Followers

Friday, 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పంచమ అధ్యాయం

సూత ఉవాచ

అథ తం సుఖమాసీన ఉపాసీనం బృహచ్ఛ్రవాః
దేవర్షిః ప్రాహ విప్రర్షిం వీణాపాణిః స్మయన్నివ

నారద ఉవాచ
పారాశర్య మహాభాగ భవతః కచ్చిదాత్మనా
పరితుష్యతి శారీర ఆత్మా మానస ఏవ వా

జిజ్ఞాసితమధీతం చ బ్రహ్మ యత్తత్సనాతనమ్
తథాపి శోచస్యాత్మానమకృతార్థ ఇవ ప్రభో

అధీతం అంటే పొందారు. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందారు, పరభ్రహ్మ విషయం తెలుస్కొన్నారు, తెలుసుకొన్నదానిని భారతరూపంలో అందించారు. అయిన మీరు చింతిస్తున్నారు. ఎందుకు

వ్యాస ఉవాచ
అస్త్యేవ మే సర్వమిదం త్వయోక్తం తథాపి నాత్మా పరితుష్యతే మే
తన్మూలమవ్యక్తమగాధబోధం పృచ్ఛామహే త్వాత్మభవాత్మభూతమ్

మీరుచెప్పినదంతా నాదగ్గర ఉంది. అయిన ఎందుకు నా మనసు తృప్తిని పొందటంలేదు. అవ్యక్తం అగాధమైన నా చింత యొక్క మూలాన్ని తెలపగోరుతున్నాను మీరు అనంతమైన జ్ఞ్యానమున్నవారు. మీరు బ్రహ్మయొక్క శరీరమ్నుంచి పుట్టినవారు.

స వై భవాన్వేద సమస్తగుహ్యముపాసితో యత్పురుషః పురాణః
పరావరేశో మనసైవ విశ్వం సృజత్యవత్యత్తి గుణైరసఙ్గః

మీరు అందరి మనసులో ఉన్న భావలని తెలుసుకోగలరు. మీరు పురాణ పురుషున్ని ఆరాధించారు.  ఆ పురుషుడు పర - అవర ఈశ: తక్కువ వారికి ఎక్కువ వారికి ప్రభువు. ప్రకృతికి అహంకరానికి మహత్తుకు ప్రభువు. మనసైవ సృజతి - మనసుతో సంకల్పంతో సృజిస్తాడు రక్షిస్తాడు సం హరిస్తాడు. ఆ గుణాలతో ఆయనకి సంబంధముండదు. పరమాత్మ తాను తానుగానే ఉంటాడు,

త్వం పర్యటన్నర్క ఇవ త్రిలోకీమన్తశ్చరో వాయురివాత్మసాక్షీ
పరావరే బ్రహ్మణి ధర్మతో వ్రతైః స్నాతస్య మే న్యూనమలం విచక్ష్వ

సూర్యునిలాగ సకలలోకాలు పర్యటిస్తున్నావు, వాయువు ఎలా ఐతే అందరిలో ఉంటుందో అలాగే అందరిలో సంచరిస్తున్నావు. పరమాత్మని చేరడానికి తెలియడానికి తెలపడానికి ఆచరించాల్సిన అన్ని నియమాలను ధర్మాలను నిర్వహించడంలో నేను పరిపూర్ణుడిని అనుకుంటున్నాను గాని నిజముగా నాలో ఉన్న లోపమేమిటో చెప్పవలసింది. (నూనం - తక్కువ)

శ్రీనారద ఉవాచ
భవతానుదితప్రాయం యశో భగవతోऽమలమ్
యేనైవాసౌ న తుష్యేత మన్యే తద్దర్శనం ఖిలమ్

పరమాత్మ యొక్క గాధలను వర్ణించవలసినవిధంగా వర్ణించలేదేమో. అది అనుదితప్రాయం అంటే చెప్పలేనట్లుగానే. భగవత్ తత్వాన్ని భగవత్ తత్వంగా చెప్పలేదు. పరమాత్మను సంతోషింపలేని పని ఆ శాస్త్రం క్రియ పని వ్యర్థం.

