Google+ Followers

Followers

Friday, 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధంస్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

సూత ఉవాచ
యో వై ద్రౌణ్యస్త్రవిప్లుష్టో న మాతురుదరే మృతః
అనుగ్రహాద్భగవతః కృష్ణస్యాద్భుతకర్మణః

బ్రహ్మకోపోత్థితాద్యస్తు తక్షకాత్ప్రాణవిప్లవాత్
న సమ్ముమోహోరుభయాద్భగవత్యర్పితాశయః

ఈ పరీక్షిత్తు బ్రహ్మదండంతో కూడ దండింపబడని వాడు, అత్యాశ్చర్య కరములైన పనులు చేసే కృష్ణపరమాత్మ చేత కాపాడబడ్డాడు.
ఈయన రెండు రకాల గొప్పవాడు 1. బ్రహ్మాస్త్రం చేత దహింపబడలేదు భయపడలేదు 2. బ్రహ్మ దండానికి (శాపానికీ) భయపడలేదు.
ఈయన మరణానికి భయపడలేదు. ఓంటి స్తంభం మేడలో ఉన్నడని చెప్పిన కథ వాస్తవం కాజాలదు. ఇంత ఉదాత్తంగా ప్రవర్తించినవాడు కలి పురుషున్ని శాసించినవాడు బ్రహ్మ శాపాన్నుంచి తప్పించుకోచూడ జాలడు. ఆయన భయపడలేదు (న సమ్ముమోహ)
ఆ కబురు తెలియగానే ఉన్నవన్నీ విడిచిపెట్టాడు

ఉత్సృజ్య సర్వతః సఙ్గం విజ్ఞాతాజితసంస్థితిః
వైయాసకేర్జహౌ శిష్యో గఙ్గాయాం స్వం కలేవరమ్

పరమాత్మ గురించి తెలిసినవాడు కాబట్టి వ్యాసునికి శిష్యుడై (వైయాసకేర్జహౌ ) అన్నీ వదిలిపెట్టాడు.

నోత్తమశ్లోకవార్తానాం జుషతాం తత్కథామృతమ్
స్యాత్సమ్భ్రమోऽన్తకాలేऽపి స్మరతాం తత్పదామ్బుజమ్

బ్రాహ్మణ శాపం తక్షక విషం ప్రాణాపాయం ఇవన్నీ ఉన్నా ఆయన భయపడలేదు. పరమాత్మ కథమృతాన్ని పానామృతం చేస్తున్నవారు (జుషతాం) సేవిస్తున్న వారు అంతకాలంలో కూడా భయం తొట్రుపాటు ఉండవు (నోత్తమశ్లోకవార్తానాం ). పరమాత్మ పాదాలను ధ్యానిస్తున్న వారికి భయం ఉండదు ఏ కాలంలో అయినా. (భూ: పాదౌ)

తావత్కలిర్న ప్రభవేత్ప్రవిష్టోऽపీహ సర్వతః
యావదీశో మహానుర్వ్యామాభిమన్యవ ఏకరాట్

పరీక్షిత్తు పరిపాలిస్తున్నంత కాలం కలి ప్రభావం ఉండదు.

యస్మిన్నహని యర్హ్యేవ భగవానుత్ససర్జ గామ్
తదైవేహానువృత్తోऽసావధర్మప్రభవః కలిః

శ్రీ కృష్ణపరమాత్మ ఏ పూట ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాడొ ఆ సమయంలోనే మరుక్షణమే అధర్మ వలన పుట్టిన కలి ఈ భూమండలంలోకి అడుగుపెట్టాడు

నానుద్వేష్టి కలిం సమ్రాట్సారఙ్గ ఇవ సారభుక్
కుశలాన్యాశు సిద్ధ్యన్తి నేతరాణి కృతాని యత్

కలిని పరీక్షిత్తు ద్వేషిచలేదు, నశింపజేయలేదు ఎందుకంటే తుమ్మెద పద్మంలో మకరందాన్ని ఆస్వాదిస్తుంది గాని పద్మాన్ని పాడుచేయదు (సారఙ్గ ఇవ సారభుక్). కలిలో ఉన్న దోషాలను హరించాలి తప్ప కలిని హరించకూడదు.
తెలివిగా ఉపాయంగా ప్రజ్ఞ్యతో ఆచరించిన పనులే నెరవేరుతాయి. లేకపోతే ఫలించవు
తక్కిన మూడు యుగాలలో లేని విశేషం కలియుగంలో ఉంది.

కిం ను బాలేషు శూరేణ కలినా ధీరభీరుణా
అప్రమత్తః ప్రమత్తేషు యో వృకో నృషు వర్తతే

చిన్నపిల్లలయందు శూరుడు ప్రవర్తించడు. కలిని కూడా పరీక్షిత్తు ఒక బాలుడిలా వదిలేశాడు. కాని కలికి ఆ కృతజ్ఞ్యత ఉండదు. తోడేలు ప్రాణులయందు ప్రవర్తిస్తుందో ఈ అధర్మం మనం పోవడానికి కారణమవుతుంది. ఎప్పుడు అజాగ్రత్తగా ఉంటాడొ ఎదురుచూస్తూ ఉంటాడు

ఉపవర్ణితమేతద్వః పుణ్యం పారీక్షితం మయా
వాసుదేవకథోపేతమాఖ్యానం యదపృచ్ఛత

నీవడిగిన పరమాత్మ కధతో కూడి ఉన్న పరీక్షిత్తు గురించి చెప్పాను. (పరీక్షిత్తు ఎలా పుట్టాడు, ఎలా పరిపాలించడు ఎలా కలిని శాసించాడు )

యా యాః కథా భగవతః కథనీయోరుకర్మణః
గుణకర్మాశ్రయాః పుమ్భిః సంసేవ్యాస్తా బుభూషుభిః

తెలియగోరువారు సేవించ వలసినవి పరమాత్మ కధలే - అవి పరమాత్మ గుణాలకి కర్మలకి సంబంధించినవి

ఋషయ ఊచుః
సూత జీవ సమాః సౌమ్య శాశ్వతీర్విశదం యశః
యస్త్వం శంససి కృష్ణస్య మర్త్యానామమృతం హి నః

నీవు ఎల్ల కాలం నీకీర్తితో జీవించి ఉండు గాక. మానవులకు అమృతంగా ఉండే కృష్ణుని కథను చెప్పావు
శిష్యులు ఎప్పుడు గురువు గారి దేహాన్ని జాగ్రత్తగా చూడాలి. గురువుగారు శిష్యుడి ఆత్మను గురువు కాపాడాలి

కర్మణ్యస్మిన్ననాశ్వాసే ధూమధూమ్రాత్మనాం భవాన్
ఆపాయయతి గోవిన్ద పాదపద్మాసవం మధు

ఊపిరిగూడా తీసుకోవడానికి వీలులేనంతగా ఉన్న సమస్యలు ఉన్న మాకు, పొగతో ఊపిరి ఆడకుండా ఉన్నవారికి గాలి వచ్చి ఎలా ఐతే ఊపిరి సలిపేలా చేస్తుందో. పరమాత్మ పాద పద్మ మకరందాన్ని మాచేత తాగిస్తున్నావు

తులయామ లవేనాపి న స్వర్గం నాపునర్భవమ్
భగవత్సఙ్గిసఙ్గస్య మర్త్యానాం కిముతాశిషః

ఈ శ్లోకం మనం రోజూ చదువుకోవాలి
పరమాత్మనే ఎప్పుడూ సేవించాలనే కోరిక ఉన్న మహానుభావునితో క్షణకాల కలయికతో లక్షలో లక్ష అంశలో కూడా స్వర్గం అపునర్భవం సాటి రావు. భక్తులతో ఒక్క క్షణం కలిసి ఉండే ఫలములోని కోటి యొక్క అంశతో స్వర్గము అపునర్భవమూ సాటి రావు

కో నామ తృప్యేద్రసవిత్కథాయాం మహత్తమైకాన్తపరాయణస్య
నాన్తం గుణానామగుణస్య జగ్ముర్యోగేశ్వరా యే భవపాద్మముఖ్యాః

పరమాత్మ కథలో రుచి తెలిసినవాడెవడైనా తృప్తిచెందుతాడా?
పరమాత్మ కథలు ఎప్పుడు ఐపోతాయి? ఆయన గుణాలు ఐపోయినప్పుడు. అవి ఎప్పటికీ అయ్యేవి కావు. ఏ గుణములూ లేని పరమాత్మ గుణాలకు అంతే లేదు. సత్వ రజో తమో గుణాలు లేని పరమాత్మ గుణాలు. భవపాద్మముఖ్యాః - బ్రహ్మరుద్రేంద్రాదులు కూడా ఆయన గుణ కీర్తనములతో అయిపోయాయి అనుకోరో అలాంటి కథలను విన్నవారు తృప్తి పొందుతారా

తన్నో భవాన్వై భగవత్ప్రధానో మహత్తమైకాన్తపరాయణస్య
హరేరుదారం చరితం విశుద్ధం శుశ్రూషతాం నో వితనోతు విద్వన్

పరమాత్మ గుణాలని వ్యాపింపచేయండి. సేవించే వారిని గురువుగారు కాదనరు (శుశ్రూషతాం ).
భవాన్ భగవత్ప్రధానో   - మీరు పరమాత్మ నామ గుణ కీర్తనలే ముఖ్యమని భావించే వారు
ఏకాన్తపరాయణస్య - భగవానుడు కూడా మీలాంటి వారి యందే ఉంటాడు

స వై మహాభాగవతః పరీక్షిద్యేనాపవర్గాఖ్యమదభ్రబుద్ధిః
జ్ఞానేన వైయాసకిశబ్దితేన భేజే ఖగేన్ద్రధ్వజపాదమూలమ్

మీరు చెప్పినదాని బట్టి పరీక్షిత్తు  భాగవతోత్తముడు. భగవంతుని చేతనే మహానుభావుడని కీర్తింపబడినవాడు.
శుకుని చేత మోక్షముకు మూఒలస్థానమైన ప్రమాత్మ జ్ఞ్యానం పొంది మోక్షం పొందాడన్నారు.
పరమాత్మ సంబంధమున్నది కాబట్టి అది కూడా చెప్పవలసింది

తన్నః పరం పుణ్యమసంవృతార్థమాఖ్యానమత్యద్భుతయోగనిష్ఠమ్
ఆఖ్యాహ్యనన్తాచరితోపపన్నం పారీక్షితం భాగవతాభిరామమ్

అసంవృతార్థమా - ఏ మాత్రం దాచకుండా ఆ ఆఖ్యానాన్ని చెప్పండి (సంవృతం అంటే దాచడం)
అన్నీ ఉన్నవాడు ఏడు రోజుల్లో మోక్షానికి వెళ్ళాడంటే అది అత్యద్భుత యోగ నిష్ఠం.
పరమాత్మ యొక్క ఆచరణతో కూడి ఉన్నది కాబట్టి (ఆఖ్యాహ్యనన్తాచరితోపపన్నం). ఇది భగవత్ భక్తులని ఆనందింపచేసేది (భాగవతాభిరామమ్)

సూత ఉవాచ
అహో వయం జన్మభృతోऽద్య హాస్మ వృద్ధానువృత్త్యాపి విలోమజాతాః
దౌష్కుల్యమాధిం విధునోతి శీఘ్రం మహత్తమానామభిధానయోగః

మహానుభావుల యోగం (సంసర్గం) వలన అద్భుతం జరుగుతుంది. నేను విళొమజుడిని (విలోమం : క్షత్రియుడి వలన బ్రాహ్మన స్త్రీకి పుట్టే వాడు. అనులోమం - బ్రాహ్మణుడి వలన క్షత్రియురాలికి పుట్టే వాడిని. సూతుడు స్త్రీ పురుష సమ్యోగంతో పుట్టినవాడు కాడు. పృధు చక్రవర్తి చేసిన యజ్ఞ్యంలో అగ్నిహోత్రునికి స్వాహాకారం ఇస్తూ ఇంద్ర మంత్రాన్ని పొరబాటున చదివాడు. ఇంద్రుడు క్షత్రియుడు అగ్ని బ్రాహ్మణుడు. క్షత్రియ బీజంతో బ్రాహ్మణ క్షేత్రంలో పుట్టినవాడు సూతుడు. ఎలాంటి పాపం చేయని నాకు ఇలాంటి జన్మ ఎందుకు ఇచ్చి శిక్షించారని అడిగితే - ప్రధానమైన అగ్ని హోత్రానికి పుట్టావు కాబట్టి, అగ్నిహోత్రం జ్ఞ్యానాన్ని అందిస్తుంది కాబట్టి అందరికీ జ్ఞ్యానాన్ని అందిస్తావు )
నేను విలోమ జాతున్నైనా నాకు బ్రహ్మ స్థానం ఇచ్చి సేవిస్తున్నారంటే పెద్దలను సేవిస్తే ఎలాంటివాడైన ఎంతటి వాడు అవుతాడొ అర్థమవుతుంది. దుష్టకులంలో పుట్టానన్న చింతను పెద్దల సంసర్గంతో తొలగించుకున్నాను. పరమాత్మ నామాన్ని ఉచ్చరిస్తే చాలు వాడు పెద్దవారందరికీ పెద్దవాడవుతాడు
మహత్తమానామభిధానయోగః - పెద్దల పేరు నోటితో పలికితేనే అన్ని శుభాలు కలుగుతాయి.

కుతః పునర్గృణతో నామ తస్య మహత్తమైకాన్తపరాయణస్య
యోऽనన్తశక్తిర్భగవాననన్తో మహద్గుణత్వాద్యమనన్తమాహుః

ఒక్క సారిపేరు చెబితేనే ఇంత గొప్ప వస్తే, నిరంతరమూ పరమాత్మనే ధ్యానిచే వాడి కథని చెబితే
అనంత శక్తి గల అనత గుణాలు కల పరమాత్మ కథనలు చెప్పేవాడు అనతుడే అవుతాడు (అందుకే ఆదిశేషునికి అనంతుడని పేరు. అనతమైన గుణాలు కలిగిన పరమాత్మను సేవించే శక్తి గల సేవకుడు అనంతుడే)

ఏతావతాలం నను సూచితేన గుణైరసామ్యానతిశాయనస్య
హిత్వేతరాన్ప్రార్థయతో విభూతిర్యస్యాఙ్ఘ్రిరేణుం జుషతేऽనభీప్సోః

ఇంతెందుకు యస్యాఙ్ఘ్రిరేణుం జుషతేऽనభీప్సోః -లక్ష్మీ దేవి అందరినీ వదిలిపెట్టి ఆమెను ఎవరు కోరలేదో ఆయననే వరించింది. లక్ష్మికి విభూతి అని పేరు. అలాంటి లక్ష్మీ పతి గుణాలని విడువకుండా పలికే మనకు రాని కీర్తి ఏమి ఉంటుంది

అథాపి యత్పాదనఖావసృష్టం జగద్విరిఞ్చోపహృతార్హణామ్భః
సేశం పునాత్యన్యతమో ముకున్దాత్కో నామ లోకే భగవత్పదార్థః

భగవంతుడని ఎవరిని అనాలంటే, ఎవరి యొక్క పాద తీర్థలను ఒకరు కడిగారు, ఒకరు శిరస్సున ఉంచుకున్నారు. భగవత్ పదానికి ఇంత కన్నా అర్థం ఏముంది. యత్పాదనఖావసృష్టం  - పాదం నుండి ఉద్భవించిన. బ్రహ్మదేవుడు పూజించడానికి తెచ్చిన జనం ఏ పాదములనుండి వెలువడి శంకరుని సహా మిగిలిన దేవతలను పునీతులని చేస్తుందో, భగవాన్ అన్న పదానికి ముకుందుడు తప్ప ఇంకెవరు అర్థమవుతారు

యత్రానురక్తాః సహసైవ ధీరా వ్యపోహ్య దేహాదిషు సఙ్గమూఢమ్
వ్రజన్తి తత్పారమహంస్యమన్త్యం యస్మిన్నహింసోపశమః స్వధర్మః

ఎవరి గుణాల యందు అనురాగం కలవారు దేహాత్మాభిమాన్నాని దేహాత్మ సంగతిని వదిలిపెట్టి అలాంటి పరమాత్మ సన్నిధికి చేరుతారు. ఎక్కడైతే హింస అనేది సంపూర్ణంగా తొలగుతుందో. హింసకు మూలమైన సకల గుణ నివృత్తి ఎక్కడ జరుగుతుండొ అలాంటి పరమపదానికి ఏ మహాత్ముని పాద పద్మాలు సేవించిన వారు వెళతారో - మోక్షమును ఇచ్చేవారు కాక మరెవరు భగవంతుడు అంటే?

అహం హి పృష్టోऽర్యమణో భవద్భిరాచక్ష ఆత్మావగమోऽత్ర యావాన్
నభః పతన్త్యాత్మసమం పతత్త్రిణస్తథా సమం విష్ణుగతిం విపశ్చితః

పక్షులు తమ తమ పక్ష బలాలను బట్టి ఆయా ఎత్తులకి వెళ్తాయి (పతన్త్యాత్మసమం ). పండితులు కూడా వారి జ్ఞ్యాననికి అనుగుణంగా ఆయా ప్రదేశాలకు జేరగలరు (కొందరు జ్ఞ్యానం, కొందరు భక్తి, కర్మ  ).

ఏకదా ధనురుద్యమ్య విచరన్మృగయాం వనే
మృగాననుగతః శ్రాన్తః క్షుధితస్తృషితో భృశమ్

కౄఉర మృగములు ప్రజల పాడిపంటలను దెబ్బతీస్తున్నాయన్న మాట విని అశ్వారూఢుడై వేటకు వెళ్ళాడు (సప్త వ్యసనాల్లో వేట ఒకటి ) అలా పరిగెత్తి అలసిపోయాడు ఆకలి దప్పిగొన్నాడు

జలాశయమచక్షాణః ప్రవివేశ తమాశ్రమమ్
దదర్శ మునిమాసీనం శాన్తం మీలితలోచనమ్

కనులు మూసుకుని యోగ సమాధిలో ఉన్న ఋషిని చూచి.

