Followers

Friday 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం ప్రధమాధ్యాయం


శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం ప్రధమాధ్యాయం

ధర్మః ప్రోజ్ఝితకైతవోऽత్ర పరమో నిర్మత్సరాణాం సతాం
వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనమ్
శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః
సద్యో హృద్యవరుధ్యతేऽత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్

ఇతర అన్ని గ్రంధములకంటే భాగవతానికున్న వైశిష్ట్యం ఇందులో కపటం ఉండదు. ప్రోజ్జిత - అంటే మిక్కిలి విడవబడిన. భగవంతుని కోరినవాడు మోక్షాన్ని కూడా కోరడు. శ్రీమన్నారాయణుని కథ వినడమే పురుషార్థం. 
నిర్మత్సరాణాం - ఎదుటివారి అభివృధ్ధి సహించకపోవడం మాత్సరం. పరోత్కర్ష అసహనం

నిర్మత్సరాణాం - ఎదుటివారి అభివృధ్ధి సహించకపోవడం మాత్సరం. పరోత్కర్ష అసహనం
వేద్యం వాస్తవమత్ర వస్తు - ఇది తెలుస్కోవలసినది. తెలుస్కుంటే సుఖం కలుగుతుంది.
సంస్కృతంలో ఖం అంటే ఇంద్రియం. సుఖం అంటే మంచి ఇంద్రియం. అంటే భగవంతుని విషయాలను ధ్యానించడం. సుఖం కలుగుతుంది అంటే మంచి ఇంద్రియం అవుతుని. అంటే చెయ్యకూడని వాటిని చెయ్యవు
తాపత్రయోన్మూలనమ్ - దీనివల్ల మూడు రకాల తాపత్రయాలు తొలిగిపోతాయి
శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః
నారాయణుడు బ్రహ్మదేవునికి ఉపదేశించాడు భాగవతం. ఇక్కడ మహాముని అంటే నారాయణుడు. ఆయనే వ్యాసునిగా అవతరించి భాగవతాన్ని 18000 శ్లొకాలుగా అందించాడు. 
ఈ భాగవతం ఉండగా కిం వా పరైరీఇశ్వరః. తక్కిన వాటితో పనేంటి
దాని వల్ల ఫలం ఎమిటంటే 
సద్యో హృద్యవరుధ్యతేऽత్ర కృతిభిః శుశ్రూషుభిస్తత్క్షణాత్
పరమాత్మ వచ్చి హృదయంలో చేరతాడు. వినానలనే కోరిక కలిగి చెప్పేవారిమీద గౌరవంతో వినాలి. ఆ భావనే శుశ్రూష. ఆ భావన ఉంటే పరమాత్మ హృదయంలో ఉంటాడు. 
భక్తి మంత్రం మీదా ఉండాలి మంత్రం పర్తిపాదించే దైవం మీద ఉండాలి గురువు మీద కూడా ఉండాలి


నిగమకల్పతరోర్గలితం ఫలం
శుకముఖాదమృతద్రవసంయుతమ్
పిబత భాగవతం రసమాలయం
ముహురహో రసికా భువి భావుకాః

ప్రతివారి చేతిలో ఉండే పండూ ఈ భాగవతం. బాగా తీయగా ఉన్న పండునే చిలుక పొడుస్తుంది. అలాంటి చిలుక (శుకుడు) కొట్టిన పండు భాగవతం. ఇది చెట్టునుండి పడినపండు కాదు, జారిన పండు. ఈ ఫలం మన చేతుల్లోకి రాగానే రసం అయ్యింది. మామూలుగా పండులో మనం చాలా భాగం పారేసి రసం తాగుతాం. కానీ ఈ భాగవతం అనే పండే రసం అయ్యింది. 'గలితం ఫలం శుకముఖాదమృతద్రవసంయుతమ్ పిబత భాగవతం రసం' 
రసమాలయం - లయం అంటే మోక్షం. మోక్షంలో కూడా భాగవతం వినాలి చదవాలి. మోక్షంలో కూడా ఇడే చేస్తాం.
ముహురహో రసికా భువి భావుకాః
రసమును భావన చేసే వాళ్ళు. భగవంతుని భావించడమే బలం. రసికా అంటే పరమాత్మ యొక్క రసమును తెలుసుకుని భావించేవాళ్ళు. 
భాగవతం శ్రోత్రమనోభిరామం. వినడానికి కూడా బాగుంటుంది. 