యథా ధర్మాదయశ్చార్థా మునివర్యానుకీర్తితాః
న తథా వాసుదేవస్య మహిమా హ్యనువర్ణితః

ధర్మార్థ కామాలను వర్ణించావు గాని పరమాత్మ ప్రభావాన్ని వర్ణించలేదు.

న యద్వచశ్చిత్రపదం హరేర్యశో జగత్పవిత్రం ప్రగృణీత కర్హిచిత్
తద్వాయసం తీర్థముశన్తి మానసా న యత్ర హంసా నిరమన్త్యుశిక్క్షయాః

ఎన్ని రకాల చిత్ర చిత్ర పదాలున్నా అలంకారాలున్నా కవిత్వం సకలజగత్తుని పాలించే పరమాత్మను గానంచెయ్యనట్లైతే అవి కాకులు సంచరించే ప్రదేశం. పరమాత్మ కీర్తిని గానం చెయ్యని కావ్యమును జ్ఞ్యానులు చద్వరు. మనస సరస్సులో సంచరించే హంసలు బురదగుంటలో తిరుగుతారా. ఉషిక్ - పరమాత్మ. క్ష్యయం - గృహం.

తద్వాగ్విసర్గో జనతాఘవిప్లవో యస్మిన్ప్రతిశ్లోకమబద్ధవత్యపి
నామాన్యనన్తస్య యశోऽఙ్కితాని యత్శృణ్వన్తి గాయన్తి గృణన్తి సాధవః

కవిత్వ లక్షణాలు (యతి ప్రాస చందస్సు అలంకారాలు రీతి వృత్తి) లేకపోయినా పరమాత్మ నామాలను కీర్తించుట జపించుట ధ్యానించుట చెప్పిన కావ్యాన్ని, దానిలో కావ్యలక్షణాలు లేకపోయినా అది జనాల పాపాలను పోగొట్టేవే

నైష్కర్మ్యమప్యచ్యుతభావవర్జితం న శోభతే జ్ఞానమలం నిరఞ్జనమ్
కుతః పునః శశ్వదభద్రమీశ్వరే న చార్పితం కర్మ యదప్యకారణమ్

పరమాత్మమయముగా తోచని నాడు మనం చేసే పని (అలోచన, కార్యం మొ) అది నిష్కామకర్మ అయినా పరమాత్మ భావంలేకపోతే శోభించదు. భక్తి లేని జ్ఞ్యానము పనికిరాదు. నిష్కామ కర్మ అయిన పరమాత్మకు సంబంధించనిది వ్యర్థమైనప్పుడు పరమాత్మకు. మన శరీరమూ వాక్కు వేదవిహితంగా ఉంది అంటే అది మన బుధ్ధి వల్లకాదు. ఆ బుధ్ధి ఇచ్చినది పరమాత్మ. అందుకు ఆ కర్మకు సంకలంపాన్ని ఇచ్చిన మనసును అలోచింపజేసిన బుధ్ధినీ పరమాత్మకు సమర్పించాలి. మనలో భావన కలిగించేది పరమాత్మ.మనం అనుభవించాల్సిన ఫలితానికి అనుగుణమైన బుధ్ధిని ఆయనే కలిగిస్తాడు. అందుకే ఆయనకు శరీరాన్ని మనస్సును అర్పించాలి. ప్రయోజనం ఆశించని కర్మ అయిన పరమాత్మకు అర్పించకుంటే శుభప్రదం కాదు

అథో మహాభాగ భవానమోఘదృక్శుచిశ్రవాః సత్యరతో ధృతవ్రతః
ఉరుక్రమస్యాఖిలబన్ధముక్తయే సమాధినానుస్మర తద్విచేష్టితమ్

