Followers

Friday 31 January 2014

శ్రీమద్భాగవతం ప్రధమ స్కంధం పదహారవ అధ్యయం

సూత ఉవాచ
తతః పరీక్షిద్ద్విజవర్యశిక్షయా మహీం మహాభాగవతః శశాస హ
యథా హి సూత్యామభిజాతకోవిదాః సమాదిశన్విప్ర మహద్గుణస్తథా

విప్రులారా పరీక్షిత్తు పుట్టినప్పుడు (సూత్యాం) ఎలా ఐతే జాతకం తెలిసినవాళ్ళు అభిప్రాయపడ్డారో (సమాదిశన్) అలాగే మహా భాగవతుడైన పరీక్షిత్తు బ్రాహమణుల శిక్షణ చేత భూమిని పరిపాలించాడు.

స ఉత్తరస్య తనయాముపయేమ ఇరావతీమ్
జనమేజయాదీంశ్చతురస్తస్యాముత్పాదయత్సుతాన్

ఉత్తరుని కుమారుడైన ఇరావతిని పెండ్లాడి నలుగురు కొడుకులని కన్నాడు. అందుల్ఫ్ జనమేజయుడు పెద్ద వాడు

ఆజహారాశ్వమేధాంస్త్రీన్గఙ్గాయాం భూరిదక్షిణాన్
శారద్వతం గురుం కృత్వా దేవా యత్రాక్షిగోచరాః

శారదవతుడు (కృపాచార్యుడు) గురువుగా చేసికొని మూడు అశ్వమేధ యాగములు భూరి దక్షిణలతో కూడి గంగా తీరములో చేసాడు. ఈ అశ్వమేధ యజ్ఞ్యానికి సామన్య మానవులకు కనపడేట్లుగా దేవతలు వచ్చారు

నిజగ్రాహౌజసా వీరః కలిం దిగ్విజయే క్వచిత్
నృపలిఙ్గధరం శూద్రం ఘ్నన్తం గోమిథునం పదా

తన దిగ్విజయ యారలో భాగంగా రాజువేషం వేసుకున్న శూద్రుడి రూపంలో ఉండి గోవునీ వృషబాన్నీ కాలితో తన్నుతున్న కలిని నిగ్రహించాడు

శౌనక ఉవాచ
కస్య హేతోర్నిజగ్రాహ కలిం దిగ్విజయే నృపః
నృదేవచిహ్నధృక్శూద్ర కోऽసౌ గాం యః పదాహనత్
తత్కథ్యతాం మహాభాగ యది కృష్ణకథాశ్రయమ్

కలిని పరీక్షిత్తు ఏ కారణం చేత నిగ్రహించాడు. రాజు వేషం వేసుకున్న శూద్రుని రూపంలో ఉండి గోవుని కాలితో స్పృశించినందుకా. కృష్ణ కథా సంబంధమైతే దీన్ని వివరించవలసింది

అథవాస్య పదామ్భోజ మకరన్దలిహాం సతామ్
కిమన్యైరసదాలాపైరాయుషో యదసద్వ్యయః

పరమాత్మ పాదములనే పద్మముల మకరందాన్ని గ్రోలే భక్తులకు అసత్ ఆలాపములు ఎందుకు. వాటితో ఆయువు వ్యయం చేయడం ఎందుకు (అసత్ వ్యయ:)

క్షుద్రాయుషాం నృణామఙ్గ మర్త్యానామృతమిచ్ఛతామ్
ఇహోపహూతో భగవాన్మృత్యుః శామిత్రకర్మణి

క్షుద్రాయుషాం  - అల్పమైన ఆయ్షు కలవారు మానవులు. ఓ సూతా (అఙ్గ ), సత్యం తెలుసుకోవాలనే వారు మృత్యు భగవానుని శమింపచేసే కర్మలు చేస్తారు

న కశ్చిన్మ్రియతే తావద్యావదాస్త ఇహాన్తకః
ఏతదర్థం హి భగవానాహూతః పరమర్షిభిః
అహో నృలోకే పీయేత హరిలీలామృతం వచః