నైమిషేऽనిమిషక్షేత్రే ఈశయః శౌనకాదయః
సత్రం స్వర్గాయ లోకాయ సహస్రసమమాసత
యాగం వంద సంవత్సరాలు దాటితే సత్రం అంటాం. పది దాటితే యజ్ఞ్యం సంవత్సరం దాటితే యాగం నెల్లల్లో చేస్తే హోమం అంటాం.ఒక్క రోజులో చేస్తే ఇష్టి అంటాం. ఋషులకు బ్రహ్మగారు తపస్సుకు చూపించిన స్థలం నైమిషం. వరాహావతారంలో హిరణ్యాక్షుని సైన్యాన్ని వరాహమూర్తి ఒక్క నిముషంలో 92 కోట్ల రాక్షసులని సమ్హరించిన ప్రదేశం.  ఇక్కడ స్వర్గాయ లోకాయ అంటే వైకుంటం అని అర్థం. 
త ఏకదా తు మునయః ప్రాతర్హుతహుతాగ్నయః
సత్కృతం సూతమాసీనం పప్రచ్ఛురిదమాదరాత్
మునులందరూ ప్రాత: కాలంలో హవిస్సులన్నీ ఇచ్చి  సూతున్ని బాగా సత్కరించి ఆదరించి ఈ విధంగా అడిగారు
ఋషయ ఉవాచ
త్వయా ఖలు పురాణాని సేతిహాసాని చానఘ
ఆఖ్యాతాన్యప్యధీతాని ధర్మశాస్త్రాణి యాన్యుత
మీరు అన్ని పురాణాలను చదివారు చెప్పారు (ఆఖ్యాతాని అపి అధీతాని) 
యాని వేదవిదాం శ్రేష్ఠో భగవాన్బాదరాయణః
అన్యే చ మునయః సూత పరావరవిదో విదుః

వేత్థ త్వం సౌమ్య తత్సర్వం తత్త్వతస్తదనుగ్రహాత్
బ్రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత
వేదవ్యాసునినికి ఇతర ఋషులకి ఎంత తెలుస్లో నీకు అంతా తెలుసు. వ్యాస మహర్షి తెలుస్కున్నవి ఆయన దయతో నీవు తెలుసుకున్నావు. ఉత్తుడైన స్నేహశీలి అయిన ఆచార్యుడు శిష్యులు అడగకనే చెప్తారు 
తత్ర తత్రాఞ్జసాయుష్మన్భవతా యద్వినిశ్చితమ్
పుంసామేకాన్తతః శ్రేయస్తన్నః శంసితుమర్హసి
మీరు ఆయా సందర్భాలలో పెద్దగా ప్రయాస పడకుండా మానవులందరికి ఇది శ్రేయస్సు కలిగిస్తుందో. అది కూడా సులభంగా  (తర తర అంజసా భవతా )  శ్రేయస్సుని కలిగిస్తుందో అది చెప్పండి. ఒక్క శ్రేయస్సుమాత్రమే కలగాలి (యేకాంత:) . 
ప్రాయేణాల్పాయుషః సభ్య కలావస్మిన్యుగే జనాః
మన్దాః సుమన్దమతయో మన్దభాగ్యా హ్యుపద్రుతాః
కలియుగంలో మానవులంతా అల్పాయుష్యులు. పొట్టివాళ్ళు (మందా: ) నిత్యం ఉపద్రవం ఉండే వాళ్ళు. 
భూరీణి భూరికర్మాణి శ్రోతవ్యాని విభాగశః
అతః సాధోऽత్ర యత్సారం సముద్ధృత్య మనీషయా
చేయవలసిన ధర్మాలు కర్మలు పెద్దవి ఉన్నవి. వినవలసినవి విభాగం ప్రాక్రం చాలా ఉన్నవి. వాటి సారం నీ బుద్ధితో వెలికి తీసి (సముద్ధృత్య ) మాకివ్వు 
బ్రూహి భద్రాయ భూతానాం యేనాత్మా సుప్రసీదతి
శ్రధ్ధగా మేము వింటాం దానివల్ల పరమాత్మ ప్రసన్నుడవుతాడు 
సూత జానాసి భద్రం తే భగవాన్సాత్వతాం పతిః
దేవక్యాం వసుదేవస్య జాతో యస్య చికీర్షయా
అవన్నీ నీకు తెలుసు, నీకు శుభం కలుగు గాక. సకల వేద శాస్త్ర ఇతిహాస సారమంటే వసుదేవునివాల్ల దేవికి యందు పరమాత్మ కుమారుడిగా పుట్టి యేమి చేశారు, యేమి చెయాలనుకుని పుట్టాడో
తన్నః శుష్రూషమాణానామర్హస్యఙ్గానువర్ణితుమ్
యస్యావతారో భూతానాం క్షేమాయ చ భవాయ చ
మిమ్మల్ని శుష్రూష చేస్తున్నా మాకు వివరించతగినవాడవు. ఆ అవతారం సకల భూతముల క్షేమానికి సుఖానికి పనికొచ్చేది
ఆపన్నః సంసృతిం ఘోరాం యన్నామ వివశో గృణన్
తతః సద్యో విముచ్యేత యద్బిభేతి స్వయం భయమ్
సంసారంలో పడి పెద్ద ఆపదలో ఉన్న మానవుడు పరమాత్మ నామనును అనుకోకుండా(వివశ:) ధ్యానం చేసినా విముక్తుడవుతాడో అలాంటివాడు కూడా సంసారంలోంచి విముక్తుడవుతాడు. ఎలాంటివాడిని చూస్తే భయం కూడా భయపడుతుందో
యత్పాదసంశ్రయాః సూత మునయః ప్రశమాయనాః
సద్యః పునన్త్యుపస్పృష్టాః స్వర్ధున్యాపోऽనుసేవయా
యే పరమాత్మ పాదాలను ఆశ్రయించిన్ మునులు ఒక్క సారి స్పృశిస్తేనే తక్కినవారందరూ గంగా స్నానం చేసిన వారిలాగ పవిత్రులవుతారో.