ప్రతిరుద్ధేన్ద్రియప్రాణ మనోబుద్ధిముపారతమ్
స్థానత్రయాత్పరం ప్రాప్తం బ్రహ్మభూతమవిక్రియమ్

ఇంద్రియ ప్రాణ మనసు బుధ్ధిని అరికట్టాడు. నిజముగా ప్రాణాయామం చేస్తే మన చుట్టుపక్కల ఉన్న శబ్దాలు వినపడకూడదు, స్పర్శ తెలియకూడదు. అయిదు విషయాలు తెలియకూడదు. మనసును కూడా అరికట్టాలి. ఏ ఇంద్రియం పని చేయడం మానేసిందో ఆ ఇంద్రియ శక్తి మనసుకు సంక్రమిస్తుంది. మనం మానేసిన దాన్ని మనసు పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. అందుకు మనసుని అరికట్టాలి. బుధ్ధిని కూడా అరికట్టాలి. బుధ్ధి ఏమీ అలోచించకుండా మనసు ఏమి సంకల్పించకుండా ఇంద్రియాలు ఏ విషయాలలో ప్రవర్తించకుండా ఉండటం ప్రాణాయామం.
దీనే ప్రతిరుధ్ధా అంటారు. అలగే ఉపారతం - పూర్తిగా లౌకిక జీవితాన్ని ఉపసమ్హరించుకున్నవాడు
స్థానత్రయాత్పరం ప్రాప్తం బ్రహ్మభూతమవిక్రియమ్- స్థాన త్రయం అంటే ఉదరం కంఠం శిరం. ఈ మూడిటినీ దాటిపోయాడు. భూ: భువ: సువ: లోకత్రయాలు దాటాడు. బ్రహం రుద్ర ఇంద్ర స్థానాలు దాటిన వాడు
 బ్రహ్మభూతమవిక్రియమ్ - తానే పరమాత్మ అయ్యాడు. బ్రహ్మ స్థితి యందు ఉన్నాడు. ఎవడు లోకాన్ని చూచి భయపడడో, లోకములు ఎవడిని చూచి భయపడవో తానే బ్రహ్మ.  ఆపద కలిగించే వాడు ఆపద కలిగించేది అన్న వేరు భావన ఉన్నవాడు బ్రహ్మాత్మకం జగదిదం అనుకోలేడు.  తాను ఏది కోరక ఎదుటివాడిలో భేధభావన చూపని వాడు బ్రహ్మ. పొందవలసినది ఏదీ లేక పొందాలన్న కోరిక లేని వాడు.
అవిక్రియం - ఎటువంటి వికారాలు లేని వాడు.

విప్రకీర్ణజటాచ్ఛన్నం రౌరవేణాజినేన చ
విశుష్యత్తాలురుదకం తథాభూతమయాచత

రౌరవేణాజినేన - రురు అనే జంతువు చర్మం ధరించి ఉన్నవాడు, జటలు వ్యాపించి ఉన్నవాడు.
విశుష్యత్తాలు- చెంపలు లోతుకు పోయినవాడు. అలాంటి ఆయనను నీరు అడిగాడు
(ఉదకం తథాభూతం) - నీటిని అడిగాడు)

అలబ్ధతృణభూమ్యాదిరసమ్ప్రాప్తార్ఘ్యసూనృతః
అవజ్ఞాతమివాత్మానం మన్యమానశ్చుకోప హ

అలబ్ధతృణభూమ్యాది - కూర్చోడానికి ఆసనం ఇవ్వలేదు. అర్ఘ్యం పాద్యంలేదు. గడ్డిపరకలేదు
అవజ్ఞాతమివాత్మానం- అవమానించాడు
అందుకు పరీక్షిత్తు కోపించాడు

అభూతపూర్వః సహసా క్షుత్తృడ్భ్యామర్దితాత్మనః
బ్రాహ్మణం ప్రత్యభూద్బ్రహ్మన్మత్సరో మన్యురేవ చ

మన శాంతి సహనం ఓర్పు, మన శరీరంలో వికారం కలగనంత వరకే. అందులో ప్రధానం ఆకలి దప్పి
క్షుత్తృడ్భ్యాం - ఆకలి దప్పీ.  ఈ రెండితో ఎలా ప్రవరించాలో మర్చిపోయి . ఆ మహర్షి మీద మాత్సర్యం వచ్చింది. ఇలా చేసినందుకు కోపం (మన్యు) వచ్చింది

స తు బ్రహ్మఋషేరంసే గతాసుమురగం రుషా
వినిర్గచ్ఛన్ధనుష్కోట్యా నిధాయ పురమాగతః

గతాసుమురగం - ప్రాణంపోయిన సర్పాన్ని ధనువు యొక్క కొసతో తీసి (ధనుష్కోట్యా ) ఆయనమీద వేసి వెళ్ళాడు. కలిపురుషుడు అడిగిన కొన్ని స్థాలాల్లో బంగారం ఒకటి. ఆయన్ కిరీటాన్ని నెత్తినపెట్టుకుని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ఆ విషయం గుర్తుకు వచ్చింది. ఆయన పెట్టుకున్న కిరీటం జరాసంధుడిది. ఒకరు వాడే వస్తువులు ఇంకొకరు వాడకూడదు. ఆ వ్యక్తికీఇ వస్తువుకీ ఉన్న సంబంధంతో ఆ వ్యక్తి గుణాలు ఆ వస్తువుకి వస్తాయి.(ఈ భాగం పాద్మపురాణంలో స్కాంధపురాణంలో ఉంది. )

ఏష కిం నిభృతాశేష కరణో మీలితేక్షణః
మృషాసమాధిరాహోస్విత్కిం ను స్యాత్క్షత్రబన్ధుభిః

నిభృత అశేష కరణో  - అన్ని ఇంద్రియాలను అంతర్ముఖం చేసాడు
నాటకం అనుకున్నాడు పరీక్షిత్తు (మృషాసమాధి).

తస్య పుత్రోऽతితేజస్వీ విహరన్బాలకోऽర్భకైః
రాజ్ఞాఘం ప్రాపితం తాతం శ్రుత్వా తత్రేదమబ్రవీత్

ఈ సంగతి తెలిసిన ఆయన కుమారుడు. ఈ విషయాన్ని తెలుసుకున్నాడు (తాతం శ్రుత్వా). ఇలా అన్నాడు

అహో అధర్మః పాలానాం పీవ్నాం బలిభుజామివ
స్వామిన్యఘం యద్దాసానాం ద్వారపానాం శునామివ

బలిభుజామివ -బలిని తినేవి, (బలి భుక్) కాకులు. రాజులు మేమిచ్చే శక్తివల్ల బ్రతుకుతున్నారు . దాసుల్య్  యజమానుల విషయంలో అపచారం చేస్తారా. కుక్కలు యజమాని విషయంలో చేసినట్లు.

బ్రాహ్మణైః క్షత్రబన్ధుర్హి గృహపాలో నిరూపితః
స కథం తద్గృహే ద్వాఃస్థః సభాణ్డం భోక్తుమర్హతి

క్షతిర్యులు ద్వారపాలకులని నేను కొత్తగా అనట్లేదు. బ్రాహ్మణులందరూ క్షత్రియులని ద్వారపాలకులనే అంటారు.
ద్వారంలో ఉండాల్సిన వాడు ఇంటిలోకి వచ్చి యజమాని భాండంలో ఉన్న భోజనాన్ని భుజించడం ఎంత తప్పో.

కృష్ణే గతే భగవతి శాస్తర్యుత్పథగామినామ్
తద్భిన్నసేతూనద్యాహం శాస్మి పశ్యత మే బలమ్

కృష్ణపరమాత్మ వైకుంఠానికి వెళ్ళాడని వీళ్ళందరూ ఇలా ప్రవర్తిస్తున్నారు.
(శాస్తర్యుత్పథగామినామ్ - శాస్తరి ఉత్పధ గామినాం -  అడ్డదారిలో వెళ్ళేవారిని శాసించే) కృష్ణపరమాత్మ
ఆయనవెళ్ళిపోయాడు కాబట్టి మమ్మల్ని ఎవరేమి చేయగలరు అనుకునే రాజులు చేసిన మర్యాద భంగానికి నా బలం చూపిస్తాను

ఇత్యుక్త్వా రోషతామ్రాక్షో వయస్యానృషిబాలకః
కౌశిక్యాప ఉపస్పృశ్య వాగ్వజ్రం విససర్జ హ

కౌశిక నదిలో నీటిని తీసుకుని అందరూ చూస్తుండగా. (వాగ్వజ్రం - వాక్కుని అగ్ని అంటారు) శాపాన్ని విడిచిపెట్టాడు.

ఇతి లఙ్ఘితమర్యాదం తక్షకః సప్తమేऽహని
దఙ్క్ష్యతి స్మ కులాఙ్గారం చోదితో మే తతద్రుహమ్

ఇలా మర్యాదని అధిక్రమించిన బ్రాహ్మణులకు ద్రోహం చేసిన (తతద్రుహమ్) వాడిని తక్షకుడు నేటికేడవరోజున నా ప్రేరణచే వధిస్తాడు. 

తతోऽభ్యేత్యాశ్రమం బాలో గలే సర్పకలేవరమ్
పితరం వీక్ష్య దుఃఖార్తో ముక్తకణ్ఠో రురోద హ

ఇంటికి వచ్చి తన తండ్రిని చూచి ముక్తకంఠంతో ఏడ్చాడు

స వా ఆఙ్గిరసో బ్రహ్మన్శ్రుత్వా సుతవిలాపనమ్
ఉన్మీల్య శనకైర్నేత్రే దృష్ట్వా చాంసే మృతోరగమ్

కుమార రోదన ధ్వని విని ఈ లోకానికి వచ్చి
కనులు తెరిచి తన మెడలో ఉన్న పాముని చూచి

విసృజ్య తం చ పప్రచ్ఛ వత్స కస్మాద్ధి రోదిషి
కేన వా తేऽపకృతమిత్యుక్తః స న్యవేదయత్

దాన్ని బయట పడేసి పిల్లవాడిని అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావు. (తపసులో ఉన్న వారిని ఏ ప్రాణి ముట్టుకున్నా మరణిస్తుంది. అందుకే ఆ సర్పం వచ్చి మరణించిందా, మరణించిన్ వచ్చిందా అనేదీ అయానకు వెంటనే తైల్యలేదు)
ఎవరైనా నీకు హాని చేసార

నిశమ్య శప్తమతదర్హం నరేన్ద్రం స బ్రాహ్మణో నాత్మజమభ్యనన్దత్
అహో బతాంహో మహదద్య తే కృతమల్పీయసి ద్రోహ ఉరుర్దమో ధృతః

పిల్లవాడు చెప్పినదాన్ని విని 'శాపానికి తగని వాడు రాజు. అజ్ఞ్యానంతో చాలా పెద్ద తప్పు చేసావు. చిన్న తప్పుకు పెద్ద శిక్ష వేశావు '

న వై నృభిర్నరదేవం పరాఖ్యం సమ్మాతుమర్హస్యవిపక్వబుద్ధే
యత్తేజసా దుర్విషహేణ గుప్తా విన్దన్తి భద్రాణ్యకుతోభయాః ప్రజాః

నీకు తేజస్సు తపసు పెరిగింది గానీ బుద్ధి పెరగలేదు. (పరిపక్వస్థితికి రాని వాడి శక్తి పరిమితంగా ఉండాలి) నృభిర్నరదేవం  - రాజు నర రూపం లో ఉన్న దేవం.
తన దివ్య ప్రతాపంతో అన్ని అమంగళాలను తొలగించి ప్రజలను కాపాడుతున్నాడు.

అలక్ష్యమాణే నరదేవనామ్ని రథాఙ్గపాణావయమఙ్గ లోకః
తదా హి చౌరప్రచురో వినఙ్క్ష్యత్యరక్ష్యమాణోऽవివరూథవత్క్షణాత్

పరమాత్మ అవతారాన్ని చాలించాక ఇతన్ని చూచే లోకం ధైర్యంగా బ్రతుకుతోంది. రక్షించని రాజు లేని లోకం. అవివరూథవత్క్షణాత్ - గొర్రెల కాపరిలేని గొర్రెల మందలా అవుతుంది రాజ్యం

తదద్య నః పాపముపైత్యనన్వయం యన్నష్టనాథస్య వసోర్విలుమ్పకాత్
పరస్పరం ఘ్నన్తి శపన్తి వృఞ్జతే పశూన్స్త్రియోऽర్థాన్పురుదస్యవో జనాః

కృష్ణుడు అవతారం చాలించాక మనని అంతబాగా పోషిస్తోన్న రాజు ని శపించడం వల్ల  మనకి ఘోరమైన పాపం వస్తుంది. రాజులేని రాజ్యంలో పశువులని స్త్రీలను ధనాని లాకుంటారు. ఒకరినొకరు చంపుకుంటారు నిందించుకుంటారు లాక్కుంటారు పెద్ద దొంగలు

తదార్యధర్మః ప్రవిలీయతే నృణాం వర్ణాశ్రమాచారయుతస్త్రయీమయః
తతోऽర్థకామాభినివేశితాత్మనాం శునాం కపీనామివ వర్ణసఙ్కరః

సజ్జన ధర్మం నశిస్తుంది. వర్ణ ఆచార వేద ధర్మాలు (తస్త్రయీమయః) ఉండవు.
అర్థకామాలు మాత్రల యందు మాత్రమే ప్రజలు మనసు లగ్నం చేస్తారు. వర్ణ సంకరం జరుగుతుంది. కోతులు కుక్కలూ కలిసినట్లుగా ప్రజలు వర్ణ సంకరానికి పాపడుతారు

ధర్మపాలో నరపతిః స తు సమ్రాడ్బృహచ్ఛ్రవాః
సాక్షాన్మహాభాగవతో రాజర్షిర్హయమేధయాట్
క్షుత్తృట్శ్రమయుతో దీనో నైవాస్మచ్ఛాపమర్హతి

ఈ రాజు గొప్ప కీర్తి కలవాడు పరమ భాగవతోత్తముడు, అశ్వమేధము చేసిన వాడు. అతను కూడా కావలని వచ్చి తప్పు చేయలేదు. ఆకలి దప్పి శ్రమ కలిగి వచ్చాడు.

అపాపేషు స్వభృత్యేషు బాలేనాపక్వబుద్ధినా
పాపం కృతం తద్భగవాన్సర్వాత్మా క్షన్తుమర్హతి

ఏ పాపం చేయనివారి యందు పరిపక్వబుద్ధి లేని నీవు పాపం చేసావు.భగవంతుడు ఈ తప్పును క్షమించుగాక

తిరస్కృతా విప్రలబ్ధాః శప్తాః క్షిప్తా హతా అపి
నాస్య తత్ప్రతికుర్వన్తి తద్భక్తాః ప్రభవోऽపి హి

నీవు శపించావని తెలిసి కూడా మహారాజు ఎటువంటి ప్రతిక్రియా చేయలేదు. ప్రతీకారం చేయగలిగినా మహానుభావులు ప్రతీకారం చేయరు. తిరస్కరించిన వెడలగొట్టినా శపించినా అధిక్షేపించినా చివరికి చంపినా (తిరస్కృతా విప్రలబ్ధాః శప్తాః క్షిప్తా హతా) అటువంటివారికి ప్రతీకారం చేయరు పరమాత్మ భక్తులు

ఇతి పుత్రకృతాఘేన సోऽనుతప్తో మహామునిః
స్వయం విప్రకృతో రాజ్ఞా నైవాఘం తదచిన్తయత్

కొడుకు చేసిన తప్పుకు ఆ మహా ముని బాగా పరితపించాడు. రాజు తనకు ఇలాంటి తప్పు చేసాడని అలోచిననేలేదు

ప్రాయశః సాధవో లోకే పరైర్ద్వన్ద్వేషు యోజితాః
న వ్యథన్తి న హృష్యన్తి యత ఆత్మాగుణాశ్రయః

ఇతరుల చేత ద్వందాల యందు బాధపడరు సంతోషించరు
లోకంలో సజ్జనులైన వాళ్ళు ఎదుటివాళ్ళు చేసిన మానావమానాల విషయంలో అంతా ఆత్మనే చూస్తారు. సర్వం ఖల్విద బ్రహ్మ అన్నట్టు ఉంటారు.

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పదిహేడవ అధ్యాయం


పరీక్షిన్మహారాజు విజయ యాత్రల కోసమని బయలు దేరి మార్గమధ్యంలో - భూమి ధర్మం. గోరూపంలో, వృష రూపం. వారిద్దరినీ దూరం నుంచి తన్న బోతున్నటువంటి విషయాన్ని చూచి, ఎవరు ఈ పని చేస్తున్నారు. అర్జనుని యొక్క కౌరవ వంశంలో ఉన్నవారి పరిపాలనలో ఇలా జరగడానికి వీలు లేదు . ఎవరిలా చేశారు

 సూత ఉవాచ
తత్ర గోమిథునం రాజా హన్యమానమనాథవత్
దణ్డహస్తం చ వృషలం దదృశే నృపలాఞ్ఛనమ్

అప్పుడు పరీక్షిత్తు ఒక శూద్రుడు రాజు వేషం ధరించి గోవునీ వృషభాన్ని కొట్టడం చూచాడు

వృషం మృణాలధవలం మేహన్తమివ బిభ్యతమ్
వేపమానం పదైకేన సీదన్తం శూద్రతాడితమ్

వృషభం తెల్ల తామర పూవులా ఉంది, తనను కొడుతున్న శూద్రుడు మీద భయపడుతూ ఒక కాలి మీద నిలబడి వణుకుతూ మూత్రం పోసింది

గాం చ ధర్మదుఘాం దీనాం భృశం శూద్రపదాహతామ్
వివత్సామాశ్రువదనాం క్షామాం యవసమిచ్ఛతీమ్

ఆ శూద్రునిచే కొట్ట్బడిన గోవు కళ్ళనీళ్ళతో బలహీనముగా ఉంది

పప్రచ్ఛ రథమారూఢః కార్తస్వరపరిచ్ఛదమ్
మేఘగమ్భీరయా వాచా సమారోపితకార్ముకః

రథాన్ని అధిరోహించిన పరీక్షిత్తు గంభీరస్వనంతో ఇలా అన్నాడు

కస్త్వం మచ్ఛరణే లోకే బలాద్ధంస్యబలాన్బలీ
నరదేవోऽసి వేషేణ నటవత్కర్మణాద్విజః

ఎవరు నీవు నా రాజ్యంలో నా రక్షణలో అబలులని హింసిస్తున్నావు. రాజు వేషం వేసుకుని బ్రాహ్మణులకు వ్యతిరేకమైన పని చేస్తున్నావు

యస్త్వం కృష్ణే గతే దూరం సహగాణ్డీవధన్వనా
శోచ్యోऽస్యశోచ్యాన్రహసి ప్రహరన్వధమర్హసి

కృష్ణార్జనులు లేరని నీవు గోవుని హింసిస్తున్నావు. నీవు వధార్హుడివి.