ఇవి నీకు చెప్పాల్సిన అవసరంలేదు. మీరు అమోఘదృక్ - సఫలమైన జ్ఞ్యానం కలవారు. పరిశుధ్ధమైన కీర్తి కలవాడవు సత్యం మీద ప్రీతి కలవాడవు, దృతవ్రతుడివి. అన్ని వ్రతాలు ఆచరించిన వాడవు. ప్రాణులందరికీ సంసారబంధం వదలడానికి పరమాత్మ చరిత్ర తెలుపు. ప్రతీవారికి పరమాత్మ ఎలా ఉపకరిస్తున్నాడు. పరమాత్మకు మనమీద గల ప్రేమను తెలుపు. మనం చెయ్యాల్సిన పని చెయ్యకపోతే మనం పడే కష్టాలని పరమాత్మ సహించలేడు. సమాధినానుస్మర - నీ దివ్యదృష్టితో స్మరించు ఆయన చేష్టలను

తతోऽన్యథా కిఞ్చన యద్వివక్షతః పృథగ్దృశస్తత్కృతరూపనామభిః
న కర్హిచిత్క్వాపి చ దుఃస్థితా మతిర్లభేత వాతాహతనౌరివాస్పదమ్

నడిసముద్రంలో బాగా గాలివీచి అలలులేస్తుంటే పడవ ఎలా అందులో మునుగుతుందో పరమాత్మ తత్వమును కాకుండా భిన్నమైన సాంసారిక తత్వమును (ధనము మొ) ఇలాంటివాటిగురించి ఆలోచించేవాడు ఎంతటి జ్ఞ్యాని అయిన పెనుగాలికి వచ్చే పెద్ద అలలలో కొట్టుకుపోయే పడవలాంటివాడు

జుగుప్సితం ధర్మకృతేऽనుశాసతః స్వభావరక్తస్య మహాన్వ్యతిక్రమః
యద్వాక్యతో ధర్మ ఇతీతరః స్థితో న మన్యతే తస్య నివారణం జనః

సహజంగానే స్వభావాన్ని బట్టి లోకులు అధర్మాన్ని ఆచరిస్తున్నారు. జుగుప్సితమైన పని చేసే మనుషులకి, అలాంటివారికి భారతంలో ధర్మం ఆచరించమంటే వారు అధర్మాన్నే ఆచరిస్తారు. అలాంటివారిని ఎలా వారిస్తావు, ఎవరైనా ఎలా వారిస్తారు. ఒక కావ్యం చదివితే అదివరకూ వారు చేసే అధర్మాన్ని ఆపగలగాలి. నోటికిమాత్రం ఇది ధర్మాన్ని భోదిస్తున్నట్లు ఉన్నది గాని, అది చూసి వారు అధర్మాన్నే ఆచరిస్తే వారిని నివారించడం ఎలా?

విచక్షణోऽస్యార్హతి వేదితుం విభోరనన్తపారస్య నివృత్తితః సుఖమ్
ప్రవర్తమానస్య గుణైరనాత్మనస్తతో భవాన్దర్శయ చేష్టితం విభోః

నీవు వ్రాసిన మహాభారతాన్ని వివేకంగలవారు తెలుసుకోగలరు, అది జ్ఞ్యానులకే తెలియశక్యం. నివృత్తి (సర్వ కర్మ ఫల త్యాగం ) సుఖము. సంసారంలో సహజమైన సాత్విక రాజస తామస గుణాల్లో ఉండే వారికి తత్వంతెలియని వారికి (అనాత్మన: ) పరమాత్మ తత్వం చెప్పు. ఆయన అవ్యాజమైన కృప గురించిచెప్పు. ఆయన లీలలను వర్ణించు.