మృత్యువు  ఇక్కడ ఉన్నంత వరకూ ఎవరూ ప్రాణాలు కోల్పోరు, అందుకే ఋషులు ఆ భగవానుని ఆహ్వానించారు. నరలోకంలో ఉండే వారి హరి లీలామృతాన్ని గ్రోలుదురు గాక

మన్దస్య మన్దప్రజ్ఞస్య వయో మన్దాయుషశ్చ వై
నిద్రయా హ్రియతే నక్తం దివా చ వ్యర్థకర్మభిః

మందబుద్ధి గల మానవులు నిద్రతో రాత్రినీ వ్యర్థకర్మలతో పగటినీ వృధా చేస్తారు

సూత ఉవాచ
యదా పరీక్షిత్కురుజాఙ్గలేऽవసత్కలిం ప్రవిష్టం నిజచక్రవర్తితే
నిశమ్య వార్తామనతిప్రియాం తతః శరాసనం సంయుగశౌణ్డిరాదదే

పరీక్షిత్తు కురు జాంగల రాజ్యంలో ఉండగా తన పరిపాలనలో కలి ప్రవేశించాడన్న ప్రియము కానటువంటి వారతని తెలుసుకొని, తన శరములను బాణములను తీసుకుని యుధ్ధమునకు బయలుదేరాడు.

స్వలఙ్కృతం శ్యామతురఙ్గయోజితం రథం మృగేన్ద్రధ్వజమాశ్రితః పురాత్
వృతో రథాశ్వద్విపపత్తియుక్తయా స్వసేనయా దిగ్విజయాయ నిర్గతః

అలంకృతమైన నల్లని గుఱ్ఱములు గలిగి ఉన్న రథం, సిమ్హ ద్వజముతో, రథ, అశ్వ, గజ సేనలు పరివేష్టితమై ఉండగా విజయాభిలాషియై బయలుదేరాడు

భద్రాశ్వం కేతుమాలం చ భారతం చోత్తరాన్కురూన్
కిమ్పురుషాదీని వర్షాణి విజిత్య జగృహే బలిమ్


పరీక్షిన్మహారాజు భద్రాశ్వం కేతుమాలం భారతం, ఉత్తరకురు , కింపురుష మొదలిన వర్షములను గెలిచాడు

నగరాంశ్చ వనాంశ్చైవ నదీశ్చ విమలోదకాః
పురుషాన్దేవకల్పాంశ్చ నారీశ్చ ప్రియదర్శనాః
అదృష్టపూర్వాన్సుభగాన్స దదర్శ ధనఞ్జయః
సదనాని చ శుభ్రాణి నారీశ్చాప్సరసాం నిభాః

నగరాలు వనాలు నదులు అందమైన పురుషులూ స్త్రీలు మొదలైన వారిని చూచాడు

తత్ర తత్రోపశృణ్వానః స్వపూర్వేషాం మహాత్మనామ్
ప్రగీయమాణం చ యశః కృష్ణమాహాత్మ్యసూచకమ్

ఎక్కడకి వెళ్తే అక్కడ తన పూర్వులైన పాండవుల గురించి, కృష్ణ మాహాత్యం గురించి స్తోత్రాలు విన్నాడు

ఆత్మానం చ పరిత్రాతమశ్వత్థామ్నోऽస్త్రతేజసః
స్నేహం చ వృష్ణిపార్థానాం తేషాం భక్తిం చ కేశవే

పరీక్షిన్మహరాజుని అశ్వద్ధమ అస్త్ర తేజసు నుండి కృష్ణుడు రక్షించడాన్ని, వృష్ణి పృధుల స్నేహాన్ని, వారి భక్తినీ కూడా కీర్తించారు

తేభ్యః పరమసన్తుష్టః ప్రీత్యుజ్జృమ్భితలోచనః
మహాధనాని వాసాంసి దదౌ హారాన్మహామనాః

వారి స్తోత్రానికి సంతోషించి విప్పారిన నేత్రములు కలిగిన రాజు వారికి కానుకలు హారములు వస్త్రములు ఇచ్చాడు