త్వం వా మృణాలధవలః పాదైర్న్యూనః పదా చరన్
వృషరూపేణ కిం కశ్చిద్దేవో నః పరిఖేదయన్

నీవు నిజముగా వృషబానివేనా లేక దేవతవా. నీవు మూడు కాళ్ళు పోగొట్టుకుని ఒక కాలితో ఉన్నావు. వృషబ రూపంలో బాధపడుతున్న దేవతవా నీవు

న జాతు కౌరవేన్ద్రాణాం దోర్దణ్డపరిరమ్భితే
భూతలేऽనుపతన్త్యస్మిన్వినా తే ప్రాణినాం శుచః

నీవు తప్ప ఇంతవరకూ ఈ కురు సామ్రాజ్యంలో ఎవరూ ఇలా ధు:కించలేదు

మా సౌరభేయాత్ర శుచో వ్యేతు తే వృషలాద్భయమ్
మా రోదీరమ్బ భద్రం తే ఖలానాం మయి శాస్తరి

సురభి పుత్రుడా.ఇక నీవు దుఖించవలదు. ఈ దుర్మార్గుడికి ఇక నీవు భయపడవలదు. ధేనువా నేను రాజుగా ఉన్నంతవరకూ నీవు ధుకించడానికి కారణం ఉండకూడదు

యస్య రాష్ట్రే ప్రజాః సర్వాస్త్రస్యన్తే సాధ్వ్యసాధుభిః
తస్య మత్తస్య నశ్యన్తి కీర్తిరాయుర్భగో గతిః
ఏష రాజ్ఞాం పరో ధర్మో హ్యార్తానామార్తినిగ్రహః
అత ఏనం వధిష్యామి భూతద్రుహమసత్తమమ్

దుర్మార్గుల వలన ప్రజలు భయపడుతూ ఉంటే ఆ రాజు పేరు ఆయువు పోతుంది. అలాంటి స్థితికి కారణమైన వాడిని చంపి తీరాలి

కోऽవృశ్చత్తవ పాదాంస్త్రీన్సౌరభేయ చతుష్పద
మా భూవంస్త్వాదృశా రాష్ట్రే రాజ్ఞాం కృష్ణానువర్తినామ్

ఎవరు నీ మూడు పాదాలు పోవడానికి కారణం. కృష్ణాను వర్తుడైన రాజు పరిపాలించే ఈ రాజ్యంలో నీలా బాధపడే వారు ఎవరూ లేరు.

ఆఖ్యాహి వృష భద్రం వః సాధూనామకృతాగసామ్
ఆత్మవైరూప్యకర్తారం పార్థానాం కీర్తిదూషణమ్

నీకు భద్రమవుగాక. రాజుయొక్క కీర్తిని తగ్గించే ఈ పని చేసింది ఎవరు

జనేऽనాగస్యఘం యుఞ్జన్సర్వతోऽస్య చ మద్భయమ్
సాధూనాం భద్రమేవ స్యాదసాధుదమనే కృతే

ఎవరైతే అమాయకులను హింసిస్తారో వారు నా వల్ల భయము పొందుతారు. ఇలాంటి వారిని దండించుట వలన మంగళమే జరుగుతుంది.

అనాగఃస్విహ భూతేషు య ఆగస్కృన్నిరఙ్కుశః
ఆహర్తాస్మి భుజం సాక్షాదమర్త్యస్యాపి సాఙ్గదమ్

అలాంటి వారు ఏ ఆయుధం ధరించిన వారు స్వర్గంలో ఉన్నా ఇటువంటి పనులు చేసేవారిని నేను ఏరిపారేస్తాను

రాజ్ఞో హి పరమో ధర్మః స్వధర్మస్థానుపాలనమ్
శాసతోऽన్యాన్యథాశాస్త్రమనాపద్యుత్పథానిహ

ధర్మమాచరించే వారిని కాపాడుట అధర్మాత్ములని శాస్త్రాలను పాటించనివారిని శిక్షించుట రాజు యొక్క పరమ ధర్మం

రాజోవాచ
న తే గుడాకేశయశోధరాణాం బద్ధాఞ్జలేర్వై భయమస్తి కిఞ్చిత్
న వర్తితవ్యం భవతా కథఞ్చన క్షేత్రే మదీయే త్వమధర్మబన్ధుః

న వర్తితవ్యం తదధర్మబన్ధో ధర్మేణ సత్యేన చ వర్తితవ్యే
బ్రహ్మావర్తే యత్ర యజన్తి యజ్ఞైర్యజ్ఞేశ్వరం యజ్ఞవితానవిజ్ఞాః

యజ్ఞ్యములు ధర్మములు ఇలాంటివాటిని ఆచరించే ఈ బ్రహ్మావర్తంలో ఈ అధరమాన్ని చేస్తున్నది ఎవరు
అప్పుడు ధర్మం ఇలా చెబుతుంది

ఏతద్వః పాణ్డవేయానాం యుక్తమార్తాభయం వచః
యేషాం గుణగణైః కృష్ణో దౌత్యాదౌ భగవాన్కృతః
పాండవ వంశంలో ఆర్తులకు  అభయమిచ్చే ఈ మాట నీకు యోగయమైనది
ఇంతటి ఉత్తమ గుణాలు కలవారగుటచే పరమాత్మ మీకు దౌత్యము సారధ్యము ఇలా అన్ని రకములా మిమ్ములని వెంట వుండి పరిపాలించారు. స్వామి స్వయం గా ఇలా ప్రవర్తించడాన్నిబట్టి మీ ఉత్తమ గుణాలు చెప్పకనే చెప్పబడుతోంది

న వయం క్లేశబీజాని యతః స్యుః పురుషర్షభ
పురుషం తం విజానీమో వాక్యభేదవిమోహితాః

ధర్మం కాబట్టి చాలా ధర్మ బద్ధంగా చెబుతోంది. ఎవరు మీకు ఇలాంటి అవస్థ కలిగించారని మీరు అడిగారు కానీ, ఒక్క మాకే కాదు ఈ ప్రకృతిలోనే సుఖాలకు గాని కష్టములకి కాని వాటిని కలిగించే కర్మలకు గాని కారణం ఇది అని చెప్పలేమి ఎందుకంటే ఈ ప్రపంచంలోనే ఈ పని ఎందుకు జరింగింది అంటే వందమంది వంద కారణాలు చెబుతారు.  కనుక మాకు కలిగిన దానికి ఇదీ కారణం అని చెప్పలేము

కేచిద్వికల్పవసనా ఆహురాత్మానమాత్మనః
దైవమన్యేऽపరే కర్మ స్వభావమపరే ప్రభుమ్

కొందరు జ్ఞ్యానులు ఆత్మే అన్నిటికీ కారణం అన్నారు కొందరు మనసే కారణం అన్నారు కొందరు దైవం కారణమని కొందరు స్వభావం కారణం అని అన్నారు (మీమాన్స - కర్మే కారణమని, తర్కం ఆత్మే కారణమని వైషేషికం సంకల్పం కారణం అని వేదాంతం సంస్కారం కారణమని ) .

అప్రతర్క్యాదనిర్దేశ్యాదితి కేష్వపి నిశ్చయః
అత్రానురూపం రాజర్షే విమృశ స్వమనీషయా

మరి కొందరు (అప్రతర్క్యాద) దీనివల్లనే జరుగుతుంది అని మనం ఊహించలేము కాబట్టి ఏమి కారణమో చెప్పలేమంటారు. ఇంకొందరు మనం ఊహించగలిగినా ఊహించినది ఇదే అని వేలుబట్టి చూపలేము (అనిర్దేశ్యాదితి ).
ఇన్ని కారణాలున్నాయి. నీవు నీ బుద్దితో ఏమి కారణమో తెలుసుకో
సూత ఉవాచ
ఏవం ధర్మే ప్రవదతి స సమ్రాడ్ద్విజసత్తమాః
సమాహితేన మనసా విఖేదః పర్యచష్ట తమ్

సావధానమైన చిత్తంతో రాజు ఇలా అన్నాడు

రాజోవాచ
ధర్మం బ్రవీషి ధర్మజ్ఞ ధర్మోऽసి వృషరూపధృక్
యదధర్మకృతః స్థానం సూచకస్యాపి తద్భవేత్

నీవు ధర్మానివే ఎందుకంటే - బాధ పడుతూ , నిన్ను ఇంత వేదనకు గురిచేసిన్ వాడిని శిక్షిస్తానని అన్నప్పుడు , 'దీని వల్ల కారణమని చెప్పలేను అన్నావు" వృషరూపంలో ఉన్న నీవు ధర్మానివే
ఫలానావాడు నాకు ఈఎ అపకారం చేసాడని నీవెందుకు చెప్పలేకపోతున్నావో నేను ఊహించగలను. వీడు అధర్మం చేసాడని సూచించిన వాడికి కూడా అధర్మ దోషం వస్తుంది.
అందుకే చేతనైతే ఎదుటివాడిన్ స్తోత్రం చేయమని ధర్మ శాస్త్రం. అందువల్ల ఆ మహాత్ములు ఆచరించిన పుణ్యంలో కొంత భాగం మనకు వస్తుంది. పొరబాటున కూడా నిందించకు విమర్శించకు. చేసిన తప్పుకు గాని చేయని తప్పుకు గాని నిందించితే అకారణంగా ఆ తప్పులోని భాగం నీకు కూడా వస్తుంది . ఈ సంగతి ధర్మానికి తెలుసు కాబట్టి నీవు ధర్మానివే

అథవా దేవమాయాయా నూనం గతిరగోచరా
చేతసో వచసశ్చాపి భూతానామితి నిశ్చయః

ప్రపంచంలో కలిగే ప్రతీ మార్పూ పరమాత్మ సంకల్పంతో జరుగుతాయి. భగవత్సంకల్పానికి మనం కారణం చెప్పలేము. దేవ మాయ ప్రవృత్తి ఇలా ఉంటుంది అని ఎవరికీ తెలీదు. ఎవరి మనసు ఎలా ఉంటుందో మాట ఎలా ఉంటుందో. వారి మనసు ఎందుకిలా అయింద్ వారు ఎందుకిలా మాట్లాడారని ఎవరు చెప్పగలరు

తపః శౌచం దయా సత్యమితి పాదాః కృతే కృతాః
అధర్మాంశైస్త్రయో భగ్నాః స్మయసఙ్గమదైస్తవ

కృత యుగంలో నీకు తపః శౌచం దయా సత్య అని నాలుగు పాదాలు. ఈ కలియుగం లో మూడు పోయాయి.
స్మయ సఙ్గం మదైస్తవ  - గర్వం ఆసక్తి మదం అనే మూటి చేత తపసు శౌచం దయ పోయాయి.
గర్వం వల్ల తపసు. ఆసక్తి వల్ల శౌచం మదం వల్ల దయ  పోయాయి. ఇపుడు సత్యం మాత్రమే ఉన్నది

ఇదానీం ధర్మ పాదస్తే సత్యం నిర్వర్తయేద్యతః
తం జిఘృక్షత్యధర్మోऽయమనృతేనైధితః కలిః

అందులో కలికి పనికి రానిదే ఈ సత్యం. అసత్యంతో బాగా పెరిగిన కలి (అనృతేన ఏధితః కలిః) ఈ సత్యాన్ని కూడా తీసివేయడానికి ప్రయత్నిస్తున్నాడు (తం జిఘృక్షత్)

ఇయం చ భూమిర్భగవతా న్యాసితోరుభరా సతీ
శ్రీమద్భిస్తత్పదన్యాసైః సర్వతః కృతకౌతుకా

ఈ గోవు ఉన్నదే అదే భూమి.  పరమత్మ అవతరించి (భగవతా న్యాసితోరుభరా) ఈమే భారాన్నంతా తొలగించాడు. పరమాత్మ పాద ముద్రలటొ పులకించబడిన శరీరం కల ఈ భూమి

శోచత్యశ్రుకలా సాధ్వీ దుర్భగేవోజ్ఝితా సతీ
అబ్రహ్మణ్యా నృపవ్యాజాః శూద్రా భోక్ష్యన్తి మామితి

పరమాత్మచేత విడువబడిన ఈ భూమి దౌర్భాగ్యురాలు లాగ అదృష్టహీనురాలులాగ దు:ఖిస్తోంది. బ్రాహ్మణ భక్తిలేని రాజులాంటి శూద్రులు నన్ను అనుభవించడానికి చూస్తున్నారు. ఇక్కడ బ్రహ్మ అంటే బ్రాహ్మణులనీ వేదం అని కూఒడా అర్థం.

ఇతి ధర్మం మహీం చైవ సాన్త్వయిత్వా మహారథః
నిశాతమాదదే ఖడ్గం కలయేऽధర్మహేతవే

ఇలా ఇద్దరినీ ఓదార్చి అధర్మం ఆచరించినందుకు కలిని సమ్హరించడానికి ఖడ్గం స్వీకరించాడు

తం జిఘాంసుమభిప్రేత్య విహాయ నృపలాఞ్ఛనమ్
తత్పాదమూలం శిరసా సమగాద్భయవిహ్వలః

నృపలాఞ్ఛనమ్ విహాయ  -అపుడు కిరీటాన్ని తీసి పక్కన పెట్టాడు. అతని పాదమూలాన్ని ఆశ్రయించాడు (తత్పాదమూలం ).

పతితం పాదయోర్వీరః కృపయా దీనవత్సలః
శరణ్యో నావధీచ్ఛ్లోక్య ఆహ చేదం హసన్నివ

దీనవత్సలుడు కాబట్టి శరణ్యుడు కాబట్టి అతన్ని చంపకుండా

రాజోవాచ
న తే గుడాకేశయశోధరాణాం బద్ధాఞ్జలేర్వై భయమస్తి కిఞ్చిత్
న వర్తితవ్యం భవతా కథఞ్చన క్షేత్రే మదీయే త్వమధర్మబన్ధుః

గుడాకేశయశోధరాణాం - అర్జనుని కీర్తిని మోస్తున్న వాళ్ళం (గుడాక అంటే నిద్ర . నిద్రకు అధిపతి. గుడాక అంటే స్మృతి అని కూడా అర్థం. మానవులు జరిగిన దాన్ని ఒక పట్టాన మర్చిపోలేరు. చెడును ఎక్కువ గుర్తు ఉంచుకుని మంచిని మర్చిపోతాం. ఏది తల్చుకుంటే కష్టం కలిగిస్తుందో దన్ని మర్చిపోము).
ఇలాంటి మమ్ములను చేతులు జోడించి శరణు వేడిన వారికి ఎక్కడినుంచీ భయం ఉండదు.
అధర్మ బంధువైన నీవు నారాజ్యం లో ఉండొద్దు,

త్వాం వర్తమానం నరదేవదేహేష్వనుప్రవృత్తోऽయమధర్మపూగః
లోభోऽనృతం చౌర్యమనార్యమంహో జ్యేష్ఠా చ మాయా కలహశ్చ దమ్భః

నీవు రాజులలోనే వచ్చి చేరుతున్నావు. పరిపాలకుడు అధర్మాత్ముడైతే ప్రపంచం మొత్తం అధర్మం అవుతుంది. లోభోऽనృతం చౌర్యమనార్యమంహో జ్యేష్ఠా చ మాయా కలహశ్చ దమ్భః - ఇవన్నీ అధర్మ లక్షణాలు
కలి ఉన్నట్లు మొదటి గుర్తు లోభం. అంతా నాకే కావాలి అనే గుణం. లోభి ధనం మీద ఆశతో భారయతో కాపురం కూడా చెయ్యడు. పొరబాటున కొడుకు పుడితే ఆస్తిని గుంజుకుంటాడని. కలి ప్రధమ లక్షణం లోభం. లోభాన్ని పోషించుకోవడానికి అబద్దం, చౌర్యం, అనార్యం (దుర్జనత), అమ్హ (పాపం), మాయ (మోసం), కలహం, ధంభం (ఇంద్రియాలను మూసుకుని మనసుతో ఇంద్రియ విషయాలని ఆలోచిస్తూ ఉండటం ధంభం)

న వర్తితవ్యం తదధర్మబన్ధో ధర్మేణ సత్యేన చ వర్తితవ్యే
బ్రహ్మావర్తే యత్ర యజన్తి యజ్ఞైర్యజ్ఞేశ్వరం యజ్ఞవితానవిజ్ఞాః

నా రాజ్యం లో ధర్మ సత్యములతోటే మీరు ప్రవర్తించాలి.
ఇది బ్రహ్మావర్తం. ఇక్కడ మహాత్ములందరు యజ్ఞ్యములతో యజ్ఞ్యపురుషున్ని ఆరాధిస్తారు

యస్మిన్హరిర్భగవానిజ్యమాన ఇజ్యాత్మమూర్తిర్యజతాం శం తనోతి
కామానమోఘాన్స్థిరజఙ్గమానామన్తర్బహిర్వాయురివైష ఆత్మా