కో వా భగవతస్తస్య పుణ్యశ్లోకేడ్యకర్మణః
శుద్ధికామో న శృణుయాద్యశః కలిమలాపహమ్
అపవిత్రంగా ఉన్నతాను పవిత్రంకావలనుకుని భగవానుని కధను వినని వాడెవడు. 
తస్య కర్మాణ్యుదారాణి పరిగీతాని సూరిభిః
బ్రూహి నః శ్రద్దధానానాం లీలయా దధతః కలాః
అలాంటి పరమాత్మ యేమి పనులు చేసాడని పెద్దలు చెప్పారో. 
అథాఖ్యాహి హరేర్ధీమన్నవతారకథాః శుభాః
ఈలా విదధతః స్వైరమీశ్వరస్యాత్మమాయయా
అటువంటి పరమాత్మ కధను చెప్పండి
వయం తు న వితృప్యామ ఉత్తమశ్లోకవిక్రమే
యచ్ఛృణ్వతాం రసజ్ఞానాం స్వాదు స్వాదు పదే పదే
మేము మాత్రం తృప్తి పొందము, రసము తెలిసిన్వ వారు వింటే భగవంతుని కధలో ప్రతీ పదంలో రుచే. రుచికే రుచి (స్వాదు స్వాదు). 
కృతవాన్కిల కర్మాణి సహ రామేణ కేశవః
అతిమర్త్యాని భగవాన్గూఢః కపటమానుషః
బలరామునితో కలిసి అతిమానుషుడైన భగవానుడు ఎమేమిపనులు చేసాడో 
కలిమాగతమాజ్ఞాయ క్షేత్రేऽస్మిన్వైష్ణవే వయమ్
ఆసీనా దీర్ఘసత్రేణ కథాయాం సక్షణా హరేః
కలిపురుషుడు రాబోతున్నాడని తెలుస్కున్నాము ఈ విష్నుక్షేత్రంలోకి ఆ కలి రాకుండా ఉండటానికి ఈ సత్రం చేస్తున్నాము 
త్వం నః సన్దర్శితో ధాత్రా దుస్తరం నిస్తితీర్షతామ్
కలిం సత్త్వహరం పుంసాం కర్ణధార ఇవార్ణవమ్
కలిమలాన్ని తొలిగించుకోడానికి ఎమి చెయ్యాలనుకున్న మాకు భగవానుడు మిమ్మల్ని చూఫాడు

బ్రూహి యోగేశ్వరే కృష్ణే బ్రహ్మణ్యే ధర్మవర్మణి
స్వాం కాష్ఠామధునోపేతే ధర్మః కం శరణం గతః
కృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తరువాత ధరమము ఎవరిని ఆశ్రయించింది

Popular Posts