చేసి , ,మంచి మార్గాన నడిపించు . అందరి కష్టార్జిత సంపదలను కాపాడు ,పరివా ర ఆనదములు అందరికి లభించి , సుఖ్ సంతోషాలు కలిగి అందరిని సుభిక్షముగా ఉంచు తల్లీ !అందరికి ,మంచి విఘ్యాన తృష్ణ కలిగించు ,

“నీకు జయము, జయము తల్లీ !” ఓం శాంతి , శాంతి శాంతిహి

tranlated by shakunthala bhat

Popular Posts