ఈ ఆర్యావరతంలో మహానుభావులు యజ్ఞ్యములతో పరమాత్మను ఆరాధిస్తుంటే ఆయాన మంగళములను కలిగిస్తున్నాడు (శం తనోతి). కేవలం మంగళములనే కాదు కోరిన కోరికరలను అందిస్తున్నడు ఎందుకంటే ఈయనే మనలోపలా బయటా ఉన్నాడు కాబట్టి. (అమోఘాన్, స్థిర జంగమానా ). ఎలా ఐతే వాయువు లోపలా బయటా సంచరిస్తో అలాంటివాడివి నీవు
ప్రాణములేని వాటికి కూడా కోరికలు ఉంటాయి. కదలిక లేనంతా మాత్రాన జీవాత్మలేనట్లు కాదు.
పెద్దపులి గాని చిన్న పులి గాని తాను తినవలసిన జంతువు ఎదురుగా ఉంటే దాని ఎదురుగా ఉంటుంది కదలకుండా. ఎంత సేపంటే ఆ జంతువుకి ఇది ప్రాణం లేని జంతువు అని నమ్మకం కుదిరేదాక. అది ముందుకు అడుగేయగానే పులి దాని మీద పడుతుంది. ఎదుటివాన్ని తన వశం చేసుకోవడానికి తనలో ఉన్న చైతన్యాన్ని చలనాన్ని ప్రణాన్ని మరుగు పరిచి స్థావరంలాగ ఉన్న జీవులు తరువాతి జన్మలో స్థావరం గానే పుడతారు. చలనం లేని వాటికి కోరికలుండవని స్థావరములకు ఆశలుండవని అనుకోవధ్ధు. అత్రిమహర్షి ఆశ్రమానికి కొంచెం దూరం ఉండగా రాముడు చెమట పడుతున్నదని ఒక రాతిమీద కూర్చుంటాడు. లక్ష్మణుడికి ఒక అనుమానం వచ్చి 'అత్రి మహర్షి ఆశ్రమం ఇక్కడికి 10 నిముషాలే దూరం ఉంది. ఈ మాత్రానికి ఇక్కడికెందుకు కూర్చున్నారూ అని అడుగగా. 'మనం చిత్రకూటంలో ఉండగా మరీచుడు లేడి రూపంలో వచ్చాడు (రావణుడు పంపగా). నేను బాణం తీయగానే పారిపోయాడు. పారిపోతూ అలసి ఈ రాయిమీద విశ్రమించాడు. ఇక్కడ నేను కూర్చుంటే నేను వాడి దగ్గరకు వస్తున్నట్లు వాడికి సమాచరమొచ్చి తపస్సు కొంచెం పెంచుతాడు. ఈ శిల అయోధ్యా నగరంలో నా అంతపురంలో మణిమయ మండపాన్ని నిర్మించింది ఈ శిల్పియే. వాడికి మోక్షం ఇవ్వడానికి, మరీచుడికి సంకేతం ఇవ్వడానికీ ఇక్కడ కూర్చున్నా' అని అన్నాడు.

సూత ఉవాచ
పరీక్షితైవమాదిష్టః స కలిర్జాతవేపథుః
తముద్యతాసిమాహేదం దణ్డపాణిమివోద్యతమ్

ఇలా కలిపురుషున్ని శాసించేసరికి

కలిరువాచ
యత్ర క్వ వాథ వత్స్యామి సార్వభౌమ తవాజ్ఞయా
లక్షయే తత్ర తత్రాపి త్వామాత్తేషుశరాసనమ్
తన్మే ధర్మభృతాం శ్రేష్ఠ స్థానం నిర్దేష్టుమర్హసి
యత్రైవ నియతో వత్స్య ఆతిష్ఠంస్తేऽనుశాసనమ్

నీవు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను. ఉన్నా నేను ఇలాంటి దౌర్జన్య ప్రవృత్తి కలిగి ఉండను. ఎందుకంటే నేను ఎక్కడ ఉన్నా దనుర్బాణాలను పట్టుకుని నీవే కనపడుతున్నావు.
నేను ఎక్కడ ఉండాలో నీవే చెప్పు. నీవు చెప్పిన చోట నీవు చెప్పిన ఆజ్ఞ్యను పరిపాలిస్తూనే ఉంటాను.

సూత ఉవాచ
అభ్యర్థితస్తదా తస్మై స్థానాని కలయే దదౌ
ద్యూతం పానం స్త్రియః సూనా యత్రాధర్మశ్చతుర్విధః

నాలుగు చోట్లు ఇచ్చారు 1. జూతం 2. మద్యపానం 3. స్త్రీలు 4. పశు హింసలు. ఎవరికీ పనికి రాని పశువులని చంపేవారు ఉంటారు కొందరు.

పునశ్చ యాచమానాయ జాతరూపమదాత్ప్రభుః
తతోऽనృతం మదం కామం రజో వైరం చ పఞ్చమమ్

ఇంకా మళ్ళి అడగగా జాతరూపమదాత్ప్రభుః - బంగారం రూపంలో ఉండూ అన్నాడు.
అబద్దం మదం కోరిక రజో గుణం వైరం . మొత్తం కలిపి పది.

అమూని పఞ్చ స్థానాని హ్యధర్మప్రభవః కలిః
ఔత్తరేయేణ దత్తాని న్యవసత్తన్నిదేశకృత్

ఇలా పది స్థానాల్లో కలి పరీక్షిత్తు ఇచ్చిన ఈ ప్రదేశాల్లో నివసించాడు

అథైతాని న సేవేత బుభూషుః పురుషః క్వచిత్
విశేషతో ధర్మశీలో రాజా లోకపతిర్గురుః

జ్ఞ్యానం కావలనుకున్నవాడెవ్వడు వీటిని సేవించకూడదు
1. జ్యూదం  2. పానం 3. స్త్రీ 4. పశు హింస 5. బంగారం 6. అబద్దం 7. మదం 8 కోరిక 9. రజో గుణం 10. వైరం.
సామాన్యులు సేవించడం కన్నా రాజు సేవించడం వలన ప్రమాదం ఎక్కువ 

వృషస్య నష్టాంస్త్రీన్పాదాన్తపః శౌచం దయామితి
ప్రతిసన్దధ ఆశ్వాస్య మహీం చ సమవర్ధయత్

ఇలా కలిపురుషున్ని శాసించి అతన్ని వెళ్ళగొట్టి ధర్మ దేవతకు దానం తపం శౌచం అనే పాదాలు సంధింపజేసాడు. భూమిని కూడా ఓదార్చి పెంపొందింపచేసాడు (సమవర్ధయత్)

స ఏష ఏతర్హ్యధ్యాస్త ఆసనం పార్థివోచితమ్
పితామహేనోపన్యస్తం రాజ్ఞారణ్యం వివిక్షతా

అలాంటి వాడు ఇప్పుడు కూడా ఉన్నాడు పరిపాలన చేస్తున్నాడు.

ఆస్తేऽధునా స రాజర్షిః కౌరవేన్ద్రశ్రియోల్లసన్
గజాహ్వయే మహాభాగశ్చక్రవర్తీ బృహచ్ఛ్రవాః

ఇప్పటికీ ఆయన కౌరవేంద్ర శ్రీ ని, రాజ్యాన్ని గొప్ప కీర్తిని ధరించి అనుభవిస్తున్నాడు.

ఇత్థమ్భూతానుభావోऽయమభిమన్యుసుతో నృపః
యస్య పాలయతః క్షౌణీం యూయం సత్రాయ దీక్షితాః

ఆయన ధర్మముగా రాజ్యపరిపాలన చేస్తున్నాడు కాబట్టే మనం ధరియంతో వేయి సంవత్స్రాలు గల సత్రాన్ని చేస్తున్నాము

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పదహారవ అధ్యయం

సూత ఉవాచ
తతః పరీక్షిద్ద్విజవర్యశిక్షయా మహీం మహాభాగవతః శశాస హ
యథా హి సూత్యామభిజాతకోవిదాః సమాదిశన్విప్ర మహద్గుణస్తథా

విప్రులారా పరీక్షిత్తు పుట్టినప్పుడు (సూత్యాం) ఎలా ఐతే జాతకం తెలిసినవాళ్ళు అభిప్రాయపడ్డారో (సమాదిశన్) అలాగే మహా భాగవతుడైన పరీక్షిత్తు బ్రాహమణుల శిక్షణ చేత భూమిని పరిపాలించాడు.

స ఉత్తరస్య తనయాముపయేమ ఇరావతీమ్
జనమేజయాదీంశ్చతురస్తస్యాముత్పాదయత్సుతాన్

ఉత్తరుని కుమారుడైన ఇరావతిని పెండ్లాడి నలుగురు కొడుకులని కన్నాడు. అందుల్ఫ్ జనమేజయుడు పెద్ద వాడు

ఆజహారాశ్వమేధాంస్త్రీన్గఙ్గాయాం భూరిదక్షిణాన్
శారద్వతం గురుం కృత్వా దేవా యత్రాక్షిగోచరాః

శారదవతుడు (కృపాచార్యుడు) గురువుగా చేసికొని మూడు అశ్వమేధ యాగములు భూరి దక్షిణలతో కూడి గంగా తీరములో చేసాడు. ఈ అశ్వమేధ యజ్ఞ్యానికి సామన్య మానవులకు కనపడేట్లుగా దేవతలు వచ్చారు

నిజగ్రాహౌజసా వీరః కలిం దిగ్విజయే క్వచిత్
నృపలిఙ్గధరం శూద్రం ఘ్నన్తం గోమిథునం పదా

తన దిగ్విజయ యారలో భాగంగా రాజువేషం వేసుకున్న శూద్రుడి రూపంలో ఉండి గోవునీ వృషబాన్నీ కాలితో తన్నుతున్న కలిని నిగ్రహించాడు

శౌనక ఉవాచ
కస్య హేతోర్నిజగ్రాహ కలిం దిగ్విజయే నృపః
నృదేవచిహ్నధృక్శూద్ర కోऽసౌ గాం యః పదాహనత్
తత్కథ్యతాం మహాభాగ యది కృష్ణకథాశ్రయమ్

కలిని పరీక్షిత్తు ఏ కారణం చేత నిగ్రహించాడు. రాజు వేషం వేసుకున్న శూద్రుని రూపంలో ఉండి గోవుని కాలితో స్పృశించినందుకా. కృష్ణ కథా సంబంధమైతే దీన్ని వివరించవలసింది

అథవాస్య పదామ్భోజ మకరన్దలిహాం సతామ్
కిమన్యైరసదాలాపైరాయుషో యదసద్వ్యయః

పరమాత్మ పాదములనే పద్మముల మకరందాన్ని గ్రోలే భక్తులకు అసత్ ఆలాపములు ఎందుకు. వాటితో ఆయువు వ్యయం చేయడం ఎందుకు (అసత్ వ్యయ:)

క్షుద్రాయుషాం నృణామఙ్గ మర్త్యానామృతమిచ్ఛతామ్
ఇహోపహూతో భగవాన్మృత్యుః శామిత్రకర్మణి

క్షుద్రాయుషాం  - అల్పమైన ఆయ్షు కలవారు మానవులు. ఓ సూతా (అఙ్గ ), సత్యం తెలుసుకోవాలనే వారు మృత్యు భగవానుని శమింపచేసే కర్మలు చేస్తారు

న కశ్చిన్మ్రియతే తావద్యావదాస్త ఇహాన్తకః
ఏతదర్థం హి భగవానాహూతః పరమర్షిభిః
అహో నృలోకే పీయేత హరిలీలామృతం వచః

మృత్యువు  ఇక్కడ ఉన్నంత వరకూ ఎవరూ ప్రాణాలు కోల్పోరు, అందుకే ఋషులు ఆ భగవానుని ఆహ్వానించారు. నరలోకంలో ఉండే వారి హరి లీలామృతాన్ని గ్రోలుదురు గాక

మన్దస్య మన్దప్రజ్ఞస్య వయో మన్దాయుషశ్చ వై
నిద్రయా హ్రియతే నక్తం దివా చ వ్యర్థకర్మభిః

మందబుద్ధి గల మానవులు నిద్రతో రాత్రినీ వ్యర్థకర్మలతో పగటినీ వృధా చేస్తారు

సూత ఉవాచ
యదా పరీక్షిత్కురుజాఙ్గలేऽవసత్కలిం ప్రవిష్టం నిజచక్రవర్తితే
నిశమ్య వార్తామనతిప్రియాం తతః శరాసనం సంయుగశౌణ్డిరాదదే

పరీక్షిత్తు కురు జాంగల రాజ్యంలో ఉండగా తన పరిపాలనలో కలి ప్రవేశించాడన్న ప్రియము కానటువంటి వారతని తెలుసుకొని, తన శరములను బాణములను తీసుకుని యుధ్ధమునకు బయలుదేరాడు.

స్వలఙ్కృతం శ్యామతురఙ్గయోజితం రథం మృగేన్ద్రధ్వజమాశ్రితః పురాత్
వృతో రథాశ్వద్విపపత్తియుక్తయా స్వసేనయా దిగ్విజయాయ నిర్గతః

అలంకృతమైన నల్లని గుఱ్ఱములు గలిగి ఉన్న రథం, సిమ్హ ద్వజముతో, రథ, అశ్వ, గజ సేనలు పరివేష్టితమై ఉండగా విజయాభిలాషియై బయలుదేరాడు

భద్రాశ్వం కేతుమాలం చ భారతం చోత్తరాన్కురూన్
కిమ్పురుషాదీని వర్షాణి విజిత్య జగృహే బలిమ్


పరీక్షిన్మహారాజు భద్రాశ్వం కేతుమాలం భారతం, ఉత్తరకురు , కింపురుష మొదలిన వర్షములను గెలిచాడు

నగరాంశ్చ వనాంశ్చైవ నదీశ్చ విమలోదకాః
పురుషాన్దేవకల్పాంశ్చ నారీశ్చ ప్రియదర్శనాః
అదృష్టపూర్వాన్సుభగాన్స దదర్శ ధనఞ్జయః
సదనాని చ శుభ్రాణి నారీశ్చాప్సరసాం నిభాః

నగరాలు వనాలు నదులు అందమైన పురుషులూ స్త్రీలు మొదలైన వారిని చూచాడు

తత్ర తత్రోపశృణ్వానః స్వపూర్వేషాం మహాత్మనామ్
ప్రగీయమాణం చ యశః కృష్ణమాహాత్మ్యసూచకమ్

ఎక్కడకి వెళ్తే అక్కడ తన పూర్వులైన పాండవుల గురించి, కృష్ణ మాహాత్యం గురించి స్తోత్రాలు విన్నాడు

ఆత్మానం చ పరిత్రాతమశ్వత్థామ్నోऽస్త్రతేజసః
స్నేహం చ వృష్ణిపార్థానాం తేషాం భక్తిం చ కేశవే

పరీక్షిన్మహరాజుని అశ్వద్ధమ అస్త్ర తేజసు నుండి కృష్ణుడు రక్షించడాన్ని, వృష్ణి పృధుల స్నేహాన్ని, వారి భక్తినీ కూడా కీర్తించారు

తేభ్యః పరమసన్తుష్టః ప్రీత్యుజ్జృమ్భితలోచనః
మహాధనాని వాసాంసి దదౌ హారాన్మహామనాః

వారి స్తోత్రానికి సంతోషించి విప్పారిన నేత్రములు కలిగిన రాజు వారికి కానుకలు హారములు వస్త్రములు ఇచ్చాడు

సారథ్యపారషదసేవనసఖ్యదౌత్య
వీరాసనానుగమనస్తవనప్రణామాన్
స్నిగ్ధేషు పాణ్డుషు జగత్ప్రణతిం చ విష్ణోర్
భక్తిం కరోతి నృపతిశ్చరణారవిన్దే

కృష్ణభగవానుడు సారధిగా, పారషదుడిగా, సఖ్యునిగా, దూతగా, కాపలావాడిగా, అనుగమించేవాడిగా, నమస్కరించే వాడిగా అందరిచేతా నమస్కరింపబడే కృష్ణుడు ఉన్నాడన్న సంగతి విని కృష్ణ చరణారవిందములయందు భక్తి తో ఉప్పొంగాడు

తస్యైవం వర్తమానస్య పూర్వేషాం వృత్తిమన్వహమ్
నాతిదూరే కిలాశ్చర్యం యదాసీత్తన్నిబోధ మే

ఇలా రొజూ తన పూర్వీకుల వైభవములో మునిగి ఉన్న పరీక్షిత్తుకి నేను మీకు చెప్పబోయే ఆశ్చర్యకరమైన సంఘటన దగ్గరలోనే వచ్చింది. (పూర్వేషాం - పూర్వులు, వర్తమానస్య - మునిగి ఉన్న అన్వహం - ప్రతీ రోజు )

ధర్మః పదైకేన చరన్విచ్ఛాయాముపలభ్య గామ్
పృచ్ఛతి స్మాశ్రువదనాం వివత్సామివ మాతరమ్

ఏక పాదము మీద ధర్మము నిలబడి కళారహితముగా ఉండి (విచ్ఛాయాం) ఉండగా అక్కడకి కన్నీళ్ళు పెడుతూ పిల్లని కోల్పోయిన తల్లి వలే ఉన్న ఒక గోవుని గమనించిది (చూచింది) (ఉపలభ్య )

ధర్మ ఉవాచ
కచ్చిద్భద్రేऽనామయమాత్మనస్తే విచ్ఛాయాసి మ్లాయతేషన్ముఖేన
ఆలక్షయే భవతీమన్తరాధిం దూరే బన్ధుం శోచసి కఞ్చనామ్బ

మంగళకరమైన దానా నీ ఆరోగ్యానికి ఎమైనా అయిందా.  విచ్ఛాయాసి  - కళావిహీనంగా ఉన్నావు. మ్లాయత ఏషన్ ముఖం -  బాధతో నల్లబడిన ముఖముతో లోపల దిగులుతో (అంతరాధి) బాధపడుతున్నట్లున్నావు, దూర బంధువులకోసం చింతిస్తున్నట్లు ఉన్నావు

పాదైర్న్యూనం శోచసి మైకపాదమాత్మానం వా వృషలైర్భోక్ష్యమాణమ్
ఆహో సురాదీన్హృతయజ్ఞభాగాన్ప్రజా ఉత స్విన్మఘవత్యవర్షతి

పాదై: న్యూనం శొచసి - నా పాదములు చూసి శోకిస్తున్నావా లేక మాంస భక్షకులగురించి భయపడుతున్నావా లేక యజ్ఞ్యములు ఆగిపోయినందు వలన సురాదులు యజ్ఞ్యభాగములు లేకపోవడాన్ని చూసి బాధపడుతున్నావా లేక కరువు వల్ల ప్రాణులు బాధపడడం చూసి బాధపడుతున్నావా

అరక్ష్యమాణాః స్త్రియ ఉర్వి బాలాన్శోచస్యథో పురుషాదైరివార్తాన్
వాచం దేవీం బ్రహ్మకులే కుకర్మణ్యబ్రహ్మణ్యే రాజకులే కులాగ్ర్యాన్

రక్షణలేని స్త్రీలను బాలలను  గూర్చి ఆలోచించా లేక స్వధర్మాన్ని వదిలి నీచుల పంచన చేరిన బ్రాహ్మణుల గురించా

కిం క్షత్రబన్ధూన్కలినోపసృష్టాన్రాష్ట్రాణి వా తైరవరోపితాని
ఇతస్తతో వాశనపానవాసః స్నానవ్యవాయోన్ముఖజీవలోకమ్

లేక దుష్ట పాలకులు చేస్తున్న దుష్పరిపాలనను చూసా లేక తినడం యందు తాగడం యందు నివసించడం యందు, స్నాన, సంభోగములందు ఒక పద్దతిని పాటించని జనులని చూచా?

