Followers

Friday, 13 June 2014

భూదానం, సువర్ణదానం అన్నదానం. వీటిలో ఏది గొప్పది ?



 భూదానం, సువర్ణదానం అన్నదానం. వీటిలో ఏది గొప్పది అంటే చాలామంది ఘంటాపదంగా చెప్పేది ఒకేఒక్క దానం. అన్నదానం. కాని నూటికి 90మంది చెప్పేవారే గాని చేయరు. మన సంప్రదాయాల కోసం లోకం గాలిస్తానంటారు. కాని ఇది మన సంప్రదాయం అంటే మాత్రం ఆ నిజాన్ని జీర్ణించుకోలేరు.

దానలన్నిటిలో కెల్లా గోప్పదానం భూదానం. దీనివల్ల తరతరాలను తరింపజేస్తుంది. ఏలోటు ఉండదు. ఎందుకంటే భూమిలో సువర్ణం,(బంగారం), భీజం(ఆహారం), నీరు, నిప్పు, పెట్రోలియం. ఇలా మనవ వనరులు మొత్తానికి ఆధారం భూమి మాత్రమే. చివరికి   చస్తే పాతిపెట్టాల్సింది ఈభుమిలోనే. 

 సువర్ణదానం : ఇది ఆయుష్షుని పెంచుతుంది. దీర్గాయువు ఇస్తుంది. రేపో మాపో చనిపోయేవారు పేరు   మీద సువర్ణం దానం ఇస్తే ఆరోగ్యం మెరుగుపడి ఆయుష్షు పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది.

అన్నదానం : ఇది మనకి ఆహారం, వస్త్రం కొరతరాకుండా చేస్తుందని శాస్త్రం.

లింగాభిషేకములో పరమార్ధం & శివ షడక్షరీ స్తుతి



లింగాభిషేకములో పరమార్ధం

శివలింగం :-

నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్య విషయాలను తెలియజెప్పే తత్వస్వరూపమే "లింగం"

లింగాభిషేకములో పరమార్ధం :-

పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం - భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనాలతో దైవాభిషేకం చేయాలి. జలధారాపాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.

శివ షడక్షరీ స్తుతి(Shiva Shadakshari Stuti)

శ్రీ మేధా దక్షిణామూర్తి రూపాయ పరమాత్మనే నమ:

శివాయ వేద్యాయ నాథాయ గురవే నమ:

ఓం కారం తు పరం బ్రహ్మ సర్వమోంకార సంభవమ్

అకారోకారమంతాయ ఓంకారాయ నమో నమ:

న నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర

నమస్తే వృషభారుఢ నకారయ నమో నమ:

మ: మహాదేవం మహాత్మానం మహా పాతక నాశనం

మహా నటవరం వందే మకారాయ నమో నమ:

షి శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారకమ్

శివమేకపదం దేవం శికారాయ నమో నమ:

వా వాహనం వృషభో యస్య వాసుకి: కంఠభూషణమ్

వామే శక్తిధరం దేవం వాకారాయ నమో నమ:

య యత్ర యత్ర స్థితో దేవ: సర్వవ్యాపీ మహేశ్వర:

యల్లింగం పూజయేన్నిత్యం యకరాయ నమో నమ:

ఓం ఓంకారామంత్ర సంయుక్త నిత్యం ధ్యాయంతి యోగిన:

కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ:

మహాదేవ: పరో మంత్ర: మహాదేవం: పరం తప:

మహాదేవ: పరా విద్యా మహాదేవ: పరా గతి:

ఓం నమ: శివాయేతి చ షడ్లింగాయ నమో నమ:

మోక్షకామ్య ప్రదాత్రే చ విశ్వరూపాయ తే నమ: నమ:

శివాయ సోమాయ సతారాయ షడత్మనే

స్వయం జ్యోతి: ప్రకాశాయ స్వతంత్రాయ నమో నమ:

మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే నమ:

శివాయ శాంతాయ బ్రాహ్మణే లింగమూర్తయే

ఓంకారాయ విశేషాయ నమో దుందుభినే నమ:

నమ: శివాయ రుద్రాయ ప్రధానాయ నమో నమ:

గురవే సర్వలోకానం భిషణే భవరోగిణామ్

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ:

జ్ఞానానందం జ్ఞానరూపం జ్ఞానబీజం సనాతనమ్

తపసాం ఫలదాతారం దాతారం సర్వసంపదామ్

ఋత్గగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళమ్

ఊర్థ్వరేతం విరూపాక్షం విశ్వరూపం నమోమ్యహమ్

ధ్యాయే దభీష్టసిద్ధ్యర్థ మహర్నిశ ముమాపతిం

ఈశానం సర్వవిద్యానా మీశ్వరేశ్వర మవ్వయమ్

గోభీ ర్జుష్టం ధనేన హ్యాయుషా చ బలేన చ

ప్రజయా పశుభి: పుష్కరాక్షం

త న్మే మన: శివసంకల్పమస్తు

సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా

శాంతి: పత్నీ క్షమా పుత్ర: షడతే మమ బాంధవా:

ఇతి షడక్షరీ స్తుతి :

ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళితే ఎంత పుణ్యం?


ఉదయాన్నే శ్రీ మహావిష్ణువు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళడం మంచిది. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు.

కాబట్టి ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు. మన బుద్ధి ద్వార ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు. 

మహేశ్వరుడు లయకారుడు. కాబట్టి రోజు పూర్తి అవుతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందర పడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతున్ని దర్శించాలి.