సారథ్యపారషదసేవనసఖ్యదౌత్య
వీరాసనానుగమనస్తవనప్రణామాన్
స్నిగ్ధేషు పాణ్డుషు జగత్ప్రణతిం చ విష్ణోర్
భక్తిం కరోతి నృపతిశ్చరణారవిన్దే

కృష్ణభగవానుడు సారధిగా, పారషదుడిగా, సఖ్యునిగా, దూతగా, కాపలావాడిగా, అనుగమించేవాడిగా, నమస్కరించే వాడిగా అందరిచేతా నమస్కరింపబడే కృష్ణుడు ఉన్నాడన్న సంగతి విని కృష్ణ చరణారవిందములయందు భక్తి తో ఉప్పొంగాడు

తస్యైవం వర్తమానస్య పూర్వేషాం వృత్తిమన్వహమ్
నాతిదూరే కిలాశ్చర్యం యదాసీత్తన్నిబోధ మే

ఇలా రొజూ తన పూర్వీకుల వైభవములో మునిగి ఉన్న పరీక్షిత్తుకి నేను మీకు చెప్పబోయే ఆశ్చర్యకరమైన సంఘటన దగ్గరలోనే వచ్చింది. (పూర్వేషాం - పూర్వులు, వర్తమానస్య - మునిగి ఉన్న అన్వహం - ప్రతీ రోజు )

ధర్మః పదైకేన చరన్విచ్ఛాయాముపలభ్య గామ్
పృచ్ఛతి స్మాశ్రువదనాం వివత్సామివ మాతరమ్

ఏక పాదము మీద ధర్మము నిలబడి కళారహితముగా ఉండి (విచ్ఛాయాం) ఉండగా అక్కడకి కన్నీళ్ళు పెడుతూ పిల్లని కోల్పోయిన తల్లి వలే ఉన్న ఒక గోవుని గమనించిది (చూచింది) (ఉపలభ్య )

ధర్మ ఉవాచ
కచ్చిద్భద్రేऽనామయమాత్మనస్తే విచ్ఛాయాసి మ్లాయతేషన్ముఖేన
ఆలక్షయే భవతీమన్తరాధిం దూరే బన్ధుం శోచసి కఞ్చనామ్బ

మంగళకరమైన దానా నీ ఆరోగ్యానికి ఎమైనా అయిందా.  విచ్ఛాయాసి  - కళావిహీనంగా ఉన్నావు. మ్లాయత ఏషన్ ముఖం -  బాధతో నల్లబడిన ముఖముతో లోపల దిగులుతో (అంతరాధి) బాధపడుతున్నట్లున్నావు, దూర బంధువులకోసం చింతిస్తున్నట్లు ఉన్నావు

పాదైర్న్యూనం శోచసి మైకపాదమాత్మానం వా వృషలైర్భోక్ష్యమాణమ్
ఆహో సురాదీన్హృతయజ్ఞభాగాన్ప్రజా ఉత స్విన్మఘవత్యవర్షతి

పాదై: న్యూనం శొచసి - నా పాదములు చూసి శోకిస్తున్నావా లేక మాంస భక్షకులగురించి భయపడుతున్నావా లేక యజ్ఞ్యములు ఆగిపోయినందు వలన సురాదులు యజ్ఞ్యభాగములు లేకపోవడాన్ని చూసి బాధపడుతున్నావా లేక కరువు వల్ల ప్రాణులు బాధపడడం చూసి బాధపడుతున్నావా

అరక్ష్యమాణాః స్త్రియ ఉర్వి బాలాన్శోచస్యథో పురుషాదైరివార్తాన్
వాచం దేవీం బ్రహ్మకులే కుకర్మణ్యబ్రహ్మణ్యే రాజకులే కులాగ్ర్యాన్

రక్షణలేని స్త్రీలను బాలలను  గూర్చి ఆలోచించా లేక స్వధర్మాన్ని వదిలి నీచుల పంచన చేరిన బ్రాహ్మణుల గురించా

కిం క్షత్రబన్ధూన్కలినోపసృష్టాన్రాష్ట్రాణి వా తైరవరోపితాని
ఇతస్తతో వాశనపానవాసః స్నానవ్యవాయోన్ముఖజీవలోకమ్

లేక దుష్ట పాలకులు చేస్తున్న దుష్పరిపాలనను చూసా లేక తినడం యందు తాగడం యందు నివసించడం యందు, స్నాన, సంభోగములందు ఒక పద్దతిని పాటించని జనులని చూచా?