యద్వామ్బ తే భూరిభరావతార కృతావతారస్య హరేర్ధరిత్రి
అన్తర్హితస్య స్మరతీ విసృష్టా కర్మాణి నిర్వాణవిలమ్బితాని

లేకపోతే అమ్మా, నీ భారాన్ని తగ్గించడానికి కృష్ణపరమాత్మ అవతరించాడు. ఆయన అవతారాన్ని చాలించడంతో ఆయాన చేసిన లీలలను కర్మలను గుర్తుకు తెచ్చుకుని బాధపడుతున్నావా

ఇదం మమాచక్ష్వ తవాధిమూలం వసున్ధరే యేన వికర్శితాసి
కాలేన వా తే బలినాం బలీయసా సురార్చితం కిం హృతమమ్బ సౌభగమ్

వసుంధరా, నీ బాధకు మూలమేమిటో నాకు చెప్పు. బలీయమైన కాలం సురుల చేత కూడా అర్చించబడే నీ అదృష్టాన్ని హరించింది అని నేను భావిస్తున్నాను.

ధరణ్యువాచ
భవాన్హి వేద తత్సర్వం యన్మాం ధర్మానుపృచ్ఛసి
చతుర్భిర్వర్తసే యేన పాదైర్లోకసుఖావహైః

ధర్మమా, నీవడిగిన ప్రశ్నలకు నీకు సమాధానం తెలిసే ఉంటుంది. నీవు కూడా నాలుగు పాదాల మీదా నిలచి లోఖానికి సుఖాన్ని అందించావు

సత్యం శౌచం దయా క్షాన్తిస్త్యాగః సన్తోష ఆర్జవమ్
శమో దమస్తపః సామ్యం తితిక్షోపరతిః శ్రుతమ్

సత్యం శౌచం దయా శాంతి తాయగం సంతోషం ఆర్జవం శమము దమము అందరినీ సమానంగా చూచుట, ఓర్పు (తితిక్ష), లాభ నష్టాలను సమానంగా చూచుట (ఉపరతి), వేదాలను పాటించడం

జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతిః
స్వాతన్త్ర్యం కౌశలం కాన్తిర్ధైర్యం మార్దవమేవ చ

జ్ఞ్యానం విరక్తి అయిశ్వర్యం (ఈశ్వరత్వం) శౌర్యం తేజస్సు బలము, స్మృతి, స్వాతంత్ర్యం, కౌశలం, కాంతి ధైర్యం, మార్దవం (జాలి) ,

ప్రాగల్భ్యం ప్రశ్రయః శీలం సహ ఓజో బలం భగః
గామ్భీర్యం స్థైర్యమాస్తిక్యం కీర్తిర్మానోऽనహఙ్కృతిః

ప్రాగల్బ్యం (ధైర్యం) ప్రశ్రయం (మంచితనము) శీలం, పట్టుదల, జ్ఞ్యానం, బలం, గాంభీర్యం, స్థైర్యం, నిజాయితీ, కీర్తి, అహంకారం లేకపోవడం,

ఏతే చాన్యే చ భగవన్నిత్యా యత్ర మహాగుణాః
ప్రార్థ్యా మహత్త్వమిచ్ఛద్భిర్న వియన్తి స్మ కర్హిచిత్

ఇలాంటీ మహాగుణాలు భగవంతుని వీడకుండా ఎపుడూ ఉంటాయి.

తేనాహం గుణపాత్రేణ శ్రీనివాసేన సామ్ప్రతమ్
శోచామి రహితం లోకం పాప్మనా కలినేక్షితమ్

ఆయన అవతారం చాలించాక కలి తన ప్రభావాన్ని అన్నిచోట్లా వ్యాపింపచేసాడు. ఆ స్థితి చూచి నేను బాధపడుతున్నాను

ఆత్మానం చానుశోచామి భవన్తం చామరోత్తమమ్
దేవాన్పితౄనృషీన్సాధూన్సర్వాన్వర్ణాంస్తథాశ్రమాన్

నాకోసం కూడా నేను చింతిస్తున్నాను. అంతే కాదు  నీ గురించి అమరోత్తముల గూర్చి, దేవతలు పితృదేవతలూ ఋషులు సాధులు అన్ని వర్ణాశ్రమాల వారి గురించీ ఈ నా చింత

బ్రహ్మాదయో బహుతిథం యదపాఙ్గమోక్ష
కామాస్తపః సమచరన్భగవత్ప్రపన్నాః
సా శ్రీః స్వవాసమరవిన్దవనం విహాయ
యత్పాదసౌభగమలం భజతేऽనురక్తా

ఎవరి కటాక్ష వీక్షణంకోసం బ్రహ్మాది దేవతలు ఎదురు చూస్తారో ఆ లక్ష్మి, పరమాత్మ కోసం తపమాచరైంచి తన పద్మనివాసాన్ని విడిచి పరమాత్మ పాదముల వద్దకు చేరిందో 

తస్యాహమబ్జకులిశాఙ్కుశకేతుకేతైః
శ్రీమత్పదైర్భగవతః సమలఙ్కృతాఙ్గీ
త్రీనత్యరోచ ఉపలభ్య తతో విభూతిం
లోకాన్స మాం వ్యసృజదుత్స్మయతీం తదన్తే

ఆ పరమాత్మ పాద చిహ్నములు నన్ను అలంకరించాయి, అది నాకు మూడు లోకాలకు  లభించని విభూతి నాకు లభించింది. నేను అంత అదృష్టవంతురాలినని అనుకుంటూ ఉంటే పరమాత్మ నన్ను వదిలి  వెళ్ళాడు

యో వై మమాతిభరమాసురవంశరాజ్ఞామ్
అక్షౌహిణీశతమపానుదదాత్మతన్త్రః
త్వాం దుఃస్థమూనపదమాత్మని పౌరుషేణ
సమ్పాదయన్యదుషు రమ్యమబిభ్రదఙ్గమ్

దుర్మార్గూలైన రాజుల వలన పెరిగిన నా భారాన్ని తగ్గించడానికి. యదు వంశములో జన్మించి నిన్నూ నన్నూ కూడా ఆయన మన బాధలనుండి విముక్తి ప్రసాదించాడు

కా వా సహేత విరహం పురుషోత్తమస్య
ప్రేమావలోకరుచిరస్మితవల్గుజల్పైః
స్థైర్యం సమానమహరన్మధుమానినీనాం
రోమోత్సవో మమ యదఙ్ఘ్రివిటఙ్కితాయాః

ఆయన విరహం ఎవరు సహించగలరు, ఆయన ప్రేమాస్పదమైన చూపులతో, చిరునవ్వుతో, హృదయానికి హత్తుకొనే చేష్టలతో ఎంతో మంది గోపికలను స్త్రీలను జయించాడు. ఆయన పద ధూళితో నిండిన గడ్డి నా శరీరం మీద ఆనందంతో రోమాలు నిక్కబొడుచుకున్నట్లు అనిపించేది.

తయోరేవం కథయతోః పృథివీధర్మయోస్తదా
పరీక్షిన్నామ రాజర్షిః ప్రాప్తః ప్రాచీం సరస్వతీమ్

ఇలా భూమీ ధర్మమూ మాట్లాడుకుంటూ ఉండగా పరీక్షిత్తు అక్కడికి వచ్చాడు  

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పదిహేనవ అధ్యాయం

సూత ఉవాచ

ఏవం కృష్ణసఖః కృష్ణో భ్రాత్రా రాజ్ఞా వికల్పితః

నానాశఙ్కాస్పదం రూపం కృష్ణవిశ్లేషకర్శితః

భ్రాత్రా రాజ్ఞ ఆవికల్పితః: ధర్మరాజు ఇన్ని రకాలుగా అడిగితే. కృష్ణవిశ్లేషకర్శితః : కృష్ణవియోగంతో చిక్కిపోయినవాడై ముఖము వాడిపోయింది

శోకేన శుష్యద్వదన హృత్సరోజో హతప్రభః

విభుం తమేవానుస్మరన్నాశక్నోత్ప్రతిభాషితుమ్

శుష్యత్ వదన :  కృష్ణవియోగంతో చిక్కిపోయినవాడై ముఖము వాడిపోయింది

హృత్సరోజో హతప్రభః హృదయపద్మం కూడా కంతిని తగ్గించుకుంది

విభుం తమేవానుస్మరన్నాశక్నోత్ప్రతిభాషితుమ్ - పరమాత్మనే స్మరిస్తూ మాటలు రాక నిలబడెను

కృచ్ఛ్రేణ సంస్తభ్య శుచః పాణినామృజ్య నేత్రయోః

పరోక్షేణ సమున్నద్ధ ప్రణయౌత్కణ్ఠ్యకాతరః

ఎంతో కష్టపడి దుఖాన్ని దిగమింగుకొని కనులు తుడుచుకొని

పరమాత్మ ఎదురుగా ఉన్నప్పుడు అతని మీద ఉన్న ఉత్సాహం చాటుగ ఉన్నప్పుడు ఎక్కువైంది. కాతర: దీనుడైపోయాడు

సఖ్యం మైత్రీం సౌహృదం చ సారథ్యాదిషు సంస్మరన్

నృపమగ్రజమిత్యాహ బాష్పగద్గదయా గిరా

కృష్ణుణ్ణి తలచుకుంటే తలచుకోవాల్సింది సఖ్యం మైత్రీం సౌహృదం

ఈ  మూడితికీ తేడా ఉంది.సౌహృదం - హృదయాంతర్గంలో కూడా ఎదుటివాడిమేలు కోరడం. హృదయం కూడా 'సూ కావాలి. హృదయాంతర్గతం కూడా హితం కోరుకోవడము

మైత్రీం  - మిత్రత. తనవాడు అనుకున్నవాడి దోషాలని వివరించి సవరించే పని చెస్తే అది మైత్రీ

సఖ్యం  - ఖం అంటే ఇంద్రియాలు. స ఖ్యం అంటే సమానాన్ని. అంటే ఇంద్రియాలు సమానం. అంటే? అన్నిటిలో ఒకలా ఉండటం, పనిచేయడంలో, తినడంలో తిరగడంలో, అన్నిటిలో ఒకలా ఉండటం.

సారధ్యంలో సౌహృదాన్ని స్మరించాడు. యుధ్ధం జరిగిన 18 రోజులు కృష్ణుడు అర్జనునితోనే ఉన్నాడు. కృష్ణుని దృష్టి సాకే దూరంలోనే మిగతా నలుగురు పాండవులూ ఉన్నారు. ఒక వేళ కృష్ణుడు కూడా యుధ్ధం చేస్తే యుధ్ధం చేస్తూ పాండవుల యోగ క్షేమాన్ని కనిపెట్టడం కష్టమవుతుంది. సారధిగా ఉండి ఐదుగురినీ కాపాడాడు. ఒక సారి కర్ణుడి ప్రతాపం చూచి అర్జనుడే రథాన్ని వెనక్కి జరపమన్నాడు. అపుడు ధర్మరాజు ముందుకొచ్చి కర్ణున్ని అడ్డుకున్నాడు. ధర్మరాజులో తన శక్తిని నిక్షేపించాడు. ఒక సారి వీరిద్దరూ భయపడితే భీముడిలో నిక్షేపించాడు. అలాగే భగదత్తుడు వచ్చినప్పుడు వీళ్ళ ముగ్గురినీ కాపాడటానికి సహదేవున్ని పంపాడు. ఆయన శక్తిని సహదేవునిలో నిక్షేపించాడు

18 రోజుల యుధ్ధంలో సహదేవుడుకూడ ఒక రోజు మొత్తం కౌరవ సైన్యాన్ని ఆపాడు.

కృష్ణుడు వెంటలేనప్పుడు నలుగురు పాండవులు ఉండి కూడా అభిమన్యున్ని కాపాడలేకపోయారు

అలాగే రాయబారంలో ఆయన చూపిన మైత్రీ. ఇవన్నీ గుర్తుకుతెచ్చుకున్నాడు.

అర్జున ఉవాచ

వఞ్చితోऽహం మహారాజ హరిణా బన్ధురూపిణా

యేన మేऽపహృతం తేజో దేవవిస్మాపనం మహత్

ఓం నమో భగవతే వాసుదేవాయ

వఞ్చితోऽహం మహారాజ హరిణా బన్ధురూపిణా

యేన మేऽపహృతం తేజో దేవవిస్మాపనం మహత్

బంధువుగా ఉన్న శ్రీహరిచేత నేను మోసగింపబడ్డాను. ఇక్కడ మోసగించబడటం అంటే అనుఖొనిది జరగడం. అందరు కృష్ణుని యందు పరమాత్మ భావన కలిగి ఉన్నవారే.

ఎంతో కాలం నేను దేవతలను కూడా ఆశ్చర్యపరిచాను (దేవవిస్మాపనం ) నా తేజస్సుతో. అది అంతా నా తేజస్సు అని అనుకున్నాను. ఏ మహానుభావుని చేత దేవతలకి కూడా ఆశ్చర్యపరిచే నా పరాక్రమం అపహరించబడింది.

యస్య క్షణవియోగేన లోకో హ్యప్రియదర్శనః

ఉక్థేన రహితో హ్యేష మృతకః ప్రోచ్యతే యథా

ఏ ప్రాణి అయిన ఏది ఉంటే ప్రకాశిస్తున్నారో ఏది లేకపోతే అంతకు ముందు ప్రేమించినవారంతా భయపడతారో అది ప్రాణం

ఏ మహానుభావుని యొక్క క్షణ కాల వియోగంతో ప్రపంచమంతా శూన్యంగా కనపడుతుందో, ఎలాగంటే ప్రాణం లేని దేహం లాగ.ఒక క్షణకాల వియోగానికే లోకమంతా అప్రియంగా కనపడుంది.

ఆయన లేని మనం ప్రాణం లేని దేహంతో సమానం

యత్సంశ్రయాద్ద్రుపదగేహముపాగతానాం రాజ్ఞాం స్వయంవరముఖే స్మరదుర్మదానామ్

తేజో హృతం ఖలు మయాభిహతశ్చ మత్స్యః సజ్జీకృతేన ధనుషాధిగతా చ కృష్ణా

తను జీవితకాలం లో సాధించిన విజయాలని,

పాండవులు ఏమి ఏమి విజయాలు సాధించారో అవి అన్నీ చెబుతున్నాడు

ద్రౌపదీ స్వయం వరానికి అందరూ వచ్చారు. పాండవులు బ్రాహ్మణ వేషంతో ఉన్నారు. క్షత్రియులని చెప్పుకున్నవారందరు మత్స్య యంత్రాన్ని చేధించలేకపోయారు. అది అవమానం అని భావించి ద్రుపదుడు

"లక్ష్యన్ని కొట్టగలవారు, కొట్టినా చేసే పనిలో సౌహార్దం ఉండాలి తప్ప ద్వేషం ఉండకూడదు, చక్కని శాస్త్ర పాండిత్యం కలవారు అయి ఉండాలి. వేదాధ్యాయం చేసే బ్రాహ్మణులు కూడా రవొచ్చు" అని చెప్పగా అర్జనుడు వెళ్ళి కొట్టాడు. అది సహించలేని రాజులు మమ్మల్ని ఓడిస్తేనే నీవు గెలిచినట్లు అని అన్నారు, ద్రౌపది మీద కోరికతో. ఆ మదం తో వారు యుధ్ధానికి వస్తే

వారితేజస్సును నేను హరించాను. మత్స్యాన్ని కూడా కొట్టాను. (తేజో హృతం ఖలు మయాభిహతశ్చ మత్స్యః )

ద్రౌపతిని కూడా పొందాను.ఇది అంతా నా ప్రతిభ చేత కాదు (యత్సంశ్రయా - ఎవరి ఆశ్రయం వల్ల)

స్వయంవరానికి కబురు పంపింది కృష్ణుడే

యత్సన్నిధావహము ఖాణ్డవమగ్నయేऽదామిన్ద్రం చ సామరగణం తరసా విజిత్య

లబ్ధా సభా మయకృతాద్భుతశిల్పమాయా దిగ్భ్యోऽహరన్నృపతయో బలిమధ్వరే తే

ఖాండవ వన దహనం లో ఇంద్రుని మీదే గెలిచాను. వాహ్యాళికి వెళ్ళినట్లు బయలుదేరించి అర్జనునికి ఆయుధాలిప్పించి ఇంద్రునితో యుధ్ధం చేసి వర్షం రాకుండా చేసి ఖాండవ వనం దహింపజేసాడు.