త్యక్త్వా స్వధర్మం చరణామ్బుజం హరేర్భజన్నపక్వోऽథ పతేత్తతో యది
యత్ర క్వ వాభద్రమభూదముష్య కిం కో వార్థ ఆప్తోऽభజతాం స్వధర్మతః

అన్ని ధర్మాలను కర్మఫలితాలను విడిచి నారాయణుని పాదాలని ఆశ్రయించినవాడు తనకి కలగవలసిన జ్ఞ్యానం పూర్తిగా కలగకుండా మరణిస్తే వాడు పవిత్రమైన సంపద కలవారి ఇంట్లో పుడతాడు. పరమాత్మను సేవించనివాడికి శుభమూ కలగదు. సుఖము సుఖమూ కాదు పరమాత్మని స్మరించని నాడు. దు:ఖము దు:ఖము కాదు పరమాత్మని స్మరించిననాడు

తస్యైవ హేతోః ప్రయతేత కోవిదో న లభ్యతే యద్భ్రమతాముపర్యధః
తల్లభ్యతే దుఃఖవదన్యతః సుఖం కాలేన సర్వత్ర గభీరరంహసా

సంపదపొందటానికి ప్రయత్నం చెయ్యకరలేదు, మన ప్రయ్త్నంలేనిదే రావు అన్నది నిజం ఐతే దు:ఖము కూడా ఎవరికి రాకూడదు ఎందుకంటే ఎవరూ దు:ఖానికి ప్రయత్నం చెయ్యరు గనక. అమిత వేగమైన కాలం కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు దు:ఖం ఇస్తుంది. మన ప్రయత్నం జ్ఞ్యానం పొందాలని ధర్మాన్ని పొందాలని ఉండాలి. మిగతావి మన ప్రయత్నం లేకుండానే వస్తాయి. ఈ జన్మ పరంపరను తప్పించే ఊఅయాన్ని చెప్పు.

న వై జనో జాతు కథఞ్చనావ్రజేన్ముకున్దసేవ్యన్యవదఙ్గ సంసృతిమ్
స్మరన్ముకున్దాఙ్ఘ్ర్యుపగూహనం పునర్విహాతుమిచ్ఛేన్న రసగ్రహో జనః

ఒక్కసారి పరమాత్మ పాదసేవలో రుచి తెలిసినవాడు దాన్ని వదిలిపెడతాడా? ప్రంపంచంలో పెద్దకష్టాలలో కల్లా పెద్ద కష్టం సంసారం. ఇన్ని దు:ఖాలకి మూలమైన సంసారన్నే వదలని వాడు పరమాత్మ దొరికితే వదులుతాడా? పరమాత్మ పాద పద్మాలని ఆశ్రయించే విధానాన్ని తెలిసినవాడు మళ్ళి విడిచిపెట్టడు

ఇదం హి విశ్వం భగవానివేతరో యతో జగత్స్థాననిరోధసమ్భవాః
తద్ధి స్వయం వేద భవాంస్తథాపి తే ప్రాదేశమాత్రం భవతః ప్రదర్శితమ్

ఇవాన్నీ నీకు స్వయంగా తెలుసు. అయినా కేవలం ప్రాదేశమాత్రంగా (సూక్ష్మంగా ) చెప్పాను.

త్వమాత్మనాత్మానమవేహ్యమోఘదృక్పరస్య పుంసః పరమాత్మనః కలామ్
అజం ప్రజాతం జగతః శివాయ తన్మహానుభావాభ్యుదయోऽధిగణ్యతామ్

నీవుకూడా స్వామియొక్క అంశవే . జగాతు యొక్క కళ్యాణానికి పుట్టుకలేనివాడివైన నువ్వు పుట్టినావని తెలుసుకో. సకల జగత్తు ఎలా వృధ్ధి పొందుతుందో దానిగురించి ఆలోచించు

ఇదం హి పుంసస్తపసః శ్రుతస్య వా స్విష్టస్య సూక్తస్య చ బుద్ధిదత్తయోః
అవిచ్యుతోऽర్థః కవిభిర్నిరూపితో యదుత్తమశ్లోకగుణానువర్ణనమ్

మానవుడాచరించే తపస్సు శాస్త్రం ఆచరించే సత్కర్మలు అధ్యయనం చేసే వేదాలు, చేసే దానం వీటన్నిటికీ తప్పకుండా ఫలితం కలగాలంటే ఏమి చెయ్యలో పండితులందరూ చెప్పారు - పరమాత్మ యొక్క గుణాలను సంకీర్తనమే. మనచేత పరమాత్మ చేయిస్తున్నాడు అనుకుంటే వస్తుంది . ఈ కర్మల ఫలితం పరమాత్మ నామ సంకీర్తనే.