యద్వామ్బ తే భూరిభరావతార కృతావతారస్య హరేర్ధరిత్రి
అన్తర్హితస్య స్మరతీ విసృష్టా కర్మాణి నిర్వాణవిలమ్బితాని

లేకపోతే అమ్మా, నీ భారాన్ని తగ్గించడానికి కృష్ణపరమాత్మ అవతరించాడు. ఆయన అవతారాన్ని చాలించడంతో ఆయాన చేసిన లీలలను కర్మలను గుర్తుకు తెచ్చుకుని బాధపడుతున్నావా

ఇదం మమాచక్ష్వ తవాధిమూలం వసున్ధరే యేన వికర్శితాసి
కాలేన వా తే బలినాం బలీయసా సురార్చితం కిం హృతమమ్బ సౌభగమ్

వసుంధరా, నీ బాధకు మూలమేమిటో నాకు చెప్పు. బలీయమైన కాలం సురుల చేత కూడా అర్చించబడే నీ అదృష్టాన్ని హరించింది అని నేను భావిస్తున్నాను.

ధరణ్యువాచ
భవాన్హి వేద తత్సర్వం యన్మాం ధర్మానుపృచ్ఛసి
చతుర్భిర్వర్తసే యేన పాదైర్లోకసుఖావహైః

ధర్మమా, నీవడిగిన ప్రశ్నలకు నీకు సమాధానం తెలిసే ఉంటుంది. నీవు కూడా నాలుగు పాదాల మీదా నిలచి లోఖానికి సుఖాన్ని అందించావు

సత్యం శౌచం దయా క్షాన్తిస్త్యాగః సన్తోష ఆర్జవమ్
శమో దమస్తపః సామ్యం తితిక్షోపరతిః శ్రుతమ్

సత్యం శౌచం దయా శాంతి తాయగం సంతోషం ఆర్జవం శమము దమము అందరినీ సమానంగా చూచుట, ఓర్పు (తితిక్ష), లాభ నష్టాలను సమానంగా చూచుట (ఉపరతి), వేదాలను పాటించడం

జ్ఞానం విరక్తిరైశ్వర్యం శౌర్యం తేజో బలం స్మృతిః
స్వాతన్త్ర్యం కౌశలం కాన్తిర్ధైర్యం మార్దవమేవ చ

జ్ఞ్యానం విరక్తి అయిశ్వర్యం (ఈశ్వరత్వం) శౌర్యం తేజస్సు బలము, స్మృతి, స్వాతంత్ర్యం, కౌశలం, కాంతి ధైర్యం, మార్దవం (జాలి) ,

ప్రాగల్భ్యం ప్రశ్రయః శీలం సహ ఓజో బలం భగః
గామ్భీర్యం స్థైర్యమాస్తిక్యం కీర్తిర్మానోऽనహఙ్కృతిః

ప్రాగల్బ్యం (ధైర్యం) ప్రశ్రయం (మంచితనము) శీలం, పట్టుదల, జ్ఞ్యానం, బలం, గాంభీర్యం, స్థైర్యం, నిజాయితీ, కీర్తి, అహంకారం లేకపోవడం,

ఏతే చాన్యే చ భగవన్నిత్యా యత్ర మహాగుణాః
ప్రార్థ్యా మహత్త్వమిచ్ఛద్భిర్న వియన్తి స్మ కర్హిచిత్

ఇలాంటీ మహాగుణాలు భగవంతుని వీడకుండా ఎపుడూ ఉంటాయి.