దేవతల గణాంతో కూడిన ఇంద్రున్ని గెలిచి (ఇన్ద్రం చ సామరగణం), అదే సమయంలో మయుడు కాపాడబడితే మయుడు ఒక సభను తయారు చేసి ఇచ్చాడు. కుంతీ స్తోత్రంలో చెప్పబడినట్లు అర్జనునికి గాండీవాన్ని తనకి సుదర్శనాన్ని ధర్మరాజుకు మయసభ ఇప్పించి ఇంద్రున్ని అర్జనుడు జయించాడన్న కీర్తి చాటించి  - ఆ మయ సభ వలనే భారతంలో మిగతా ఘట్టాలన్ని జరిగాయి. పాండవులకు అవమానం జరిగితేనే గానీ వారి మనసు క్షోభించదు, ధర్మాత్ముల మనసు క్షోభిస్తేనే గాని అధర్మం అంతరించదు.

కృష్ణుడు మయసభను ఇప్పించడంలో సూక్షం , దుర్యొధనునికి ఆ మయసభను విడిదిగా ఇప్పించమని ధర్మరాజుకు చెప్పడం ఇదంతా ఆయన సంకల్పమే

ఆ మయ సభలోనే సామంత రాజులంతా నీకు ధనాన్ని అర్పించారు

యత్తేజసా నృపశిరోऽఙ్ఘ్రిమహన్మఖార్థమార్యోऽనుజస్తవ గజాయుతసత్త్వవీర్యః

తేనాహృతాః ప్రమథనాథమఖాయ భూపా యన్మోచితాస్తదనయన్బలిమధ్వరే తే

ఈ మహానుభావుడు రాజసూయం చేయించి నీ తమ్ముడు నా అన్నగారైన  భీముడు (గజాయుతసత్త్వవీర్యః) పదివేల ఏనుగుల బలం గల జరాసంధున్ని ఓడించాడు. రాజసూయం శివ మయం అయిన యాగం  (ప్రమథనాథమఖాయ). అయితే రాజసూయం ఎవరు చేసిన సకలదేవత అర్పణం చేసి చివరి ఆహుతి శివునికి ఇస్తారు. యజ్ఞ్య రక్షకుడు విష్ణువు కాబట్టి శంకరునికి ఆహుతి చేసి, కృష్ణునికి అగ్రపూజ చేసారు. దాని వల్ల ధర్మరాజుకు చక్రవర్తి హోదా వచ్చింది. ఈ కీర్తిని మాకు వచ్చేట్లు చేసిన కృష్ణుడు

పత్న్యాస్తవాధిమఖక్లృప్తమహాభిషేక శ్లాఘిష్ఠచారుకబరం కితవైః సభాయామ్
స్పృష్టం వికీర్య పదయోః పతితాశ్రుముఖ్యా యస్తత్స్త్రియోऽకృతహతేశవిముక్తకేశాః

ఆ రజసూయమైన తరువాత జరిగిన అవభృత స్నానంతో పవిత్రమైన గంగా జలంతో (మఖక్లృప్తమహాభిషేక ) తడిసిన నీ పట్టపురాని (పత్న్యాస్తవా) కొనియాడబడే కేశములను ( శ్లాఘిష్ఠచారుకబరం) అసూయతో నీ శత్రువులు స్పృశించారు (కితవైః స్పృష్టం  - కపటులతో స్పృశించబడింది) . వారు స్పృశిస్తే వారి భార్యలు కేశములు ముడివేయలేని స్థితికి వచ్చారు.

యో నో జుగోప వన ఏత్య దురన్తకృచ్ఛ్రాద్దుర్వాససోऽరిరచితాదయుతాగ్రభుగ్యః
శాకాన్నశిష్టముపయుజ్య యతస్త్రిలోకీం తృప్తామమంస్త సలిలే వినిమగ్నసఙ్ఘః

అరణ్యవాసంలో కూడా దుర్యోధనుడు వదలక దుర్వాసున్ని పదివేలమంది శిష్యులతో సహా భోజనానికి పాండవుల వద్దకు పంపాడు. అక్ష్యపాత్రను అప్పుడే కడిగి పెట్టడంవల్ల మరునాడు ఉదయంవరకూ దానిని వాడటం కుదరదు. అప్పుడు ద్రౌపతి ధర్మరాజు తక్షణ కర్త్వ్యమేమిటని మధనపడుతుంటే ధర్మరాజు సలహా మేరకు ద్రౌపది కృష్ణుణ్ణి పిలిస్తే, వెంటనే కృష్ణుడు ఆకలవుతుందంటూ వస్తాడు. ద్రౌపతిని అక్షపాత్ర తీసుకు రమ్మని అందులో మూడు మెతుకులని చూపిస్తాడు.
మనం చాలా జాగ్రత్తగా పనిచేసాము అనుకున్న దాంట్లొ లొసుగులు ఉంటాయి అనడానికి ఇది ఒక నిదర్శనం.
ఇంటికి వచ్చిన అథిది కి భోజనం పెట్టడానికి కూడా ఆయన కృపే కావల్సి వచ్చింది
పదివేలమందితో కలిసి భోజనానికి వచ్చిన దుర్వాసునికి కూరగాయలతో కలిపి ఉన్న అన్నంతో (కృష్ణుడు అప్పుడు చెప్పాడు - నేనే అన్నమును కావలంటే ఆవిర్భవిస్తాను వద్దనుకుంటే అంతర్ధానమవుతాను)

యత్తేజసాథ భగవాన్యుధి శూలపాణిర్విస్మాపితః సగిరిజోऽస్త్రమదాన్నిజం మే
అన్యేऽపి చాహమమునైవ కలేవరేణ ప్రాప్తో మహేన్ద్రభవనే మహదాసనార్ధమ్

అరణ్యవాసంలో ఉన్నప్పుడు వ్యాస భగవానుడు వచ్చి - అరణ్య అజ్ఞ్యాత వాసాలు ముగిసాక వారు రాజ్యం ఇవ్వకపోతే నీవు యుధ్ధం చేసి రాజ్యం సంపాదించాలి. వారి పక్షంలో 21సార్లు భూమడలాన్ని ని:క్షత్రియం చేసిన బీష్ముడిని, దృఒణున్ని, కర్ణుణ్ణి, కృపున్ని, అశ్వధ్ధామ ఉన్నారు. వారు అస్త్రబలం దేహబలం కాకుండా దివ్యాస్త్రబలం ఉన్నవారు. తపసుతో ఎందరినో ప్రసన్నం చేసుకుని దివ్యాస్త్రాలని పొందారు. నీవు అర్జనుని పంపి శంకరుని గూర్చి తపసు చేయమను. అర్జనున్ని శంకరుడు - నన్ను కొట్టి నీ వరాహాన్ని తీసుకో అంటే, అర్జనుడి అమ్ములపొదిలో ఎన్నడూ లేనివిధంగా బాణములు ఐపోయాయి, అప్పుడు ధనస్సుతో శనకుర్నిమీదకు వచ్చినపుడు, సమయస్పూర్థి ఉన్నవాడివి నీవు గెలిచావులే అన్నాడు. అర్జనునికి పాశుపశాస్త్రం ఇచ్చాడు. శంకరున్నే ఓడించాడన్న పేరు పొందడానికి ఎవరు కాలం .
అది పొందిన తరువాతే అర్జనుడు ఇంద్రునికి సాయం చేసి ఇంద్రుని ఆహవానంతో ఇదే శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు, వెళ్ళి అర్థాసనాన్ని పొందాడు. (అందరూ శరీరం వదిలి వెళితే అర్జనుడు కృష్ణుని వల్ల శరీరంతోటే స్వర్గానికి వెళ్ళాడు)

తత్రైవ మే విహరతో భుజదణ్డయుగ్మం గాణ్డీవలక్షణమరాతివధాయ దేవాః
సేన్ద్రాః శ్రితా యదనుభావితమాజమీఢ తేనాహమద్య ముషితః పురుషేణ భూమ్నా

ఎవరి సంకల్పానుగ్రహం వలన పొందిన అస్త్రాది బలంతో ఉన్న నేను దేవతలకి సాయం చేసి వరములు పొందాను. అలాంటివాడు నన్ను మోసం చేసాడు (ముషితః )

యద్బాన్ధవః కురుబలాబ్ధిమనన్తపారమేకో రథేన తతరేऽహమతీర్యసత్త్వమ్
ప్రత్యాహృతం బహు ధనం చ మయా పరేషాం తేజాస్పదం మణిమయం చ హృతం శిరోభ్యః
ఇది ఉత్తరగోగ్రహణానికి సంబంధించినది
దాటడానికి సరిపొయే బలం లేని నేను ఇంత పెద్ద కౌరవ సమూహాన్ని రథంతోటే దాటాను (కృష్ణుని సారధ్యం వల్ల).
ఉత్తర గోగ్రహణంలో అందరినీ ఓడించి వారి శిరస్సులకి గల పుత్తలికలను తీసుకు వచ్చాను కృష్ణుని అనుగ్రహంతో
(మనకి ఉత్తరగోగ్రహణంలో కృష్ణుడు కనపడడు. ఉత్తరకుమారుడు సారధ్యం చేయడానికి వెళ్తూ తన గదిలో కృష్ణపరమాత్మను ధ్యానం చేసి అనుగ్రహం కోరగా కృష్ణుడు వచ్చి అభయమిస్తాడు)

యో భీష్మకర్ణగురుశల్యచమూష్వదభ్ర రాజన్యవర్యరథమణ్డలమణ్డితాసు
అగ్రేచరో మమ విభో రథయూథపానామాయుర్మనాంసి చ దృశా సహ ఓజ ఆర్చ్ఛత్

కురుక్షేత్ర సంగ్రామంలో నాకంటే ముందు నిలిచి (ఆయుర్మనాంసి చ దృశా) శత్రువుల ఆయువును మనసును బలమును కంటి చూపుతోటే తీసుకున్నాడు. రావణున్ని చంపడానికి రాముడు నిమిత్తుడయ్యాడు. అతని చావు సీతమ్మవలనే జరిగింది. అలాగే భారత యుధ్ధంలో అందరి ప్రాణములని మనసును బలమును గుంజుకున్నాడు. చచ్చినవారు మళ్ళి పుట్టకూడదని తాను చూచాడు, యుధ్ధం చేస్తున్న వాళ్ళు గెలవకూడదని, వారి మనసులో ధర్మభీతి కలగడానికి చూచాడు. వారి మనసు పరాక్రమం ఆయ్షు హరించాడు. దానికితోడు వారికి మళ్ళీ పుట్టుక లేకుండా చేసాడు. వారు మోక్షానికి వెళ్ళడంతో వారి కుటుంబాలు కూడా తరించాయి. భారతంలో కృష్ణుడు భగవంతుడని తెలియని వాడు లేడు దుర్యోధనునితో సహా,

యద్దోఃషు మా ప్రణిహితం గురుభీష్మకర్ణ నప్తృత్రిగర్తశల్యసైన్ధవబాహ్లికాద్యైః
అస్త్రాణ్యమోఘమహిమాని నిరూపితాని నోపస్పృశుర్నృహరిదాసమివాసురాణి

పరమాత్మ భక్తున్ని రాక్షసులు ముట్టనట్టుగా కురుక్షేత్రంలో మహావీరులు ప్రయోగించిన అస్త్రములు నన్ను ముట్టకుండా కాపాడాడు. వారు వేసిన అస్త్రాలన్ని రథంలో నిక్షిప్తం చేసాడు. యుధ్ధం పూర్తి అయ్యేవరకూ అవి అన్ని రథంలోనే ఉన్నాయి. అవి నన్ను స్పృశించలేదు, ఎలాగంటే, విష్ణుభక్తున్ని రాక్షసులు స్పృశించలేనట్లు

సౌత్యే వృతః కుమతినాత్మద ఈశ్వరో మే యత్పాదపద్మమభవాయ భజన్తి భవ్యాః
మాం శ్రాన్తవాహమరయో రథినో భువిష్ఠం న ప్రాహరన్యదనుభావనిరస్తచిత్తాః

భారతమంతా చదివిన వారు బీష్మ దృఓణ కర్ణ శల్య సౌత్విక పర్వాలు చదవాలి. ఉన్నదంతా యుధ్ధమే అయినా ఉన్న సత్యమంతా అక్కడే ఉంది. మనం ఈ సంసారంతో ఎవరితో యుధ్ధం చేస్తున్నమో తెలుస్తుంది. అర్జనుని గుఱ్ఱాలు అలసిపోయి ఇక లాగలేమని మొండికేసాయి. అప్పుడు కృష్ణుడు వాటికి విశ్రాంతి ఇచ్చాడు. మళ్ళి గుఱ్ఱాలని రథాలకి తగిలించే దాకా ఎదురుగా ఉన్న వీరులందరూ ఒక్క బాణంకూడా వెయ్యలేదు గుఱ్ఱాలను పక్కన పెట్టి కూర్చున్నా. పరమాత్మ చూపుతో వారి మనసు హరించబడింది
సౌత్యే వృతః కుమతినా - అంత పెద్ద మహానుభావున్ని సారధిగా ఉండమని అడిగాను దుష్టబుధ్ధితో
అలాంటి సమయంలో కూడా (ఈశ్వరో మే యత్పాదపద్మమభవాయ భజన్తి భవ్యాః) సంసారంలో ఎవరి కాళ్ళు పట్టుకుని తరిస్తున్నారో అలాంటి వాడి భుజాలను నా పాదములతో తాకే ఉద్యోగం అతనికి ఇచ్చాను. దాన్ని కూడా సంతోషంగా స్వీకరించాడు.
గుఱ్ఱములు అలసిపోయి రథం విప్పి భూమి మీద నించుంటే (మాం శ్రాన్తవాహమరయో రథినో భువిష్ఠం) శత్రురాజులంతా ఆ మహానుభావుని వల్ల మనసు ఎక్కడికో పోయింది (న ప్రాహరన్ యద్ అనుభావనిరస్తచిత్తాః)

నర్మాణ్యుదారరుచిరస్మితశోభితాని హే పార్థ హేऽర్జున సఖే కురునన్దనేతి
సఞ్జల్పితాని నరదేవ హృదిస్పృశాని స్మర్తుర్లుఠన్తి హృదయం మమ మాధవస్య

ఆయన ఎప్పుడు కలిసినా హాస్యాన్ని సూచించేవి అయిన నర్మ గర్బితంగా అందమైన ఆయన నవ్వుతో మనసును హరించే హే పార్థ హేऽర్జున సఖే కురునందనా అనే మాటలతో హృదయాన్ని స్పృశించే ఆనందింప్చేసే పరిహాస ఉక్తులు ఇప్పుడు తలుచుకుంటే నా హృదయం హరించుకు పోతోంది

శయ్యాసనాటనవికత్థనభోజనాదిష్వైక్యాద్వయస్య ఋతవానితి విప్రలబ్ధః
సఖ్యుః సఖేవ పితృవత్తనయస్య సర్వం సేహే మహాన్మహితయా కుమతేరఘం మే

ఒక పక్క అతన్ని పరమాత్మ అంటూ, ఇంకో పక్క మహానుభావుడు అంటూ, రక్షకుడూ అంటున్నాం. వ్యవహారంలో ఆయనెప్పుడు నేను భగవంతున్ని అని వివక్ష చూపలేదు
కలిసి పడుకున్నాం భుజించాము ఆటలాడాము, (వికత్థన - నేను అర్జనున్ని అని గర్వించినపుడు), కూర్చున్నప్పుడు, మిత్రమా అని మాట్లాడాడు, మాట్లాడి మోసగించాడు (విప్రలబ్ధః). ఎన్నో సార్లు నా గర్వాన్ని ప్రకటించాను, దాన్ని కూడా ఆమోదించాడు (ఋతవానితి) అమోదించి నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయతించాడు - ఒక తండ్రి కొడుకు తప్పుని, మిత్రుడు మిత్రుని తప్పును ఏ విధంగా సహిస్తారో అలా నా అపరాధాలు సహించాడు.
మహాన్మహితయా కుమతేరఘం మే - నేను మహా పాపం చేసాను. నేను గోపాలక పశుపాలక యాదవా అని పిలిచాను. హీనంగా మాట్లాడాను హీనంగా చూచాను. ఇవన్ని తండ్రిలాగ భరించి మిత్రుడిలాగ సహించాడు.

సోऽహం నృపేన్ద్ర రహితః పురుషోత్తమేన సఖ్యా ప్రియేణ సుహృదా హృదయేన శూన్యః
అధ్వన్యురుక్రమపరిగ్రహమఙ్గ రక్షన్గోపైరసద్భిరబలేవ వినిర్జితోऽస్మి

ఇప్పుడు ఆ పురుషోత్తమునితో వియోగాన్ని పొందాను. మిత్రుడు లేడు ప్రియుడు లేడు సుహృత్తూ లేడు. అంతెందుకు నా హృదయమే లేదు. ఇవన్నీ ఎప్పుడు తెలిసాయంటే ఆయాన నన్ను పిలిచి "ఒక్క నా భవనం తప్ప మిగతా అంతా సముద్రం ముంచి వేస్తుంది, వజ్రునికి పట్టభిషేకం చేయి, నా పరివారాన్ని నీవు వెంట తీసుకుని వెళ్ళు, నీవే వారికి రక్షకుడివి" అన్నాడు. ఆ స్త్రీ పరివారాన్ని తీసుకుని వెళ్తుంటే ఒక గొల్ల పిల్లవాడు చిన్న కట్టెతో నన్ను చాలా దూరం పారగొట్టాడు. గొల్ల పిల్లవాడితో ఓడిపోయాను. అప్పుడు గుర్తుకొచ్చింది ఈ గొల్లపిల్లవాడు లేడు అని. అప్పుడు జ్ఞ్యాపకం వచ్చింది నా తేజస్సు ఏమిటొ. ఇప్పుడు నా హృదయమే లేదు. దుర్మార్గులైన గోపబాలుని చేతిలో స్త్రీ వలే ఓడిపోయాను (అధ్వన్యురుక్రమపరిగ్రహమఙ్గ రక్షన్గోపైరసద్భిరబలేవ వినిర్జితోऽస్మి)

తద్వై ధనుస్త ఇషవః స రథో హయాస్తే సోऽహం రథీ నృపతయో యత ఆనమన్తి
సర్వం క్షణేన తదభూదసదీశరిక్తం భస్మన్హుతం కుహకరాద్ధమివోప్తమూష్యామ్

అదే ధనసు అదే గాండీవం పాశుపాశాస్త్రం, అదే బాణాలు అదే రథం అవే గుఋఋఆలు - నేనూ మారలేదు,ఎవరిని చూసి సకలలోక రాజు తల వచుతారో నేను మారలేదు. క్షణంలో అంతా లేనట్లుగా అయ్యింది ఎందువాలంటే కృష్ణుడు అక్కడ లేకపోవడం వల్ల (ఈశరిక్తం)
భస్మన్హుతం కుహకరాద్ధమివోప్తమూష్యామ్ - చవట నేలలో నాటిన విత్తనంలాగ. అదంతా రిక్తమయిపోయింది

రాజంస్త్వయానుపృష్టానాం సుహృదాం నః సుహృత్పురే
విప్రశాపవిమూఢానాం నిఘ్నతాం ముష్టిభిర్మిథః

నీవడిగిన వారందరు బ్రాహ్మణ శాపంతో ఒకరిని ఒకరు ముష్ఠిఘాతాలతో కొట్టుకున్నారు.