అహం పురాతీతభవేऽభవం మునే దాస్యాస్తు కస్యాశ్చన వేదవాదినామ్
నిరూపితో బాలక ఏవ యోగినాం శుశ్రూషణే ప్రావృషి నిర్వివిక్షతామ్

నేను పూర్వజన్మలో వేదాలను అధ్యాయం చేసే వారి దగ్గర ఉన్న ఒక దాసీ పుత్రుడను. చిన్నవాడిగా ఉండగానే ఋషులను సేవించాను. ప్రావృషి నిర్వివిక్షతామ్ - వారు చాతుర్మాస్యంలో ఉన్నవారు.

తే మయ్యపేతాఖిలచాపలేऽర్భకే దాన్తేऽధృతక్రీడనకేऽనువర్తిని
చక్రుః కృపాం యద్యపి తుల్యదర్శనాః శుశ్రూషమాణే మునయోऽల్పభాషిణి

నేను అన్ని ఆటల మీద నుంచి మనసు పొయింది, బాల్య చాపల్యం కూడా పొయింది. అపేతాఖిల చాపలే - అన్ని చాపల్యాలు పొయాయి. అదృతక్రీడననే - ఆటలమీద నుంచి మనసు పొయింది. తుల్య దర్శన - అన్ని ప్రాణులను సమానంగా చూసే ఋషులు.

ఉచ్ఛిష్టలేపాననుమోదితో ద్విజైః సకృత్స్మ భుఞ్జే తదపాస్తకిల్బిషః
ఏవం ప్రవృత్తస్య విశుద్ధచేతసస్తద్ధర్మ ఏవాత్మరుచిః ప్రజాయతే

వారు తిని వదిలిపెట్టిన విస్తరిలో ప్రసాదాన్ని వారి అనుమతితో స్వీకరించే అదృష్టంవల్ల ఒకటి రెండు మెతుకులు తినగానే సకల పాపాలు పోయాయి. వారివెంటనే ఉండటంతో ఆ ధర్మమంటేనే రుచిపుట్టింది.

తత్రాన్వహం కృష్ణకథాః ప్రగాయతామనుగ్రహేణాశృణవం మనోహరాః
తాః శ్రద్ధయా మేऽనుపదం విశృణ్వతః ప్రియశ్రవస్యఙ్గ మమాభవద్రుచిః

వారుపరమాత్మ కధలను మనోహరంగా గానం చేస్తుంటే విన్నాను. వారుగానం చేసే గాధలను వింటున్న నాకు ఆ భగవంతుని కధలయందే రుచి పుట్టింది.

తస్మింస్తదా లబ్ధరుచేర్మహామతే ప్రియశ్రవస్యస్ఖలితా మతిర్మమ
యయాహమేతత్సదసత్స్వమాయయా పశ్యే మయి బ్రహ్మణి కల్పితం పరే

పరమాత్మ యందు కలిగిన రుచితో ప్రపంచమనతా పరమాత్మలోనే కల్పించబడింది. ఆయనకన్నా భిన్నంగా ప్రపంచంలేదని అర్థమైంది. ఇదంతా పరమాత్మలో కల్పించబడిన మాయ అని అర్థం అయింది.