జీవాత్మ – పరమాత్మ – మోక్షం అనగానేమి?


ప్రతి మానవుడి (జీవాత్మ ) అంతిమ లక్ష్యం మోక్షం పొందడమే. పరమాత్మ యొక్క తేజస్సుసృష్టి ప్రారంభమగునపుడు. ప్రకృతి యెక్క ప్రబావంతో అనేకానేకములైన ఆత్మలుగా ప్రతిబింబించను. ఇలా అనేకములుగా ఉన్న ఆత్మలనే జీవాత్మలని అంటాం. వాస్తవానికి పరమాత్మ యెక్క ప్రతిబింబమే అలా పధార్థంతో ఏకమైన జీవాత్మ తన నిజమైన ఉనికిని మరచి, పదార్థాన్నే (దేహాన్నే ) తానని భ్రమించి, పుట్టచూ గిట్టుచూ (దేహాలను మార్చుకుంటూ) గమ్యాన్ని మరిచి తిరుగును. ఇలా జీవాత్మ గతి తప్పి తిరగడాన్నే ‘ సంసారం ’ అని అంటారు. అలాంటి జీవాత్మ మానవ జన్మ ఎత్తి తన నిజతత్వాన్ని గురువుల బోధనలతో అర్థం చేసుకొని, బౌతికమైన మరియు మానసికమైన బంధాలనుండి తపోసాధనలతో తెంచుకొని పరమాత్మలో తన ఉనికిని స్థిరం చేసుకోవడాన్నే మోక్షం అని అంటారు. ఇలా మోక్షము పొందడము కేవలము వివేకవంతుడైన మనిషికి మాత్రమే సాధ్యం. ఎప్పుడూ ఉనికి కలిగి వుండి తన తత్వమైన పరమ ఆనందాన్ని పొందుతూ ప్రకృతికి అతీతంగా ఉండునదే పరమాత్మ. కావున ప్రకృతికి అతీతమైన స్థితిని చేరిన ముక్తిపొందిన ఆత్మ తిరిగి జన్మంచదు. కష్టాలపాలు కాదు, నిత్యానందాన్ని శాశ్వతంగా అనుభవిస్తుంది. సర్వవిధ భగవత్ సాధనల పరమ లక్ష్యం జీవాత్మ తన నిజస్థితియైన పరమాత్మ స్థానాన్ని పొందడమే.

Tuesday, 3 June 2014

ఏ యే పూలు సమర్పిస్తే ఏమి ఫలితం ?



దేవునికి సంపెంగ పువ్వులు సమర్పిస్తే..!?
దేవునికి పుష్పాన్ని అర్పించి ప్రసాదం తీసుకోవటం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందని తెలుసుకుందాం.
1. దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి.
2. దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే - మాంత్రిక ప్రయోగాలు మీపై పని చేయవు. శత్రువుల నివారణ సాధ్యమవుతుంది.
3. పారిజాత పూవును అర్పిస్తే - కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది.
4. రుద్రాక్షపూవును అర్పిస్తే -ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది.
5. మల్లెపూలను అర్పిస్తే - అధికారంలో ఉన్నవారి మనస్తాపాలుపరిహరించబడతాయి.
6. లక్కి పూవుతో పూజిస్తే - భార్య, పిల్లలతో కలహాలు లేకుండాసంతోషంగా ఉంటాయి.
7. పద్మం లేదా కమలంతో పూజిస్తే - సమస్త దారిద్ర్య నివారణ, శ్రీమంతులు అవుతారు.
8. మల్లెపూవుతో పూజిస్తే - అన్ని రోగాలు నయం అవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
9. కల్హర పుష్పంతో పూజ చేస్తే - అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.
10. గన్నేరు పూలతో పూజిస్తే - కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది.
11. కలువ పూవుతో పూజ చేస్తే - స్తంభన తదితర మంత్ర సంబంధ బాధలుతొలగిపోతాయి.
12. పాటలీ పుష్పంతో పూజ చేస్తే - వ్యాపార-వ్యవహారాల్లో అధిక లాభం వస్తుంది.
13. కుంద పుష్పంతో పూజ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.
14. మల్లెపూవుతో పూజ చేసి ప్రసాదన్ని స్వీకరిస్తే - అన్ని రకాల మానసిక, దైహిక రోగాలు నయం అవుతాయి.
15. కనకాంబరం పూలతో దేవునికి పూజ చేయకూడదు. ఒకవేళ చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే - జీవితం పట్ల వైరాగ్యం వస్తుంది.
16. మాధవీ పుష్పంతో - సరస్వతి, గాయత్రి, శ్రీ చక్రం, శ్రీ రాజరాజేశ్వరి దేవికి జ్యోతిష్యం చెప్పేవారు పూజ చేస్తే మంచి వాక్‌శుద్ధి కలిగి పలికినట్లే జరుగుతుంది.
17. తుమ్మపూలతో ఈశ్వరునికి పూజ చేస్తే - దేవునిపై భక్తి అధికమవుతుంది.
18. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే - జీవితంలో సుఖం, శాంతి, ప్రశాంతత లభిస్తుంది.
19. కణగలె పుష్పం - దీనితో దేవునికి పూజ చేస్తే మనను పట్టిపీడిస్తున్న భయం, భీతి తొలగిపోతాయి. గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక బాధల తొలగిపోతాయి. విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవీ అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనంఅవుతుంది.
20. పొద్దుతిరుగుడు పువ్వుతో పూజ చేస్తే - పూవును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

Popular Posts