వారుణీం మదిరాం పీత్వా మదోన్మథితచేతసామ్
అజానతామివాన్యోన్యం చతుఃపఞ్చావశేషితాః

ఇంత పెద్ద యాదవ సైన్యం మద్యపానం చేసి ఆ మదంలో తన వారిని ఎదుటివారిని తేడా లేకుండా ఒకరినొకరు తెలియని వారిలా కొట్టుకున్నారు. నలుగురో అయిదుగురో మిగిలారు.(ఉద్దవుడు వజర్కుడు దారుకుడు...)

ప్రాయేణైతద్భగవత ఈశ్వరస్య విచేష్టితమ్
మిథో నిఘ్నన్తి భూతాని భావయన్తి చ యన్మిథః

ఎంత మద్యపానం చేసినా కొందరికైన బుధ్ధి పనిచెయలి కదా? అందరికీ లేకుండా పోయింది అంటే ఇది స్వామి సంకల్పం
ఆ పరమాతం సంకల్పంతోటే ఒకరినోకరు కొట్టుకుంటారు కలుసుకుంటారు.

జలౌకసాం జలే యద్వన్మహాన్తోऽదన్త్యణీయసః
దుర్బలాన్బలినో రాజన్మహాన్తో బలినో మిథః

నీళ్ళల్లోని చేపలు - చిన చేపలను పెద చేపలు తింటాయి. చేపలు భక్షింపబడినట్లుగా భక్షింపబడ్డారు

ఏవం బలిష్ఠైర్యదుభిర్మహద్భిరితరాన్విభుః
యదూన్యదుభిరన్యోన్యం భూభారాన్సఞ్జహార హ

ఇప్పుడు అనిపిస్తోంది అంత బాలాడ్యులైన యాదవులు అలాగే ఉంటే వారిని ఎవరు సమ్హరిస్తారు. కౌరవ బలానికి రెట్టింపు యాదవ బలం. స్వామి రక్షకుడు గా ఉండటం వలన వారిని ఎవరు నిర్మూలిస్తారు? ముల్లుని ముల్లుతో తీసి రెండు మూళ్ళనూ పారేసినట్లుగా.
అలాగే పరమాత్మ కూడా శరీరం దాల్చిన అధర్మాలను తీయడానికి వచ్చి ఆయన శరీరాన్ని కూడా చివరకు ఉపసమ్హరించుకున్న్నాడు

దేశకాలార్థయుక్తాని హృత్తాపోపశమాని చ
హరన్తి స్మరతశ్చిత్తం గోవిన్దాభిహితాని మే

ఆయా సమయాలలో సందర్భాలలో స్వామి అన్న మాటాలు ఇంకా జ్ఞ్యాపకం వస్తున్న్నాయి.

సూత ఉవాచ
ఏవం చిన్తయతో జిష్ణోః కృష్ణపాదసరోరుహమ్
సౌహార్దేనాతిగాఢేన శాన్తాసీద్విమలా మతిః

ఇలా పరిపైస్తూ ఆక్రోశిస్తూ బాధపడి ఆ పరమాత్మ కృపతోటే మనసు ప్రశాంతమయ్యింది. పరమాత్మ పాదాలను స్మరిస్తున్న అర్జనునికి మనసు శాంతించింది.

వాసుదేవాఙ్ఘ్ర్యనుధ్యాన పరిబృంహితరంహసా
భక్త్యా నిర్మథితాశేష కషాయధిషణోऽర్జునః

ఒక్కసారి తమ పుట్టుక నుంచీ ఇప్పటి వరకూ కృష్ణుడు చేసిన సహాయాలను ప్రేమను తలుచుకోవడం వల్ల ఆయన ధ్యానం వలన పెరిగిన భక్తితో బుధ్ధిలో ఉన్న అన్ని మురుకులూ కడిగివేయబడ్డాయి. పరమాత్మ పాదాలను స్మరించడంవలన బుధ్ధి నిర్మలం అయింది.

గీతం భగవతా జ్ఞానం యత్తత్సఙ్గ్రామమూర్ధని
కాలకర్మతమోరుద్ధం పునరధ్యగమత్ప్రభుః

పరమాత్మని గూర్చి ఇంతగా స్మరించుకుని బాధపడుతున్న అర్జనునికి యుధ్ధరంగంలో ఉపదేశించిన గానం చేసిన గీతా వాక్యం స్మరణకు వచ్చింది. ఇంత కాలం, కాలన్ని బట్టి కాలం వలన చేసిన కర్మలబట్టి దుఖాన్ని బట్టి అజ్ఞ్యానాన్ని బట్టి అణచివేయబడిన జ్ఞ్యానం స్పురణకి వచ్చింది.


విశోకో బ్రహ్మసమ్పత్త్యా సఞ్ఛిన్నద్వైతసంశయః
లీనప్రకృతినైర్గుణ్యాదలిఙ్గత్వాదసమ్భవః

బ్రహ్మసంపత్తితోటి దు:ఖాన్ని పోగొట్టుకున్నాడు. దాని వలన ద్వైత భావన పోయింది, (విశిష్ట)అద్వైతం గుర్తుకు వచ్చింది.
ప్ర్కృతిలో ఉన్న అన్ని గుణాలతో ఏర్పడిన ప్రపంచాన్ని మరచిపోవాలంటే ఆ గుణాలను ఎలా ప్రకృతిలో లీనం చేయాలో అలాగే అర్జనుడు కూడా దేహం మనసు బుధ్ధి చిత్తం అంత:కరణం అనే వాటిని పరమాత్మలో లీనం చేసాడు. నేను వేరు కృష్ణుడు వేరు అనే భావం అంతరించి , స్వరూప జ్ఞ్యానం కలిగింది

నిశమ్య భగవన్మార్గం సంస్థాం యదుకులస్య చ
స్వఃపథాయ మతిం చక్రే నిభృతాత్మా యుధిష్ఠిరః

పరమాత్మ వెళ్ళిన దారిని విన్న ధర్మరాజు నారదుని మాటలు గుర్తుచేసుకుని తాను కూడా బలయ్దేరడానికి సిద్దపడాడు.

పృథాప్యనుశ్రుత్య ధనఞ్జయోదితం నాశం యదూనాం భగవద్గతిం చ తామ్
ఏకాన్తభక్త్యా భగవత్యధోక్షజే నివేశితాత్మోపరరామ సంసృతేః

 కుంతి కూడా అర్జనుని మాటలు విని ఆ మహానుభావురాలు (ఏకాన్తభక్త్యా భగవత్యధోక్షజే ) అలాంటి పరమాత్మ మీద ఏకాంత భక్తితో యోగమార్గంలొ పరమాత్మలో ప్రవేశించింది
తల్లి ముందర పిల్లలను పంపడం మంచి కాదు కాబట్టి ముందు తల్లినే పంపారు.

యయాహరద్భువో భారం తాం తనుం విజహావజః
కణ్టకం కణ్టకేనేవ ద్వయం చాపీశితుః సమమ్

ఏ శరీరంతో భూభారాన్ని తగ్గించడానికి వచ్చాడో ఆ శరీరాన్ని ముల్లుని తీసిన తరువాత ఎలా ఐతే సహాయపడిన ముల్లుని కూడా పడేస్తామొ అలా

యథా మత్స్యాదిరూపాణి ధత్తే జహ్యాద్యథా నటః
భూభారః క్షపితో యేనజహౌ తచ్చ కలేవరమ్

నటుడు నాటకం వేసినపుడు, మత్స్య కూర్మ వరాహ అనే వేషం వేసిన తరువాత నాటంపూర్తి అయినాక ఆ వేషాన్ని వదిలిపెట్టినట్లు పరమాత్మ తెచ్చుకున్న రూపాన్ని దాని అవసరం తీరగానే వదిలిపెట్టాడు

యదా ముకున్దో భగవానిమాం మహీం జహౌ స్వతన్వా శ్రవణీయసత్కథః
తదాహరేవాప్రతిబుద్ధచేతసామభద్రహేతుః కలిరన్వవర్తత

ఎప్పుడైతే పరమాత్మ ఈ భూమి మీద తన దేహాన్ని విడిచిపెట్టాడొ, అదే అదనుగా కాచుకుని ఉన్న కలిపురుషుడు ఆ పూటే (ఒక పూట కూడా ఆగకుండా), వికసించని మనసులో అధర్మం కలిగించడానికి కారణమైన కలి అనుసరించాడు

యుధిష్ఠిరస్తత్పరిసర్పణం బుధః పురే చ రాష్ట్రే చ గృహే తథాత్మని
విభావ్య లోభానృతజిహ్మహింసనాద్యధర్మచక్రం గమనాయ పర్యధాత్

ధర్మ రాజు తన రాజ్యం లో కి కలి ప్రవేశించి సంచరించాడని జ్ఞ్యాని కాబట్టి తెలుస్కున్న అడు. తన పురంలో తన రాష్ట్రంలో తన ఇంటిలో చివరికి తనలో కూడా కలి ప్రవేశించాడని తెలుసుకొని. లోభం అబద్దం. కపటం, హింస (లోభానృతజిహ్మహింస) ఈ నాలుగు వచ్చాయని తెలుసుకున్నాడు. ఇంక ప్రస్థానం కోసం ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు (గమనాయ పర్యధాత్)

స్వరాట్పౌత్రం వినయినమాత్మనః సుసమం గుణైః
తోయనీవ్యాః పతిం భూమేరభ్యషిఞ్చద్గజాహ్వయే
మథురాయాం తథా వజ్రం శూరసేనపతిం తతః
ప్రాజాపత్యాం నిరూప్యేష్టిమగ్నీనపిబదీశ్వరః

తన మన్వడైన పరీక్షిత్తుని, తన గుణాలతో సమానమైన గుణాలు కలిగినవాడిని అభిషేకించి. మధురకు వజ్రున్ని (సాంబుని కుమారుడు) రాజు గా చేసి.
వెళ్ళేముందు ప్రాజాపత్య హోమం చేసి ఆ అగ్నిని తనలో ఆవాహన చేసుకున్నాడు.

విసృజ్య తత్ర తత్సర్వం దుకూలవలయాదికమ్
నిర్మమో నిరహఙ్కారః సఞ్ఛిన్నాశేషబన్ధనః

పట్టు వస్త్రాలు అన్నీ వదిలిపెట్టి, మమకారంలేకుండా (నిర్మమో ) అహంకారం లేకుండా అన్ని బంధనాలను తెంచుకుని.

వాచం జుహావ మనసి తత్ప్రాణ ఇతరే చ తమ్
మృత్యావపానం సోత్సర్గం తం పఞ్చత్వే హ్యజోహవీత్
త్రిత్వే హుత్వా చ పఞ్చత్వం తచ్చైకత్వే ఞ్జుహోన్మునిః
సర్వమాత్మన్యజుహవీద్బ్రహ్మణ్యాత్మానమవ్యయే

వాచం జుహావ మనసి - వాక్కును మనసులో నియమించాడు. ఆ  మనసును ప్రాణంలో ఉంచాడు
ఆ ప్రాణమును అపానంలో . అపానమును ఉదానంలో, ఉదానం వ్యానంలో, , అలా పంచ ప్రాణములను మూటిలో (త్రిగుణాల్లో) ఉంచి (సత్వం రజసు తమసు - ప్రకృతి - ఆత్మ), సర్వాన్ని ఆత్మలో ఉంచి ఆ ఆత్మను పరమాత్మలో ఉంచాడు

చీరవాసా నిరాహారో బద్ధవాఙ్ముక్తమూర్ధజః
దర్శయన్నాత్మనో రూపం జడోన్మత్తపిశాచవత్
అనవేక్షమాణో నిరగాదశృణ్వన్బధిరో యథా
ఉదీచీం ప్రవివేశాశాం గతపూర్వాం మహాత్మభిః
హృది బ్రహ్మ పరం ధ్యాయన్నావర్తేత యతో గతః

నార వస్త్రాలు కట్టుకుని వాక్కుని మానివేసి వెంట్రుకలు ముడివేసుకోకుండా జడుడిలాగ, ఉన్మత్తునిలాగ తల వంచుకుని దిక్కులు చూడకుండా నడుచుకుంటూ పోయాడు. దేవతలతో కూడా సేవింపబడిన వాడు ఇలా అయ్యాడు
దేన్ని కోరకుండా ఎవరు ఏమి మాట్లాడుతున్న వినకుండా చూడకుండా ఉత్తరదిక్కుగా వెళ్ళాడు. పరమాత్మను మళ్ళీ ధ్యానిస్తూ ఎక్కడికిపోతే మాల్లీ రారో అక్కడికే వెళ్ళాడు

సర్వే తమనునిర్జగ్ముర్భ్రాతరః కృతనిశ్చయాః
కలినాధర్మమిత్రేణ దృష్ట్వా స్పృష్టాః ప్రజా భువి

మిగతా వారు కూడా నిశ్చయంగా అతనిని అనుసరించాడు. కలి పురుషుడు ప్రజలని తాకడంతో వారు వెళ్ళిపోయారు

తే సాధుకృతసర్వార్థా జ్ఞాత్వాత్యన్తికమాత్మనః
మనసా ధారయామాసుర్వైకుణ్ఠచరణామ్బుజమ్

తద్ధ్యానోద్రిక్తయా భక్త్యా విశుద్ధధిషణాః పరే
తస్మిన్నారాయణపదే ఏకాన్తమతయో గతిమ్


అవాపుర్దురవాపాం తే అసద్భిర్విషయాత్మభిః
విధూతకల్మషా స్థానం విరజేనాత్మనైవ హి

అన్నీ మంచి పనులు చేసారు కాబట్టి, ఆత్మ తత్వం తెలిసినవారు కాబట్టి పరమాత్మను పాదపద్మాలను ధ్యానిస్తూ పరిశుద్దమైన భక్తితో బుధ్ధి సుద్దమైంది. ఆయన యందు ఏకాంత బుధ్ధితో విషయములను కోరే దుర్జనులు పొందరాని స్థానాన్ని వారు పొందారు


విదురోऽపి పరిత్యజ్య ప్రభాసే దేహమాత్మనః
కృష్ణావేశేన తచ్చిత్తః పితృభిః స్వక్షయం యయౌ

ఇది తెలుస్కుని ప్రభాస తీర్థంలో కృష్ణుని యందు మనసు లగ్నం చేసి తన ఇంటికి వెళ్ళాడు (యమ లోకం)

ద్రౌపదీ చ తదాజ్ఞాయ పతీనామనపేక్షతామ్
వాసుదేవే భగవతి హ్యేకాన్తమతిరాప తమ్

భర్తల ఆ వైరాగ్యాన్ని చూచిన ద్రౌపతి కృష్ణుని యందు మనసు లగ్నం చేసి భగవంతునే పొందింది

యః శ్రద్ధయైతద్భగవత్ప్రియాణాం పాణ్డోః సుతానామితి సమ్ప్రయాణమ్
శృణోత్యలం స్వస్త్యయనం పవిత్రం లబ్ధ్వా హరౌ భక్తిముపైతి సిద్ధిమ్

సకల శుభాలకు మూలం (స్వస్త్యయనం ) అయిన భగవత్ప్రియులైన పాండు పుత్రుల ఈ మోక్ష మార్గాన్ని శ్రద్దతో విన్నవారు పరమాత్మ యందు భక్తినీ సిధ్ధినీ పొందుతారు

                                                          సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం ప్రధమస్కంధం పదునాల్గవ అధ్యాయం


సూత ఉవాచ
సమ్ప్రస్థితే ద్వారకాయాంజిష్ణౌ బన్ధుదిదృక్షయా
జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితమ్
వ్యతీతాః కతిచిన్మాసాస్తదా నాయాత్తతోऽర్జునః
దదర్శ ఘోరరూపాణి నిమిత్తాని కురూద్వహః

అర్జనుడు ద్వారకకు వెళ్ళాడు బంధువులని చూడటానికి (బన్ధుదిదృక్షయా). 
అనీ దుశ్శకునములు కలిగాయి. 

కాలస్య చ గతిం రౌద్రాం విపర్యస్తర్తుధర్మిణః
పాపీయసీం నృణాం వార్తాం క్రోధలోభానృతాత్మనామ్

కాలగతి మారింది. మానవుల మనసులో పాపబుధ్ధి కలుగుతోంది. కృఒధం లోభం అసత్యం పెరిగింది. 

జిహ్మప్రాయం వ్యవహృతం శాఠ్యమిశ్రం చ సౌహృదమ్
పితృమాతృసుహృద్భ్రాతృదమ్పతీనాం చ కల్కనమ్

ప్రతీ వ్యవహారం కపటంతోనే (జిహ్మ) నడుస్తోంది. ప్రతీ స్నేహం మోసంతో కూడి ఉన్నది. 
తల్లితండ్రులతోటి మిత్రులు సోదరులతోటి కలహించేవారు ఎక్కువ అయ్యారు. 