ఇత్థం శరత్ప్రావృషికావృతూ హరేర్విశృణ్వతో మేऽనుసవం యశోऽమలమ్
సఙ్కీర్త్యమానం మునిభిర్మహాత్మభిర్భక్తిః ప్రవృత్తాత్మరజస్తమోపహా

ఇలా వారు చేస్తున్న పనులని చెప్తున్న కధలను చేస్తున్న కీర్తలను విన్న నాకు పరమాత్మ  మీద భక్తి కలిగింది. నా రజో తమో గుణాన్ని జయించే భక్తి కలిగింది.

తస్యైవం మేऽనురక్తస్య ప్రశ్రితస్య హతైనసః
శ్రద్దధానస్య బాలస్య దాన్తస్యానుచరస్య చ
జ్ఞానం గుహ్యతమం యత్తత్సాక్షాద్భగవతోదితమ్
అన్వవోచన్గమిష్యన్తః కృపయా దీనవత్సలాః


ఇలా ఇంద్రియ నిగ్రం కలిగింది సంసార స్వరూపం తెలిసింది, భగవంతుని యొక్క మాయ అని అర్థం అయింది భగవంతుని మీద భక్తి కలిగింది వారి ఉచ్చిష్ట భోజనంతో పాపాలు తొలిగాయి. ఇవన్నీ ఒకదానివెంట ఒకటి కలుగగా వారికి నా మీద దయ పుట్టి, దీనవత్సలులు కాబట్టి వర్షఋస్తువు పూర్తయి బయటకు వెళ్ళేముందు భగవత్ తత్వాన్ని నాకు ఉపదేశించారు

యేనైవాహం భగవతో వాసుదేవస్య వేధసః
మాయానుభావమవిదం యేన గచ్ఛన్తి తత్పదమ్

యే జ్ఞ్యానంతో పరమాత్మ స్థానాన్ని చేరుకుంటామో దాన్ని ఋషుల బోధతో తెలుసుకోగలిగాను.


ఏతత్సంసూచితం బ్రహ్మంస్తాపత్రయచికిత్సితమ్
యదీశ్వరే భగవతి కర్మ బ్రహ్మణి భావితమ్

మనకు కలిగేటటువంటి మూడు తాపములకూ సరి అయిన చికిత్స తెలుస్కున్నాను - పరమాత్మ భక్తులను సేవించడం. ఇది నాకు మహానుభావుల సేవ వలన తెలిసింది.

ఆమయో యశ్చ భూతానాం జాయతే యేన సువ్రత
తదేవ హ్యామయం ద్రవ్యం న పునాతి చికిత్సితమ్

కర్మ పరమాత్మకి అర్పిస్తే పుణ్యం. మనమే చేసామనుకుంటే పాపం.కర్మ రెండువిధాలుగా పనిచేస్తుంది. నెయ్యి ఎక్కువ తాగితే అజీర్ణం చేస్తుంది. అదే నెయ్యి మందులో వెసుకుంటే అదే అజీర్ణం పోతుంది. మందులో కలుపుకుంటే ఎలా రోగంపోతుందో - అవే కర్మలను పరమాత్మకు అర్పిస్తే పాపం ఉండదు
ఆమయో యశ్చ భూతానాం జాయతే యేన సువ్రత - దేనితే ప్రాణులకు రోగం కలుగ్తుందో.
తదేవ హ్యామయం ద్రవ్యం న పునాతి చికిత్సితమ్ - దాన్నే మందులో వాడితే రోగం కలిగించదు

ఏవం నృణాం క్రియాయోగాః సర్వే సంసృతిహేతవః
త ఏవాత్మవినాశాయ కల్పన్తే కల్పితాః పరే

యే రకంగా భుజించావో అదే ద్రవ్యాన్ని అలాగే భుజిస్తే రోగం తగ్గదు. కాని అదే పదార్ధాన్ని ఔషధంలో వేసుకుంటే రోగం తగ్గుతుంది. నీవాచరించే యే కర్మలు సంసారాన్ని ఇస్తాయో అవే కర్మలు పరమాత్మకు అర్పించినప్పుడు
త ఏవాత్మవినాశాయ కల్పన్తే కల్పితాః పరే -  అవే సంసారాన్ని తొలగిస్తాయి. అనుయోగంలో గాని వియోగంలో గాని మనసు పెట్టకపోవడం మోక్షం.

