మణి ద్వీప వర్ణన -(part 5)
om sree gurubhyo namaha ,om mahaa ganaadhipataye namahaom parabrahma sameta paaraambikayai namaha
వ్యాసులవారు చెప్పుతున్నారు , రాజా !పుష్పరాగ ప్రాకారము తరువాత ,కుంకుమ రంగు వర్ణము గల పద్మరాగమణి ,ప్రాకారము ఉంది . ఇక్కడి మధ్య భూమి సహితము ఇదే వర్ణము కలిగి ఉంది . పది , యోజనాలు పొడవు , అనేకమగు గోపురాలు ,వందల కొద్ది పద్మరాగ మణిమయ స్తంభాలు మధ్య గా అనేకమగు ఆయుధాలు చేత బట్టుకొని ,వీరుల వలే 64 కళలు ఇక్కడ నివసిస్తారు , వీరికి వేరు వేరు లోకాలు ఉన్నాయి . తమ తమ లోకాలకు అధీశ్వరిణులు . తమ తమ వాహనాల పైన కూర్చున్నట్టి ఈ కళలు ఏంతో , శోభను కలిగి ఉన్నాయి . ఇవి -
పింగలాక్షి ,విశాలాక్షి , సమృద్ధి , బుద్ధి , శ్రద్ధ ,స్వధా , అభిఖ్యా , మాయా , సంఘ్యా ,వసుంధర త్రిలోకదాత్రీ ,
సావిత్రి, గాయిత్రి ,త్రిదశేశ్వరి ,సురూపా , బహురూపా , స్కన్దమాతా ,అచ్యుత ప్రియా , విమలా ,అమలా , అరుణీ ,ఆరుణీ , ప్రక్రుతి , వికృతి , సృష్టి , స్థితి , సంహృతి , మాతా ,సంధ్యా , పరమ సాధ్వీ ,హంసీ ,మర్దికా , వజ్రికా, దేవమాతా,భగవతీ ,దేవకీ,కమలాసనా,త్రిముఖీ , సప్తముఖీ , సురాసుర విమర్దిని , లంబోష్టి ,ఊర్ధ్వ కేశీ , బహుశీర్షా వృ కోదరీ ,రథ రేఖా , శశిరేఖా , గగన వేగా , పవనవేగా , భువనపాలా , మదనాతురా , అనంగా , అనంగ మథనా , అనంగ మేఖలా , అనంగ కుసుమ , విశ్వరూపా, సురాదికా ,క్షయంకరీ ,శక్తి అక్షోభ్య సత్య వాదిని , బహురూపా, శుచివ్రతా ఉదారా , మరియు వాగీశ్వరీ ,
ఈ కళ లన్ని, తమ ముఖమునుండి అగ్నిని ప్రజ్వలిస్తుంటాయి . మేము నీరు మొత్తముగా త్రాగేస్తాము అంటున్నాయి . ,అగ్ని మా ముందు నిలువలేడు ,వ్యువును మేము ఆపగాలము , ఈ కలలన్ని ఎప్పుడు కోపముతో ఉంటాయి . ఒక్కకొక్క శక్తికి లక్షలకొద్దీ బ్రహ్మాన్దాలను సంహరించా గలిగే శక్తి వీరికి ఉన్నది ,అన్ని రకాల ఆయుధాలతో వీరు ఉన్నారు వీరికి వంద వంద అక్షౌహిని సేనలు ఉన్నాయి . సశేషము …
om sree maatre namaha