నిమిత్తాన్యత్యరిష్టాని కాలే త్వనుగతే నృణామ్
లోభాద్యధర్మప్రకృతిం దృష్ట్వోవాచానుజం నృపః

ఈ నిమిత్తాలు చూచి భీమునితో ధర్మరాజు 

యుధిష్ఠిర ఉవాచ
సమ్ప్రేషితో ద్వారకాయాం జిష్ణుర్బన్ధుదిదృక్షయాజ్
ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్టితమ్

బంధువులను చూడాలనే కోరికతో అర్జనుడు ద్వారకకు పంపబడ్డాడు కదా. కృష్ణపరమాత్మ ఏమి చేస్తున్నాడో తెలియబడిందనే అనుకుంటున్నాను. 

గతాః సప్తాధునా మాసా భీమసేన తవానుజః
నాయాతి కస్య వా హేతోర్నాహం వేదేదమఞ్జసా

ఏడు నెలలు అయిన ఇంకా వారు రాలేదు. నేనీ విషయాన్ని తెలియలేకపోతున్నాను

అపి దేవర్షిణాదిష్టః స కాలోऽయముపస్థితః
యదాత్మనోऽఙ్గమాక్రీడం భగవానుత్సిసృక్షతి

నారదుడు కాలం వచ్చింది అన్నాడు. కృష్ణపరమాత్మ అవతారం చాలించాక మీరూ వెళ్ళండి అని చెప్పాడు. ఆ కాలం వచ్చిందా?
లీలకోసం క్రీడ కోసం ఈ భూలోకానికి తీసుకొచ్చిన శరీరం వదిలిపెట్టాలనుకుంటున్నాడా

యస్మాన్నః సమ్పదో రాజ్యం దారాః ప్రాణాః కులం ప్రజాః
ఆసన్సపత్నవిజయో లోకాశ్చ యదనుగ్రహాత్

మనం అంటూ ఉన్నాం అంటే అది ఆయన వల్ల. (సమ్పదో రాజ్యం దారాః ప్రాణాః కులం ప్రజాః) 
శతృవిజయం కూడా ఆయన కటాక్షమే (ఆసన్సపత్నవిజయో ). 

పశ్యోత్పాతాన్నరవ్యాఘ్ర దివ్యాన్భౌమాన్సదైహికాన్
దారుణాన్శంసతోऽదూరాద్భయం నో బుద్ధిమోహనమ్

ఎందుకు భయపడుతున్నానంటే ఆకాశంలో భూమిమీద శరీరం మీద ఉత్పాతాలు కనపడుతున్నాయి 
ఇవన్నీ కలిపి త్వరలోనే (అదూరాత్)

ఊర్వక్షిబాహవో మహ్యం స్ఫురన్త్యఙ్గ పునః పునః
వేపథుశ్చాపి హృదయే ఆరాద్దాస్యన్తి విప్రియమ్

(ఎడమ) తొడ భుజము కన్నులు మాటిమాటికీ అదురుతున్నాయి. అనుకోకుండా హృదయంలో దడ పుడుతోంది. 

శివైషోద్యన్తమాదిత్యమభిరౌత్యనలాననా
మామఙ్గ సారమేయోऽయమభిరేభత్యభీరువత్

శివ ఏష ఉద్యన్తం ఆదిత్యమభిరౌతి - ఉదయిస్తున్న సూర్యునికి ఎదురుగా నక్కలు అరుస్తున్నాయి 
కుక్క కూడా నాకెదురుగా ఉండి అశ్లీలంగా ప్రవర్తిస్తోంది. 

శస్తాః కుర్వన్తి మాం సవ్యం దక్షిణం పశవోऽపరే
వాహాంశ్చ పురుషవ్యాఘ్ర లక్షయే రుదతో మమ

పాల గరుడ పక్షులు దర్శనమిస్తే పని జరుగుతుంది. మిగిలిన పక్షులు ఎడమనుంచి కుడికి వెళ్ళాలి (తీర్చి కట్టుట) కుడి నుంచి ఎడమకు వెళ్ళడం మంచి శకునం కాదు (కట్టి తీర్చుట), 
పశువులు పక్షులు నన్ను ఎడమకు చేసి కుడికి వెళ్తున్నాయి.
ఏనుగులు అశ్వములు ఏడుస్తున్నాయి.

మృత్యుదూతః కపోతోऽయములూకః కమ్పయన్మనః
ప్రత్యులూకశ్చ కుహ్వానైర్విశ్వం వై శూన్యమిచ్ఛతః

పావురం గుడ్లగూబ - ఈ రెండూ మృత్యు దూతలు. (వాటిని పొద్దున్నే చూస్తే వంద పాపాలు చేస్తారని ఉక్తి). అవి వినపడుతున్నాయి. నిద్రపోకుండా అవి అరుస్తున్నాయి. అంటే ప్రపంచం త్వరలో శూన్యం కాబోతోంది

ధూమ్రా దిశః పరిధయః కమ్పతే భూః సహాద్రిభిః
నిర్ఘాతశ్చ మహాంస్తాత సాకం చ స్తనయిత్నుభిః

సూర్యుని చుట్టూ చంద్రుని చుట్టు పరివేశం (వరదగూడు )అకారణంగా వస్తున్నాయి. 
భూమి పర్వతాలతో సహా కదులుతోంది మేఘంలేకుండా ఉరుములూ మెరుపులూ వస్తున్నాయి

వాయుర్వాతి ఖరస్పర్శో రజసా విసృజంస్తమః
అసృగ్వర్షన్తి జలదా బీభత్సమివ సర్వతః

ఖరకు గాలి వీస్తోంది. అందరి కళ్ళల్లో దుమ్ము పడుతోంది. మేఘాలు నెత్తురువానను కురిపిస్తున్నాయి

సూర్యం హతప్రభం పశ్య గ్రహమర్దం మిథో దివి
ససఙ్కులైర్భూతగణైర్జ్వలితే ఇవ రోదసీ

సూర్యుడు కాంతి హీనుడయ్యాడు. ఆకాశంలో గ్రహ యుధ్ధాలవుతున్నాయి. (సూర్యుని పరిధిలో బుధుడు తప్ప ఏ గ్రహం ఉన్నా అది అస్తవ్యస్తమే)
అన్ని భూతములు ఆకాశంలో కొట్లాడుతున్నట్లుగా ఉంది

నద్యో నదాశ్చ క్షుభితాః సరాంసి చ మనాంసి చ
న జ్వలత్యగ్నిరాజ్యేన కాలోऽయం కిం విధాస్యతి

నదులు నదములు క్షోభిస్తున్నాయి. సరసులు మన్సులు కల్లోలం అవుతున్నాయి
నెయ్యిపోస్తున్నా అగ్ని మండటంలేదు. ఈ కాలం ఏమి చేయడానికి వచ్చిందో

న పిబన్తి స్తనం వత్సా న దుహ్యన్తి చ మాతరః
రుదన్త్యశ్రుముఖా గావో న హృష్యన్త్యృషభా వ్రజే

దూడలు పాలు తాగడంలేదు తల్లులు పాలు ఇవ్వడం లేదు
ఆవులు కన్నీరుపెట్టుకుంటున్నాయి, దూడలుమందలో తిరగడంలేదు

దైవతాని రుదన్తీవ స్విద్యన్తి హ్యుచ్చలన్తి చ
ఇమే జనపదా గ్రామాః పురోద్యానాకరాశ్రమాః
భ్రష్టశ్రియో నిరానన్దాః కిమఘం దర్శయన్తి నః

విగ్రహాలనుండి కూడ చెమట వస్తోంది. కంటిమీద నీరు వస్తోంది. 
ఆరామాలు ఉద్యానాలు అన్ని వినోదాలు కలిగించే ప్రదేశాలు శోభావిహీనాలు అయ్యాయి. 
సంపద పోయింది ఆనందంలేకుండా అయింది. ఏదో మహా ఉత్పాతాన్నే చూపేట్లు ఉంది.

మన్య ఏతైర్మహోత్పాతైర్నూనం భగవతః పదైః
అనన్యపురుషశ్రీభిర్హీనా భూర్హతసౌభగా

పొరబాటున భూమికి భగవంతుని పాద వియోగం కలిగిందా? 

ఇతి చిన్తయతస్తస్య దృష్టారిష్టేన చేతసా
రాజ్ఞః ప్రత్యాగమద్బ్రహ్మన్యదుపుర్యాః కపిధ్వజః

ఇలా ఉండగా అర్జనుడు వచ్చాడు. 

తం పాదయోర్నిపతితమయథాపూర్వమాతురమ్
అధోవదనమబ్బిన్దూన్సృజన్తం నయనాబ్జయోః

ఇంతటి బాధతో ఉన్న అర్జనున్ని ధర్మరాజు ఇంతవరకూ చూడలేదు. తల కిందకు వచి కంటి నీరు కారుస్తూ ఉన్నాడు. 

విలోక్యోద్విగ్నహృదయో విచ్ఛాయమనుజం నృపః
పృచ్ఛతి స్మ సుహృన్మధ్యే సంస్మరన్నారదేరితమ్

నారదుడు చెప్పిన దాన్ని తలచుకుంటూ అర్జనున్ని అడిగాడు 

యుధిష్ఠిర ఉవాచ
కచ్చిదానర్తపుర్యాం నః స్వజనాః సుఖమాసతే
మధుభోజదశార్హార్హ సాత్వతాన్ధకవృష్ణయః

ద్వారకలో ఉన్నవారందరు బాగున్నార

శూరో మాతామహః కచ్చిత్స్వస్త్యాస్తే వాథ మారిషః
మాతులః సానుజః కచ్చిత్కుశల్యానకదున్దుభిః

మా మేనమామ (వసుదేవుడు) క్షేమంగా ఉన్నారా. 

సప్త స్వసారస్తత్పత్న్యో మాతులాన్యః సహాత్మజాః
ఆసతే సస్నుషాః క్షేమందేవకీప్రముఖాః స్వయమ్

మేనమామ గారి భార్యలందరూ బాగున్నారా 

కచ్చిద్రాజాహుకో జీవత్యసత్పుత్రోऽస్య చానుజః
హృదీకః ససుతోऽక్రూరో జయన్తగదసారణాః

ఆహుకుడు బాగున్నాడా (ఉగ్రసేనుడి అన్న). దుష్టపుత్రుడు ఉన్నవాడి తమ్ముడు బాగున్నాడా (ఉగ్రసేనుడు )
మన బంధువులందరూ బాగున్నారా. 

ఆసతే కుశలం కచ్చిద్యే చ శత్రుజిదాదయః
కచ్చిదాస్తే సుఖం రామో భగవాన్సాత్వతాం ప్రభుః

బలరాముడు బాగున్నాడా. భగవానుడైన కృష్ణుడు బాగున్నాడా 

ప్రద్యుమ్నః సర్వవృష్ణీనాం సుఖమాస్తే మహారథః
గమ్భీరరయోऽనిరుద్ధో వర్ధతే భగవానుత
సుషేణశ్చారుదేష్ణశ్చ సామ్బో జామ్బవతీసుతః
అన్యే చ కార్ష్ణిప్రవరాః సపుత్రా ఋషభాదయః

కృష్ణ సంతానమంతా బాగున్నారా 

తథైవానుచరాః శౌరేః శ్రుతదేవోద్ధవాదయః
సునన్దనన్దశీర్షణ్యా యే చాన్యే సాత్వతర్షభాః
అపి స్వస్త్యాసతే సర్వే రామకృష్ణభుజాశ్రయాః
అపి స్మరన్తి కుశలమస్మాకం బద్ధసౌహృదాః

కృష్ణుని మిత్రవర్గం బాగున్నారా 
బాగున్న వారు మనని గుర్తుచేసుకుంటున్నారా

భగవానపి గోవిన్దో బ్రహ్మణ్యో భక్తవత్సలః
కచ్చిత్పురే సుధర్మాయాం సుఖమాస్తే సుహృద్వృతః

బ్రాహ్మణ ప్రియ్డు అయిన భగవంతుడు బాగున్నాడా. సుధర్మ సభలో ఆయన క్షేమంగా ఉన్నాడా

మఙ్గలాయ చ లోకానాం క్షేమాయ చ భవాయ చ
ఆస్తే యదుకులామ్భోధావాద్యోऽనన్తసఖః పుమాన్

ఆయన వచ్చింది లోకాలకి మంగళం కలగడానికి. లోకానికి కవల్సినవి ఇచ్చి వాటిని కాపాడటానికి
ఈయన యాదవ కుల సముద్రంలో చంద్రుడిలా అనంతునితో అవతరించాడు.

యద్బాహుదణ్డగుప్తాయాం స్వపుర్యాం యదవోऽర్చితాః
క్రీడన్తి పరమానన్దం మహాపౌరుషికా ఇవ

మహా వీరుల్లాగ యాదవులందరూ వారి వారి ఇళ్ళల్లో నిర్భయంగా ఉన్నారు

యత్పాదశుశ్రూషణముఖ్యకర్మణా సత్యాదయో ద్వ్యష్టసహస్రయోషితః
నిర్జిత్య సఙ్ఖ్యే త్రిదశాంస్తదాశిషో హరన్తి వజ్రాయుధవల్లభోచితాః

ఏ మహానుభావుని పాదములని ఆశ్రయించడం వల్ల మహారాజులు సార్వభౌమాధికారాని పొందారో, సత్య్భామాది భార్యలు ఇంద్రలోక సౌఖ్యాలను అనుభవిస్తున్నారో 

యద్బాహుదణ్డాభ్యుదయానుజీవినో యదుప్రవీరా హ్యకుతోభయా ముహుః
అధిక్రమన్త్యఙ్ఘ్రిభిరాహృతాం బలాత్సభాం సుధర్మాం సురసత్తమోచితామ్

ఎవరి బాహు బలాన్ని ఆశ్రయించిన్ యాదవులంతా ఎక్కడినుంచీ బయం లేకుండా ఉన్నారు
ఇంద్రుడి సభలో దేవతలు అధిరోహించడానికి అనువైన సుధర్మ అనే సభామండపాన్ని కాళ్ళతో హస్తములతో స్పృశిస్తూ ఆసీనులై సభని నిర్వహిస్తున్నారు. ఆ సుధర్మ కృష్ణునివల్లే వచ్చింది

కచ్చిత్తేऽనామయం తాత భ్రష్టతేజా విభాసి మే
అలబ్ధమానోऽవజ్ఞాతః కిం వా తాత చిరోషితః

నువ్వు బాగున్నావా. నీ ముఖం కాంతి విహీనమయింది. 
చిన్నబోయి వచ్చావంటే అతి పరిచయం వల్ల వారు నిన్ను సరిగా చూచుకోలేదా 

కచ్చిన్నాభిహతోऽభావైః శబ్దాదిభిరమఙ్గలైః
న దత్తముక్తమర్థిభ్య ఆశయా యత్ప్రతిశ్రుతమ్

కావలసిన విషయములని అందుకోలేదా. చెప్పకూడని అనుకోకూడని విషయాలయందు మనసు పెట్టావా. వినకూడని దాన్ని విన్నప్పుడు, తినకూడని దాన్ని తిన్నప్పుడు, చూడకూడని దాన్ని చూచినపుడు మనసు చిన్నబోతుంది. మనప్రమేయం లేకుండా ఇలాంటి విషయం మనకి అనుభవింపచేసాడంటే దానికి మనం చేసిన ఏ పాపం కారణమో అని అర్థం. అధర్మం ఆచరించే దగ్గర గాని, అధర్మం ఎక్కువగా ఉన్నపుడు గాని మన పుట్టుక ఉంటే మనం పాపం చేసిన వాళ్ళమే. ఇలాంటివి విన్నప్పుడో చూచినప్పుడో తిన్నప్పుడో పరమాత్మ నామాలని తలుచుకోవాలి 
ఎమైనా ఇస్తానని చెప్పి ఇవ్వలేదా? వారి మనసులో ఆశ కల్పించి నీవు ఇవ్వలేదా?

కచ్చిత్త్వం బ్రాహ్మణం బాలం గాం వృద్ధం రోగిణం స్త్రియమ్
శరణోపసృతం సత్త్వం నాత్యాక్షీః శరణప్రదః

అభయాన్ని ఇవ్వవలసిన నీవు - బ్రాహ్మణులకు బాలురకు గోవుని వృధ్ధున్ని రోగిష్టిని స్త్రీలను. వీరు శరణు కోరితే ఇవ్వలేదా 

కచ్చిత్త్వం నాగమోऽగమ్యాం గమ్యాం వాసత్కృతాం స్త్రియమ్
పరాజితో వాథ భవాన్నోత్తమైర్నాసమైః పథి

పొందకూడని స్త్రీని వదిలిపెట్టావా. పొందవలసిన స్త్రీని వదిలిపెట్టావా
పొరబాటున దారిలో వస్తుంటే నీకన్నా తక్కువ వారితో ఓడిపోయావా 

అపి స్విత్పర్యభుఙ్క్థాస్త్వం సమ్భోజ్యాన్వృద్ధబాలకాన్
జుగుప్సితం కర్మ కిఞ్చిత్కృతవాన్న యదక్షమమ్

తినవలసిన వృధ్ధులు పిల్లలు ఉండగా వారిని వదిలిపెట్టి తిన్నావా. ఆకలిగొన్న వారు ఉండగా వరిని వదిలి నీవు తిన్నావా. ద్వారంలో అథితి ఉండగా ఆపోశనం, నీరు తాగితే అది మద్యంతో సమానం. 
పది మందీ అసహ్యించుకునే పని నీవు చేయదగని పనినీ చేసావా

కచ్చిత్ప్రేష్ఠతమేనాథ హృదయేనాత్మబన్ధునా
శూన్యోऽస్మి రహితో నిత్యం మన్యసే తేऽన్యథా న రుక్

నీకు బాగా ఇష్టమైన (ప్రేష్ఠతముడు ) వారితో ఎడబాటు పొందావా. ఇలాంటిదేదో లేకుంటే నీకు ఇల్లంటి బాధ కలగదు 

Popular Posts