యదత్ర క్రియతే కర్మ భగవత్పరితోషణమ్
జ్ఞానం యత్తదధీనం హి భక్తియోగసమన్వితమ్
కుర్వాణా యత్ర కర్మాణి భగవచ్ఛిక్షయాసకృత్
గృణన్తి గుణనామాని కృష్ణస్యానుస్మరన్తి చ

యదత్ర క్రియతే కర్మ భగవత్పరితోషణమ్ -
భాగవతం మొత్తంలో చెప్పే విషయం నీవు చేసే పనియొక్క అసలైన ఫలితం భగవంతుని సంతోషం.
జ్ఞానం యత్తదధీనం హి భక్తియోగసమన్వితమ్- పరమాత్మ ఆధీనంలో ఉన్నదైన జ్ఞ్యానం భక్తియోగంతో కూడితేనే దాన్ని జ్ఞ్యానం అంటారు.
కుర్వాణా యత్ర కర్మాణి భగవచ్ఛిక్షయాసకృత్ - పరమాత్మ బోధించాడని చెప్పాడని చెయించాడనే భావంతో కర్మలు చేస్తున్నారో, భగావంతుని స్మరణతో కరమలు చేస్తారో అది ఉత్తమ కర్మ

ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సఙ్కర్షణాయ చ
ఇతి మూర్త్యభిధానేన మన్త్రమూర్తిమమూర్తికమ్
యజతే యజ్ఞపురుషం స సమ్యగ్దర్శనః పుమాన్

ఓం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సఙ్కర్షణాయ చ - ఈ మంత్రాన్ని వారునాకు చెప్పారు. ఇది జ్ఞ్యానం కలిగించే మంత్రం.
ఇతి మూర్త్యభిధానేన మన్త్రమూర్తిమమూర్తికమ్ - ఎలాంటి విగ్రహాన్ని లేకుండా మంత్రమే మూర్తిగా ఉన్నా ఈ మంత్రాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వారు

ఇమం స్వనిగమం బ్రహ్మన్నవేత్య మదనుష్ఠితమ్
అదాన్మే జ్ఞానమైశ్వర్యం స్వస్మిన్భావం చ కేశవః

పరమాత్మనాలో జ్ఞ్యానాన్ని భక్తి భావాన్ని ఆయిశ్వర్యాన్ని (నా మనసు ను నేను శాసించుట)

త్వమప్యదభ్రశ్రుత విశ్రుతం విభోః సమాప్యతే యేన విదాం బుభుత్సితమ్
ప్రాఖ్యాహి దుఃఖైర్ముహురర్దితాత్మనాం సఙ్క్లేశనిర్వాణముశన్తి నాన్యథా

నీవు కూడా పరమాత్మ కీర్తిని గుణాలను వర్ణించు. దుఃఖైర్ముహురర్దితాత్మనాం - అనేక పరితాపాలతో బాధలతో ఉన్నవారికి. సంక్లేశనివారణ అంటే భగవంతుని కీర్తిని గాణం చెయ్యలని లేదా వినాలి లేదా ధ్యానం చెయ్యలి
సమాప్యతే యేన విదాం బుభుత్సితమ్ -జ్ఞ్యానులకి (విదాం )తెలుసుకోదగింది (బుభుత్సితమ్ ) దేనిచేత (యేన ) పూరింపబడుతుందో (సమాప్యతే ).
సఙ్క్లేశనిర్వాణముశన్తి నాన్యథా - తాపత్ర్యలాచేత కలిగే దుఖాలని తొలగించేది పరమాత్మ కధలే. బాగా చెప్పేవాడు (ఉశంతి ).

Popular Posts