తేనాహం గుణపాత్రేణ శ్రీనివాసేన సామ్ప్రతమ్
శోచామి రహితం లోకం పాప్మనా కలినేక్షితమ్

ఆయన అవతారం చాలించాక కలి తన ప్రభావాన్ని అన్నిచోట్లా వ్యాపింపచేసాడు. ఆ స్థితి చూచి నేను బాధపడుతున్నాను

ఆత్మానం చానుశోచామి భవన్తం చామరోత్తమమ్
దేవాన్పితౄనృషీన్సాధూన్సర్వాన్వర్ణాంస్తథాశ్రమాన్

నాకోసం కూడా నేను చింతిస్తున్నాను. అంతే కాదు  నీ గురించి అమరోత్తముల గూర్చి, దేవతలు పితృదేవతలూ ఋషులు సాధులు అన్ని వర్ణాశ్రమాల వారి గురించీ ఈ నా చింత

బ్రహ్మాదయో బహుతిథం యదపాఙ్గమోక్ష
కామాస్తపః సమచరన్భగవత్ప్రపన్నాః
సా శ్రీః స్వవాసమరవిన్దవనం విహాయ
యత్పాదసౌభగమలం భజతేऽనురక్తా

ఎవరి కటాక్ష వీక్షణంకోసం బ్రహ్మాది దేవతలు ఎదురు చూస్తారో ఆ లక్ష్మి, పరమాత్మ కోసం తపమాచరైంచి తన పద్మనివాసాన్ని విడిచి పరమాత్మ పాదముల వద్దకు చేరిందో 

తస్యాహమబ్జకులిశాఙ్కుశకేతుకేతైః
శ్రీమత్పదైర్భగవతః సమలఙ్కృతాఙ్గీ
త్రీనత్యరోచ ఉపలభ్య తతో విభూతిం
లోకాన్స మాం వ్యసృజదుత్స్మయతీం తదన్తే

ఆ పరమాత్మ పాద చిహ్నములు నన్ను అలంకరించాయి, అది నాకు మూడు లోకాలకు  లభించని విభూతి నాకు లభించింది. నేను అంత అదృష్టవంతురాలినని అనుకుంటూ ఉంటే పరమాత్మ నన్ను వదిలి  వెళ్ళాడు

యో వై మమాతిభరమాసురవంశరాజ్ఞామ్
అక్షౌహిణీశతమపానుదదాత్మతన్త్రః
త్వాం దుఃస్థమూనపదమాత్మని పౌరుషేణ
సమ్పాదయన్యదుషు రమ్యమబిభ్రదఙ్గమ్

దుర్మార్గూలైన రాజుల వలన పెరిగిన నా భారాన్ని తగ్గించడానికి. యదు వంశములో జన్మించి నిన్నూ నన్నూ కూడా ఆయన మన బాధలనుండి విముక్తి ప్రసాదించాడు

కా వా సహేత విరహం పురుషోత్తమస్య
ప్రేమావలోకరుచిరస్మితవల్గుజల్పైః
స్థైర్యం సమానమహరన్మధుమానినీనాం
రోమోత్సవో మమ యదఙ్ఘ్రివిటఙ్కితాయాః

ఆయన విరహం ఎవరు సహించగలరు, ఆయన ప్రేమాస్పదమైన చూపులతో, చిరునవ్వుతో, హృదయానికి హత్తుకొనే చేష్టలతో ఎంతో మంది గోపికలను స్త్రీలను జయించాడు. ఆయన పద ధూళితో నిండిన గడ్డి నా శరీరం మీద ఆనందంతో రోమాలు నిక్కబొడుచుకున్నట్లు అనిపించేది.

తయోరేవం కథయతోః పృథివీధర్మయోస్తదా
పరీక్షిన్నామ రాజర్షిః ప్రాప్తః ప్రాచీం సరస్వతీమ్

ఇలా భూమీ ధర్మమూ మాట్లాడుకుంటూ ఉండగా పరీక్షిత్తు అక్కడికి వచ్చాడు  

Popular Posts